'పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశా' | sudhish rambhotla quits TDP | Sakshi
Sakshi News home page

'పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశా'

Published Mon, Mar 10 2014 3:46 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

'పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశా' - Sakshi

'పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశా'

హైదరాబాద్ : టీడీపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల సోమవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం ఆయన తన రాజీనామా లేఖను నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. పార్టీలో వ్యక్తిగతంగా ... ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చుట్టూ కోటరీగా ఏర్పడి గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం నచ్చకనే టీడీపీని వీడుతున్నట్లు సుధీష్ రాంభొట్ల తెలిపారు. బాధగా ఉన్నా తప్పని పరిస్థితిలోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు.

పార్టీ కోసం కష్టపడేవారికి టీడీపీలో సరైన ప్రాధాన్యత లేదని సుధీష్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు చేరికలు, సీట్ల కేటాయింపులన్నీ... డబ్బుల ప్రాధాన్యతగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అనేక సూచనలు, పోరాటాలు చేశానని సుధీష్ రాంభొట్ల తెలిపారు. పార్టీ తీరు నచ్చకనే సంవత్సరకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నానని ఆయన అన్నారు. రెండు, మూడు రోజుల్లో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని సుధీష్ రాంభొట్ల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement