Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion1
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Puthandu 2025 History and Significance know all about Tamil New year2
నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం

ఈరోజు (ఏప్రిల్‌ 14) తమిళుల నూతన సంవత్సరం.. తెలుగువారంతా ఉగాది జరుపుకున్న మాదిరిగానే తమిళులు నేడు వారి నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. దీనిని వారు ‘పుతండు’(Puthandu)గా పిలుస్తుంటారు. నేడు తమిళ క్యాలెండర్‌లోని చిత్తిరై నెలలోని మొదటి రోజు. ‘పుతండు’ రోజున తమిళనాడులో కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సవం చేసుకుంటారు. అలాగే రాష్ట్రంలోని వ్యాపారులు ఈ రోజున తమ నూతన ఆర్ధిక సంవత్సర లావాదేవీలను ప్రారంభిస్తారు. దీనిని "కై-విశేషం" అని పిలుస్తారు. కాగా తమిళనాట హిందీని వ్యతిరేకిస్తూ, సొంత భాషకు అత్యధిక ప్రాముఖ్యతనిస్తున్న తరుణంలో తమిళులంతా తమ భాషలోనే పరస్పరం ‘పుతండు’ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. పురాణాల ప్రకారం పుతండు రోజున బ్రహ్మదేవుడు(Lord Brahma) విశ్వ సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. అలాగే ఈ రోజునే ఇంద్రుడు భూమిపైకి శాంతి, ఆశ, ఆనందాన్ని తీసుకువచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. తమిళ సంస్కృతిలో ఈ రోజున కొత్త పనులు తలపెడితే శ్రేయస్సు, సంతోషం కలుగుతుందని చెబుతారు. పుతండును సంగమ యుగం నుంచి జరుపుకుంటున్నారని, ఇది వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉందని చరిత్ర చెబుతోంది. పుతండు రోజున తమిళులు తమ ఇళ్లను కోలం (రంగోలీ)తో అలంకరిస్తారు. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి వేడుకలు చేసుకుంటారు. ‘మంగాయ్ పచ్చడి’ని తింటారు. దీనిని బెల్లం, మామిడి, వేప ఆకులు, ఎర్ర మిరపకాయలతో తయారుచేస్తారు. ఇది జీవితంలోని వివిధ రుచులను సూచిస్తుంది. ఈ రోజున ఆలయాలను సందర్శించడం, కొత్త బట్టలు ధరించడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం చేస్తారు.పుతండు ఉత్సవం తమిళులకు కేవలం కొత్త సంవత్సరం మాత్రమే కాదు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా భావిస్తారు. పుతండు వేడుకలు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు, కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. ఈ ఉత్సవాన్ని శ్రీలంక, మలేషియా, సింగపూర్ తదితర తమిళ జనాభా అధికంగా కలిగిన దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ ఆశయాలకు తూట్లు: దళిత రైతు దారుణ హత్య.. ఏడుగురు అరెస్ట్

Yellappa Family Allegations On TDP MLA gummanuru JayaRam3
వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే జయరాం.. ఉద్యోగం పేరుతో లక్షల్లో డబ్బులు..

సాక్షి, అనంతపురం: ఏపీలో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదంలో చిక్కుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం విషయంలో జయరాం తనను మోసం చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం..‘గుత్తి మండలం మామడూరు గ్రామానికి చెందిన బోలే యల్లప్ప ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. యల్లప్ప ఆత్మహత్యయత్నం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కారణమని అన్నారు. ఎమ్మెల్యే జయరాం.. యల్లప్ప నుంచి నాలుగు లక్షల రూపాయలు తీసుకుని ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత అదే ఉద్యోగాన్ని 8 లక్షలకు మరొకరికి ఇచ్చేశారు. ఈ కారణంగా ఉద్యోగం పోయిందనే ఆవేదనతో యల్లప్ప ఇలా చేశాడని తెలిపారు. ఈ క్రమంలో జయరాం పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చారు.

Sheikh Hasina Says Bangladeshs History Being Erased4
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్‌ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్‌(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్‌ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్‌(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్‌ మదిలో ‘హైదరాబాద్‌’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..

IPL 2025, DC VS MI: Hat Trick Run Outs, For First Time In IPL5
DC VS MI: ఢిల్లీ కొంప ముంచిన హ్యాట్రిక్‌ రనౌట్స్‌.. చరిత్రలో ఇదే తొలిసారి

ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ ఘటన నిన్న చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో అత్యంత అరుదైన హ్యాట్రిక్‌ రనౌట్స్‌ నమోదయ్యాయి. ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. ఢిల్లీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు కావడం ఇదే మొదటిసారి.లీగ్‌ ఆరంభ సీజన్‌లో (2008) ఓ సారి ఒకే ఓవర్‌లో మూడు రనౌట్లు నమోదైనా, అవి వరుస బంతుల్లో జరగలేదు. నాడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి ఓవర్‌లో (2, 4, 6 బంతులకు) మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఒకే ఓవర్‌లో, అందులోనూ వరుసగా మూడు బంతుల్లో రనౌట్లు నమోదయ్యాయి.నిన్నటి మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ ఢిల్లీ 19వ ఓవర్‌ చివరి మూడు బంతులకు వరుసగా అశుతోష్‌ శర్మ (17), కుల్దీప్‌ యాదవ్‌ (1), మొహిత్‌ శర్మ (0) వికెట్లను రనౌట్ల రూపంలో కోల్పోయింది. కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం​ సృష్టించి గెలుపుకు పటిష్ట పునాది వేసినా, చివర్లో హ్యాట్రిక్‌ వికెట్లు కోల్పోయి ఢిల్లీ పరాజయాన్ని కొని తెచ్చుకుంది. ఉ‍త్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. లేని, అనవసరమైన పరుగుల కోసం ప్రయత్నించి ఢిల్లీ గెలుపు గుర్రాన్ని దిగింది. పరుగుల వేటలో ఒత్తిడికిలోనై రనౌటైంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (59), ర్యాన్‌ రికెల్టన్‌ (41), సూర్యకుమార్‌ యాదవ్‌ (40), నమన్‌ ధీర్‌ (38) రాణించగా.. రోహిత్‌ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌, విప్రాజ్‌ నిగమ్‌ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్‌ కుమార్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్‌ ఫ్రేజర్‌ (0) వికెట్‌ కోల్పోయినా.. అభిషేక్‌ పోరెల్‌ (33), కరుణ్‌ నాయర్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్‌ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్‌ శర్మ (4-0-36-3), మిచెల్‌ సాంట్నర్‌ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్‌ ప్లేస్‌ నుండి రెండో స్థానానికి పడిపోయింది.నేటికి అది రికార్డే2008 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదుగురు ముంబై బ్యాటర్లు రనౌట్లయ్యారు (చివరి ఓవర్‌లో మూడు రనౌట్లతో కలుపుకుని). ఐపీఎల్‌ చరిత్రలో నేటికీ ఇది ఓ రికార్డుగా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్‌ మ్యాచ్‌లోనూ ఐదుగురు బ్యాటర్లు రనౌట్లు కాలేదు.

Mehul Choksi Arrested In Belgium Police6
వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

బ్రస్సెల్స్‌: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్‌బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025

Tollywood Film Writer Loss Money In Online Fake Trading Apps7
ట్రేడింగ్‌ పేరుతో మోసపోయిన సినీ రచయిత.. కొంపముంచిన వీడియో

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రసంగానికి ఆకర్షితుడై ఓ వ్యక్తి బొక్కబోర్లా పడ్డాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడంపై ఆమె చేసిన ప్రసంగ వీడియో తిలకిస్తున్న సమయంలో స్క్రీన్‌పై వచ్చిన ఓ యాప్‌ అతడి కొంపముంచింది. పెట్టుబడి పెడితే రెండు వారాల్లోపు మంచి రాబడి వస్తుందని ఇచ్చిన హామీ మేరకు రూ.39,694లు చెల్లించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ ప్రగతినగర్‌లో నివసించే జనార్దన్‌రెడ్డి(44) సినీ రచయిత. ఈ నెల 11న ఉదయం ఫేస్‌బుక్‌లో వీడియోలు తిలకిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్రేడింగ్, పెట్టుబడి గురించి వివరించే వీడియో కనిపించింది. అది నిజమైనదిగా భావించి వీడియో ఓపెన్‌ చేశాడు. ట్రేడింగ్‌ ప్రయోజనాల కోసం రూ.21 వేలు పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతుండగా ఆకర్షితుడై, అక్కడ ఉన్న లింక్‌పై క్లిక్‌ చేశాడు. మరిన్ని వివరాల కోసం జీపీడీ అడిపెక్స్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడంతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, తన పేరు, ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వంటి సమాచారాన్ని నమోదు చేశారు. పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రాబడి వస్తుందని నమ్మబలికారు. దీంతో ఆయన తన క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.39,694లను చెల్లించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు చూపించగా అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు. అనంతరం 1930కు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tariff Uncertainty Short Lived Revenue Bookings Strong TCS CEO8
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్‌ సీఈవో

ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) సీఈవో, ఎండీ కె.కృతివాసన్‌ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్‌ బుక్‌ భవిష్యత్‌ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్‌ పైప్‌లైన్‌ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్‌ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్‌వేర్‌ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్‌ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం!

Aqua farmers worry with Companies cut prices under pretext of US tariffs9
‘కౌంట్‌’ డౌన్‌.. కల్లోలం 'రోడ్డున పడ్డ రొయ్య'!

గతంలో బస్తా ఫీడ్‌ రూ.900 ఉండగా ఇప్పుడు రూ.2,700 అయి­పోయింది. మేత ధర మూడు రెట్లు పెరగగా రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్‌ రూ.600 ఉండగా ఇప్పుడు రూ.300కి పడిపోయింది. 30 కౌంట్‌కు రూ.వంద, మిగిలిన కౌంట్‌లకు సగటున రూ.60 చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం వంద కౌంట్‌ రూ.220 చొప్పున కొనాలని చెబుతున్నా రూ.180కి మించి చెల్లించడం లేదు. వెంటనే స్పందించి ఆదుకోవాలి. – మద్దాల గోపాలకృష్ణ, మేడపాడు, పశ్చిమగోదావరి జిల్లా ⇒ ‘30 ఏళ్లుగా ఆక్వా సాగు చేస్తున్నా. ఇప్పుడు ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మార్కెట్‌ను ఎక్స్‌పోర్టర్స్, ప్రాసెసింగ్‌ కంపెనీలు శాసిస్తున్నాయి. రొయ్యల ధరలు ఇష్టమొచ్చినట్టుగా తగ్గించేస్తున్నారు. ఫీడ్‌ ధరలు మాత్రం పెంచేశారు. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాల్సింది పోయి ప్రభుత్వం వారికి వత్తాసు పలుకుతోంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. నెలకు రూ.1.20 లక్షలు అదనంగా విద్యుత్‌ బిల్లులు కడుతున్నా. ప్రభుత్వం నిర్దేశించిన రూ.220 ఏమాత్రం గిట్టుబాటు కాదు’ – గుండు నరసింహం, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ⇒ ‘ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు లీజులకే పోతోంది. ఆక్వా సాగుకు ఎకరాకు రూ. 4.5 లక్షలకుౖపైగా ఖర్చవుతోంది. గతంతో పోలిస్తే ఫీడ్‌ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి. మాది నాన్‌ ఆక్వా జోన్‌ ప్రాంతం. యూనిట్‌ రూ.4 చొప్పున కరెంట్‌ చార్జీలు చెల్లిస్తున్నా. నాన్‌ ఆక్వా జోన్‌ పరిధిలో యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడంతో ఆశపడ్డాం. ఆర్నెల్లకు ఒకసారి ట్రూఅప్, లోడింగ్‌ చార్జీల పేరిట రూ.20 వేల నుంచి రూ.50 వేలు భారం వేస్తున్నారు. అదనపు వినియోగ సుంకం (ఏసీడీ) పేరిట మరో రూ.30వేల నుంచి రూ.40 వేలు బాదేస్తున్నారు. ట్రంప్‌ సుంకం వాయిదా పడినా కంపెనీలు కౌంట్‌ రేట్లను మాత్రం పెంచలేదు. సీఎం ప్రకటించిన 100 కౌంట్‌ రూ.220 కూడా అమలు కావడం లేదు. మొత్తంగా రూ.5–10 లక్షల మేర నష్టపోతున్నాం. – మల్లిడి సందీప్‌రెడ్డి, గంటి, కొత్తపేట మండలం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ⇒ జాతీయ స్థాయిలో 2023–24లో రూ.60 వేల కోట్ల విలువైన 17.82 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి కాగా, దాంట్లో 35 శాతం (దాదాపు రూ. 20వేల కోట్లు) అమెరికాకే ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత 19 శాతం చైనాకు, మిగిలినవి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు 20–50 కౌంట్‌ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతాయి. అయినా సరే ఇప్పుడు 60–100 కౌంట్‌ ధరలను తగ్గించేశారు. సాక్షి, అమరావతి: రొయ్య రైతులను కూటమి సర్కారు రోడ్డున పడేసింది! ఆక్వా సాగుదారులకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకపోవడం.. కాల్చుకు తింటున్న కరెంట్‌ చార్జీలు.. పతనమవుతున్న ధరలు.. ప్రభుత్వ భరోసా కరువవడంతో రైతులు అల్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫీడ్‌ ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఆ మేరకు కిలోకు రూ.20–25 మేర అన్ని రకాల ఫీడ్‌ ధరలు తగ్గించాల్సి ఉంది. ఫీడ్‌ రేట్లు తగ్గకపోగా మూడు రెట్లు పెరిగాయి. దీనిపై ఆక్వా రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరోవైపు గత పది నెలల్లో ట్రూ అప్‌ చార్జీలు, లోడింగ్, అదనపు వినియోగ సుంకం పేరిట విద్యుత్‌ చార్జీల బాదుడు మొదలైంది. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగుదారులందరికీ యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామన్న హామీని టీడీపీ సర్కారు నెరవేర్చకపోవడంతో మోసపోయిన రైతులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు విద్యుత్‌ చార్జీలు చెల్లిస్తున్నారు. తాజాగా ట్రంప్‌ టారిఫ్‌ల సాకుతో కౌంట్‌కు రూ.30–80 మేర తగ్గించిన కంపెనీలు, అమెరికా విధించిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కౌంట్‌ ధర ఆ మేరకు పెంచలేదు.ఫీడ్‌ రేట్లు తగ్గించకుండా పది నెలల పాటు ఆక్వా రైతును దోపిడీ చేసిన కంపెనీలు కంటితుడుపు చర్యగా రూ.4 చొప్పున తగ్గించి చేతులు దులుపుకొన్నాయి. కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం వ్యవహరించటాన్ని నిరసిస్తూ ఆక్వా రైతులు సాగు సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, భీమవరం, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో క్రాప్‌ హాలిడేకు సిద్ధం కావడం, మిగిలిన జిల్లాల్లోనూ ఇదే బాట పడుతున్న నేపథ్యంలో ఆక్వా రైతుల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.. రూ.1.50కే విద్యుత్‌ హామీ గాలికి.. ఆక్వా జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతి రైతుకు యూనిట్‌ రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం.. ఇలా మెరెన్నో∙హామీలిచ్చారు. అయితే వీటి అమలు కోసం రూ.1,099 కోట్లతో అధికార యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను కూటమి సర్కారు పక్కన పెట్టేసింది. గతంలో 15 రోజులకోసారి రైతులు, ప్రాసెసింగ్‌ ఆపరేటర్లు, ఎక్స్‌ పోర్టర్స్‌తో సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరలను స్థిరీకరిస్తూ మద్దతు ధర తగ్గకుండా పర్యవేక్షించగా గత 10 నెలలుగా ఒక్కటంటే ఒక్కసారి కూడా సమావేశమైన పాపాన పోలేదు. కమిటీలో రైతులకు చోటే లేదు.. అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధించిన నేపథ్యంలో సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించాల్సిన కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆక్వా కంపెనీలు కౌంట్‌ రేట్లను దారుణంగా తగ్గించాయి. ఎక్స్‌పోర్టర్స్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతుల గోడు పెడచెవిన పెట్టారు. తాజా సంక్షోభంపై ఆక్వారంగ భాగస్వామ్య సంస్థలతో ఏర్పాటు చేసిన కమిటీలో రైతులకు చోటు లేకుండా చేశారు. వంద కౌంట్‌ రూ.220గా నిర్ణయించారు. ఇదే అదునుగా కంపెనీలు మిగిలిన కౌంట్‌ ధరలను రూ.20–60 వరకు తగ్గించేశాయి. 100 కౌంట్‌ను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం కూడా కొనడం లేదు. కొందరు ట్రేడర్లు రూ.180కి మించి ఇవ్వడం లేదు. ట్రంప్‌ టారిఫ్‌ల వర్తింపు 90 రోజుల పాటు వాయిదా పడినా ఏ ఒక్క కంపెనీ కూడా కౌంట్‌పై రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. ఇదేమిటని ప్రశ్నించే పరిస్థితి కరువైంది. మెజార్టీ కంపెనీలు 20–50 కౌంట్‌ రొయ్యలను కొనడమే నిలిపివేశాయి. పొరుగు రాష్ట్రాల మాదిరిగా ఫీసుల (రొయ్య) మాదిరిగా ధరలు నిర్ణయించాలని రైతులు కోరుతున్నారు. సోయా ధర కిలో రూ.85 ఉన్నప్పుడు మేత ధర టన్ను రూ.15 వేలు ఉండేది. నేడు సోయా ధర కిలో రూ.23 కు తగ్గింది. అంతేకాదు మేతలో కలిపే కాంపోజిషన్, ప్రీమిక్స్‌ ఇతర ముడిసరుకులపై కూడా దిగుమతి సుంకం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మేత ధర కిలోకి రూ.25–రూ.30 తగ్గించాల్సి ఉన్నా కంటి తుడుపు చర్యగా కేవలం రూ.4 తగ్గించడం దారుణమని రైతులు మండిపడుతున్నారు. ఆక్వాలో నంబర్‌ వన్‌ ఏపీ రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో 1.69 లక్షల మంది ఆక్వా సాగు చేస్తున్నారు. మంచినీటి రొయ్యలు 9.56 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యలు 7.15 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. అత్యధికంగా ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.20 లక్షల మంది 4.25 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుదారులున్నారు. రాష్ట్రంలో 111 కోల్డ్‌ స్టోరేజ్‌లు, 1,104 ఆక్వా షాపులు, 106 ప్రాసెసింగ్‌ ప్లాంట్స్, 241 ఆక్వా ల్యాబ్స్‌ ఉన్నాయి. 2023–24లో 51.58 లక్షల టన్నుల దిగుబడులతో ఆక్వాలో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌గా నిలవగా జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో 32.09 శాతం ఏపీ నుంచే జరిగాయి. జాతీయ స్థాయిలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 76 శాతం, చేపల్లో 28 శాతం వాటా ఏపీదే. అలాంటి ఆక్వా రంగం నేడు కూటమి ప్రభుత్వ చర్యల ఫలితంగా సంక్షోభంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆక్వాకు అండగా వైఎస్‌ జగన్‌వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్లూ తమకు అండగా నిలిచిందని ఆక్వా రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు అప్సడా చట్టంతో పాటు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ సరఫరా కోసం ఏపీ ఫిష్‌ ఫీడ్, సీడ్‌ యాక్టులను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తెచ్చింది. నాణ్యమైన సీడ్, ఫీడ్‌ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్‌ ఆక్వాల్యాబ్స్‌ ఏర్పాటుతో ఇన్‌పుట్‌ టెస్టింగ్, వ్యాధి నిర్థారణ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. కరోనా వేళ 100 కౌంట్‌ రూ.150–180 మధ్య కంపెనీలు కొనుగోలు చేస్తున్న సమయంలో గత ప్రభుత్వం రూ.210గా నిర్ణయించి అంతకంటే తక్కువకు కొనుగోలు చేయకుండా కట్టడి చేసింది. ఈక్వెడార్‌ సంక్షోభ సమయంలో సీనియర్‌ మంత్రులతో ఆక్వా రైతు సాధికార కమిటీని నియమించి ప్రతి 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సమీక్షించి 100 కౌంట్‌ రూ.245 కంటే తగ్గకుండా చర్యలు తీసుకుంది. 30 కౌంట్‌ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. అంతేకాకుండా పెంచిన ఫీడ్‌ ధరలను మూడుసార్లు వెనక్కి తీసుకునేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860కి మించి పడకుండా అడ్డుకుందని గుర్తు చేసుకుంటున్నారు. ఆక్వా జోన్‌ పరిధిలో పదెకరాల లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ను అందించింది. 2014–19 మధ్య నాడు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల విద్యుత్తు సబ్సిడీ బకాయిలు చెల్లించడంతోపాటు ఐదేళ్లలో ఏకంగా రూ.3,394 కోట్లు వెచ్చించి రైతులను ఆదుకుంది.పంట విరామం మినహా మార్గం లేదు... ట్రంప్‌ ట్యాక్స్‌ను సాకుగా చూపించి కౌంట్‌ ధరలు దారుణంగా తగ్గించేశారు. సుంకాల పెంపు అమలు 90 రోజులు పాటు వాయిదా వేసినా 100 కౌంట్‌ రూ.200–220కు మించి కొనడం లేదు. కిలోకి రూ.30 నష్టపోతున్నాం. మేత ధర కనీసం రూ.20 తగ్గించాలి. రొయ్యల పెంపకంలో 20% మందులకే ఖర్చవుతుంది. వాటి ధరలు కూడా తగ్గించాలి. ఆక్వా సాగులో 80 %రైతులు నష్టపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట విరామం మినహా మరో మార్గం లేదు. – భూపతిరాజు సుబ్రహ్మణ్యం రాజు (బుల్లిరాజు), ఎదుర్లంక, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాసబ్సిడీ విద్యుత్తు హామీని నెరవేర్చాలి.. 12 ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నా. యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే అని ఇచ్చిన హామీని కూటమి పార్టీలు నెరవేర్చాలి. రూ.3.50 నుంచి రూ.4 వరకు యూనిట్‌పై భారం పడుతోంది. ఎగుమతి దారులు, ఫీడ్‌ ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌గా మారటంతో చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. 100 కౌంట్‌ రూ.260 నుంచి రూ.270 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. – బొల్లెంపల్లి శ్రీనివాస్, అండలూరు, పశ్చిమగోదావరి జిల్లాపెట్టుబడి ఖర్చులు పెరిగాయి గతంతో పోలిస్తే ఆక్వా సాగు పెట్టుబడి ఏకంగా 50 శాతం పెరిగింది. కంపెనీలు చెల్లిస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. – బిళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, తాళ్లరేవు, కాకినాడ జిల్లాఅన్యాయమైపోతున్నాం.. గతేడాది కేంద్ర బడ్జెట్‌లో ముడి సరుకులపై కస్టమ్స్‌ డ్యూటీ ఎత్తివేయడంతో ఇంపోర్టెడ్‌ మేతపై పన్నులు 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గినప్పటికీ కంపెనీలు మేత ధర ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. ఇప్పుడు అమెరికాలో దిగుమతి సుంకం పెంచారనే సాకుతో ఆగమేఘాల మీద కౌంట్‌ రేట్లు తగ్గించడం దుర్మార్గం. ట్యాక్స్‌ పెంపు వాయిదా పడ్డా కౌంట్‌ ధర ఒక్క రూపాయి కూడా పెంచిన పాపాన పోలేదు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కంపెనీలకు వత్తాసు పలకడం బాధాకరం. –టి.నాగభూషణం, ఏపీ ఆక్వా ఫెడరేషన్‌ సలహాదారుడు

African Djembe Drummin Has Many Health Benefits10
సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!

ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్‌ డ్రమ్‌ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్‌ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్‌లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. డ్రమ్‌ మారో డ్రమ్‌.. సంగీత పరికరమైన డ్రమ్‌ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్‌ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్‌. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్‌ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్‌ శిక్షణ స్ట్రోక్‌ పేషెంట్లకు పార్కిన్సన్స్‌ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్‌ స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్‌ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. ఒంటరిగా డ్రమ్మింగ్‌ చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్‌ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్‌ ఫుల్‌ నెస్‌) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్‌ పోయేలా చేస్తుంది. ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్‌ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్‌ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్‌ ఆకారపు ఈ డ్రమ్‌ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్‌ పీస్‌ హార్డ్‌ వుడ్‌తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్‌హెడ్‌ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. పెర్కుషన్‌ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. ‘దక్షిణాఫ్రికా నుంచి వచి్చన జెంబే ఒక పెర్కుషన్‌ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్‌ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్‌డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్‌ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్‌ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే. అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. – సాయి కుమార్, ది జెంబే సర్కిల్‌ వ్యవస్థాపకుడు ఎవరికి నప్పదు.. అంటే.. పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది. (చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement