‘కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు’ | Buggana Rajendranath Reddy Counter To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ గజదొంగల పార్టీ: బుగ్గన

Published Sat, Mar 9 2019 4:54 PM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

Buggana Rajendranath Reddy Counter To Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మాటల్లో సెల్ఫ్‌గోల్‌ తప్ప మరేమీ లేదని, కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. శనివారం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్‌ సమాధానమిచ్చారు. ఐటీగ్రిడ్స్‌ స్కాంలో టీడీపీ ప్రభుత్వ హస్తం లేకపోతే ఎందుకు భయపడుతున్నారని బుగ్గన ప్రశ్నించారు. హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు అమరావతి పారిపోయాడని అన్నారు. ఏపీలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రజల సమస్యలు చంద్రబాబుకు పట్టలేదని విమర్శించారు.



సిట్‌ ఏర్పాటులో సర్కారు ఫీట్లు
డేటా స్కాంలోనూ బాబు యూటర్న్‌!

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడారు. ‘‘ ఏపీలో కిడ్నాపులు, ఆస్తులు దొంగతనాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అంటే ఆయన పాలనలో శాంతిభద్రతలు లోపించాయని ఒప్పుకుంటున్నారు. టీడీపీ గజదొంగల పార్టీ. ప్రజల ఓటర్‌ ఐడీలు, ఆధార్‌ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటే ప్రభుత్వం దగ్గర సమధానంలేదు. 50 లక్షల మంది డేటా ఉందా? లేక 3 కోట్ల 50 లక్షల మంది డేటా ఉందా?. సేవామిత్ర యాప్‌లో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తొలగించారు. ప్రభుత్వం పథకాలు అందిన ప్రజల వివరాలు టీడీపీ యాప్‌లోకి ఎలా వచ్చాయి. దొంగతనం వేరేవాళ్లు చేసి ఉంటే ఐటీగ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ ఎందుకు పారిపోయాడు. ఓట్ల తొలగింపుపై విజయసాయిరెడ్డి సీఈసీకి ఫిర్యాదు చేయడం తప్ప?. చంద్రబాబు మాటల్లోనే ఐటీగ్రిడ్స్‌ సంస్థ మోసం చేసినట్టు కనబడుతోంది. ప్రజా సాధికారిక సర్వే వివరాలు ప్రైవేటు సంస్థకు ఎలా వచ్చాయి. వేమూరి హరికృష్ణ మీ సాంకేతిక సలహాదారుడు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ఆయన అరెస్ట్‌యిన విషయం వాస్తవం కాదా. అలాంటి వ్యక్తిని మీరు సలహాదారుడిగా ఎలా నియమించుకుంటారు’’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement