
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలకడలేని మనిషి అని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తన స్వార్థం కోసం ప్రతిరోజు మాట మార్చడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వం అన్నందుకే సాయం అడిగామని చెప్పడం సిగ్గుచేటు అని బుగ్గన వ్యాఖ్యానించారు. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా అని సూటిగా ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు, పోలవరం ప్రాజెక్ట్ కమిషన్లు, పట్టిసీమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే హోదాను తాకట్టు పెట్టారని బుగ్గన ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాంట చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని, రాజకీయాలకు అతీతంగా ఉద్యమిద్దామని ఆయన సూచించారు.
కాగా ప్రత్యేక హోదా వద్దని తాము ఎక్కడా,ఎప్పుడూ అనలేదని, హోదాకు అడ్డంకులు ఉన్నాయని అన్నందువల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ జరిగిన టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment