శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు.. | Sakshi
Sakshi News home page

శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..

Published Sun, May 5 2024 1:35 AM

-

పాలమూరు బిడ్డ సీఎంగా ఉండొద్దు.. ఈ ప్రభుత్వాన్ని పడగొడ్తామని అంటున్నారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. కానీ ఇక్కడి వారే శత్రువంచన చేరి మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీకే అరుణ ఏమంటాంది.. రేవంత్‌రెడ్డి నా మీద పగబట్టిండు. రేవంత్‌ నన్ను ఒడగొట్టాలని చూస్తున్నాడు. నేను మాత్రం కాంగ్రెస్‌ను ఓడగొట్టే వరకు ఊరుకోను. కాంగ్రెస్‌ను ఖతం చేస్తా అని అంటది. కాంగ్రెస్‌ నీకు ఏం అన్యాయం చేసింది? పాన్‌గల్‌ నుంచి జెడ్పీటీసీగా, గద్వాల ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్‌ను ఓడగొట్టాల్నా? దేశంలో, రాష్ట్రంలో నిన్ను గుర్తు పడుతోంది కాంగ్రెస్‌తోనే కదా.

ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..

మోదీ చుట్టంలాగా వస్తడు, పోతడు. పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. మాదిగల వర్గీకరణ చేయలేదు.. ముదిరాజ్‌లను ఆదుకోలేదు.. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ గద్వాలను కదా.. బోయల గురించి ఆమెకు తెలుసుకదా ? వీళ్ల గురించి ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? తుమ్మిళ్ల, ఆర్డీఎస్‌ పూర్తి చేయాలని చూసిందా? జూరాల నీళ్లు రాకపోతే మాట్లాడిందా? భీమా నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, రామన్‌పాడు మరమ్మతుల ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షరాలు పదవి తెచ్చుకుంది. ఆమెకు కర్ణాటకలో వ్యాపారాలకు ఇబ్బంది లేదు. ఏ రోజైనా ఈ జిల్లాకు సంబంధించి హైదరాబాద్‌–బెంగళూరు హైవేపై పరిశ్రమల కోసం మోదీతో మాట్లాడిందా? ఏ ప్రయత్నం చేయలేదు.. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగాలొచ్చేవి. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. ఆలోచన చేయండి. సభలో నాగర్‌కర్నూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ జిల్లెల చిన్నారెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement