రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు
సాక్షి, గుంటూరు: దొంగే దొంగా దొంగా.. అని అరిచిన చందంగా అధికార టీడీపీ నేతలు కొత్త డ్రామాకు తెరతీశారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాను తారు మారు చేసేందుకు డేటాను ఐటీగ్రిడ్స్ సంస్థకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తడం, అందుకు సంబంధించిన కీలక ఆధారాలు తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుసుకోవడంతో టీడీపీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు వింత వాదనకు దిగింది. ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతోపాటు, తెలంగాణ పోలీసు అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు కుట్ర పన్నారంటూ బుధవారం కొత్త పల్లవి అందుకున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఐటీగ్రిడ్స్ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ముచ్చమటలు పట్టాయి.(‘ఐటీ గ్రిడ్స్’పై సిట్)
ఫిబ్రవరి 23కు ముందే అమరావతిలో కుట్ర పన్నారంటూ గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్‌పై దాడి చేసిన వ్యవహారంలో తప్పులు చేసినట్లుగా చెబుతూ తెలంగాణ పోలీసు అధికారులపై నిందలు వేస్తూ కుట్ర కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే కౌంటర్ కేసులు పెట్టి ఏదో విధంగా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీని కలిసిన అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళావెంకట్రావు, ఎంపీ కనకమేడల, మంత్రి ప్రత్తిపాటి మాట్లాడారు. (ఇదీ జరుగుతోంది!)
కేసు నమోదు చేస్తాం: ఎస్.వి.రాజశేఖర్‌బాబు, గుంటూరు రూరల్ ఎస్పీ
ఐటీగ్రిడ్స్‌పై దాడి వ్యవహారంలో ఫిబ్రవరి 23కు ముందే అమరావతిలో కుట్ర జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాం. తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment