నిజామాబాద్ : రెంజల్ మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాల భవనంపై నుంచి దూకి శ్వేత(13) అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. శ్వేతకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏడోతరగతి చదువుతున్న శ్వేత తన ఇంటికి వెళ్లేందుకు సెలవు అడిగింది. సంక్రాంతి సెలవులు మరో వారం రోజుల్లో వస్తున్నాయని అప్పుడు వెళ్లాలని సిబ్బంది చెప్పడంతో మనస్తాపానికి గురై భవనంపై నుంచి దూకింది. ఈ విషయాన్నిపాఠశాల సిబ్బంది, పోలీసులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.