వ్యవసాయం దండగ అన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే ముందుకు సాగుతాయని... కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రాలు పథకాలు అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన రైతులకు రూ.12500 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రైతులకు మరింత అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదనంగా మరో వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చేందుకు నిర్ణయించారని తెలిపారు.