మా సీట్లలో టీడీపీ అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి: సుధీష్ | BJP Demand for TDP assembly Candidates Withdraw | Sakshi
Sakshi News home page

మా సీట్లలో టీడీపీ అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి: సుధీష్

Published Thu, Apr 24 2014 8:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

మా సీట్లలో టీడీపీ అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి: సుధీష్ - Sakshi

మా సీట్లలో టీడీపీ అభ్యర్థుల్ని సస్పెండ్ చేయాలి: సుధీష్

హైదరాబాద్: పొత్తులో భాగంగా తమకు కేటాయించిన సంతనూతలపాడు, కడప, గుంతకల్లు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అధికారిక అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు.

ఆయన గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఆ పార్టీ చెప్పిందని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నామినేషన్లు ఉపసంహరించుకోని ఆ ముగ్గురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement