Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AB Venkateswara Rao Secret Talks With Janupalli Srinivas Family Members1
వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్‌ పోస్ట్‌లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్‌ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్‌ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్‌ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్‌కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్‌పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్‌లో జగన్‌పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు.

India Uses Laser Weapons To Shoot Down Aircraft & Missiles2
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం

న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్‌ ఫుల్‌ వెపన్‌ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్‌ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరసలో ఉన్న అమెరికా, చైనా, రష్యాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్‌ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లను అధునాతన లేజర్ బీమ్‌ను ప్రయోగించారు. ఇది భారత్‌ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్‌ ఫుల్‌ గా లేజర్‌ బీమ్‌ కూల్చివేయడంతో డీఆర్‌డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్‌ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025

IPL 2025: RCB Beat Rajasthan Royals By 9 Wickets3
రికార్డు అర్ద శతకంతో సత్తా చాటిన విరాట్‌.. రాయల్స్‌పై ఆర్సీబీ ఘన విజయం

ఐపీఎల్‌ 2025లో భాగంగా జైపూర్‌ వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 కెరీర్‌లో 100 హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్‌ (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకగా.. రాయల్స్‌ అదే ఏడో స్థానంలో కొనసాగుతుంది.

A 30 Day Warning For Foreign Nationals Staying In US4
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి

వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025 వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

Banks Will Be Closed Tomorrow For Ambedkar Jayanti5
రేపు బ్యాంకులకు సెలవు: ఎందుకంటే?

'అంబేద్కర్ జయంతి'ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా సోమవారం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు దినంగా పేర్కొంది. అంటే అన్ని బ్యాంకులు మూసి ఉంటాయన్నమాట.బ్యాంకులు అన్నీ క్లోజ్ అయినప్పటికీ.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ (ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్ మొదలైనవి) సేవలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. బ్యాంకులకు వెళ్లి చేసుకోవలసిన పనులన్నీ ఎల్లుండికి (మంగళవారం) వాయిదా వేసుకోవాలి.ఇతర సెలవు దినాలు➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్​ బెంగాల్​, అరుణాచల్​ ప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​లోని బ్యాంక్​లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్​, త్రిపుర, అసోం, రాజస్థాన్​, జమ్ము, హిమాచల్​ ప్రదేశ్​, శ్రీనగర్​లోని బ్యాంక్​లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్​లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్​ ప్రదేశ్​లోని బ్యాంక్​లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్​లకు సెలవు)

YS Jagan Expresses Deep Shock Over On Fireworks Explosion Incident In Anakapalle District6
అనకాపల్లి అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేపల్లి,సాక్షి: అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 13-04-2025బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం @ysjagan దిగ్భ్రాంతి బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తివైయస్‌.జగన్‌ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ…— YSR Congress Party (@YSRCParty) April 13, 2025

IPL 2025 RCB VS RR: Virat Kohli Completes Century Of Half Centuries In T20s7
RR VS RCB: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. మరో సెంచరీ

ఐపీఎల్‌ 2025లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 13) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన విరాట్‌.. టీ20ల్లో 100 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసిన తొలి భారత్‌ మరియు ఆసియా ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా చూసినా డేవిడ్‌ వార్నర్‌ మాత్రమే విరాట్‌ కంటే ముందు టీ20ల్లో 100 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. వార్నర్‌ 400 టీ20 మ్యాచ్‌ల్లో 108 హాఫ్‌ సెంచరీలు చేయగా.. విరాట్‌ తన 388వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో విరాట్‌ 388 ఇన్నింగ్స్‌లు ఆడి 9 సెంచరీలు, 100 హాఫ్‌ సెంచరీల సాయంతో 13100 పైచిలుకు పరుగులు చేశాడు.THE HISTORIC MOMENT - 100 FIFTIES FOR KING KOHLI IN T20 HISTORY 🎯 pic.twitter.com/e4uvnxh0Vd— Johns. (@CricCrazyJohns) April 13, 2025టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన టాప్‌-5 ప్లేయర్లువార్నర్‌- 108విరాట్‌- 100బాబర్‌ ఆజమ్‌- 90గేల్‌- 88బట్లర్‌- 86కాగా, రాయల్స్‌తో మ్యాచ్‌లో విరాట్‌ రికార్డు హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజ​స్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (47 బంతుల్లో 75; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ధృవ్‌ జురెల్‌ (35 నాటౌట్‌), రియాన్‌ పరాగ్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (15) మరోసారి నిరాశపర్చగా.. ఆఖర్లో వచ్చిన హెట్‌మైర్‌ 9, నితీశ్‌ రాణా 4 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌, హాజిల్‌వుడ్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 17.3 ఓవర్లలో ఫిల్‌ సాల్ట్‌ (33 బంతుల్లో 65; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. విరాట్‌ కోహ్లి (45 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయమైన అర్ద సెంచరీతో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. పడిక్కల్‌ (28 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) బౌండరీ కొట్టి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. విరాట్‌ హాఫ్‌ సెంచరీల సెంచరీని విరాట్‌ సిక్సర్‌తో అందుకోవడం విశేషం. ప్రస్తుత సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో హాఫ్‌ సెంచరీ. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ సీజన్‌లో విరాట్‌ 6 మ్యాచ్‌ల్లో 62 సగటున, 143.35 స్ట్రయిక్‌ రేట్‌తో 248 పరుగులు చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేసిన పూరన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

TTD Chairman BR Naidu Responds To TTD Goshala Incident8
గోశాల ఘటనపై టీటీడీ ఛైర్మన్‌ చులకన వ్యాఖ్యలు!

సాక్షి, తిరుపతి: టీటీడీ గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. గోశాలలో గోవుల మృతిని టీటీడీ చైర్మన్ అంగీకరించారు. టీటీడీ గోశాలలో ఇప్పటివరకు 22 గోవులు చనిపోయాయాన్న టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు.. ఇంట్లో మనుషులు చనిపోరా అంటూ చులకనగా వ్యాఖ్యానించారు. మరో వైపు, గోశాలలో 40 ఆవులు చనిపోయాయని ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. గోవుల మరణాలపై కూటమి నేతల తలోమాట మాట్లాడుతున్నారు.గోశాలలో గోవుల మరణాలపై మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్‌ నాయుడు బెదిరింపులకు దిగుతున్నారు. అన్నిచోట్ల కేసులు నమోదు చేయిస్తాం.. ఇప్పటికే కొందరు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారంటూ పరోక్షంగా పోసాని కృష్ణమురళి ఉద్దేశించి టీటీడీ చైర్మన్‌ వ్యాఖ్యానించారు. గోశాలలో డాక్టర్లు తక్కువగా ఉన్నారంటున్న టీటీడీ ఛైర్మన్‌.. అదనపు వైద్యులను నియమిస్తామని తెలిపారు.

Mallidi Satyanarayana Reddy Recalls Incident With Nithin And His Father About Movie9
రూ.75 లక్షలు అడ్వాన్స్‌.. నితిన్‌ మోసం చేశాడు: నిర్మాత

హీరో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలిస్తే చివరకు ఆ సినిమానే చేయం అని చేతులెత్తేశాడు అంటున్నాడు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. ఈయన.. ఢీ, భగీరథ, బన్నీ వంటి చిత్రాలను నిర్మించాడు. ఈయన కుమారుడు వేణు అలియాస్‌ వశిష్ట (Mallidi Vassishta) డైరెక్టర్‌గా బింబిసారతో భారీ హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు.వశిష్ట ఇన్ని కష్టాలు పడ్డాడా?అయితే ఈ విజయాలకు ముందు వశిష్ట ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటిని తం‍డ్రి సత్యనారాయణ (Mallidi Satyanarayana Reddy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నితిన్‌ 'ఇష్క్‌' సినిమా సమయంలో ఆయన తండ్రి సుధాకర్‌ రెడ్డి చాలా సమస్యల్లో ఉన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను కొని వైజాగ్‌లో డిస్ట్రిబ్యూషన్‌ చేశాను. ఆయనకు ఎప్పుడైనా అవసరముంటే డబ్బులిచ్చేవాడిని. అలా మేము క్లోజ్‌ అయ్యాం.రూ.75 లక్షలు అడ్వాన్స్‌నా కుమారుడు వేణు (వశిష్ట)కు డైరెక్షన్‌ అంటే ఇష్టం ఉందని తెలిసి.. నితిన్‌ (Nithiin)తో సినిమా చేద్దాం అన్నాడు. మావాడిని నితిన్‌కోసం కథ రాసుకోమన్నాను. మేము ఓ నిర్మాతను సెట్‌ చేసుకున్నాం. ఆయనతో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలు, కెమెరామెన్‌ ఛోటాకు రూ.10 లక్షలు ఇప్పించాం. దాదాపు ఆ ప్రాజెక్ట్‌ మీద రెండుకోట్లు ఖర్చుపెట్టాం. కానీ వాళ్లకు మావాడు చెప్పిన కథ నచ్చలేదు. వేరేవాళ్లు రాసుకున్న కథను వశిష్టతో డైరెక్షన్‌ చేయిద్దామని ఫిక్స్‌ చేశారు.(చదవండి: అభిమానులపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ)వాడికి పెద్ద రేంజ్‌ ఉందటగా!ఇంతలో అఆ సినిమా రిలీజై పెద్ద హిట్టయింది. అఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తే మావాడి రేంజ్‌ పడిపోతుంది అని సుధాకర్‌ అన్నాడు. వాడికి పెద్ద రేంజ్‌ ఉంది కదా.. అది పడిపోతుందట.. అందుకని తర్వాత చేద్దాం అన్నారు. డబ్బులిచ్చిన నిర్మాతను పిలిపించి మాతో సినిమా చేయడం లేదని చెప్పేశారు. కాకపోతే నితిన్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. మీరే నిర్మాతగా ఉండండి అన్నారు. అప్పుడా నిర్మాత.. నేను మీతో పార్ట్‌నర్‌షిప్‌ చేయడానికి రాలేదు, నా డబ్బు నాకిచ్చేయండి అన్నారు. అలా మోసపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేశాం.కొత్త డైరెక్టర్‌తో ఎందుకని..మా వాడికి అల్లు శిరీష్‌ (Allu Sirish) క్లోజ్‌ఫ్రెండ్‌. మంచి కథ రాసుకోరా.. నేనే చేస్తా అని శిరీష్‌ ముందుకొచ్చాడు. సినిమా ముహూర్తం కూడా భారీగా జరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీరస్తు.. శుభమస్తు సినిమా వచ్చి హిట్టయింది. దాంతో ఇలాంటి విజయం తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయడం ఎందుకు? అని శిరీష్‌ ఆలోచనలో పడ్డాడు. మాతో సినిమా చేయనన్నాడు. అల్లు అరవింద్‌ ఫీలయ్యాడు. నీకు ఎవరు కావాలో చెప్పు.. హీరోగా తీసుకొస్తా అని అరవింద్‌ మావాడిని అడిగాడు.హీరోగా ట్రై చేయమన్నాకానీ అప్పటికే వాడు చాలా బాధలో ఉన్నాడు. అది చూసి డైరెక్షన్‌ వదిలెయ్‌.. హీరోగా చేయరా అన్నాను. వాడిని హీరోగా లాంచ్‌ చేస్తూ సినిమా మొదలుపెట్టాం. కానీ, అది వర్కవుట్‌ కాదనుకున్నాడు. ఆ సినిమా వదిలేసి మళ్లీ డైరెక్షన్‌ మీదే పడ్డాడు' అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వశిష్ట ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా తీస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం.చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ

Fire Accident In Anakapalli District10
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మృతుల సంఖ్య

విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ విచారణకు ఆదేశించారు. బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:1. దాడి రామలక్ష్మి (35),W/oవెంకటస్వామి, R/o రాజుపేట .2. పురం పాప (40),W/o అప్పారావు, R/o కైలాసపట్నం. 3. గుంపిన వేణుబాబు (34),S/o దేముళ్ళు,R/o కైలాసపట్నం.4. సంగరాతి గోవిందు (40),S/o సత్యనారాయణ, R/o కైలాసపట్నం.5. సేనాపతి బాబూరావు (55)S/o గెడ్డప్ప ,R/o చౌడువాడ.6. అప్పికొండ పల్లయ్య (50)S/o నూకరాజు ,R/o కైలాసపట్నం.7. దేవర నిర్మల (38)W/o వీర వెంకట సత్యనారాయణ, R/o వేట్లపాలెం.8. హేమంత్ (20)R/o భీమిలి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement