Sudhish Rambhotla
-
డేటా చోరీ కేసు పెద్ద స్కామ్
-
డేటా చోరీ ఓ పెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని, ఐటీ గ్రిడ్స్ వ్యవహారాన్ని కేంద్రం నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆరోపించారు. డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వ పెద్దలందరూ ఏపీపై తెలంగాణ దాడిగా భావిస్తున్నారన్నారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ప్రైవేట్ కంపెనీపై, ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత భయం పట్టుకుందని నిలదీశారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!) డేటా చోరీ ఓ పెద్ద కుంభకోణం లాంటిదని పేర్కొన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని నరేంద్ర మోదీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సరైనది కాదని పేర్కొన్నారు. ఏపీలోని ప్రతి శాఖ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని వాఖ్యానించారు. రాష్ట్రంలో ఏది జరిగినా మోదీ, జగన్, పవన్ చేస్తున్న కుట్రగా చంద్రబాబు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. (ఇదీ జరుగుతోంది!) -
‘అబద్ధాలు’ అని రాసి పోస్ట్ బాక్స్‌లో వేస్తే..
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని మోదీపై రుద్దేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు.. ఒక ప్రైవేటు కంపెనీపై..ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. బాబు అక్రమాలను ఎవరు ప్రశ్నించినా.. మోదీ, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ చేసిన కుట్రగానే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు. అబద్ధాలు అని పేరు రాసి పోస్ట్‌బాక్స్‌లో వేస్తే అది నేరుగా చంద్రబాబుకే వెళ్తుంది. బాబు అబద్ధం చెబితే టీడీపీ నాయకులు దాన్ని నిజమని ప్రచారంలోకి తెస్తారు. డేటా చోరీ కేసును ఏపీపై తెలంగాణ దాడిగా టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు కేసీఆర్‌ను పొగిడినప్పుడు ఆంధ్రుల అభిమానం దెబ్బతినలేదా. ఏపీలోని ప్రతి శాఖ అవినీతి కంపుతో నిడిపోయింది. చంద్రబాబు కోసం ప్రత్యేక రాజ్యాంగాన్ని రాయాలేమో. డబ్బు ప్రింట్ చేసుకోవడానికి ఓ జీవో తెస్తే టీడీపీ నాయకులు సంతోషిస్తారు కావచ్చు. పోలవరం సందర్శన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు’ అని సుదీష్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని, ఒకవేళ పొత్తులు పెట్టుకున్నా బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు. -
అదంతా ప్లాఫ్ హీరో ఊహాజనిత కథ
సాక్షి, అమరావతి: ఆపరేషన్ గరుడ, ద్రవిడ అవాస్తవాలు..అదంతా ఒక ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీశ్ రాంబొట్ల వ్యాఖ్యానించారు. కారెం శివాజీ మాదిరిగా హీరో శివాజీకి కూడా ఏదో పదవి వచ్చేవరకూ ఇలాగే చేస్తుంటాడని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. బీజేపీని తిడతారనుకుని టీడీపీ నేతలే పవన్ మీటింగ్‌కు జనాన్ని తరలించారని, కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ పవన్‌తో ఆడిస్తుంది.. జగన్‌తో కుమ్మక్కైంది అనే అవాస్తవాలు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి పొడిగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఆ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల మాత్రమే చేశారని వివరించారు. అదికూడా నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోనే ఇచ్చారని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. చంద్రబాబును కూడా ఉండాలని కోరినా తిరస్కరించారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం కానీ అప్పుడు చంద్రబాబు ఏపీకి ఏం కావాలో కోరుకోలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇచ్చామన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నామనేది అవాస్తవమని చెప్పారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నది చంద్రబాబు కాదు.. బీజేపీ అని టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వలేదనేది అవాస్తవమని.. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే, కానీ అవినీతి జరిగిందనేది వాస్తవమని పేర్కొన్నారు. -
ఆరోపించేవాళ్లే నిరూపించాలి: సుదీష్
హైదరాబాద్ : విజయవాడలో బీజేపీ కార్యాలయం కబ్జా భూమిలోనిది కాదని, ఆరోపణలు చేసినవారే నిరూపించాలని బీజేపీ నేత సుదీష్ రాంబొట్ల డిమాండ్ చేశారు. అంతర్వేది ఆలయంలో అన్యమత ప్రచారం చేసినవాళ్లను కఠినంగా శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయం విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని సుదీష్ రాంబొట్ల పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. కాగా కృష్ణా నదీ తీరంలో బీజేపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని చేపట్టిందంటూ సీపీఎం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
మా సీట్లలో టీడీపీ అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి: సుధీష్
హైదరాబాద్: పొత్తులో భాగంగా తమకు కేటాయించిన సంతనూతలపాడు, కడప, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికారిక అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు. ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఆ పార్టీ చెప్పిందని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నామినేషన్లు ఉపసంహరించుకోని ఆ ముగ్గురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
టీడీపీకి సుధీష్ రాంరాం
పార్టీకి, పదవికి రాంభొట్ల రాజీనామా త్వరలో బీజేపీలో చేరే అవకాశం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆ పార్టీకి, తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలో కాంగ్రెస్ సంస్కృతి పెరిగిపోతోందన్నారు. ప్రజాబలం లేని, ప్రజా సమస్యల పట్ల అవగాహన లే ని నేతల పెత్తనం ఇప్పుడు తెలుగుదేశంలో ఎక్కువైందని, వారే అధినేత చుట్టూ చేరి ప్రజాబలం ఉన్న నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని ఆరోపించారు. తమ వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే వారిని పార్టీలో చేర్పిస్తున్నారని, గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్ వంటి నేతల వల్ల పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు చుట్టూ తొట్టిగ్యాంగ్ చేరిందని, వారి మాటే ఆయనకు వేదవాక్కుగా మారిందని పేర్కొన్నారు. తొట్టిగ్యాంగ్లోని సభ్యులు పార్టీ కోసం కష్టపడే వారిని కాకుండా తమ అడుగులకు మడుగులొత్తే వారిని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ అనుయాయులకు సీట్లు ఇప్పించుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో కూడా పార్టీ వైఖరి స్పష్టంగా లేదని రాంభొట్ల విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి రక్షణ కల్పించాలని, హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తే.. తనను పార్టీ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి టీడీపీలో ప్రాధాన్యత లేకపోవటం పట్ల పలువురు నేతల వద్ద సుధీష్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, రెండు మూడ్రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో సుధీష్ ఆ పార్టీలో చేరతారని తెలుస్తోంది. -
టీడీపీకి సుధీష్ రాంబొట్ల రాజీనామా
-
'పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశా'
హైదరాబాద్ : టీడీపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల సోమవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయన తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. పార్టీలో వ్యక్తిగతంగా ... ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చుట్టూ కోటరీగా ఏర్పడి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చకనే టీడీపీని వీడుతున్నట్లు సుధీష్ రాంభొట్ల తెలిపారు. బాధగా ఉన్నా తప్పని పరిస్థితిలోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ కోసం కష్టపడేవారికి టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదని సుధీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు చేరికలు, సీట్ల కేటాయింపులన్నీ... డబ్బుల ప్రాధాన్యతగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అనేక సూచనలు, పోరాటాలు చేశానని సుధీష్ రాంభొట్ల తెలిపారు. పార్టీ తీరు నచ్చకనే సంవత్సరకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని సుధీష్ రాంభొట్ల తెలిపారు.