సోమవారం హైదరాబాద్ పర్యటనకు రానున్న దిగ్విజయ్ సింగ్.
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈనెల 19న హైదరాబాద్ లో పర్యటించనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఈ పర్యటనలో ఖరారుచేసే అవకాశం ఉంది. వరంగల్ లోక్ సభ, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల పై సోమవారం కసరత్తు చేయనున్నట్లు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాగా.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కేసీఆర్ కు లేఖ రాశామని ఉత్తమ్ తెలిపారు. అయితే.. దీనిపై సీఎం కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదని ఆయన వివరించారు.