పోలింగ్‌ సిబ్బందికి ముగిసిన శిక్షణ | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సిబ్బందికి ముగిసిన శిక్షణ

Published Sun, May 5 2024 8:15 AM

పోలింగ్‌ సిబ్బందికి ముగిసిన శిక్షణ

రాయవరం: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న పోలింగ్‌ సిబ్బందికి రెండో విడత శిక్షణ శనివారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1,644 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్కడ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు రిజర్వు సిబ్బందితో సహా 13,582 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏప్రిల్‌ 15న పీఓ, ఏపీఓలకు తొలి విడత శిక్షణ నిర్వహించారు. అనంతరం ఓపీఓలుగా ఎంపికైన వారికి అమలాపురంలో శిక్షణ ఇచ్చారు. అనంతరం రెండో విడత శిక్షణ ఉద్యోగులకు పోలింగ్‌ విధులు కేటాయించిన నియోజకవర్గ కేంద్రాల్లోనే నిర్వహించారు. పీఓ, ఏపీఓలతో పాటు ఓపీఓలకు పోలింగ్‌ విధులపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోలింగ్‌ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో మెటీరియల్‌ రిసీవింగ్‌, పోలింగ్‌ రోజు ఉదయం మాక్‌ పోలింగ్‌ నిర్వహణ, అనంతరం పోలింగ్‌ నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను వివరించారు. ఈవీఎంలను ఎలా ఉపయోగించాలి? బ్యాలెట్‌ యూనిట్‌ను వీవీ ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌తో ఏ విధంగా అనుసంధానించాలనే విషయాలపై తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గ కేంద్రాల పరిధిలో పోలింగ్‌ సిబ్బందికి రెండో విడత శిక్షణ ఇచ్చారు.

Advertisement
Advertisement