భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

Published Sun, May 5 2024 4:00 AM

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు మెరుగుపరుస్తున్నట్లు ఈఓ భాస్కర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదం కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గ్రహించి శివాలయం ఎదుట ప్రత్యేకంగా టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవు రోజుల్లో కొండపైన బస్టాండ్‌లో తాత్కాలిక అదనపు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులకు సమాచారం ఇవ్వడానికి హెల్ప్‌డెస్క్‌, వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. నిత్య కై ంకర్యాలు, స్వామివారి సంకీర్తనలు భక్తులకు వినిపించేలా ప్రత్యేక దివ్యవాణి ఏర్పాటు చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో మైకులు, స్పీకర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే క్యూకాంప్లెక్స్‌లో వాల్‌మోటింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులను ఆహ్లాదం పంచేందుకు ప్రతి శుక్ర, శనివారాల్లో సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు సంగీత, సాహిత్య, నృత్య సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

8 లక్షల మందికి ఉచిత ప్రయాణ సౌకర్యం

ఒక్క ఏప్రిల్‌ మాసంలోనే 369 బస్సులను కొండపైకి, కొండ కిందకు 9,825 ట్రిప్పులు నడిపించామని ఈఓ తెలిపారు. 8లక్షల మంది భక్తులు ఉచితంగా రవాణా సౌకర్యం పొందారని, ఇందులో 70 శాతం మహిళలు, 30శాతం మంది పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఫ విడతల వారీగా వసతులు మెరుగుపరుస్తున్నాం

ఫ యాదాద్రి ఈఓ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement