చిట్టి నాయుడికి డోస్‌ పెంచండి చంద్రం సార్‌! | Vijaya Sai Reddy Satirical Tweets On Nara Lokesh Over It Grids Case | Sakshi
Sakshi News home page

చిట్టి నాయుడికి డోస్‌ పెంచండి చంద్రం సార్‌!

Published Fri, Mar 8 2019 9:22 AM | Last Updated on Fri, Mar 8 2019 2:01 PM

Vijaya Sai Reddy Satirical Tweets On Nara Lokesh Over It Grids Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డేటా చోరి కేసులో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటని అర్థం కాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్.. అంటూ ఎద్దేవా చేశారు. అలాగే శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు లో ఫెయిలవుతాడన్నారు. ఇలా అయితే కొన్నాళ్లకు తమరి మనవడి క్లాస్ మేట్ అవుతాడని కామెంట్‌ చేశారు.

అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయని  చంద్రబాబుకు అర్థమైందని, పవర్ లేకుండా జీవించ లేని ఇలాంటి వ్యక్తులు చివరి ప్రయత్నంగా దేనికైనా తెగిస్తారన్నారు. ఇటువంటి రుగ్మతను సైకాలజీలో Fear of Rejectionగా పిలుస్తారని, చంద్రబాబు ఇంత పొరపాటు ఎలా చేశాడో అర్థం కాక విపరీత భావోద్వేగాలు కనబరుస్తున్నాడని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement