అశేష ప్రజాదరణతో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యద్భుత విజయం సాధించిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. గురువారం మధ్యా హ్నం 12.23 గంటలకు విజయవాడ నడిబొడ్డున ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి అత్యంత ప్రముఖులు పలువురు హాజరుకానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీఎంకే అధినేత స్టాలిన్ తరలివస్తున్నారు. వైఎస్ జగన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.