Top Stories
ప్రధాన వార్తలు

అణచివేతలో.. ఇందిరమ్మకు తీసిపోని లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేశ్ మాటల తీరు, చేష్టలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితులు కూడా 1975 నాటి ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టి రాజ్యమేలిన ఇందిరాగాంధీ అప్పట్లోనూ ప్రతిపక్షాలను అభివృద్ధి నిరోధకులుగానే అభివర్ణించారు. పోలీసుల అకృత్యాలకు తట్టుకోలేక ఇతర పార్టీల నేతలు కార్యకర్తలు చాలా మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ యువజన కాంగ్రెస్ సారథి. ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా? అనుకునేంత పవర్ ఫుల్. కేంద్ర మంత్రి ఒకరు సంజయ్ గాంధీ చెప్పులు మోశారన్న విమర్శలు వచ్చాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.మీడియాలో అయితే అంతా భజన వార్తలే ఇవ్వాలి. రామ్‌నాథ్ గోయాంకాకు చెందిన ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి పత్రికలే ప్రభుత్వం తప్పులపై విమర్శలతో వార్తలు ఇచ్చేవి. వాటిని కూడా సమాచార శాఖ అధికారులు సెన్సార్ చేసేవారు. దానికి నిరసనగా వార్తల బదులు ఖాళీగా ఉంచి పత్రికలను ముద్రించేవారు. దాదాపు రెండేళ్లపాటు దేశం అంతటా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంది. ఏపీలోనూ ఇప్పుడు ఆ పరిస్థితి పునరావృతమవుతుందా? అన్న భయం కలుగుతోంది. టీడీపీలో చేరకపోతే వైఎస్సార్సీపీ నేతలపై ఏదో ఒక కేసు పెట్టి వేధిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఏ జైలు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికంగా కనిపిస్తున్నారట.ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అరాచకాలను తట్టుకోవడం కష్టంగా ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం వారిని నియంత్రించడం లేదు. పోలీసులు పట్టించుకోవడం లేదు. మిగతా నేరాల అదుపు చేయడం సంగతి ఎలా ఉన్నా పోలీసులు బృందాలు, బృందాలుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేసే పనిలో బిజీగా ఉంటున్నారట. ఇదంతా లోకేశ్ రెడ్ బుక్ ప్రభావమే. దానిని ఆయన కూడా నిర్ధారిస్తున్నట్లే మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్ లోకి పేరు ఎక్కించి వేధిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక మంత్రి అంటుంటే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే ఏపీలో ప్రజలను రక్షించేదెవరన్న ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కన్నా లోకేశ్‌కే అధిక ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీ వారంతా లోకేశ్ దృష్టిలో పడితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. లోకేశ్ జోక్యం చేసుకోని ప్రభుత్వ శాఖ ఉండడం లేదట. వేర్వేరు శాఖల మంత్రులు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు లోకేశ్‌నే ప్రధాన అతిధిగా పిలుస్తూన్నారు.తండ్రి ముఖ్యమంత్రి కాకుంటే, ఈయన మంత్రి అయ్యేవారా? ప్రస్తుతం యువరాజు మాదిరి ఇదంతా తమ సామ్రాజ్యం అన్నట్లు వ్యవహరించ గలిగేవారా?. తన ఆదేశాల మేరకే రెడ్ బుక్ పనిచేస్తోందని, తానే దానికి బాధ్యుడనని మరింత ఓపెన్ గా మాట్లాడుతున్నారంటే చంద్రబాబు ఎంత వీక్ అయింది అర్థమవుతోంది. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు పాలన ఇంత అధ్వాన్నంగా లేదు. లోకేశ్ అండ్ కో ఆదేశాల మేరకు రాజకీయంగా వ్యతిరేక పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన అనేక మందిపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసు శాఖ దుర్వినియోగం, ఒక కేసులో బెయిల్ వస్తుందని అనుకుంటే మరికొన్ని కేసులు పెట్టి అరెస్టు చేయడం, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూలకు తిప్పడం వంటివి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. ఏపీలో ఎవరినైనా ఎక్కువగా వేధించాలని అనుకుంటే వెంటనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తితో ఒక కేసు పెట్టిస్తున్నారు.నటుడు పోసాని కృష్ణ మురళి వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాదాపు నెల రోజుల పాటు వందల కిలోమీటర్ల దూరం ప్రతి రోజు తిప్పుతూ వేధించారంటే ఈ ప్రభుత్వానికి, ఈ పోలీసులకు అసలు మానవత్వం ఉందా అన్న ప్రశ్న వస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఒక ఎస్టీ వ్యక్తితో ఫిర్యాదు చేయించారట. మరో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా అదే చట్టం పెట్టి బెయిల్ రాకుండా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా లోకేశ్ నేరుగా రెడ్ బుక్ అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఆయన వైఎస్సార్సీపీ వారిని ఉద్దేశించి చెప్పినట్లు కనిపించినా, నిజానికి ఆయన బెదిరించింది ప్రజలనే. ఆయా చోట్ల ప్రాజెక్టులు వచ్చినప్పుడు, స్థానిక ప్రజలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. భూముల పరిహారం, కాలుష్యం తదితర సమస్యలు వస్తాయి. వాటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెబుతారు. వారికి రాజకీయ పార్టీలు అండగా ఉంటాయి. ఆ సమస్యలలో వాస్తవమైనవి ఉంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలి. అంతే తప్ప పోలీసులను పెట్టి కొట్టిస్తామని, వేధిస్తామని అన్నట్లుగా రెడ్ బుక్ తో భయపెడతామన్నట్లుగా స్వయానా ఒక మంత్రి మాట్లాడితే ఏమి చేయాలి? అలాంటివి ఎల్లకాలం సాగవన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఇక్కడ ఇంకో చిత్రం ఏమిటంటే ప్రస్తుతం లోకేశ్ ప్రకాశం జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు గతంలో జగన్ ప్రభుత్వ కాలంలో మంజూరు అయినదే. రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ స్వయంగా ఏపీకి వచ్చి జగన్‌తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ పారిశ్రామిక విధానాన్ని మెచ్చుకుంటూ ప్రసంగించారు. అయినా అవేవో తామే తెచ్చినట్లు లోకేశ్ బిల్డప్ ఇచ్చుకున్నారు. అలా చేసినంత వరకు ఆక్షేపించనవసరం లేదు. కానీ, ఆ సందర్భంలో కూడా జగన్ టైమ్ లో పరిశ్రమలు వెళ్లిపోయాయని అంటూ అసత్య ప్రచారాలు చేశారు. ఈ విషయంలో తన తండ్రి చంద్రబాబును మించి అబద్దాలు చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే అర్థం అవుతుంది. జగన్ టైమ్‌లో కర్నూలు వద్ద వచ్చిన గ్రీన్-కో ఎనర్జీ ప్లాంట్‌ను ఎద్దేవా చేసింది లోకేశ్ కాదా?. దానిని చెడగొట్టడానికి ఎల్లో మీడియా ఈనాడు ఎన్ని వ్యతిరేక కథనాలు రాసిందీ ఒక్కసారి పాత పత్రికలు తిరగేస్తే తెలుస్తుంది. ఈయన చెప్పినదాని ప్రకారం అయితే ఆ రెడ్ బుక్ ను ప్రయోగించవలసింది వారిపైనే కదా!.అదానీ, తదితరులు రెన్యుబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అదానికి రాష్ట్రాన్ని రాసిస్తున్నారని మరో టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిందే. తుని వద్ద జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్కుకు అనుమతి ఇవ్వవద్దని లేఖ రాసింది స్వయంగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాదా?. తాజాగా వచ్చిన ఒక సమాచారం ప్రకారం గురజాల ఎమ్మెల్యే బెదిరింపులతో రెండు సిమెంట్ పరిశ్రమలు మూతపడ్డాయట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. జగన్ దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వస్తే అవేం కంపెనీలు అంటూ మాట్లాడిన లోకేశ్ తాము అధికారంలోకి వచ్చాక ఆర్భాటంగా దావోస్ వెళ్లి ఉత్తచేతులతో తిరిగి వచ్చారే. పైగా పెట్టుబడుల కోసం వెళ్లలేదని, ఏపీ బ్రాండ్ ప్రచారం కోసమని చెప్పుకున్నారే. ఆ తర్వాత ఆరున్నర లక్షల కోట్ల విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి ఒప్పందాలు అయ్యాయంటూ, అవేమిటో చెప్పకుండానే ప్రచారం ఆరంభించారే. ఇప్పుడేమో కర్నూలు గ్రీన్ ఎనర్జీ కంపెనీని, కడప ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తామే తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారే. కడపలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ను జగన్ తీసుకువస్తే దానిని అమరావతికి తరలించే యత్నం చేశారా? లేదా?.గతంలో జగన్ పాలనలో అనేక పరిశ్రమలు వస్తే వాటికి అడ్డు పడడానికి తెలుగుదేశం కాని, ఎల్లో మీడియా కాని చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఏ స్కీమ్ చేపట్టినా పచ్చి అబద్దాలు ప్రచారం చేసిందీ వీరే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరికి బ్యాండ్ వాయించే వారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి ఉంటే కొన్ని వందల కేసులు నమోదై ఉండేవి. ఉదాహరణకు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ లోకేశ్ ఎందరిని బెదిరించారో అందరికీ తెలుసు. జిల్లా ఎస్పీలను సైతం పేరుపెట్టి హెచ్చరికలు చేసేవారు. ఇప్పటి మాదిరిగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఉంటే లోకేశ్‌పై ఎన్ని కేసులై ఉండేవి. ఇప్పటం వద్ద అనుమతి లేకుండా కారు పైన కూర్చుని పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. మరోసారి రోడ్డుపై అడ్డంగా పడుకుని పోలీసుల విధులకు ఆటంకం కల్పించిన పవన్‌పై ఆ రోజుల్లో కేసులు పెట్టారా? లేదే!.మహిళలు మిస్ అయ్యారని తప్పుడు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టి ఉండవచ్చు కదా?. అయినా అలా చేయలేదే. చంద్రబాబు, లోకేశ్‌లు అప్పటి సీఎం జగన్‌ను సైకో అంటూ, పలు అభ్యంతరకర పదాలు వాడారా? లేదా?. అయినా వారి మీద కేసులు రాలేదు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి పోలీసులు వైఎస్సార్సీపీ వారిపై, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి హింసిస్తున్నారే!. ఏ రాజ్యాంగం వీటికి అనుమతి ఇస్తుంది?. ఈ విషయంలో ఏపీ హైకోర్టు సైతం పలుమార్లు పోలీసులను హెచ్చరించినా వీరి ధోరణి మారడం లేదు. సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతూ ఒక జూనియర్ లెక్చరర్ ప్రశ్నిస్తే ఆయన వద్ద నాటు సారా దొరికిందని కేసు పెట్టారట. ఇలా ఒకటి కాదు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో చూశాం.ఇవన్నీ రెడ్ బుక్ లో భాగమేనని లోకేశ్ గర్వంగా ఫీల్ అవుతుండవచ్చు. కానీ షాడో సీఎం స్థాయి నుంచి అసలు సీఎం అవ్వాలని ఆశపడుతున్న లోకేశ్ నిజంగానే ఆ పదవిలోకి వస్తే రాష్ట్రం ఇంకెంత ఘోరంగా తయారవుతుందో అన్న భయం ప్రజలలో ఏర్పడదా?. నిత్యం అబద్దాలు చెప్పడం కాకుండా, కాస్త నిజాయితీగా మాట్లాడుతూ, హుందాగా వ్యవహరిస్తూ, రెడ్ బుక్ పిచ్చిగోలను వదలి వేయకపోతే రాజకీయంగా లోకేశ్‌కే నష్టం కలుగుతుంది. కక్ష పూరిత రాజకీయాలతోనే అధికారంలో కొనసాగాలనుకుంటే అది ఎల్లకాలం అయ్యే పని కాదని ఎమర్జెన్సీ అనుభవం తెలియచేస్తుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే: ఖర్గే
అహ్మదాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి. మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్‌ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్‌పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు. బీజేపీ ఆరెస్సెస్‌లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.ఇక డీసీసీలదే పవర్ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు.

ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
సాక్షి, వైఎస్సార్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఏపీలో వైఎస్సార్సీపీ కేడర్ వినాశమే టార్గెట్‌గా అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం అని హెచ్చరించారు.కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషాను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ భాషా ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంజాద్ భాషాను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం, అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది. అభివృద్ధిపై కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులే లక్ష్యంగా పెట్టుకున్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాపై అక్రమ కేసు నమోదు చేశారు. తీవ్రవాది మాదిరి ముంబై వెళ్ళి అహ్మద్ భాషాను అక్రమ అరెస్టు చేసి అత్యుత్సాహంగా కడపకి తెచారు. ఆయన అరెస్ట్ తర్వాత అంజాద్ భాషా ఇంటి సమీపంలో టీడీపీ నాయకులు సంబరాలు చేయడం దారుణం. కడపలో టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడటం దారుణం. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దగ్గర మెప్పు పొందడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు, వేధింపులకు గురిచేస్తున్న ఎవరినీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం’ అని హెచ్చరించారు.

ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.

ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్‌ను ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.25 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్‌పై నమ్మకంతో సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్ రెండు వికెట్లు తీసి మేనేజ్మెంట్ అంచనాలు నిజం చేశాడు.‘నోట్‌బుక్’ సంబరాలుఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు వైరల్ అయింది. బ్యాటర్‌ను అవుట్ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్‌బుక్‌లో వికెట్ నంబర్ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా దిగ్వేశ్ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్ తీసిన సంబరాన్ని సెలబ్రేట్ చేసుకోగా.. ఈసారి మ్యాచ్ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్ పాయింట్ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్ అయితే.. మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పచ్చిక మీద సంతకంఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం దిగ్వేశ్ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్ తీసిన అనంతరం ‘నోట్ బుక్’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య ప్లేయర్ సునీల్ నరైన్ వికెట్ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్ రెండో బంతికి నరైన్‌ను అవుట్ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.Apne idol ka hi chalaan kaat diya 😌😂 pic.twitter.com/HuoxZJj1DX— Lucknow Super Giants (@LucknowIPL) April 8, 2025ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?ఈ పరిణామాలపై కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. నోట్‌బుక్ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్ సింగ్ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచింది.చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్

శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
పాఠశాల విద్యార్థులు చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆడా, మగా పిల్లలు గ్రూపుగా కలిసి థాయ్ పాటకు అందంగా నృత్యం చేస్తున్నారు. ఈ వీడియోకు ఏకంగా 10 కోట్ల వ్యూస్ వచ్చాయి. పిల్లల పిల్లల ఉత్సాహం , వారి ఆనందం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు నెటిజన్లు తన బాల్యం సంగతులను గుర్తు చేసుకున్నారు.తమిళనాడులోని ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఈ థాయ్ పాటకు డ్యాన్స్ చేశారు.మేలూర్ పంచాయతీ యూనియన్ కిండర్ గార్టెన్ , మిడిల్ స్కూల్, తెర్కమూర్ నుండి ఒక ఉపాధ్యాయుడు షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హిట్ థాయ్ ట్రాక్ అనన్ తా పద్ చాయేకి పాడుతూ స్టెప్పులేశారు. ఒక అమ్మాయిల బృందం, ఒక అబ్బాయి నృత్యం చేస్తూ, తమిళంలో అన్ననా పతియా ఆపత కేథియా (నా సోదరుడిని చూశారా? నాన్నను అడిగారా?) థాయ్ సాహిత్యం అసాధారణంగా తమిళ భాషకు సారూప్యంగా ఉండటంతో విశేషంగా నిలిచింది. "వారు మీనియన్స్ లాగా కనిపిస్తున్నారు" అని ఒక యూజర్, "దేవా, దయచేసి నన్ను నా స్కూల్ రోజులకు తీసుకెళ్లండి" అని యూజర్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Suryan FM (@suryanfm) ఈ టీచర్ ఇన్‌స్టాలో ఖాతానిండా పిల్లల యాక్టివిటీస్, ఆటలు, పాటల వీడియోలే ఎక్కువగా ఉంటాయి. సోషల్ మీడియా వినియోగదారులు వీరిపై ప్రశంసలు కురిపిస్తుంటారు. ముఖ్యంగా శివదర్శిని అనే అమ్మాయికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇదీ చదవండి: నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్తమిళ భాషలా ధ్వనించే అనన్ త పద్ చాయే అనే పాట ఇండియాలో చాలా ట్రెండింగ్. దీని ఒరిజినల్ ట్రాక్‌ను థాయ్ హాస్యనటుడు-గాయని నోయి చెర్నిమ్ పాడారని భావిస్తున్నారు. 2019లో ఇండోనేషియా ప్రదర్శనకారిణి నికెన్ సాలిండ్రీ తన ప్రదర్శనలలో దీన్ని పాడినపుడు ఇది ప్రజాదరణ పొందింది.

ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్..: జూనియర్ ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలి. లిటిల్ వారియర్.. ధైర్యంగా ఉండు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశాడు.ఏం జరిగిందంటే? పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ వేసవి శిక్షణ తరగతులకు సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు వెళ్లాడు. ఏప్రిల్ 8న ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం శంకర్‌కు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.— Jr NTR (@tarak9999) April 9, 2025 చదవండి: Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి

ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ సుంకాలు?
ఔషధాల దిగుమతులపై అమెరికా త్వరలోనే భారీ సుంకం విధించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ట్రంప్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఔషధ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికాకు మార్చుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ ప్రభుత్వం ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లను పరస్పర టారిఫ్ పాలసీ నుంచి మినహాయించింది. కానీ తాజాగా ప్రకటనతో తిరిగి ఈ విభాగాల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.‘మేము త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాన్ని ప్రకటించబోతున్నాం. వివిధ దేశాల్లో తయారీ కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు తిరిగి అమెరికా వచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగపడుతాయి. ఈ విభాగంలో యూఎస్ అతిపెద్ద మార్కెట్’ అని ట్రంప్ అన్నారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలను ఉదహరిస్తూ అమెరికా ఇటీవల భారతీయ వస్తువులపై 26 శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించింది.దేశంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించిన సమయంలో ఫార్మా రంగాన్ని అందులో నుంచి మినహాయించారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ప్రకటిస్తామని ట్రంప్ మార్చి 24న చెప్పారు. యుద్ధాలు, మరేదైనా అనిశ్చితులు తలెత్తినప్పుడు ఉక్కు, ఫార్మాస్యూటికల్స్ అవసరం ఉందన్నారు. స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై ఇప్పటికే 25 శాతం సెక్టోరల్ టారిఫ్‌లను వర్తింపజేసిన ట్రంప్ రాగిపై కూడా వీటిని అమలు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పాటు కలప, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అదనపు సెక్టోరల్ లెవీలను ఆయన ప్రభుత్వం విడిగా పరిశీలించనుంది. అయితే వీటి అమలుకు ఎంత సమయం పడుతుందో మాత్రం స్పష్టతనివ్వలేదు.భారత్‌పై ప్రభావంఫార్మా దిగుమతులపై ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటిస్తే అమెరికాకు అత్యధికంగా ఔషధాలను సరఫరా చేసే దేశాల్లో ఒకటైన భారత్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 2024లో దేశం ఔషధ ఎగుమతుల విలువ 12.72 బిలియన్ డాలర్లు. ఇది దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ఎగుమతి రంగంగా మారింది. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో భారత ఫార్మా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2022లో కొన్ని సర్వేల ప్రకారం యూఎస్‌లోని వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్‌తో దాదాపు 40 శాతం మందులు ఇండియాకు చెందినవే కావడం గమనార్హం.ఇదీ చదవండి: మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..ఇదిలావుండగా, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) అమెరికాలో ప్లాంట్లను నిర్మించకపోతే 100% వరకు పన్ను విధిస్తామని ట్రంప్ బెదిరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనను తప్పుబట్టిన ట్రంప్ అరిజోనాలోని ఫీనిక్స్‌లో ఉన్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం టీఎస్ఎంసీ యూఎస్ యూనిట్‌కు 6.6 బిలియన్ డాలర్ల గ్రాంట్ ఇవ్వడాన్ని ఖండించారు.

మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కన్నుమూత
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళిసై తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు కుమారి అనంతన్(93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆరోగ్యం విషమించడంతో అనంతన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.వివరాల ప్రకారం.. మాజీ గవర్నర్ తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ క్రమంలో అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తన తండ్రి మృతి నేపథ్యంలో తమిళిసై కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో తమిళిసైని వారు బంధువులు, పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు.Late Shri. Kumari Ananthan known to be a true Gandhian and relentless leader of the people serving as President of TN @INCIndia leaves an inspirational legacy behind. Heartfelt condolences to his daughter @DrTamilisai4BJP mam and family. Om Shanti 🙏#RIPKumariAnanthan ayya pic.twitter.com/fSXpLBKwnM— Sanam Shetty (@ungalsanam) April 9, 2025కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా.. ఇక, కుమారి అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. ఆయన తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్‌కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగించారు. అనంతన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. VIDEO | Chennai: Former Tamil Nadu Congress president Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passes away at 93 in Chennai. Ananthan's mortal remains kept at Soundararajan's residence for people to pay homage.#ChennaiNews #TamilNaduNews(Full video… pic.twitter.com/FWlA1zXe8h— Press Trust of India (@PTI_News) April 9, 2025ఇక, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. తమిళిసై నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనంతన్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. #WATCH | Chennai, Tamil Nadu: CM MK Stalin arrives at the residence of BJP leader Tamilisai Soundararajan to pay tribute to her fatherSenior Congress leader Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passed away at 93 due to age-related illness pic.twitter.com/srYmxCEBye— ANI (@ANI) April 9, 2025
‘కిరణ్ రాయల్‌పై చర్యలేవి’
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
గ్లోబల్ కంపెనీల కోసం వేదాంతా అన్వేషణ
ఇదేం పెళ్లిరా నాయనా!
క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
చంద్రబాబు తప్పుకుంటేనే మంచిదా వర్మ?
‘కేసీఆర్‌ది సాగు భాష..రేవంత్‌ది చావు భాష’
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
మేం ఉద్యోగం చేయలేం
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ప్రాణాలు తీస్తున్న సరదా
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
చరిత్ర సృష్టించిన పూరన్.. సెహ్వాగ్ రికార్డు బద్దలు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
మియాపూర్‌లో షెల్టర్!
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్ చేసిన హర్షిత్ రాణా
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
17 ఏళ్లుగా పరారీలోనే!
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
గొప్పగా బ్యాటింగ్ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
పాపికొండల్లో అలుగుల సందడి
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
బంగాళాఖాతంలో అల్పపీడనం
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
ఆర్బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట
గవర్నర్‌కు గడువు 3 నెలలే
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
కొనసాగుతున్న అల్పపీడనం
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ
‘కిరణ్ రాయల్‌పై చర్యలేవి’
శివదర్శిని ఫ్యాన్స్ ఇక్కడ : ఒక్క డ్యాన్స్‌కు 10 కోట్లా, వీడియో వైరల్
గ్లోబల్ కంపెనీల కోసం వేదాంతా అన్వేషణ
ఇదేం పెళ్లిరా నాయనా!
క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
చంద్రబాబు తప్పుకుంటేనే మంచిదా వర్మ?
‘కేసీఆర్‌ది సాగు భాష..రేవంత్‌ది చావు భాష’
యాడ్స్‌లో అగ్రహీరోల హవా..రోజుకి అన్ని కోట్లా?
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
మేం ఉద్యోగం చేయలేం
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ప్రాణాలు తీస్తున్న సరదా
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్ వైరల్
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
చరిత్ర సృష్టించిన పూరన్.. సెహ్వాగ్ రికార్డు బద్దలు
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
మియాపూర్‌లో షెల్టర్!
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్ చేసిన హర్షిత్ రాణా
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
17 ఏళ్లుగా పరారీలోనే!
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
‘ఆ తప్పులే మా కొంప ముంచాయి.. అతడి బ్యాటింగ్ అద్భుతం’
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
గొప్పగా బ్యాటింగ్ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రంప్ టారిఫ్.. భారత ప్రతీకార సుంకాలు అనుమానమే!
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
పాపికొండల్లో అలుగుల సందడి
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
బంగాళాఖాతంలో అల్పపీడనం
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
ఆర్బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట
గవర్నర్‌కు గడువు 3 నెలలే
మళ్లీ బంగారం ధరలు పైకి! తులం ఎంతంటే..
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
కొనసాగుతున్న అల్పపీడనం
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
ఎవర్నీ వదిలేది లేదు.. అన్ని గుర్తు పెట్టుకుంటాం: అవినాష్ రెడ్డి వార్నింగ్
రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
నా సక్సెస్ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ
సినిమా

ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్..: జూనియర్ ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చిన్నకుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో గాయపడ్డ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడని తెలిసి ఎంతో బాధపడ్డాను. అతడు త్వరగా కోలుకోవాలి. లిటిల్ వారియర్.. ధైర్యంగా ఉండు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులకు బలం చేకూరాలంటూ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశాడు.ఏం జరిగిందంటే? పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ వేసవి శిక్షణ తరగతులకు సింగపూర్‌లోని రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు వెళ్లాడు. ఏప్రిల్ 8న ఈ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. దీంతో వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆస్పత్రిలో చేర్పించింది. ప్రస్తుతం శంకర్‌కు బ్రాంకోస్కోపీ చేస్తున్నట్లు పవన్ వెల్లడించారు. తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు.Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.— Jr NTR (@tarak9999) April 9, 2025 చదవండి: Saptagiri: విషాదం.. బాధలో కమెడియన్ సప్తగిరి

ఇలియానాపై నాకెలాంటి ఈర్ష్య లేదు.. దానికోసమే ప్రయత్నించా!: వాణి కపూర్
రైడ్.. 2018లో అజయ్ దేవగన్ (Ajay Devgn) హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే రైడ్ 2 (Raid 2 Movie). ఇందులో మరోసారి అజయ్ దేవ్‌గణ్ హీరోగా, రాజ్‌కుమార్ గుప్తా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే హీరోయిన్ మాత్రం మారింది. తొలి భాగంలో ఇలియానా కథానాయికగా ఉండగా రెండో భాగంలో మాత్రం ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను ఎంపిక చేశారు.సేమ్ ఇక్కడ కూడా..ఇలియానా (Ileana D'Cruz)ను ఎందుకు తప్పించారన్న ప్రశ్నలపై అజయ్, వాణికపూర్ స్పందించారు. రైడ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. మీరు చాలా హాలీవుడ్ సినిమాలు చూసే ఉంటారు. జేమ్స్‌బాండ్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాల్లో జేమ్స్‌బాండ్ ఒక్కరే ఉండరు. ఆ పాత్ర కొనసాగుతుంది కానీ నటులు కాదు. ఎప్పటికప్పుడు జేమ్స్‌బాండ్ రోల్‌లోకి కొత్తవాళ్లు వస్తుంటారు. అదే ఇక్కడ కూడా జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు.ఇలియానాపై అసూయ లేదువాణీ కపూర్ (Vaani Kapoor) మాట్లాడుతూ.. రైడ్ 1 సినిమాలో హీరోయిన్గా చేసినవారిపై నాకెలాంటి ఈర్ష్య లేదు. మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రచయిత, దర్శకుడు నన్ను సంప్రదించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను ప్రయత్నించాను. అంతే.. ఈ సినిమాలో నాలో మరో కోణాన్ని చూస్తారు. ఈ పాత్ర నాకు కొత్తగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమా రిలీజ్ ఎప్పుడంటే?రైడ్ 2 విషయానికి వస్తే.. ఇందులో అజయ్.. ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్‌గా కనిపించనున్నాడు. రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, భూషణ్ కుమార్, గౌరవ్ నంద, క్రిషణ్ కుమార్, ప్రగ్యా సింగ్ నిర్మించారు. రైడ్ 2 మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. కంగనా షాక్

మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన
ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో(Manchu Family) మరోసారి వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్(Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)తాజాగా బుధవారం ఉదయం.. జల్ పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా.. తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొన్నాళ్ల క్రితం విష్ణు-మనోజ్ మధ్య మొదలైన గొడవ.. చాలారోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారు అనుకునేంతలోపు మళ్లీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)ఇక మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే అందరినీ పిచ్చోల్లని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2 న వచ్చాము. ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళి నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.

నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. షాకయ్యా: కంగనా
నా ఇంటి కరెంట్ బిల్లు రూ.1 లక్ష అంటోంది బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut). హిమాచల్ ప్రదేశ్ మనాలీలో ఉన్న తన ఇంటికి లక్ష రూపాయల బిల్లు ఎలా వేశారని అధికారులపై మండిపడుతోంది. తనసలు నివాసమే ఉండని ఇంటికి ఎడాపెడా బిల్లు వేసిన ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది.షాకయ్యా..ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ.. మనాలీలో ఉన్న నా ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు వేశారు. నేను నివసించని ఇంటికి ఈ రేంజ్లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నాను. సోదరసోదరీమణులారా.. మన రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం మనందరి బాధ్యత. అలా చేయాలంటే ఇలాంటి తోడేళ్ల నుంచి మన రాష్ట్రానికి విముక్తి కల్పించాలి అని చెప్పుకొచ్చింది. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.సినిమాకంగనా విషయానికి వస్తే.. ఈమె చివరగా నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకురాలి అవతారమెత్తింది. అంతేకాక తన సినిమాను తనే నిర్మించింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
న్యూస్ పాడ్‌కాస్ట్

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు
క్రీడలు

PBKS Vs CSK: గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.ప్రియాన్ష్ మెరుపు శతకంఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమిఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Sights we have come to cherish over many years 💛MS Dhoni produced a fighting knock of 27(12) 🔥Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025 కీలక వికెట్ తీసిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లోనూ గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా

గొప్పగా బ్యాటింగ్ చేశాం.. కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...
ఐపీఎల్-2025 (IPL 2025)లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు మరో పరాజయం ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురైన ఈ చేదు అనుభవం పట్ల కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.గొప్పగా బ్యాటింగ్ చేశాం..లక్నో చేతిలో ఓటమి అనంతరం స్పందిస్తూ.. ‘‘టాస్ సమయంలో నేను చెప్పినట్లుగానే.. ఈ వికెట్ 40 ఓవర్లపాటు బ్యాటర్లకు అనుకూలించింది. మేము కూడా మా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాం. ఇదొక గొప్ప మ్యాచ్.కానీ చివర్లో విజయానికి మేము కేవలం నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాం. 230 పరుగులకి పైగా స్కోరును ఛేదించే క్రమంలో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ప్రభావం చూపింది. నిజంగా బ్యాటింగ్‌కు ఇది అత్యుత్తమ పిచ్.కానీ మా బౌలర్లలో ఆ ఇద్దరు మాత్రం...నిలదొక్కుకునేందుకు మా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడినా.. తర్వాత కుదురుకున్నారు. మధ్య ఓవర్లలో మా బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారని చెప్పవచ్చు. అయితే, సునిల్ నరైన్ బౌలింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడ్డాడు. నిజానికి మిడిల్ ఓవర్లలో సునిల్, వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. కానీ ఈరోజు మా బౌలర్లకు ఏదీ పెద్దగా కలిసి రాలేదు’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు. బౌలర్లు ఇంకాస్త మెరుగ్గా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.పూరన్ వీరంగంకాగా ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకాలతో చెలరేగారు.మరోవైపు.. మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో పేసర్ హర్షిత్ రాణా రెండు, రసెల్ ఒక వికెట్ దక్కించుకున్నారు.స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ మాత్రం ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వరుణ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 31 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. మరోవైపు.. నరైన్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 38 పరుగులు ఇచ్చుకున్నాడు.కేకేఆర్ మెరుపులు సరిపోలేదుఇక లక్ష్య ఛేదనలో కెప్టెన్ అజింక్య రహానే (35 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరవగా... వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), సునీల్ నరైన్ (13 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా GAME ON, courtesy of the skipper 👊🫡Ajinkya Rahane notches up his 2️⃣nd 5️⃣0️⃣ of #TATAIPL 2025! 🙌#KKR need 90 runs in 8 overs.Updates ▶ https://t.co/3bQPKnwPTU#KKRvLSG | @KKRiders | @ajinkyarahane88 pic.twitter.com/1556wwfFfg— IndianPremierLeague (@IPL) April 8, 2025

Suruchi- Vijayveer: డబుల్ ధమాకా
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో మంగళవారం భారత షూటర్లు అదరగొట్టారు. రెండు స్వర్ణ పతకాలతో సత్తా చాటుకున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 18 ఏళ్ల సురుచి ఇందర్ సింగ్... పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌వీర్ సిద్ధూ పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి 244.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సురుచి ధాటికి చైనా ద్వయం కియాన్ వె 241.9 పాయింట్లతో రజతం దక్కించుకోగా... డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ జియాంగ్ రాన్‌జిన్ 221 పాయింట్లతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. 41 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లోనూ సురుచి తన ఆధిపత్యం చాటుకుంది. సురుచి 583 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచింది. భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్ నిరాశపరిచింది. మనూ 574 పాయింట్లు స్కోరు చేసి 13వ స్థానంతో సంతృప్తి పడి ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. భారత్‌కే చెందిన మరో షూటర్ సయం 572 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచింది. ఆరుగురు షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో విజయ్‌వీర్ సిద్ధూ 29 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో 22 ఏళ్ల విజయ్‌వీర్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలవడం ఇదే తొలిసారి. రికియార్డో మజెట్టి (ఇటలీ; 28 పాయింట్లు) రజతం నెగ్గగా... యాంగ్ యుహావో (చైనా; 23 పాయింట్లు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. 24 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ ఈవెంట్లో విజయ్‌వీర్ 579 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. భారత్‌కే చెందిన గుర్ప్రీత్ సింగ్ 575 పాయింట్లతో 10వ స్థానంలో, అనీశ్ 570 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో కలిపి మొత్తం 6 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.

ఓటమితో మొదలు
పుణే: సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు శుభారంభం లభించలేదు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ జట్టులో ప్రపంచ 245వ ర్యాంకర్ లులు సన్ సింగిల్స్ మ్యాచ్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ 345వ ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–1, 6–1తో ఐశి దాస్ (న్యూజిలాండ్)పై అలవోకగా గెలిచింది. దాంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం రెండు గేమ్‌లు కోల్పోయింది. ఆరు ఏస్‌లు సంధించిన రష్మిక నాలుగు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేసింది. తొలి సర్వ్‌లో 20 పాయింట్లు నెగ్గిన రష్మిక రెండో సర్వ్‌లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. రెండో మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2–0తో విజయాన్ని ఖాయం చేసుకునేది. కానీ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ లులు సన్ 6–3, 6–3తో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లిని ఓడించింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు చేజార్చుకుంది. ఆరు ఏస్‌లు సంధించిన లులు సన్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. స్కోరు 1–1తో సమం కావడంతో చివరిదైన డబుల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా, డబుల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రార్థన తొంబారే జత కట్టి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. అయినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన ద్వయం 3–6, 4–6తో లులు సన్–మోనిక్యూ బ్యారీ జోడీ చేతిలో ఓడిపోవడంతో న్యూజిలాండ్ 2–1తో విజయాన్ని అందుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది.
బిజినెస్

ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించిన విధంగానే మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇది 6 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఫిబ్రవరి తర్వాత తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఏప్రిల్ 7న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. బుధవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన తర్వాత, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది రెండో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. అంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. తాజాగా మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6.25 శాతం నుంచి తాజాగా 6 శాతానికి తగ్గింది.సుస్థిర వృద్ధికి ఊతమిచ్చేలా..‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణ అనిశ్చితిలో ఉంది. దీంతో విధానాల రూపకల్పనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకుని మెరుగైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు కట్టుబడి ఉన్నాం. నేను గతంలో చెప్పినట్లుగానే దేశీయ వృద్ధి, ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉంటున్నాం. అదే సమయంలో ప్రధాన వృద్ధికి మద్దతు ఇచ్చే ద్రవ్య విధానాన్ని పాటిస్తున్నాం. మెరుగైన డిమాండ్, సరఫరాలు, సుస్థిర స్థూల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ద్రవ్యోల్బణేతర వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలోలాగే స్పష్టమైన, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల కోసం విధానాలను అమలు చేస్తాం’ అని మల్హోత్రా అన్నారు.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.కస్టమర్లకు ఊరటవాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలుగుతుంది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 156 పాయింట్లు తగ్గి 22,381కు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పాయింట్లు నష్టపోయి 73,821 వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా పడిన మార్కెట్లకు నిన్నటి ర్యాలీ ఉపశమనం కలిగించినా, ఇది ఒకే రోజుకు పరిమితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.45 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 60.55 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.57 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.15 శాతం దిగజారింది.ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. డాలర్ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి. ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు ఊరటనిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఆర్బీఐ ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.అప్రమత్తత అవసరంతీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యవహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

సీఈవోల సగటు వేతనం ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రమోటర్‌యేతర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ప్రొఫెషనల్ సీఈవోల సగటు వేతనం గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.10 కోట్లకు చేరింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా రూపొందించిన ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్, రివార్డ్స్ సర్వే 2025 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం సీఈవో వేతనాల్లో 40 శాతం భాగం మాత్రమే స్థిరమైనదిగా ఉంటోంది. మిగతా 60 శాతం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటోంది. ఇందులో స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, వార్షిక బోనస్‌ల రూపంలో 25 శాతం, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో మిగతా 35 శాతం ఉంటోంది.మరోవైపు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు వంటి సీఎక్స్‌వోల వేతనాలు 7 నుంచి 11 శాతం మేర పెరిగాయి. వీరి వేతనాల్లో 60 శాతం స్థిరమైనదిగా ఉండగా, మిగతాది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో ఉంటోంది. సీఈవోల తర్వాత సీవోవోలు, సీఎఫ్‌వోల వేతనాలు అత్యధికంగా రూ.4 కోట్ల స్థాయిలో ఉంటున్నాయి. ఈ సర్వేలో 400 పైచిలుకు సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలేవీ లేవు. సీఎక్స్వోలకు డిమాండ్ భారీగా ఉండటంతో వారి వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనందోరూప్ ఘోష్ తెలిపారు. సీఎక్స్‌వోల వేతనాలపై ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్ ప్రభావం వచ్చే ఏడాది మాత్రమే తెలుస్తుందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు..సీఎక్స్‌వోల స్థాయిలో స్వల్పకాలిక ప్రోత్సాహకాలనేవి కేవలం ఆర్థికాంశాలతోనే ముడిపడినవి కాకుండా సమగ్రంగా వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటున్నాయి. అయితే, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలకు మాత్రం ఆర్థిక పనితీరే ప్రాతిపదికగా ఉంటోంది. చాలా మటుకు కంపెనీలు సీఈవో, సీఎక్స్‌వోల పనితీరును మదింపు చేసేందుకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సంబంధించిన స్కోర్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. వీటిని చేరుకోవడంలో విఫలమైన సీఎక్స్వోలకు అంతక్రితం ఏడాదితో పోలిస్తే తక్కువ బోనస్‌లు ఇస్తున్నాయి. పలు కంపెనీల్లో దీర్ఘకాలికంగా షేర్ల ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చే ధోరణి పెరుగుతోంది. ఇలా వేతనంలో షేర్ల రూపంలో ఇచ్చే పరిమాణం అధికమవుతోంది. అయితే, షేర్ల ఆధారిత ప్రణాళికలను ప్రాక్సీ–అడ్వైజరీ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మేనేజ్మెంట్ నిర్ణయాలను సవాలు చేస్తున్నాయి. ఓటింగ్ ఫలితాలనూ ప్రభావితం చేస్తున్నాయి. షేర్హోల్డర్లు ఇలాంటి ప్రతిపాదనలను తిరస్కరించడం గత ఏడాది వ్యవధిలో నాలుగు రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..సీఈవోలు, సీఎక్స్‌వోల వ్యవధి తగ్గుతూ ఉండగా, పనితీరుపై అంచనాలు, షేర్‌హోల్డర్ల యాక్టివిజం గణనీయంగా పెరుగుతోంది. దీంతో జీతభత్యాలపరంగా కాంట్రాక్టుల్లో భారీగా బేరసారాలు జరుగుతున్నాయి.

మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..
గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్‌గా ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేకన్జూమర్ ఎల్రక్టానిక్స్, మెడికల్ ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.
ఫ్యామిలీ

ఎడబాటు మానసికమా? భౌతికమా?
కాలం మారుతోంది... కాలం మారితే కొత్త ప్రశ్నలు వస్తాయి.భర్త మరణించిన తర్వాత స్త్రీల పట్ల వివక్షాపూరితమైన వ్యవహారశైలిమన దేశంలో అన్ని మతాలలో ఉంది.అయితే ఆ ఎడబాటును మానసికంగా ఉంచుకుంటే చాలదా... భౌతిక ఆనవాళ్లతో వివక్షకు గురవ్వాలా అనే చర్చ ఇప్పుడు మహారాష్ట్రలో నడుస్తోంది. అక్కడి 7000 గ్రామాలు వితంతువులు తాము వితంతువులుగా వెలిబుచ్చే చిహ్నాలతో ఉండాల్సిన పనిలేదని నిర్ణయం తీసుకున్నాయి. ఈ గ్రామాల సంఖ్య ఇంకా పెరగనుంది.నేను చాలా ఇబ్బందులు పడ్డాను. చదువుకుంటుంటే అందరూ అభ్యంతర పెట్టారు... వితంతువుకు చదువు ఏంటని. నా వయసు 42. ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాడు. చదువుకుని టీచర్ అయి నా పిల్లలను చూసుకోవాలని నా ప్రయత్నం. అందుకోసం సల్వార్ కమీజ్ వేసుకుని బయటకు వచ్చినా తప్పే. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది’ అంది సోనాలి పాట్దర్. ఈమెది కొల్హాపూర్‌లోని అంబప్ అనే గ్రామం. ఈమే కాదు పశ్చిమ మహారాష్ట్రలోని సుగర్ బెల్ట్‌గా చెప్పుకునే ప్రాంతంలో ఒక విప్లవంలా ఉద్యమం రేగి వితంతువులు వివక్ష లేకుండా జీవించే మార్పులు జరుగుతున్నాయి.గ్రామాలే మారాలి... మారాయిమన దేశంలో గ్రామాల్లోనే పట్టింపు ఎక్కువ. ముఖ్యంగా వితంతువులకు గ్రామాల్లో ఎక్కడా లేని అనాదరణ ఉంటుంది. వాళ్లు బొట్టు, గాజులు, పూలు పెట్టుకోకూడదు. మంగళసూత్రం వేసుకోకూడదు. శుభకార్యాలకు రాకూడదు. కొన్నిచోట్లయితే గణేశ్ ఉత్సవాలకు వచ్చినా ఊరుకోరు. వీరిని పనిలో కూడా పెట్టుకోరు. కొన్ని ఇళ్లల్లో వీరు రావాల్సిన ఆస్తి రాక అవస్థలు పడుతుంటారు. వితంతువులు కావడం వారి తప్పా? భర్త చన΄పోయిన బాధ ఒకవైపు... బయట సమాజం నుంచి వచ్చే బాధలు మరోవైపు. తమ బాధ మానసికంగా ఉంచుకుని బయట మామూలు జీవితం గడిపే హక్కు తమకు లేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.2022లో మొదలైన ఉద్యమంమహారాష్ట్రలో పేరు పొందిన ప్రమోద్ జింజడే అనే సామాజిక కార్యకర్త పల్లెల్లో వితంతు స్త్రీలకు జరిగే అన్యాయాన్ని ఒకరోజు గమనించాడు. ‘భర్త చనిపోయాక ఒక స్త్రీ అతని గుర్తుగా బొట్టూ గాజులు ఉంచుకుంటానని బతిమిలాడుతుంటే సాటి స్త్రీలు వాటిని తొలగించడం చూశాను’ అన్నాడాయన. 2022లో ఒక అర్ధరాత్రి ఆయనకు సుస్తీ చేసింది. ప్రాణంపోపోయే స్థితి. కాని బయటపడ్డాడు. ఆయన ‘కర్మలా’ అనే ఊరిలో ఉంటాడు. వెంటనే ఆయన కర్మలా తాసిల్దార్ దగ్గరకు వెళ్లి ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాడు. ‘నేను చనిపోతే నా భార్య వొంటి మీద బొట్టు గాజులు మంగళసూత్రం తీసే హక్కు ఎవరికీ ఉండకూడదు. అలా చేసినవారిని చట్టపరంగా శిక్షించాలి’ అని ఆ అఫిడవిట్ సారాంశం. అక్కడున్న వారు ప్రమోద్‌కు పిచ్చెక్కిందనుకున్నా క్రమంగా ఈ సంగతి ప్రచారం పొందింది. మే 2022లో ఈ ఘటన జరిగితే వెంటనే ‘హెర్వాడ్’ అనే పల్లె నుంచి ఈ ఉద్యమం మొదలైంది.ముక్తి పొందిన 7,683 గ్రామాలుమహారాష్ట్రలో ఇప్పటికి 7,683 గ్రామాలు, 1,182 మునిసిపల్ వార్డులు తాము వితంతువుల పట్ల వివక్ష చూపం అని తీర్మానాలు చేశాయి. వితంతువులు తమకు నచ్చిన ఆహార్యంతో ఉండవచ్చని, అన్ని చోట్లకు రాక΄ోకలు సాగించవచ్చని, ఉద్యోగాలు చేసుకోవచ్చని అవి వారిని ్ర΄ోత్సహించడానికి ముందుకొచ్చాయి. కొన్నిచోట్ల ఆగస్టు పదిహేనున వితంతువులతో జెండా వందనం కూడా చేయిస్తూ ఉన్నారు. ‘ఈ ఉద్యమం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పాకుతోంది. ముందుగా గోవా అందుకుంది’ అని ఉద్యమకారులు అంటున్నారు. భర్త చనిపోయాక నిరాశ నిస్పృహల్లో ఉన్న స్త్రీలకు సమాజమే బాసట. దాని నుంచి వందల ఏళ్లుగా ఎదుర్కొంటున్న వివక్షతో ఎంత మంది స్త్రీలు కుమిలిపోయి ఉంటారో అర్థం చేసుకుంటే ఈ ఉద్యమం అవసరం తెలిసి వస్తుందని ఈ ఉద్యమకారుల వాదన. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించింది. 78 శాతం గురించి ఆలోచించాలిమన దేశంలో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారి సంఖ్య సుమారు ఐదున్నర కోట్లు ఉంది. వీరిలో 78 శాతం స్త్రీలు. వీరిలో 32 శాతం సగటున 40 ఏళ్ల వయసున్న వారు. ఈ వయసు స్త్రీలు ఇందరు వివక్షను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు వెళ్లలేక΄ోతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది. బహుశా ఈ స్త్రీలే తమ ఆకాంక్షలను సమాజానికి మరింత గట్టిగా తెలియ చేస్తారు.

బ్యాంకు వారిని సెటిల్ మెంట్ అడగవచ్చు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద 2019 లో దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం వారే రాయితీ కలిగించి బ్యాంకు నుంచి హామీరహిత రుణం ఇప్పించగా, ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. కొన్ని నెలలపాటు వ్యాపారం బాగానే సాగింది. కానీ కోవిడ్ సమయంలో వ్యాపారం మూతపడింది. భారీ అద్దె, జీతాలు, పైగా బ్యాంకు నెలసరి వాయిదా చెల్లింపుల వలన వ్యాపారం మూతపడాల్సి వచ్చింది. అద్దె భరించలేక వ్యాపారం ఆపేసి సామాగ్రి మొత్తం అమ్మేశాము. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని – మా వద్ద ఉన్న నగదును కలిపి బ్యాంకు వారికి చెల్లించాము. ప్రస్తుతం పొరుగు రాష్ట్రంలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. మూడు సంవత్సరాల తర్వాత బ్యాంకు వారు కోర్టు నోటీసులు పంపడమే కాకుండా ‘30 లక్షలు ఉద్దేశపూర్వకంగా చెల్లించలేదు’ అంటూ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి నా దగ్గర లేదు. పరిష్కారం చూపగలరు.– సంతోష్, నిజామాబాద్ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. కోవిడ్ కి ముందు బ్యాంకు రుణాలు తీసుకున్న చాలా మంది ఇలాగే దివాలా తీయడమే కాక పలు రకాల కేసులు కూడాఎదుర్కొంటున్నారు. బ్యాంకు వారు సాధారణంగా డి.ఆర్.టి. (డెట్ రికవరీ ట్రిబ్యునల్)లో కేసు వేసి బకాయిలను వసూలు చేసుకుంటూ ఉంటారు. మీరు పొందినది హామీ రహిత రుణం అన్నారు కాబట్టి పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. అదే విషయాన్ని మీరు డి.ఆర్.టీ.కి తెలియ జేసి, ఎలాంటి పరిస్థితులలో మీ వ్యాపారం మూతపడవలసి వచ్చినదో చెప్పండి. అలాగే మీకు సహకారం అందించిన ప్రభుత్వ విభాగానికి కూడా ఒక దరఖాస్తు పెట్టుకుంటూ ఈ విషయాలను వివరించండి.చీటింగ్ కేసులు పెట్టడం కూడా ఈ మధ్య బ్యాంకు వారు సర్వసాధారణంగా చేస్తున్నారు. బహుశా సివిల్ కేసులలో రికవరీ కష్టం అనుకున్న సందర్భాల్లో రుణగ్రస్తులను ఒత్తిడికి గురి చేయడానికి ఇలా చేస్తున్నట్టు గమనిస్తున్నాము. ఎందుకంటే రుణం చెల్లించనంతమాత్రాన ప్రతి కేసూ చీటింగ్ పరిధిలోకి రాదు. మీ కేసులో మీరు అసలు బ్యాంకు వారిని సంప్రదించలేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం కింద ప్రభుత్వం వారే మిమ్మల్ని ఎంచుకొని రుణం ఇప్పించారు. మీరు ఆ వ్యాపారాన్ని కూడా మీ శక్తిమేరకు నడిపారు. వ్యాపారం మూతపడటంలో కూడా మీపాత్ర లేదు. కోవిడ్ లో కొన్ని వేల వ్యాపారాలు మూతపడ్డాయి. కాబట్టి చీటింగ్ కేసు మీ మీద రుజువు కావడం దాదాపు సాధ్యపడదు. చీటింగ్ కేసులో సాధారణంగా అరెస్టు చేయరు. స్టేషన్ బెయిలు ఇస్తారు. పోలీసువారికి అన్ని విషయాలను ఆధారంతో సహా సమర్పిస్తే, వారు ఫైనల్ రిపోర్టు వేసి మరీ క్లోజ్ చేసిన కేసులు నా దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మీ వద్ద ఉన్న అన్ని రుజువులు పోలీసువారికి అందజేయండి. ఒకవేళ కోర్టు దాకా వెళ్లినా, ‘మొదటినుంచి వీరు మోసపూరిత భావన కలిగి ఉన్నారు’ అని (బ్యాంకు ) ప్రాసిక్యూషన్ ద్వారా ఋజువు చేయవలసి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, అలా ఋజువు చేయటం బ్యాంకువారికి కష్టమే కావచ్చు. మీ లోను విషయంలో మీరు బ్యాంకు వారిని సంప్రదించి సెటిల్మెంట్ కూడా కోరవచ్చు. మిగిలిన మొత్తంలో కొంత మాఫీ చేసి, సెటిల్ చేసేందుకు బ్యాంకువారు కూడా ముందుకు వస్తారు. కుదరని పక్షంలో కేసులను ఎదుర్కొనేందుకు దగ్గర్లోని లాయర్‌ను సంప్రదించండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comచేయవచ్చు.

మధుర కవచం! ఈ ఫ్రూట్ కవర్లతో లాభాలెన్నో..!
కాస్మొటిక్ పేపర్‌తో ఈ కవర్లు తయారయ్యాయి. నలుపు, ఇటుక రంగులో ఉంటాయి. పల్చగా ఉండే ఈ కవర్‌పై మైనం వంటి పూత ఉండటం వల్ల వర్షపు నీరు కూడా కాయకు తాకకుండా కిందికి జారి΄ోతుంది. పిందె/కాయ మీద వర్షం పడితే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. మచ్చల వల్ల టన్నుకు రూ. పది వేలకు పైగా ధర తగ్గిపోతుంది. కవర్లు కట్టిన మామిడి కాయపై ఎండ, వానల తాకిన లేక మచ్చలు ఏర్పడవు. ఫ్రూట్ ఫ్లై (పండీగ) నుంచి కూడా రక్షణ దొరుకుతుంది. పురుగులు, తెగుళ్లు సోకవు. దీంతో రైతుకు పురుగుమందులు, కూలీ ఖర్చులు సగానికి సగం ఆదా అవుతాయి. కవర్ తొడిమను పట్టుకొని ఉండటంతో ఒక మోస్తరు గాలుల నుంచి కూడా కవర్ కాయలకు రక్షణ కల్పిస్తుంది. కాయలు ఏపుగా వైట్ ఎల్లో రంగులో పెరుగుతాయి. సాధారణంగా పెరిగే కాయలకంటే కవరులో పెరిగిన కాయలు నాణ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫలితంగా ఎగుమతిదార్లు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కవర్లలో పెరిగిన కాయలకు 30–40 శాతం అధికంగా ధర పలుకుతోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగులు, తెగుళ్ల మందుల వాడకం, ఖర్చు సగానికి సగం తగ్గడం వల్ల ఆరోగ్యదాయకమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేయడంతోపాటు రైతుకూ అధికాదాయం సమకూరడం హర్షదాయకం. (చదవండి: భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..జస్ట్ ఐదేళ్లలో..)

భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..
మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కొబ్బరి చాపలనే కాయర్ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది. భూవస్త్రాల మన్నిక ఎంత?కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం. టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్ ఎక్కువగా ఉంది. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయి. 90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్ బున్‌దేసంత్ ఫర్ మెటీరియల్ టెస్టింగ్ ఆన్ నేచురల్ ఫైబర్స్’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉంది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది. అయితే, ఆ భూమి తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులు, యువి రేడియేషన్, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఏ విధంగా వాడారు అన్న విషయాలపై కూడా మన్నిక ఆధారపడి ఉంటుంది.కూరగాయ పంటల్లో భూవస్త్రంతో ఆచ్ఛాదనపంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఈ షీట్ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుంది. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్ చేస్తున్నారు. అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్.ఎం.(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) నుంచి 2,000 జి.ఎస్.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్ షీట్‌గా 600 జి.ఎస్.ఎం.(సుమారుపావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో భూమిలో కలిసి΄ోతుంది. ఫంక్షన్ హాల్స్, స్టార్ హోటళ్లలో కార్పెట్ల అడుగున కుషన్ ఎఫెక్ట్ కోసం 2,000 జి.ఎస్.ఎం. భూవస్త్రాలను వాడుతుంటారు. రోడ్ల మన్నిక పెరుగుతుందికొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అ్ర΄ోచ్రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదు. కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భూవస్త్రాల ధర..?కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్ను తయారు చేస్తారు. ఇవే భూవస్త్రాలు (కాయిర్ జియో టెక్స్టైల్స్). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్ వోవన్). నాన్ వోవన్ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా కేరళ తదితర రాష్ట్రాల్లో సహకార సంఘాలు, వ్యాపారులు కొబ్బరి ఉప ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. కేరళలో కొబ్బరి పీచు ఉత్పత్తుల తయారీ కోట్లాది మంది (వీరిలో 80% మంది మహిళలు)కి ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ఫ్రాన్స్ వంటి దేశాలు భూవస్త్రాలతో భూమి కోతకు గురికాకుండా జలవనరుల పరిసరాల్లో వినియోగిస్తున్న తీరును చూసి ఇటీవల మన అధికారులు నోరువెళ్ల బెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)
ఫొటోలు


చీరకట్టులో కుందనపు బొమ్మలా కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్


చీరలో మెరిసిపోతున్న నాగిని భామ మౌనీ రాయ్ (ఫోటోలు)


అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఇలా..(ఫొటోలు)


కొప్పున గులాబీలు, నుదుటిపై బొట్టుతో తమన్నా భాటియా (ఫోటోలు)


గోల్డెన్ ఏంజెల్ లా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)


విశాఖపట్నంలో రాత్రి కుండపోత వర్షం (ఫొటోలు)


విశాఖపట్నం : చీర,పంచెకట్టులో మెరిసిన ఏయూ విద్యార్థులు (ఫొటోలు)


ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం సందర్శించిన ‘ఒడెలా 2’ మూవీ టీమ్ (ఫొటోలు)


‘జాక్’ మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


యాక్టింగ్‌తో అదరగొట్టిన గౌతమ్.. ప్రిన్స్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా? (ఫోటోలు)
అంతర్జాతీయం

చైనాపై మరో 50%
బీజింగ్/వాషింగ్టన్: ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం. మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. ఈయూ ప్రతీకార సుంకాలు 25 శాతం బెల్జియం: అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు యూరోపియన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. కొన్ని వస్తువులపై మే 16 నుంచి, మరికొన్నింటిపై డిసెంబర్ 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.భారత్‌పైనా నేటినుంచే!ప్రపంచ దేశాలపై ట్రంప్ ఇటీవల విధించిన టారిఫ్‌ల అమలులో ఆలస్యం, డెడ్‌లైన్ పొడిగింపు వంటివేమీ ఉండబోవని లెవిట్ కుండబద్దలు కొట్టారు. భారత్‌తో పాటు 70పై చిలుకు దేశాలపై ఏప్రిల్ 2న ట్రంప్ ఎడాపెడా అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దాంతో భారత్‌పై 26 శాతం సుంకాలతో పాటు ఆయా దేశాలపై విధించిన టారిఫ్‌లు కూడా బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచే అమల్లోకి రానున్నాయి. ‘‘ట్రంప్ టారిఫ్‌లు పని చేస్తున్నాయి. ఈ విషయమై అమెరికాతో చర్చల కోసం 70కి పైగా దేశాలు ఇప్పటికే ముందుకొచ్చాయి’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. అయితే అమెరికాకు లాభదాయకంగా ఉంటేనే ఏ చర్చలైనా ఫలిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

ట్రంప్ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచదేశాలకు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే స్వయంగా దేశం విడిచిపోవాలని.. లేకుంటే తీవ్ర చర్యలు తప్పవని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో.. అక్రమ వలసదారులు ముందుగా సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ తుది ఆదేశాలు అందుకున్నాక కూడా దేశాన్ని వీడకుంటే.. రోజుకు 998 డాలర్లు(రూ.86వేల చొప్పున) జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అప్పటికీ వీడకుంటే పర్యవసనాలు మరోలా ఉంటాయని డీహెచ్ఎస్ హెచ్చరించింది. తమంతట తాముగా అక్రమ వలసదారులు వెళ్లిపోవాలి. లేకుంటే.. అప్పటివరకు సంపాదించుకున్న డబ్బు జరిమానా రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. వెయ్యితో మొదలై.. ఐదు వేల డాలర్ల దాకా జరిమానా విధించవచ్చు. జైలు శిక్ష ఎదుర్కొనడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ అమెరికాకు వచ్చే అవకాశమూ కోల్పోతారు అని డీహెచ్ఎస్ హెచ్చరించింది. అయితే ఈ తరహా హెచ్చరికలను న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్ భయాల్లో భాగంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ లైఫ్ స్టయిల్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
న్యూఢిల్లీ: ఆయన రూ. 33,500 కోట్లకు అధిపతి.. వ్యక్తిగత ఐలాండ్, రూ. 100 కోట్లకుపైగా విలువైన కార్లు ఆయన సొంతం.. ఆయన మరెవరో కాదు.. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్. ఆయన నేడు (మంగళవారం) తన రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత్‌కు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన ఆయన పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.రూ. 33,500 కోట్ల విలువైన ఆస్తి కలిగిన ఆయన విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత అభిరుచులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏప్రిల్ 8న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై, పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఏప్రిల్ 9న ముంబైలో జరిగే వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొని, అక్కడి నుంచి ఆయన తిరిగి దుబాయ్ వెళ్లనున్నారు.షేక్ హమ్దాన్ ఆస్తి వివరాలుషేక్ హమ్దాన్ వ్యక్తిగత సంపద సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ. 33,500 కోట్లు) ఇది ఆయన కుటుంబ ఆస్తిలో భాగంగా కాకుండా వ్యక్తిగత పెట్టుబడులు, వ్యాపారాల నుండి ఆర్జించినది.రియల్ ఎస్టేట్ ఆయనకు దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. జాబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి.ప్రైవేట్ ఐలాండ్షేక్ హమ్దాన్కు పర్షియన్ గల్ఫ్‌లోని ఒక ప్రైవేట్ ద్వీపం ఉంది. దీని పేరు సిర్ బానీ యాస్. దీనిని ఆయన విశ్రాంతి తీసుకునేందుకు, సాహస క్రీడలకు వినియోగిస్తారు.ఖరీదైన వాహనాలు ఆయన వద్ద రూ. 100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఇందులో బుగాటీ వెయిరాన్, లంబోర్ఘిని వెనెనో, మెర్సిడెస్-బెంజ్ ఎస్ఎల్ఆర్ లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.ప్రైవేట్ జెట్లుషేక్ హమ్దాన్ వద్ద బోయింగ్ 747-400, ఎయిర్‌బస్ ఏ320 లాంటి అత్యాధునిక ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. వీటిని ఆయన అధికారిక, వ్యక్తిగత పర్యటనల కోసం వినియోగిస్తుంటారు.యాచ్‌లు(చిన్న నౌకలు) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు రూ. 4000 కోట్లు.పెంపుడు జంతువులు ఆయన వద్ద అరుదైన తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్‌లోని తన ప్రత్యేక ఫామ్‌హౌస్‌లో పెంచుతారు.సాహస క్రీడలుషేక్ హమ్దాన్.. స్కైడైవింగ్, రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, ఫాల్కన్రీలపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు. వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేస్తుంటారు.వ్యక్తిగత జీవితంషేక్ హమ్దాన్ 1982, నవంబర్ 14న దుబాయ్‌లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా ఎన్నికయ్యారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగానూ పనిచేస్తున్నారు.సోషల్ మీడియా ‘ఫజ్జా’ పేరుతో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో ఆయన తాను రాసిన కవితలు, తన జీవనశైలి, సాహస యాత్రలను షేర్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ

కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారుదీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.:: సిమ్మాదిరప్పన్న
జాతీయం

మీది కడుపుకోతా?.. మరి అసలైన తల్లిదండ్రులది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి చూపించగలం. అంతకుమించి మీకు న్యాయమైతే చేయలేం కదా?’అంటూ.. 2024లో హైదరాబాద్‌లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీదేనా కడుపు కోతా? మీది కడుపుకోత అయినప్పుడు అసలైన తల్లిదండ్రులది ఏమనాలి? అంటూ ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ, పుణే నగరాల్లోని ఆసుపత్రుల్లో ఒకరోజు, రెండు రోజుల పసికందులను దొంగలించి హైదరాబాద్‌కు తీసుకొచి్చ.. పిల్లలు లేని వారికి దత్తత పేరుతో అమ్మకాలు చేపట్టారు. మే 22న ఫీర్జాదిగూడలో ఓ పసికందును విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిoది. శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా.. ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలు లేరు అందుకే దత్తత తీసుకున్నాం పిల్లలు లేని కారణంగానే.. ఆ పసికందులను దత్తత తీసుకున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ పిల్లలతో తమకెంతో భావోద్వేగం ఉన్నట్లు తెలిపారు. తమ నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి తాము విలవిలలాడుతున్నామని, వారిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. చట్టపరమని మేము ఎలా చెబుతాం? ‘మీరు తీసుకున్నదే ఇల్లీగల్ (చట్టవిరుద్ధం)గా.. మమ్మల్ని న్యాయం చేయమంటే మేం లీగల్ (చట్టపరం) అని ఎలా చెబుతాం? కొనుగోలు చేసిన వారిలో రెండు రోజుల పసికందులున్న విషయం గమనించారా? కన్న ఆ తల్లి క్షోభ మీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మీరు చేస్తున్నదితప్పు అని మీ మనస్సాక్షికి అనిపించలేదా’అంటూ నిలదీసింది. ఈ విషయంలో మేం కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం. కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు మీరు, పర్చేజ్ చేసిన వాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది.

భారీ సంస్థాగత మార్పులు
అహ్మదాబాద్: పార్టీలో భారీ సంస్థాగత మార్పులను లక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మేధోమథనానికి సిద్ధమైంది. నేడు జరగబోయే ఏఐసీసీ సమావేశానికి సన్నాహక సమావేశంగా విస్తృతస్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీని పార్టీ మంగళవారం అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ‘ జెండాపట్టుకుని స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన మన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్’ పేరిట సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని చేసి ఆమోదించింది.తీర్మానం, సీడబ్ల్యూసీ భేటీ వివరాలను తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అత్యధిక అధికారాలు కట్టబెట్టడం, పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి 50 శాతానికి మించి ప్రాధాన్యత కల్పించడం వంటి నిర్ణయాలను అమలుచేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ పదవుల్లో 50 శాతానికి పైగా పదవులను మహిళలు, యువతకు కట్టబెట్టాలని పార్టీ యోచిస్తోంది. నేడు అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీ తీరంలో సబర్మతీ ఆశ్రమం, కోచ్రబ్ ఆశ్రమాల మధ్యలోని ప్రాంతంలో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ‘‘ న్యాయపథ్: సంకల్ప్, సమర్పణ్, సంఘర్‡్ష’ ఇతివృత్తంతో సమావేశాన్ని చేపట్టనున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై ఖర్గే ధ్వజంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మెమోరియల్ భవంతిలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంబోపన్యాసం చేస్తూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సర్దార్ పటేల్ వారసత్వ ఘనతను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఆయన మన మనసుల్లో ఉన్నారు. మన ఆలోచనల్లో ఉన్నారు. మనం ఆయన ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే పటేల్, నెహ్రూ వంటి జాతీయనేతలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నుతున్నాయి. నెహ్రూ, పటేల్‌కు మధ్య బేధాభిప్రాయాలు ఉండేవని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి వీళ్లద్దరూ మంచి మిత్రులు. వీళ్లు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. పటేల్, నెహ్రూ రోజూ మాట్లాడుకునేవారు. అన్ని అంశాల్లో పటేల్ నుంచి నెహ్రూ సలహాలు, సూచనలు తీసుకునేవారు. నేరుగా మాట్లాడాలనుకున్న ప్రతిసారీ పటేల్ ఇంటికే నెహ్రూ వెళ్లేవారు. పటేల్ సౌకర్యార్థం కొన్ని సార్లు సీడబ్ల్యూసీ భేటీలను పటేల్ వాళ్ల ఇంట్లోనే జరిపారు. పటేల్‌ను భారత ఐక్యతా పితామహుడిగా నెహ్రూ శ్లాఘించారు. ఇవన్నీ చరిత్ర రికార్డుల్లో ఉన్నాయి’’ అని ఖర్గే గుర్తుచేశారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు ‘‘ఆర్ఎస్ఎస్ భావజాలానికి పటేల్ గొప్ప ఆదర్శాలకు పొంతనేలేదు. గతంలో ఆర్ఎస్ఎస్ను పటేల్ నిషేధించారు. అలాంటి సంస్థ ఇప్పుడు పటేల్ తమ వ్యక్తి అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. పటేల్‌కు కాంగ్రెస్ సముచిత గౌరవం ఇవ్వలేదని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తయినా వాస్తవం లేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, గత 140 ఏళ్లుగా దేశం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌ను అంతమొందించాలని కుట్రచేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.

పదేళ్లలో రూ.33.65 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదు ప్రారంభమైన ప్రధానమంత్రి–ముద్ర యోజన (పీఎం–ఎంవై) మంగళవారంతో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన నాటి నుంచి ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 52 కోట్ల మందికిపైగా లబ్ధిదారులకు రూ.33.65 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ముద్ర యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. వారి విజయగాధలు అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన యువత ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఈ పథకం తోడ్పడుతోందని అన్నారు. ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారగలమన్న నమ్మకం వారిలో పెరుగుతోందని తెలిపారు. పథకంతో లబ్ధిపొందినవారు మరో 10 మందిలో ప్రేరణ కలిగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ తన సక్సెస్ స్టోరీని ప్రధానమంత్రితో పంచుకున్నారు. నరేంద్ర మోదీ, లబ్ధిదారు మధ్య జరిగిన సంభాషణ. లబ్ధిదారు: సార్.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు హిందీ రాదు. తెలుగులోనే మాట్లాడుతా.. మోదీ: ఏం ఫర్వాలేదు.. మీరు తెలుగులోనే మాట్లాడండి. లబ్ధిదారు: నాకు 2009లో వివాహం జరిగింది. 2019 వరకు గృహిణిగా ఉన్నాను. జ్యూట్ బ్యాగ్‌ల తయారీలో కెనరాబ్యాంక్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో 13 రోజులపాటు ట్రైనింగ్ తీసుకున్నాను. బ్యాంక్‌కు చెప్పి నాకు లోన్ ఇప్చించారు. ష్యూరిటీ ఏమీలేదు. ఎవరూ నాకు సపోర్ట్ లేరు. కెనరా బ్యాంక్ వారు నన్ను నమ్మి లోన్ ఇచ్చారు. రూ.2 లక్షలు ముద్ర లోన్ తీసుకుని 2019లో వ్యాపారం ప్రారంభించా. నా రీపేమెంట్స్ చూసి 2022లో రూ.9.5 లక్షలు రుణం మంజూరు చేశారు. వ్యాపారాన్ని మరింత విస్తరించా. ఇప్పుడు నా దగ్గర 15 మంది పనిచేస్తున్నారు. మోదీ: అంటే.. రూ.2 లక్షలతో ప్రారంభించారు. రూ.9.5 లక్షలకు చేరుకున్నారు. మీతో ఎంతమంది పనిచేస్తున్నారు? లబ్ధిదారు: 15 మంది సార్. అందరూ గృహిణిలు, గ్రామీణ ప్రజలే సార్. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మోదీ: కృతజ్ఞతలు.. మీకు ధన్యవాదాలువారి ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ పీఎం–ముద్రా యోజన పథకంతో జీవితాలు మారిపోయిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈ దశాబ్ద కాలంలో ముద్ర యోజన అనేక కలలను సాకారం చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించి వారిని శక్తివంతంగా మార్చింది. వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. పథకం లబ్ధిదారుల్లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారే ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు మహిళలే కావడం చాలా సంతోషకరం. ముద్రా యోజనతో సామాజిక, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తోంది. రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది’’ అని మోదీ ‘ఎక్స్’లో తెలుగులో పోస్టు చేశారు.

గవర్నర్‌కు గడువు 3 నెలలే
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి ఎట్టకేలకు విజయం లభించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. గవర్నర్ ఆర్.ఎన్.రవి 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించామన్న సాకుతో 10 బిల్లులను చాలాకాలం పెండింగ్‌లో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తెలియజేసింది. తమిళనాడు గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధం, నిర్హేతుకం, ఏకపక్షం అని విమర్శించింది. ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ‘‘అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది. విఫలమైతే జ్యుడీషియల్ రివ్యూ తప్పదు రాజ్యాంగంలోని ఆర్టీకల్ 200 ప్రకారం.. బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ, బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువకాలం నాన్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు గడువు నిర్దేశిస్తున్నట్లు తేల్చిచెప్పింది.బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పిపంపడం మూడు నెలల్లో పూర్తి కావాలని వెల్లడించింది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే నెల రోజుల్లోగా కచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టంచేసింది. ఈ టైమ్‌లైన్ పాటించే విషయంలో విఫలమైతే.. కోర్టుల జ్యుడీషియల్ రివ్యూకు గవర్నర్ సిద్ధపడాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే సర్కారు మండిపడుతోంది. 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ 2023 నవంబర్ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్ నవంబర్ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. మిత్రుడిగా, మార్గదర్శిగా గవర్నర్ పనిచేయాలి ‘‘గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి కచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చు. గవర్నర్ విచక్షణాధికారానికి సైతం ఆర్టికల్ 200 కొన్ని పరిమితులు విధిస్తోంది. బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైంది కాదు. గవర్నర్ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగితం ముక్కగా, మాంసం లేని అస్థిపంజరంగానే ఉండిపోతుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లును ఇష్టంవచ్చినట్లు తొక్కిపెడతామంటే కుదరదు. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు (మొదటి దాని కంటే వైవిధ్యమైనది అయితే తప్ప) తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు. అలాంటి బిల్లుపై గవర్నర్‌కు వీటో పవర్ ఉండదు. ప్రజల బాగు కోసం పని చేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి. మంత్రివర్గం సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలని ఆర్టీకల్ 200 చెబుతోంది. గవర్నర్ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయొద్దు. గవర్నర్ ఉ్రత్పేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. గవర్నర్ సైతం న్యాయ సమీక్షకు అర్హుడేనన్న సంగతి మర్చిపోవద్దు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. గవర్నర్‌కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చరిత్రాత్మకం: స్టాలిన్‌చెన్నై: గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెప్పారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది తమిళనాడుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. స్టాలిన్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. సభలో బల్లలు చరిచి సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించే విషయంలో ఈ తీర్పు ఒక కీలకమైన ముందడుగు అని ఉద్ఘాటించారు. అసలైన సమాఖ్య భారత్‌లో ప్రవేశం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న తమిళనాడుకు విజయం దక్కిందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా ఇతర పారీ్టలన్నీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. అధికార డీఎంకే నాయకులు మిఠాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తమ గవర్నర్ ఆర్.ఎన్.రవి యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉండే అధికారం కోల్పోయారని డీఎంకే నేత ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం హర్షం వ్యక్తంచేశారు.
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్‌కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్‌కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్‌కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు.

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు


ఏపీలో భారీ స్కామ్.. 840 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్


నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా.. నేనంటే విష్ణుకు కుళ్లు: మనోజ్


వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది


జీవితాంతం నువ్వే ఎమ్మెల్యే కాదు... టీడీపీ ఎమ్మెల్యేకి విరూపాక్ష కౌంటర్


ఒంటిమిట్ట రథోత్సవానికి జగన్... అవినాష్ రెడ్డి కారిటీ


అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీ ఎందుకు ఆలస్యం అవుతోంది?


RAJASAAB పరిస్థితి ఏంటి..?


జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా


అల్లు అర్జున్, అట్లీ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!


70 మంది లిస్ట్ తీశాం.. ఎవ్వరినీ వదలం