
సాక్షి, అమరావతి: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఈ సమావేశాల్లో 2018–19 బడ్జెట్‌ను ఈ నెల 8న ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఇవి 14వ అసెంబ్లీ 11వ సమావేశాలు కాగా, శాసన మండలికి 13వ సమావేశాలు. కాగా ఫార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటీషన్లపై రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటేనే ఈ నెల 6 నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని వైఎస్‌ఆర్ సీపీ నేతలు స్పష్టం చేసిన విషయం విదితమే.