
లచ్చయ్య (ఫైల్)
కూసుమంచి : మండలంలోని గట్టుసింగారం గ్రామ కౌలు రైతు బొజ్జ లచ్చయ్య(50), బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు... ఇతడు తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమితోపాటు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా పంటలు సాగు చేశాడు.
పంటలు సరిగ్గా పండకపోవడం, అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనలకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో, తన ఇంట్లో బుధవారం పురుగు మందు తాగాడు. కుటంబీకులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.