సిట్ ఇంచార్జి స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: మాదాపూర్‌లోని ఐటీగ్రిడ్ కార్యాలయంలో తెలంగాణ సిట్ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. సుమారు 10 గంటల పాటు సిట్ బృందం ఆధ్వర్యంలో సోదాలు కొనసాగాయి. ఈ బృందంలో సిట్ అధికారులతో పాటు క్లూస్‌టీం, టెక్నికల్ అనలిస్టులు, సైబర్ నిపుణులు కూడా పాల్గొన్నారరు. వీరందరి సమక్షలో డేటా విశ్లేషణ కొనసాగింది. సీజ్ చేసిన కంప్యూటర్‌లు, సర్వర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బాక్సులను గోషామహల్‌లోని సిట్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. రేపటి నుంచి గోషామహల్ స్టేడియంలో సిట్ విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment