
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏ తప్పు చేసి దొరికినా ప్రధాని మోదీపై రుద్దేందుకు యత్నిస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు.. ఒక ప్రైవేటు కంపెనీపై..ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. బాబు అక్రమాలను ఎవరు ప్రశ్నించినా.. మోదీ, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ చేసిన కుట్రగానే ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘అబద్ధాలకు మారుపేరు చంద్రబాబు. అబద్ధాలు అని పేరు రాసి పోస్ట్‌బాక్స్‌లో వేస్తే అది నేరుగా చంద్రబాబుకే వెళ్తుంది. బాబు అబద్ధం చెబితే టీడీపీ నాయకులు దాన్ని నిజమని ప్రచారంలోకి తెస్తారు. డేటా చోరీ కేసును ఏపీపై తెలంగాణ దాడిగా టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు కేసీఆర్‌ను పొగిడినప్పుడు ఆంధ్రుల అభిమానం దెబ్బతినలేదా. ఏపీలోని ప్రతి శాఖ అవినీతి కంపుతో నిడిపోయింది. చంద్రబాబు కోసం ప్రత్యేక రాజ్యాంగాన్ని రాయాలేమో. డబ్బు ప్రింట్ చేసుకోవడానికి ఓ జీవో తెస్తే టీడీపీ నాయకులు సంతోషిస్తారు కావచ్చు. పోలవరం సందర్శన పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు’ అని సుదీష్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీచేస్తామని, ఒకవేళ పొత్తులు పెట్టుకున్నా బహిరంగంగా ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment