
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ సామాజిక విద్యార్థి ఉద్యమకారుడు బొప్పని ఈశ్వర్‌గా గుర్తించారు.
హైదరాబాద్: రాజ్‌భవన్ ముందు ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలంగాణ సామాజిక విద్యార్థి ఉద్యమకారుడు బొప్పని ఈశ్వర్‌గా గుర్తించారు. ఆత్మహత్యాయత్నం చేయబోయ ముందే తాను చెప్పదలచుకున్న విషయాలను ఈశ్వర్ లేఖలో ప్రస్తావించాడు. తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలాలని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఉద్యమకారులకు ఏం చేశారో చెప్పాలని యువకుడు డిమాండ్ చేశాడు.
తెలంగాణ ఉద్యమకారుల లెక్క తేలనిదే ముందస్తు ఎన్నికలకు ఎలా వెళతారని ఈశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను బ్రిటీష్ వారితో పోల్చారు..రాజ్‌న్యూస్‌ను వాడుకుని పక్కనపెట్టారు.. కోదండరాం సార్‌ను ఆడు అని ఎవడు అని పరుషపదజాలంతో మాట్లాడారని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారులు చదువుకు దూరం అయ్యారు..ఉద్యోగాలకు దూరం అయ్యారు..అలాంటి ఉద్యమకారులకు జీవనాధారం ఏది అని ప్రశ్నించారు. నేను ప్రాణ త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు ఉద్యమం చేయడానికి సిద్ధమా అని లేఖ ద్వారా అడిగారు.