అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) , ఎయిర్ సెల్‌విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) , ఎయిర్ సెల్‌విలీనానికి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైర్‌లెస్ బిజినెస్‌ను విడదీసేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించినట్లు ఆర్‌కాం తెలిపింది. ఈ మేరకు పథకం యొక్క ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్ లో ఒక అప్లికేషన్ దాఖలు చేసినట్టు చెప్పింది. ప్రతిపాదిత బదలాయింపు ఇతర అవసరమైన ఆమోదం పొందాల్సి ఉందని ఆర్‌కాం పేర్కొంది.
వైర్‌లెస్ బిజినెస్‌ను విడదీసి తద్వారా ఎయిర్‌సెల్ లిమిటెడ్, డిష్‌నెట్ వైర్‌లెస్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఈ విలీనం ప్రకారం ఏర్పడే కొత్త సంస్థలో ఆర్‌కాం, ఎయిర్ సెల్ సమ భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే దాదాపు 28,000 కోట్ల రుణాన్ని కూడా ఆర్ కామ్, ఎయిర్సెల్ చెరి సగం భరించాలి. ఇండియాలో వినియోగదారుల పరంగా టాప్-3 టెలికం సంస్థగా ఆవిర్భవించాలన్న యోచనలో ఆర్‌కాం ఈ విలీనానికి శ్రీకారం చుట్టింది.