ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ విచ్చిన్నం అవుతుందనే భయంతోనే చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతున్నారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. ఓటమి కారణాలను వెతుకుతున్నారని, 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఈవీఎంలతోనే అని ఆయన గుర్తుచేశారు.