ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చట్టబద్ధమైన భూసేకరణ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం చట్టబద్ధమైన భూసేకరణ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం వాడివేడిగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన బాబు.. భూసేకరణ అనేది చట్టబద్ధంగానే జరుగుతుందన్నారు. రాజధాని నిర్మాణంతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. రాజధాని విషయంలో రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ల్యాండ్ పూలింగ్ కోసం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయనం చేసిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం రైతుల అందరితో ఒకటికి రెండు సార్లు మాట్లాడమన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ తెచ్చామని.. దీనికి తాను గర్వపడుతున్నానన్నారు. విభజనలో ఆంధ్రాకు అన్యాయం జరిగిందన్నారు. దేవాలయ భూములకు కూడా న్యాయం చేస్తామన్నారు. రైతులకు పూర్తిగా న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటున్నామని బాబు తెలిపారు. ఎన్టీఆర్ క్యాంటీన్ లో పెడతామని, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు.