sebi
-
SEBI: 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్‌యూఎఫ్, పరితోష్ సాహా హెచ్‌యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది. -
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే.. రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ.. పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్సీఆర్), బ్లూ హెవెన్స్‌కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు.. క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్ఐఎస్ లిమిటెడ్, ఎస్ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్‌కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సందిగ్ధంలో కొన్ని.. మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్‌స్పేస్ ఆపరేటర్ వుయ్‌వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి. అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.ఓఎఫ్ఎస్ మార్గంలో స్టడ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది. అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్‌లు, రెయిన్ సూట్లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. పేస్ డిజిటెక్ అదే బాటలో..న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది. -
ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
సెబీ సభ్యుల ఆస్తుల వివరాల వెల్లడికి ప్రతిపాదనలు
సెబీ బోర్డు సభ్యులు, అధికారుల ఆస్తులు, అప్పుల వివరాలు తెలియజేసేలా సమగ్ర నిబంధనలపై సమీక్ష నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని సెబీ యోచిస్తోంది. ఇటీవల సెబీ కొత్త ఛైర్మన్ తుహిన్ కాంత పాండే ఈమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో సెబీ మాజీ ఛైర్పర్సన్ మాధవిపురి బచ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారుల లావాదేవీల్లో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.సెబీ ప్రతిపాదిత నిర్ణయంలో భాగంగా అధికారులు, సభ్యులు, ఇతర సిబ్బంది ఆస్తులు, అప్పులు, పెట్టుబడులకు సంబంధించి వివరాల వెల్లడి, పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలపై కమిటీ సమీక్ష నిర్వహించనుంది. సెబీపై మరింతగా విశ్వాసం పెంపొందించాలంటే ఈ నిబంధనలను సమీక్షించాలని పాండే తెలిపారు. బోర్డు సభ్యులు, అధికారుల నైతిక ప్రవర్తన, జవాబుదారీతనం, పారదర్శకతను నెలకొల్పాలన్నదే ఈ కమిటీ ఉద్దేశమని స్పష్టం చేశారు.ఏడాది చార్జీని ముందే తీసుకోవచ్చుపెట్టుబడుల సలహాదారులు (ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు), పరిశోధన విశ్లేషకులు (రీసెర్చ్ అనలిస్టులు) తమ సేవలకు సంబంధించి ఏడాది కాల చార్జీని ముందుగానే క్లయింట్ల నుంచి తీసుకునేందుకు అనుమతించాలని సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల మేరకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు క్లయింట్ల ఆమోదం మేరకు రెండు త్రైమాసికాల చార్జీలనే (ఆరు నెలలు) ముందస్తుగా తీసుకునేందుకు అనుమతి ఉంది. అదే, రీసెర్చ్ అనలిస్టులు అయితే ఒక త్రైమాసికం చార్జీలనే ముందుగా తీసుకోవచ్చు.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?‘ఐఏలు, ఆర్ఏలు వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో.. క్లయింట్లు సమ్మతిస్తే ఏడాది కాల ఫీజులను ముందుగానే తీసుకునేందుకు అనుమతించాలని బోర్డు నిర్ణయించింది’ అని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఫీజుల పరిమితులు, చెల్లింపుల విధానాలు, రిఫండ్లు, బ్రేకేజ్ ఫీజులకు సంబంధించి నిబంధనల అమలు కేవలం వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్‌యూఎఫ్) క్లయింట్లకే పరిమితమని స్పష్టం చేశారు. -
రిజిస్టర్డ్ ఫిన్ఫ్లుయెన్సర్లు 2 శాతమే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు, ఇతరత్రా పెట్టుబడులపై రిటైల్ మదుపరుల మీద ఫిన్ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. సరైన అర్హతలు, తగిన అనుమతులు లేకుండా వారిచ్చే ఆర్థిక సలహాలను పట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ, ఎంతో మంది నష్టాల పాలవుతున్నారు. ఫిన్‌ఫ్లుయెన్సర్లపై అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్స్ సంస్థ సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారి వివరాల ప్రకారం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు (ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు) రెండు శాతమే ఉన్నారు. కానీ 33 శాతం మంది బాహాటంగానే క్రయ, విక్రయాలకు సంబంధించిన రికమెండేషన్లు ఇస్తున్నారు. దీంతో సదరు సలహాల విశ్వసనీయతపైనా, ఇన్ఫ్లుయెన్సర్ల జవాబుదారీతనంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిన్ఫ్లుయెన్సర్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు, పరిణామాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ సర్వేలో 51 మంది ప్రముఖ ఫిన్ఫ్లుయెన్సర్ల తీరును లోతుగా విశ్లేషించారు. ఇందులో 1,600 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ‘‘ఆర్థిక అంశాలపై అవగాహన పెంచేందుకు దేశీయంగా ఫిన్‌ఫ్లుయెన్సర్ వ్యవస్థ ద్వారా ఎంతో చేయడానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బాధ్యతాయుతమైన విధానాలను పాటించడం, పూర్తి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సెబీ వద్ద రిజిస్టర్ చేసుకున్న అడ్వైజర్ల నుంచే పెట్టుబడులకు సంబంధించిన గైడెన్స్ తీసుకోవాలి. తాము ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలను ధృవీకరించుకోవాలి’’ అని సీఎఫ్ఏ ఇనిస్టిట్యూట్–ఇండియా కంట్రీ హెడ్ ఆరతి పోర్వాల్ తెలిపారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. → 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న యువ ఇన్వెస్టర్లు ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడం లేదు. పొదుపు రూపంలో కాస్త చెప్పుకోతగిన మొత్తాన్ని పోగేసుకునే వరకు వేచి చూస్తున్నారు. వయస్సులో పెద్దవారైన ఇన్వెస్టర్లు మాత్రం నెలవారీగా ఇన్వెస్ట్ చేయడంలో స్థిరమైన విధానాలను పాటిస్తున్నారు. → విశ్వసనీయత, ఉపయోగించడానికి సులభతరంగా ఉండటమనేవి ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడంలో కీలకాంశాలుగా ఉంటున్నాయి. యువ ఇన్వెస్టర్లు తక్కువ బ్రోకరేజీ ఉండే ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటుండగా, కాస్త సీనియర్లు ఫుల్–సర్వీస్ బ్రోకరేజీలను, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా గైడెన్స్ ఇచ్చే ఫ్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటున్నారు. → సంక్లిష్టమైన ఆర్థికాంశాలను ఇన్ఫ్లుయెన్సర్లు సరళంగా వివరిస్తున్నప్పటికీ, తమకు ఒనగూరే ప్రయోజనాల వివరాలను సరిగ్గా వెల్లడించడం లేదు. 63 శాతం మంది ఇన్ఫ్లుయెన్సర్లు తమకు వచ్చే స్పాన్సర్‌షిప్‌ల గురించి, ఆర్థిక సంస్థలతో ఉన్న సంబంధాల గురించి సరైన వివరాలు వెల్లడించలేదు. → ఈ నేపథ్యంలో నియంత్రణ, అవగాహనకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సర్టీఫికేషన్ ప్రమాణాలను పటిష్టం చేయాలి. ఆర్థిక సలహాలు ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్లు, సెబీలో రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేయాలి. పర్యవేక్షణ విధానాలను కఠినతరం చేయాలి. సోషల్ మీడియాల్లో స్పాన్సర్డ్ కంటెంట్‌ను స్పష్టంగా పేర్కొనాలి. ఫిన్ఫ్లుయెన్సర్ల విశ్వసనీయతను ధృవీకరించే విధానాలను రూపొందించాలి. అలాగే, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.ఉపయోగాలు ఉన్నాయి, రిస్కులూ ఉన్నాయి..గత అయిదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య అనేక రెట్లు పెరిగింది. ఇది స్వాగతించతగిన పరిణామమే అయినప్పటికీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అధ్యయనం ప్రకారం వీరిలో చాలా మంది స్పెక్యులేటర్లే ఉంటున్నారు తప్ప నిజమైన ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువే ఉంటోంది. వీరిని ప్రభావితం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందుతున్న ఫిన్ఫ్లుయెన్సర్లను కట్టడి చేసేందుకు సెబీ భారీ జరిమానాలు విధిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. దీంతో ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రించడానికి ఇంకా చాలా సమయమే పట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తగు చర్యలు తీసుకోవాలంటే ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణులను అర్థం చేసుకోవడం, ఫిన్ఫ్లుయెన్సర్లు అందిస్తున్న కంటెంట్‌ను సమీక్షించడం కీలకమైన అంశాలని సీఎఫ్ఏ గుర్తించింది. ఇందులో భాగంగానే నిర్వహించిన అధ్యనయంలో ఇన్వెస్టర్లను ఫిన్ఫ్లుయెన్సర్లు గణనీయంగా ప్రభావితం చేస్తున్న సంగతి వెల్లడైంది. ఇన్ఫ్లుయెన్సర్ల సలహాల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు 82 శాతం మంది ఫాలోయర్లు తెలిపారు. వీరిలో 72 శాతం మందికి ఆర్థికంగా ప్రయోజనాలు కూడా లభించాయి. అయితే, ఇందులో రిసు్కలూ ఉంటున్నాయి. వయస్సులో కాస్త పెద్దవారైన ఇన్వెస్టర్లలో (40 ఏళ్లు అంతకు పైబడి) 14 శాతం మంది తాము తప్పుదోవ పట్టించే సలహాలు విని మోసపోయినట్లు వెల్లడించినట్లు నివేదిక తెలిపింది. -
సెబీ కొత్త రూల్స్: ఏప్రిల్ 1 నుంచే..
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) పనిచేసే ఉద్యోగులకు సెబీ నిబంధనల పరంగా ఊరట కల్పించింది. మఖ్య నిర్వహణ అధికారి (సీఈవో), ముఖ్య పెట్టుబడుల అధికారి (సీఐవో), ఫండ్ మేనేజర్లు తదితర ఎంపిక చేసిన కీలక ఉద్యోగులు తమ వార్షిక వేతనంలో 20 శాతం మేర తమ సంస్థ నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోనే ఇన్వెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అంతేకాదు ఇలా చేసిన పెట్టుబడులకు మూడేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. దీన్నే ‘స్కిన్ ఇన్ ద గేమ్’గా చెబుతారు.ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనల అమలులో కొంత ఉపశమనాన్ని సెబీ కల్పించింది. స్థూల వార్షిక పారితోషికం ఆధారంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల ఉద్యోగులు సొంత నిర్వహణ పథకాల్లో చేయాల్సిన పెట్టుబడుల శాతంలో మార్పులు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ ఉద్యోగుల నైతిక నడవడిక, సొంత పథకాల నిర్వహణలో బాధ్యతను పెంచడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ ఇందులోని ఉద్దేశ్యాలుగా ఉన్నాయి.కొత్త నిబంధనలు..కొత్త నిబంధనల కింద రూ.25 లక్షలకు మించని వేతనం ఉన్న వారు సొంత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.రూ.25 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారు 10 శాతం ఇన్వెస్ట్ చేయాలి. ఇసాప్‌లు/ఉద్యోగ స్టాక్ ఆప్షన్లు కూడా కలుపుకుంటే 12.5% పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య వేతనం ఉన్న వారు కనీసం 14 శాతం మేర (ఒకవేళ స్టాక్ ఆప్షన్లు కూడా ఉంటే 17.5 శాతం) పెట్టుబడులు పెట్టాలి. -
కొత్త ఐపీవో.. రూ. 550 కోట్లు టార్గెట్
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 550 కోట్లు సమీకరించేందుకు ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ ఇండియా లిమిటెడ్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 300 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 250 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు కంపెనీలో 100 శాతం వాటాలు ఉన్నాయి.తాజా ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపునకు, ప్లాంటు, మెషినరీ కొనుగోలు వంటి మూలధన వ్యయాల అవసరాలకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. బాటిల్స్, కంటైనర్స్, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ కాంపోనెంట్లు మొదలైన వాటి డిజైనింగ్ నుంచి డెలివరీ వరకు వివిధ ప్యాకేజింగ్ సొల్యూషన్స్‌ను ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ అందిస్తోంది. పర్సనల్ కేర్, హోమ్ కేర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఇంజిన్ ఆయిల్, లూబ్రికెంట్స్ తదితర పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ రూ. 397.41 కోట్ల ఆదాయంపై రూ. 15.19 కోట్ల లాభం నమోదు చేసింది. ఈ ఇష్యూకి ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
ఐపీవోకు ఫిజిక్స్‌వాలా
ఎడ్యుటెక్ యూనికార్న్ ఫిజిక్స్‌వాలా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు ముందస్తు గోప్యతా దరఖాస్తు ద్వారా సెబీని ఆశ్రయించింది. దీంతో ప్రాస్పెక్టస్ వివరాలను పబ్లిక్కు వెల్లడించకుండా నిలువరించేందుకు కంపెనీకి వీలుంటుంది. కాగా.. స్టాక్ ఎక్స్ఛేంజీల మెయిన్‌బోర్డులో లిస్టయ్యేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసినట్లు ఫిజిక్స్‌వాలా తాజాగా ప్రకటించింది. అయితే ముందస్తు ఫైలింగ్ ద్వారా ఐపీవోకు వెళ్లడంపై గ్యారంటీలేదని స్పష్టం చేసింది. వెరసి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, సూపర్‌మార్ట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ బాటలో ఐపీవోకు గోప్యతా దరఖాస్తును ఎంచుకుంది. పలు కంపెనీలు..ఇంతకుముందు 2023లోనూ ఆతిథ్య రంగ కంపెనీ ఓయో కాన్ఫిడెన్షియల్ మార్గంలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అంతకంటే ముందు 2022 డిసెంబర్లో టాటా ప్లే(స్కై) రహస్య దరఖాస్తు చేసి 2023 ఏప్రిల్‌లో సెబీ అనుమతి పొందింది. అయితే ఈ రెండు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టకపోవడం గమనార్హం! కాగా.. 2020లో ఏర్పాటైన ఫిజిక్స్‌వాలా ఆన్లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దేశవ్యాప్తంగా విద్యార్ధులకు శిక్షణ ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో హార్న్‌బిల్ క్యాపిటల్ ఆధ్వర్యంలో 21 కోట్ల డాలర్ల(రూ.1,800 కోట్లు) పెట్టుబడులు అందుకుంది. 2.8 బిలియన్ డాలర్ల విలువలో నిధులు సమకూర్చుకుంది. ముందస్తు ఫైలింగ్ ఎంచుకుంటే సెబీ తుది అనుమతి తదుపరి ఐపీవోకు 18 నెలల గడువు లభిస్తుంది. సాధారణ పద్ధతిలో అయితే 12 నెలల్లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుంది.ఇదీ చదవండి: మున్సిపల్ బాండ్లకు వెబ్సైట్ రూ.550 కోట్లపై కన్నుప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎస్ఎస్ఎఫ్ ప్లాస్టిక్స్ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 550 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఐపీవోలో భాగంగా రూ.300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. ప్రస్తుతం ప్రమోటర్లు 100 శాతం వాటా కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ప్లాంటు, మెషీనరీ తదితర పెట్టుబడి వ్యయాలతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. కంపెనీ ప్రధానంగా బాటిళ్లు, కంటెయినర్లు, మూతలు, టబ్‌లు, ఇంజినీరింగ్ ప్లాస్టిక్ విడిభాగాలు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. వ్యక్తిగత సంరక్షణ, పానీయాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్, లూబ్రికెంట్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ప్రొడక్టులను వినియోగిస్తారు. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో రూ.397 కోట్ల ఆదాయం, రూ.15 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఇక 23 రోజులే గడువు.. సెబీ తాజా మార్గదర్శకాలు
లిస్టెడ్ కంపెనీ లు చేపట్టే రైట్స్ ఇష్యూలను ఇకపై 23 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా చర్యలకు తెరతీసింది. దీంతో ముసాయిదా ఆఫర్‌ను దాఖలు చేయవలసిన అవసరం తప్పుతుంది. ఇందుకు బదులుగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చి సూత్రప్రాయ అనుమతిని పొందవచ్చు.దీంతో వేగవంత రైట్స్ ఇష్యూలకు సెబీ దారి చూపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బోర్డు అనుమతించిన 23 పనిదినాల్లోగా రైట్స్ ఇష్యూని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత 317 రోజుల గడువును భారీగా కుదిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో 40 రోజుల గడువున్న ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్కంటే రైట్స్‌ను వేగవంతం చేసింది. తద్వారా నిధుల సమీకరణకు ప్రాధాన్యతా మార్గంగా రైట్స్‌కు సెబీ మద్దతు పలికింది. ఎన్ఎస్ఈలో రోడ్‌స్టార్ ఇన్విట్ లిస్టింగ్రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోడ్‌స్టార్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఎన్ఎస్ఈలో లిస్టింగ్ చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కు చెందిన రోడ్‌స్టార్ ఇన్విట్‌ను రూ. 8,592 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో లిస్ట్ చేసింది. తద్వారా రుణ పరిష్కారంలో గ్రూప్‌నకున్న విభిన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది.ఈ బాటలో రుణదాతలకు రూ. 5,000 కోట్ల మధ్యంతర చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రస్తావించింది. ఇన్విట్ యూనిట్ల ద్వారా రూ. 3,500 కోట్లు, మరో రూ. 1,500 కోట్లకు నగదు చెల్లించినట్లు తెలియజేసింది. రహదారి ఆస్తుల (ప్రాజెక్టులు)పై గరిష్ట రిటర్నులు అందుకోవడం ద్వారా సమర్ధవంత పరిష్కారాలకు తెరతీస్తున్నట్లు వివరించింది. -
ఎస్ఎంఈ ఐపీఓలు అంత ఈజీ కాదు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల పబ్లిక్ ఇష్యూలకు నిబంధనలను కఠినతరం చేసింది. వీటిలో భాగంగా లాభదాయకత అంశాన్ని ప్రవేశపెట్టింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) పరిమితిని 20 శాతానికి పరిమితం చేసింది. ఇన్వెస్టర్లకు రక్షణ కల్పిస్తూనే పటిష్ట పనితీరు సాధిస్తున్న ఎస్ఎంఈల నిధుల సమీకరణకు అండగా నిలిచే లక్ష్యంతో సంస్కరణలకు సెబీ తెరతీసింది. గత క్యాలెండర్ ఏడాదిలో ఎస్ఎంఈ ఐపీఓలు, ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ భారీగా పెరిగిన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. లాభదాయకత అంశానికివస్తే పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉన్న ఎస్ఎంఈ గత మూడేళ్లలో కనీసం రెండేళ్ల పాటు రూ. కోటి చొప్పున నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించి ఉండాలి. మొత్తం ఇష్యూ పరిమాణంలో 20 శాతానికి మించి వాటాదారులు షేర్లను విక్రయించేందుకు అనుమతించరు. ఇదేవిధంగా వాటాదారుల హోల్డింగ్స్‌లో 50 శాతానికి మించి ఆఫర్ చేసేందుకు వీలుండదు.నిధుల వినియోగమిలాసంస్థాగతేతర ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపులో మెయిన్ బోర్డ్ ఐపీఓ నిబంధనలే ఎస్‌ఎంఈలకూ వర్తించనున్నాయి. కనీస దరఖాస్తు పరిమాణాన్ని రెండు లాట్లకు సెబీ కుదించింది. తద్వారా అనవసర స్పెక్యులేషన్‌కు చెక్ పెట్టనుంది. సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఐపీఓ నిధుల్లో 15 శాతం లేదా రూ. 10 కోట్లవరకూ(ఏది తక్కువైతే) మాత్రమే కేటాయించేందుకు అనుమతిస్తారు. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, సంబంధిత పార్టీల నుంచి తీసుకున్న రుణ చెల్లింపులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఐపీఓ నిధులు వెచ్చించేందుకు అనుమతి ఉండదు. ప్రమోటర్ల కనీస వాటాకుపైన గల ప్రమోటర్ హోల్డింగ్‌కు దశలవారీ లాకిన్ గడువు వర్తిస్తుంది. అధికంగా ఉన్న ప్రమోటర్ వాటాలో ఏడాది తరువాత 50 శాతం, రెండేళ్ల తదుపరి మిగిలిన 50 శాతానికి గడువు ముగుస్తుంది. పబ్లిక్కు అందుబాటుఎస్ఎంఈలు సెబీకి దాఖలు చేసిన ఐపీఓ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను 21 రోజులపాటు పబ్లిక్కు అందుబాటులో ఉంచాలి. వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియజేయాలి. సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్‌ను సైతం వినియోగించాలి. ఎస్ఎంఈ ఎక్సే్ఛంజ్, కంపెనీ వెబ్సైట్, మర్చంట్ బ్యాంకర్.. సంబంధిత డీఆర్హెచ్పీపై పబ్లిక్ స్పందనకు వీలు కల్పించాలి. ఎస్ఎంఈలు ఐపీఓ తదుపరి మెయిన్ బోర్డులోకి చేరకుండానే నిధుల సమీకరణ చేపట్టాలంటే సెబీ(ఎల్‌వోడీఆర్) నిబంధనలు పాటించవలసి ఉంటుంది. చెల్లించిన మూలధనం రూ. 25 కోట్లకు మించవలసి ఉంటుంది. రైట్స్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, బోనస్ షేర్ల జారీ తదితరాలు ఈ విభాగంలోకి వస్తాయి. గత రెండేళ్లలో ఎస్ఎంఈ ఐపీఓలు భారీగా ఎగసిన నేపథ్యంలో సెబీ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు ఉపక్రమించింది. 2024లో ఐపీఓల ద్వారా 240 చిన్న, మధ్యతరహా సంస్థలు రూ. 8,700 కోట్లు సమీకరించాయి. అంతక్రితం 2023లో సమకూర్చుకున్న రూ. 4,686 కోట్లతో పోలిస్తే ఇవి రెట్టింపుకావడం ప్రస్తావించదగ్గ అంశం!! -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే కఠిన నిబంధనలు
ముంబై: ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఎక్స్పైరీ రోజున మితిమీరిన ట్రేడింగ్ కట్టడికే నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ తెలిపారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారని అధ్యయనంలో తేలిన మీదట గతేడాది అక్టోబర్‌లో చర్యలు ప్రకటించినట్లు ఆయన చెప్పారు.కనీస కాంట్రాక్టు పరిమాణాన్ని రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలకు దశలవారీగా పెంచడం, ప్రీమియంను ముందుగా వసూలు చేయడం తదితర చర్యలను సెబీ ప్రకటించింది. ముందుగా క్యాష్ మార్కెట్‌ను అభివృద్ధి చేసి, ఆ తర్వాత డెరివేటివ్స్‌పై కసరత్తు చేయాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సూచించారు. మరోవైపు, పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివరాలను సెబీ బోర్డు సభ్యులందరూ ప్రజలకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేసేలా నిబంధనలను రూపొందిస్తామని సెబీ కొత్త చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు.విశ్వసనీయతను, పారదర్శకతను పెంపొందించడానికి ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఓవైపు నియంత్రణ సంస్థ అధిపతిగా, మరోవైపు నియంత్రిత సంస్థల్లో భాగస్వామిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పని చేశారంటూ సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెబీ విచారణ ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్ సంస్థ సహ–ఇన్వెస్టరుగా ఉన్న ఫండ్‌లో ఆమె పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
గడవు పొడిగించిన సెబీ..
న్యూఢిల్లీ: క్లెయిమ్ చేయని నిధులు, సెక్యూరిటీలు బ్రోకర్ల వద్దే ఉండిపోతే.. వాటిని ‘విచారణ పరిధిలో’ పెట్టాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును ఈ నెల 31 వరకు సెబీ పొడిగించింది. ఈ ప్రతిపాదనపై ఫిబ్రవరి 11న సెబీ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై స్పందనలు తెలియజేయడానికి మార్చి 4వరకు గడువు ఇవ్వడం గమనార్హం.సెబీ నిబంధనల ప్రకారం క్లయింట్ల ఖాతాల్లోని నిధులను (ఫండ్స్) ప్రతి త్రైమాసికానికి ఒకసారి వెనక్కి పంపాల్సి ఉంటుంది. సెక్యూరిటీలను నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయాలి. ఒకవేళ నిధులు, సెక్యూరిటీలను బదిలీ చేసే విషయంలో క్లయింట్ల ఆచూకీ లేనట్టయితే.. సంబంధిత ఖాతాలను వెంటనే ‘ఎంక్వైరీ స్టేటస్’ కింద ఉంచాలని సెబీ ప్రతిపాదన తీసుకొచ్చింది.లేఖలు, ఈమెయిల్స్, టెలిఫోన్ ద్వారా బ్రోకర్లు క్లయింట్లను సంప్రదించాలి. ఇలా ఎంక్వైరీ స్టేటస్ కింద 30 రోజులకుపైగా నిధులు, సెక్యూరిటీలు ఉండిపోతే, వాటిని అన్క్లెయిమ్డ్గా పరిగణిస్తారు. ఆ తర్వాత క్లయింట్ నామినీని సంప్రదించాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనలో పేర్కొంది. -
‘కొత్త ఫండ్’ పథకానికి సెబీ కొత్త రూల్
న్యూఢిల్లీ: ఇకపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)లు తప్పనిసరిగా కొత్త ఫండ్ పథకం (NFO) నిధుల ను 30 రోజుల్లోగా వినియోగించవలసి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది.వెరసి ఏఎంసీలు ఎన్ఎఫ్వోలో భాగంగా సమీకరించిన నిధులను సంబంధిత పెట్టుబడుల కోసం 30 రోజుల్లోగా వెచ్చించవలసి ఉంటుంది. సెబీ తాజా స ర్క్యులర్ ప్రకారం ఇన్వెస్టర్లకు యూనిట్ల కేటాయింపు తదుపరి గడువు అమల్లోకి రానుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ పథకాలలో తప్పుడు విక్రయాలకు తావివ్వకుండా సెబీ చెక్ పెట్టనుంది.పథకం సమాచార పత్రా(ఎస్ఐడీ)లలో ఏ ఎంసీలు నిధుల వినియోగ గడువు, కేటాయింపు తదితరాలను వెల్లడించవలసి ఉంటుంది. ఒకవేళ 30 పనిదినాల్లోగా నిధుల వినియోగా న్ని చేపట్టలేకపోతే.. కారణాలను వివరిస్తూ ఏఎంసీ ఇన్వెస్ట్మెంట్ కమిటీకి లేఖ ద్వారా వెల్లడించవలసి ఉంటుంది. తద్వారా కమిటీ మరో 30 రోజుల గడువును ఇచ్చేందుకు వీలుంటుంది. -
సెబీ మాజీ చీఫ్‌కు బాంబే హైకోర్టులో ఊరట
స్టాక్ మార్కెట్ మోసాల కేసులో.. సెబీ మాజీ చీఫ్ 'మాదభి పురి బుచ్' (Madhabi Puri Buch)కు ఊరట లభించింది. పురి, మరో ఐదుగురిపై పోలీసు కేసు నమోదు చేయాలన్న దిగువ కోర్టు ఆదేశాన్ని, బాంబే హైకోర్టు నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.స్టాక్ఎక్స్ఛేంజ్లో కంపెనీలను లిస్ట్ చేయడంలో ఆర్ధిక పరమైన మోసం జరిగిందని ఆరోపిస్తూ.. సంబంధిత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇందులో పురి బుచ్ మాత్రమే కాకుండా.. సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్లైన అశ్వని భాటియా, అనంత్ నారాయణ్, కమలేష్ చంద్ర వర్ష్నీలు.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామమూర్తి, బిఎస్ఇ మాజీ చైర్మన్ & పబ్లిక్ ఇంటరెస్ట్ డైరెక్టర్ ప్రమోద్ అగర్వాల్ ఉన్నారు.ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల తరువాత.. పురి బుచ్, మిగిలిన ఐదుగురు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపి.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది.పూర్తిస్థాయి పరిశీలన లేకుండానే.. కింది కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కనిపిస్తోంది. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన తర్వాత వాటిని నిలిపివేస్తున్నాం.. అని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణ వరకు వీరిపై ఎటువంటి చర్య తీసుకోవద్దని కూడా ఏసీబీని ఆదేశించింది.నిజానికి పురి బుచ్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. అదానీ గ్రూపుకు చెందిన కొన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు.. గతేడాది ఆగస్టులో హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఆ తరువాత ఒక్కొక్కటిగా.. ఈమెపైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన ఆరోపణలన్నీ ఒట్టివే అని పురి బుచ్ కొట్టిపారేశారు. -
సెబీ మార్గదర్శకాలలో సవరణలు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలకు నామినీలను పేర్కొనే విషయంలో నిబంధనలను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సవరించింది. ఆస్తుల బదిలీ, నామినీ సులభతర ఎంపికకు వీలుగా మార్గదర్శకాలను సవరిస్తూ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. వెరసి సెక్యూరిటీల మార్కెట్లలో నామినేషన్ సౌకర్యంపై అవసరమైన స్పష్టతను కల్పించింది.ఒక వ్యక్తి లేదా సంయుక్త ఖాతాదారులలో ఒకరు మరణిస్తే ఆస్తుల బదిలీని అదనపు కేవైసీ అవసరంలేకుండా రెండవ వ్యక్తికి బదిలీ చేసేందుకు దారి ఏర్పాటు చేసింది. ముందస్తుగానే కేవైసీ ఇచ్చి ఉంటే వీటి అవసరం ఉండదు. ఖాతాదారులలో జీవించి ఉన్న వ్యక్తి ఏ సమయంలోనైనా కాంటాక్టు వివరాలు, నామినీ మార్పు వంటివి చేపట్టవచ్చు.ఈ బాటలో ఫిజికల్‌గా ఖాతా నిర్వహించేలేని వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు సంబంధించి సైతం మార్పులు ప్రవేపెట్టింది. తాజా సవరణలు 2025 మార్చి1 నుంచి మూడు దశలలో అమలుకానున్నాయి. సవరించిన మరికొన్ని నిబంధనలు జూన్1 నుంచి, పూర్తి నిబంధనలు సెపె్టంబర్ 1నుంచి వర్తించనున్నాయి. -
సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ ఛైర్మన్‌గా మాదబిపురీ బుచ్ స్థానంలో తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. మార్చి 1 నుంచి తాను సెబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.తుహిన్ కాంత పాండే అనుభవంఆర్థిక కార్యదర్శి: భారత ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఆయన వివిధ ఆర్థిక సంస్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించారు.రెవెన్యూ కార్యదర్శి: దేశ రెవెన్యూ వసూళ్లు, పన్ను విధానాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి పదవిని కూడా పాండే నిర్వహించారు.ఎయిరిండియా ప్రైవేటీకరణ: భారతదేశ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ముఖ్యమైన ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు.పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహణ: పాండే తన కెరీర్ అంతటా ప్రభుత్వ సంస్థలు, వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల నిర్వహణలో నిమగ్నమయ్యారు. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డారు.ఇదీ చదవండి: రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’ముందున్న సవాళ్లు..కొత్త సెబీ ఛైర్మన్ పాండే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, మార్కెట్ సమగ్రతను పెంపొందించడానికి పలు కీలక రంగాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.విజిలెన్స్‌ను బలోపేతం చేయడం: మార్కెట్ మానిప్యులేషన్, ఇన్ సైడర్ ట్రేడింగ్(అనధికారికంగా ముందుగానే కంపెనీలోని కీలక సమాచారాన్ని తెలుసుకుని తర్వాత షేర్లు పెరిగాక తిరిగి విక్రయించి లాభపడడం)ను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి పాండే మార్కెట్ నిఘా యంత్రాంగాలను పెంచే అవకాశం ఉంది.ఇన్వెస్టర్ ప్రొటెక్షన్: కఠినమైన నిబంధనలు, పకడ్బందీ ఆర్థిక విధానల ద్వారా పారదర్శకతతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి.డిజిటల్ సహకారం: నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డిజిటల్ వేదికల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.కార్పొరేట్ గవర్నెన్స్: లిస్టెడ్ కంపెనీల్లో తమ కార్యకలాపాలపై జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను బలోపేతం చేయాలి.సుస్థిర ఆర్థిక విధానాలు: ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక కార్యక్రమాలు, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం. -
రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్’
ప్రత్యేక పెట్టుబడి పథకాలకు(SIF) సంబంధించి సెబీ నిబంధనల కార్యచరణను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి సిఫ్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.250 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (PMS)లో అయితే పెట్టుబడికి కనీసం రూ.50 లక్షల ఉండాలి. ఈ రెండింటికి మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేస్తూ.. అధిక పెట్టుబడి పెట్టే సామర్థం, రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్)ను ప్రవేశపెట్టడం గమనార్హం.అన్ని రకాల సిఫ్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ), సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) సాధనాలను వినియోగించుకోవచ్చు. మొత్తం మీద పెట్టుబడి విలువ రూ.10 లక్షలకుపైనే ఉండాలి. మార్కెట్ పతనం కారణంగా రూ.10లక్షల్లోపునకు వచ్చేస్తే, మిగిలిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. సిఫ్లో 25 శాతం మేర డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. బ్యాండ్ 1 నుంచి 5 వరకు మొత్తం ఐదు స్థాయిల్లో రిస్క్‌ను సెబీ వర్గీకరించింది.ఇదీ చదవండి: ఏఐకి కంపెనీల జైప్రస్తుత మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ నుంచి అనుమతి తీసుకుని సిఫ్లను ప్రారంభించొచ్చు. ఇందుకు నిర్దేశిత అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. కనీసం మూడేళ్లకు పైగా కార్యకలాపాలతో, రూ.10,000 కోట్ల నిర్వహణ ఆస్తులు కలిగినవి దరఖాస్తు చేసుకోవచ్చు. మరో మార్గంలో కనీసం 10 ఏళ్లు ఫండ్ నిర్వహణలో అనుభవం ఉండి, కనీసం రూ.5,000 కోట్లకు పైగా ఆస్తులను నిర్వహించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌ను సిఫ్‌కు నియమించడం ద్వారా వీటి నిర్వహణకు అనుమతి కోరొచ్చని సెబీ ప్రకటించింది. -
అంకుర సంస్థలకు ప్రభుత్వ తోడ్పాటు
తయారీ, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేటీఎంతో పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అంకుర సంస్థలు కార్యకలాపాలు విస్తరించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు అవసరమైన మెంటార్షిప్, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపరంగా మద్దతునిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.ఈ చర్యల్లో భాగంగా నియంత్రణ నిబంధనలను పాటించడంపై, పెట్టుబడులను సమకూర్చుకోవడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. పేటీఎం విస్తృత మర్చంట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను టెస్ట్ చేసేందుకు, వేలిడేట్ చేసేందుకు, వాటిని మరింత మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడేలా మౌలిక సదుపాయాలు, మార్కెట్ యాక్సెస్‌కి సంబంధించిన మద్దతు లభిస్తుంది. మెంటార్షిప్, ఆర్థిక సాయం, అధునాతన టెక్నాలజీ ద్వారా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సాధికారత కలి్పంచేందుకు పేటీఎం కట్టుబడి ఉందని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. పేటీఎం ఫిన్‌టెక్ అనుభవాన్ని, మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, కార్యకలాపాలను విస్తరించడంలో, సవాళ్లను అధిగమించడంలో స్టార్టప్‌లను తోడ్పాటు అందిస్తామని డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు.హెచ్బీఎన్ డెయిరీస్‌కు నోసెబీ తాజా హెచ్చరికక్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్బీఎన్ డెయిరీస్‌కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేపట్టవద్దంటూ పబ్లిక్‌ను హెచ్చరించింది. హెచ్బీఎన్ డెయిరీస్ అండ్ అలైడ్ లిమిటెడ్‌కు చెందిన ఎలాంటి ప్రాపర్టీ కొనుగోలు లేదా లావాదేవీలు చేపట్టవద్దంటూ పేర్కొంది. వీటి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు తప్పుడు సమాచారం(వదంతులు) ప్రచారం చేస్తూ హెచ్బీఎన్ ప్రాపర్టీస్ వేలాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని తెలియజేసింది. సెబీ అధికారులుగా చెప్పుకుంటూ చట్టాన్ని అతిక్రమిస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా నిజమైన కొనుగోలుదారులను పక్కదారి పట్టించడంతోపాటు.. సెబీ ఈవేలం విధానానికి అడ్డుతగులుతున్నట్లు వివరించింది. హెచ్బీఎన్ ప్రాపరీ్టస్లో.. సంస్థ డైరెక్టర్లు, సంబంధిత అనుబంధ, సహచర సంస్థలు తదితరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి హక్కులూ లేవని స్పష్టం చేసింది. వెరసి హెచ్బీఎన్ ఆస్తుల విషయంలో సంస్థకు సంబంధించిన ఏ వ్యక్తినీ లేదా ఏ సంస్థనూ చట్ట విరుద్ధంగా అనుమతించబోమని పేర్కొంది. -
ఈక్విటీ డెరివేటివ్స్‌పై సెబీ ఫోకస్
న్యూఢిల్లీ: ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో సరళతర లావాదేవీల నిర్వహణకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా రిస్క్ పర్యవేక్షణను పటిష్టపరచడం ద్వారా సమర్థవంత లావాదేవీలకు తెరతీయనుంది. దీనిలో భాగంగా ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) ఓపెన్ ఇంటరెస్ట్(ఓఐ)పై రియల్‌టైమ్ పర్యవేక్షణకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై మార్చి 17వరకూ ప్రజల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ప్రతిపాదనలను అమలు చేస్తే మరింతగా సమాచార ఆధారిత నిర్ణయాలు తీసుకునేందుకు మార్కెట్ పార్టిసిపెంట్లకు వీలు ఏర్పడుతుంది. తద్వారా రిస్కులను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశమేర్పడుతుంది. రియల్‌టైమ్‌లో సెబీ రూపొందించిన తాజా ప్రతిపాదనల ప్రకారం మార్కెట్ పార్టిసిపెంట్లు ఇంట్రాడే స్నాప్‌చాట్స్ ద్వారా రియల్‌టైమ్ ఎఫ్‌అండ్‌వో ఓఐ సంబంధిత సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది రిస్క్ లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో సహకరించడంతోపాటు.. ఉత్తమ నిర్ణయాలు తీసుకునేందుకు దారి చూపిస్తుంది. సెబీ సిద్ధం చేసిన కన్సల్టేషన్ పేపర్ ప్రకారం డెరివేటివ్స్‌లో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్), ఆల్టర్నేటివ్ పండ్స్(ఏఐఎఫ్) చేపట్టే లావాదేవీల(ఎక్స్పోజర్) పరిమితులలో సవరణలకు తెరలేవనుంది. ఫ్యూచర్స్ ఎక్స్పోజర్ మదింపులో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే ఆప్షన్స్(లాంగ్ అండ్ షార్ట్) ఎక్స్పోజర్లో సవరణలు చోటు చేసుకోనున్నాయి. వీటి ప్రకారం ఫ్యూచర్ ఈక్వివాలెంట్ లేదా డెల్టా ప్రాతిపదికన వీటిని మదింపు చేస్తారు. తద్వారా ఇవి మార్కెట్ కదలికల(సెన్సిటివిటీ)ను సమర్ధవంతంగా ప్రతిఫలిస్తాయి. సవరణల బాటలో ప్రస్తుతం విభిన్న పద్ధతుల్లో ఎఫ్‌అండ్‌వో ఎక్స్పోజర్లను మదింపు చేస్తున్నారు. ఫ్యూచర్స్ పొజిషన్ల ఆధారంగా, షార్ట్ అప్షన్స్ను నోషనల్ విలువ ద్వారా, లాంగ్ ఆప్షన్స్ అయితే ప్రీమియం చెల్లింపు ద్వారా మదింపు చేస్తున్నారు. కాగా.. మార్కెట్ రిస్క్ లను మరింతగా ప్రతిఫలించేలా ఇండెక్స్ డెరివేటివ్స్‌కు సెబీ కొత్త పొజిషన్ పరిమితులను ప్రతిపాదించింది. ఇండెక్స్ ఆప్షన్స్‌కు రోజువారీ ముగింపులో నికర విలువ రూ. 500 కోట్లు, స్థూలంగా రూ. 1,500 కోట్లవరకూ అనుమతించనుండగా.. ఇంట్రాడేకు నికరంగా రూ. 1,000 కోట్లు, స్థూలంగా రూ. 2,500 కోట్లు చొప్పున పరిమితులు అమలుకానున్నాయి.ఇక ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు రోజువారీ ముగింపు పరిమితి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెరగనుంది. రూ. 2,500 కోట్ల ఇంట్రాడే పరిమితి ఇందుకు అమలుకానుంది. తాజా ప్రతిపాదనలు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), ఎంఎఫ్‌లు, ట్రేడర్లు, క్లయింట్లతోపాటు మార్కెట్ పార్టిసిపెంట్లు అందరికీ అమలుకానున్నాయి. అయితే నిజంగా హోల్డింగ్స్ కలిగిన పొజిషన్లకు మినహాయింపులు లభించనున్నాయి. స్టాక్స్ కలిగిన షార్ట్ పొజిషన్లు, నగదు కలిగిన లాంగ్ పొజిషన్లకు మినహాయింపులు వర్తించనున్నాయి. -
ఐపీవో బాటలో ఎల్సీసీ ప్రాజెక్ట్స్
న్యూఢిల్లీ: ఈపీసీ సంస్థ ఎల్సీసీ ప్రాజెక్ట్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో .29 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా నీటి పారుదల, నీటి సరఫరా ప్రాజెక్టుల విభాగాలలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సేవలు అందిస్తోంది. రెండు దశాబ్దాల కాలంలో కంపెనీ ఆనకట్టలు, బ్యారేజీలు, హైడ్రాలిక్ స్ట్రక్చర్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తదితర ప్రాజెక్టులను పూర్తి చేసింది. -
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్‌లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషితొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్‌ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు. -
ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతా లాగిన్ మరింత భద్రం!
ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల లాగిన్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా కీలక చర్యలను సెబీ(SEBI) ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకమీదట అ«దీకృత యూజర్లే వారి ట్రేడింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వగలరు. యూనిక్ క్లయింట్ కోడ్ (యూసీసీ)–డివైజ్–సిమ్ ఈ మూడింటితో కూడిన సిమ్ బైండింగ్ విధానాన్ని తీసుకురావాలన్నది సెబీ ప్రతిపాదన. యూపీఐ యాప్ అన్నది ఒక మొబైల్లో ఒకే యూజర్‌తో ఎలా అనుసంధానం అయి ఉంటుందో.. ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా సైతం యూజర్ మొబైల్‌తో అనుసంధానమై ఉంటుంది. యూపీఐ లావాదేవీల సమయంలో యూపీఐ అప్లికేషన్ క్లయింట్ సిమ్, మొబైల్ డివైజ్, వారి బ్యాంక్ ఖాతాలను గుర్తించిన తర్వాతే ప్రాసెస్ చేస్తుంది. అదే మాదిరిగా ట్రేడింగ్ అప్లికేషన్ సైతం యూజర్ యూసీసీ, సిమ్, మొబైల్ డివైజ్ నిజమైనవని ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్‌కు వీలు కల్పిస్తుంది.యూనిక్ క్లయింట్ కోడ్‌కు క్లయింట్ మొబైల్ నంబర్, డివైజ్ ఐఎంఈఐ నంబర్‌ను లింక్ చేయడాన్ని సెబీ ప్రతిపాదించింది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా లాగిన్ అవ్వాలంటే.. సోషల్ మీడియా యాప్‌ల మాదిరే టైమ్ సెన్సిటివ్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సిటివ్ క్యూఆర్ కోడ్ ఆథెంటికేషన్ ద్వారే చేయాల్సి వస్తుంది. అలాగే, ట్రేడింగ్ యాప్‌లోకి బయోమోట్రిక్ ధ్రువీకరణతోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ పత్రిపాదనలపై సలహా, సూచనలను మార్చి 11 లోపు తెలియజేయాలని సెబీ కోరింది.ఏఎంసీలు సకాలంలో పెట్టుబడి పెట్టాల్సిందేనూతన ఫండ్ పథకం (ఎన్ఎఫ్వో) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను నిర్దేశిత సమయంలోపు తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలంటూ నిబంధనలను సెబీ సవరించింది. అలాగే, పారదర్శకత పెంపుకోసం మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్ ఫలితాలను సైతం ఇన్వెస్టర్లకు తెలియజేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయనుంది. మరింత జవాబుదారీతనం, ఇన్వెస్టర్లలో విశ్వాసం, మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్వహణ సౌలభ్యం తీసుకొచ్చే దిశగా సెబీ ఈ చర్యలు తీసుకుంది.ఇదీ చదవండి: స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం, పథకం పెట్టుబడుల విధానానికి అనుగుణంగా నిర్దేశిత సమయంలోపు ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతిపాదనకు సెబీ బోర్డు గత డిసెంబర్లో ఆమోదం తెలపడం గమనార్హం. సాధారణంగా ఈ గడువు 30 రోజులుగా ఉంటుంది. ఎన్ఎఫ్వో ముగిసిన అనంతరం 30 రోజుల్లో ఇన్వెస్ట్ చేయకపోతే.. ఇన్వెస్టర్లు ఎలాంటి ఎగ్జిట్ లోడ్ (చార్జీ) చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు ఏఎంసీలు అనుమతించాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మ్యూచువల్ ఫండ్ పథకాలు ఎలా ఎదుర్కొంటాయో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. -
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది. పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్‌కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. -
అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందే
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’ అని సెబీ పేర్కొంది. పెనాల్టీలు వేయాల్సింది టెల్కోలపై కాదు: సీఓఏఐస్పామ్ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేయడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలతో టెల్కోలకు పెనాల్టీలు గణనీయంగా పెరిగాయని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్‌కు ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల స్పామ్ సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. ‘టెలికం ఆపరేటర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి పుష్కలంగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: రూ.250కే జన్‌నివేష్ సిప్అయాచిత కమ్యూనికేషన్ల పరిమాణంలో గణనీయ పెరుగుదల, అలాగే న్యాయబద్ధ వాణిజ్య కమ్యూనికేషన్ అంతా ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లకు మారింది. ఇది దేశంలో ఆర్థిక నేరాల పెరుగుదలకు దారితీసింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లపై పెనాల్టీలు ఏ ప్రయోజనాన్ని అందించవు. అవసరమైతే టెలిమార్కెటర్ డెలివరీ కంపెనీలు లేదా వాణిజ్య సమాచార ప్రసారాల వాస్తవ రూపకర్తలు, లబ్ధాదారులైన ప్రధాన సంస్థలపై ఈ పెనాల్టీలు వేయాలి’ అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి.కొచ్చర్ అన్నారు. -
ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ ‘మిత్రా’ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల కోసం ‘మిత్రా’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సెబీ తీసుకొచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి, వాటి వివరాలు మర్చిపోయిన వారు, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేకుండా ఉండిపోయిన వాటిని సులభంగా గుర్తించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సాయపడనుంది. ఇలాంటి చురుగ్గాలేని (ఇనాక్టివ్), చాలా కాలంగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన (అన్క్లెయిమ్డ్) పెట్టుబడులను తిరిగి గుర్తించి, వెనక్కి తీసుకోవడానికి ఈ చర్య తీసుకుంది.గతంలో చేసిన పెట్టుబడుల వివరాలను మర్చిపోయి, తాజా కాంటాక్ట్ సమాచారం లేక, తమ పేరిట చేసిన పెట్టుబడులపై అవగాహన లేని వారి విషయంలో వ్యక్తమవుతున్న ఆందోళనలకు ఈ ప్లాట్‌ఫామ్ పరిష్కారం చూపుతుందని సెబీ తన తాజా సర్క్యులర్‌లో వెల్లడించింది. ఈ తరహా యాక్టివ్‌గా లేని ఫోలియోలు (పెట్టుబడులు) మోసపూరిత ఉపసంహరణలకు దారితీయవచ్చని పేర్కొంది.రిజిస్టార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన పెట్టుబడులను తగ్గించేందుకు సాయపడుతుందని పేర్కొంది. పదేళ్లుగా పెట్టుబడులు, మరే ఇతర ఆర్థికేతర లావాదేవీలు లేకుండా ఉండిపోయిన పెట్టుబడులను ఇనాక్టివిగా పరిగణిస్తుంటారు. ఇన్వెస్టర్లకు సంబంధించి ఇనాక్టివ్ ఫోలియోలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్లను గుర్తించి.. వాటిని తగ్గించే బాధ్యతను ‘యూనిట్ హోల్డర్ ప్రొటెక్షన్ కమిటీ’పై పెట్టింది. తాజా చర్యల గురించి ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలంటూ ఏఎంసీలు, ఆర్టీఏలు, ఆర్ఐఏలు, యాంఫి, మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారులను సెబీ ఆదేశించింది. -
ఇన్ యాక్టివ్ ఫోలియోలకు ‘మిత్రా’ సాయం
యాక్టివ్‌లోలేని లేదా క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇన్వెస్టర్లకు తీపికబురు అందించింది. సదరు ఫండ్ ఫోలియోలను ట్రాక్ చేసేందుకు, వాటిని తిరిగి పొందేందుకు పెట్టుబడిదారులకు సహాయపడటానికి సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ (మిత్రా) అనే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది.పెట్టుబడుల సమాచారం మిస్ అవ్వడం లేదా తమ పేరుతో చేసిన పెట్టుబడుల గురించి నామినీలకు తెలియకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ట్రాక్ చేయలేకపోతున్నామనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అలాంటి వారికోసం కొత్తగా ప్రవేశపెట్టిన మిత్రా ఎంతో సహకరిస్తుందని సెబీ తెలిపింది. యాక్టివ్‌లోలేని, క్లెయిమ్ చేయని మ్యూచువల్ ఫండ్ ఫోలియోల వివరాలను డేటాబేస్ నుంచి శోధించి ‘మిత్రా’ పెట్టుబడిదారులకు సమాచారం అందిస్తుంది. పెట్టుబడుల సమాచారాన్ని విస్మరించినా లేదా ఇతరులు చేసిన ఏవైనా పెట్టుబడులను గుర్తించడానికైనా మిత్రా వేదిక అవ్వనుంది.ఇదీ చదవండి: రూ.50 నోట్లపై గవర్నర్ సంతకం మార్పుఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేసేలా ప్రోత్సహిస్తుంది. నాన్ కేవైసీ కంప్లైంట్ ఫోలియోల సంఖ్యను తగ్గిస్తుంది. మోసపూరిత రిడంప్షన్లను అరికడుతుంది. ఫండ్స్, సరైన ఫోలియో ఉన్నప్పటికీ పదేళ్ల పాటు ఎలాంటి నిర్వహణ చేయకపోతే వాటిని నిబంధనల ప్రకారం ఇన్‌యాక్టివ్‌గా పరిగణిస్తారు. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు (ఏఎంసీలు), రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ ఫర్ ఏజెంట్లు (ఆర్టీఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ), మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు సహా అందరు భాగస్వాములకు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఇన్వెస్టర్లలో అవగాహన కల్పించాలని సెబీ ఆదేశించింది. -
కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఇటీవలే ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ(NSE SME) ప్లాట్‌ఫాం ఎమర్జ్‌లో లిస్టయిన కాలాహరిధాన్ ట్రెండ్జ్‌పై (KTL) నిబంధనల ఉల్లంఘనకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ కంపెనీతో పాటు ప్రమోటర్లు నిరంజన్ డి అగర్వాల్, ఆదిత్య ఎన్ అగర్వాల్, సునీత నిరంజన్ అగర్వాల్‌ను ఆదేశించింది. అలాగే వారిని పూర్తిగా నిషేధిస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడంలో విఫలమైందంటూ కేటీఎల్పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి ఫిర్యాదు రావడంతో సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన విచారణలో.. ఈ డిఫాల్ట్ వివరాలను కంపెనీ వెల్లడించకుండా డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. పైగా బంగ్లాదేశ్‌లోని ఒక కల్పిత సంస్థ నుంచి భారీ ఆర్డరు వచ్చిందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరిస్తున్నామని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. దీన్ని కప్పి పుచ్చేందుకు ఈమెయిల్స్ సృష్టించినట్లు వివరించింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఐపీవోలుమొత్తం మీద కంపెనీపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచి షేర్లలో ట్రేడ్ చేసేలా ఇన్వెస్టర్లను పురిగొల్పి, షేర్లను అమ్ముకుని లబ్ధి పొందేందుకే కేటీఎల్ నిర్దిష్ట కార్పొరేట్ ప్రకటనలను చేసినట్లు సెబీ పేర్కొంది. పైపెచ్చు రైట్స్ ఇష్యూ ద్వారా మరో విడత నిధుల సమీకరణ కూడా కంపెనీ తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 23న ఇష్యూ ధర రూ.45తో పోలిస్తే రూ.47.15 వద్ద లిస్టయిన కేటీఎల్ షేరు ప్రస్తుతం రూ.20 స్థాయిలో ఉంది. -
యూట్యూబర్‌పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆరు సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగానే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (APGSOT) డైరెక్టర్ 'అస్మితా పటేల్' కూడా ఉన్నారు.అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో సెబీ రంగంలోకి దిగింది.టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు రూ. 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన రూ.53 కోట్లు.. సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్‌కు 5.26 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్బుక్లో 73,000 మంది, లింక్డ్ఇన్లో 1,900 మంది ఫాలోవర్లు, ఎక్స్ (ట్విటర్)లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇదీ చదవండి: తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విటర్)లలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. అస్మితా పటేల్ తనను తాను షీవోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్.. 'ఆప్షన్స్ క్వీన్'గా ప్రచారం చేసుకుంటోంది. ఈమె దాదాపు ఒక లక్షమంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం.ఎవరీ అస్మితా పటేల్?అస్మితా పటేల్.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (AGSTPL)కి డైరెక్టర్. కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా అనేక అవార్డులను గెలుచుకున్నట్లు చెబుతున్నారు. -
సెబీ కొత్త రూల్.. వారి బంధువుల పాన్ కార్డులూ ఫ్రీజ్!
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి కొత్త సమాచారం వెలువడింది. లిస్టెడ్ కంపెనీల “ట్రేడింగ్ విండో క్లోజ్”కు సంబంధించి సెబీ కొత్త నిబంధనలు తీసుకురాబోంది. ఇవి కంపెనీ ఇన్సైడర్ల బంధువులకు కూడా వర్తిస్తాయి. నిర్ణీత సమయంలో వారి పాన్ కార్డులు (PAN cards) కూడా స్తంభిస్తాయి. ఈ మేరుకు సెబీ ప్రతిపాదనలు జారీ చేసింది. “ట్రేడింగ్ విండో క్లోజ్” అంటే.. “ట్రేడింగ్ విండో క్లోజ్” అనేది కంపెనీ ఇన్సైడర్లకు సంబంధించిన నిబంధన. అంటే ఆ నిర్ణీత సమయంలో కంపెనీ ఇన్సైడర్లు షేర్లను ట్రేడ్ చేయలేరు. తద్వారా ఇన్సైడర్ ట్రేడింగ్‌ను నిరోధించే ఆస్కారం ఉంటుంది. మార్కెట్ పారదర్శకత కోసం సెబీ దీనిని అమలు చేస్తుంది.త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు "ట్రేడింగ్ విండో" ఆటోమేటిక్ క్లోజర్ నిబంధనలో మరికొంత మందిని చేర్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సెబీ చెబుతోంది. ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులు వంటి వారు ఈ నిబంధన కింద ఉన్నారు. కానీ కొత్త నిబంధన ప్రకారం ఈ వ్యక్తులందరి దగ్గరి బంధువులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఎటువంటి అవకాశం లేకుండా నిరోధించడం దీని ఉద్దేశం.ట్రేడింగ్ విండో క్లోజ్ సమయంలో మరింత భద్రత కోసం ఇన్సైడర్ల పాన్ కార్డులను స్తంభింపజేయడానికి, డిపాజిటరీల ట్రేడింగ్‌ను నిలిపివేయడానికి సెబీ 2022 ఆగస్టులో మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం లిస్టెడ్ కంపెనీ విడుదల చేసిన సమాచారం ఆధారంగా వారి పాన్ కార్డులను స్తంభింపజేస్తున్నారు. గతంలో ఈ నిబంధన నిఫ్టీ 50, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలలో నమోదైన కంపెనీలకు వర్తించేది. 2023 జూలైలో సెబీ దీనిని అన్ని కంపెనీలకు తప్పనిసరి చేసింది.కొత్త ప్రతిపాదనలపై ఫిబ్రవరి 28 లోగా స్పందనలు తెలియజేయాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కోరింది. సెబీ నిర్వచనం ప్రకారం దగ్గరి బంధువు అంటే తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు. అలాగే స్టాక్ మార్కెట్ వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో సంప్రదించే వ్యక్తులు కూడా ఇందులోకి వస్తారు.ప్రతి త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ప్రకటించిన 48 గంటల వరకు ట్రేడింగ్ విండో మూసివేత వర్తిస్తుందని సెబీ పేర్కొంది. సెబీ వెబ్సైట్లో విడుదల చేసిన సమాచారం ప్రకారం.. కంపెనీలు సాధారణంగా త్రైమాసిక, వార్షిక ఆర్థిక ఫలితాలు, పెద్ద ఒప్పందాలు, కొనుగోళ్లు లేదా విలీనాలను ప్రకటించే ముందు ట్రేడింగ్ విండోను మూసివేస్తాయి. అలాగే బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్‌లు లేదా డివిడెండ్లను ప్రకటించే ముందు కూడా ట్రేడ్ విండో క్లోజ్ వస్తుంది. -
టాప్-100 కంపెనీలకు డిజిటల్ అష్యూరెన్స్: సెబీ
టాప్-100 లిస్టెడ్ కంపెనీలకు ఆర్థిక నివేదికలకు సంబంధించి తప్పనిసరి డిజిటల్ అష్యూరెన్స్‌ను సెబీ ప్రతిపాదించింది. కంపెనీల ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లు, ఆయా కంపెనీల డిజిటల్ సమాచార మూలాలను కూడా ధ్రువీకరించనుండడం ఇందులో భాగంగా ఉంటుంది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని సెబీ (SEBI) విడుదల చేసింది.‘‘డిజిటల్ అష్యూరెన్స్ రిపోర్ట్‌తో పారదర్శకత పెరుగుతుంది. సమాచార వెల్లడి ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు మరింత రక్షణ లభించి, వ్యవస్థ పట్ల నమ్మకం పెరుగుతుంది’’అని సెబీ పేర్కొంది. కంపెనీ ఆర్థిక నివేదికలను మదింపు చేసే ఆడిటర్లే ఈ డిజిటల్ అష్యూరెన్స్ నివేదికలను ప్రత్యేకంగా జారీ చేయాల్సి ఉంటుంది.దీనికి సహకారం అందించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కూడా ముందుకు వచ్చింది. డిజిటల్‌గా అందుబాటులో ఉన్న ఆడిట్ ఆధారాలు, సమాచారాన్ని ఉపయోగించడం ద్వారా ఆడిట్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచడానికి తమ సభ్యులకు మార్గదర్శకత్వం అందించడానికి డిజిటల్ హామీపై ఒక మార్గదర్శనాన్ని విడుదల చేసింది. -
ఐపీవోకు 7 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్‌ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి. రూ. 4,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎస్ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్‌గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది. రూ. 1,300 కోట్ల సమీకరణ ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రూ. 900 కోట్లకు సై ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్ఆర్పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్‌కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది. రూ. 740 కోట్లపై దృష్టి పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది. రూ. 600 కోట్లకు రెడీ సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. రూ. 200 కోట్లతోపాటు.. ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్‌సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. 1.9 కోట్ల షేర్ల జారీ గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సెబీకి ఉయ్‌వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్వర్క్స్పేస్ సేవల సంస్థ ఉయ్‌వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్‌స్పేస్‌లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
సెబీకి త్వరలో కొత్త చీఫ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రభుత్వం కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనుంది. ఇందుకు ఆర్థిక శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రస్తుత చైర్‌పర్శన్ మాధవీపురీ బచ్ మూడేళ్ల పదవీకాలం ఫిబ్రవరి 28న ముగియనుంది. సెబీకి కొత్త చీఫ్‌ను ఐదేళ్ల కాలానికి ఎంపిక చేయనున్నట్లు లేదా అభ్యర్థికి 65 ఏళ్ల వయసు(ఏది ముందయితే)వరకూ బాధ్యతలు అప్పగించనున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ తెలియజేసింది. దరఖాస్తుల దాఖలుకు ఫిబ్రవరి 17 గడువుగా పేర్కొంది. ఈ నెలలో 60వ వసంతంలో అడుగు పెట్టనున్న బచ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. కొత్త చైర్మన్‌గా ఎంపికయ్యే వ్యక్తికి సెబీ నిర్వహణపై ప్రభావం చూపగల ఎలాంటి ఆర్థిక లేదా సంబంధిత వ్యవహారాలు ఉండకూడదని ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 25ఏళ్లకు మించిన వృత్తి సంబంధ అనుభవంతోపాటు 50ఏళ్లకు మించిన వయసుగల వ్యక్తులు దరఖాస్తు చేయవచ్చని వివరించింది. ఎంపికైన అభ్యర్థి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో నెలకు రూ. 5,62,500 చొప్పున వేతనాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. సాధారణంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను తొలుత మూడేళ్ల కాలానికి ఎంపిక చేస్తుంది. తదుపరి మరో రెండేళ్లు పదవీ కాలాన్ని పొడిగిస్తుంది. అయితే ఇంతక్రితం యూకే సిన్హా ఐదేళ్ల కాలానికి పదవిని స్వీకరించారు. తదుపరి మరో ఏడాది బాధ్యతలు నిర్వహించారు. -
ఐపీవోకు డార్ఫ్-కీటాల్ కెమికల్స్
న్యూఢిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీలో ఉన్న డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ ఐపీవోకు వస్తోంది. రూ.5,000 కోట్లను సమీకరించేందుకు అనుమతి కోరుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు.ప్రమోటర్ మీనన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ రూ.3,500 కోట్ల విలువైన షేర్లను విక్రయించనుంది. డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా 1992లో ప్రారంభం అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఐవోసీ, పీపీజీ ఇండస్ట్రీస్, వేదాంత వంటి దిగ్గజ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, యూఎస్, కెనాడాలో మొత్తం 16 తయారీ కేంద్రాలను కలిగి ఉంది.రసాయనాల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అతికొద్ది సంస్థల్లో డార్ఫ్–కీటాల్ కెమికల్స్ ఇండియా ఒకటి. భారత్ వెలుపల సంస్థ ఖాతాలో 542 పేటెంట్స్ ఉన్నాయి. వీటిలో యూఎస్‌లో 99 నమోదయ్యాయి. కంపెనీ 2023–24లో రూ.548 కోట్ల టర్నోవర్‌పై రూ.60 కోట్ల నికరలాభం ఆర్జించింది.ఐపీఓ అంటే..స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి రెండు రకాల మార్గాలు అందుబాటులో ఉంటాయి. ఒకటి..కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పుడు వాటికి దరఖాస్తు చేయడం ద్వారా షేర్లను కొనుగోలు చేయడం. అలాకాకుండా మార్కెట్లో నేరుగా షేర్లను కొనుగోలు చేయడం రెండోది. పబ్లిక్ ఇష్యూనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) అని కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా కంపెనీలు తమ ఎదుగుదల క్రమంలో నిధులు అవసరమై ప్రజల నుంచి వాటిని సమీకరించాలనే ఉద్దేశంతో షేర్లను జారీ చేయడం ద్వారా మొట్టమొదటిసారి ఐపీఓకు వస్తాయి.ఇలా ఐపీఓకి వచ్చే కంపెనీలు ముందుగా లీడ్ మేనేజర్లను నియమించుకుంటాయి. వీరు ఆ కంపెనీ ఐపీఓ వ్యవహారాలు సజావుగా పూర్తయ్యేలా చూస్తారు. కంపెనీలు ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ, మూలధన అవసరాలు, అప్పులు తీర్చడం కోసం వాడుకుంటాయి. ఐపీఓ తర్వాత సంస్థలు వాటాదారులకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది. -
ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను
పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ ఛైర్పర్సన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవో(IPO)లో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు.దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావాదేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్టార్టప్స్‌కు ఏటా రూ.1.24 లక్షల కోట్ల నిధులునిధుల దుర్వినియోగంకొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దుర్వినియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
రెండేళ్లలో 1,000 ఐపీవోలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్‌కాగా.. 570 సంస్థలు ఎస్ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది. గతేడాదిలో గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్‌లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్‌చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది. ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్నుప్రీలిస్టింగ్ ట్రేడింగ్‌ను అనుమతించే యోచనపబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు. -
ఐపీవోకు ఆరు కంపెనీలు రెడీ
కొత్త క్యాలండర్ ఏడాదిలోనూ ప్రైమరీ మార్కెట్ల దూకుడు కొనసాగనుంది. తాజాగా ఆరు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI) పచ్చ జెండా ఊపింది. జాబితాలో ఐటీ సర్వీసుల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్‌తోపాటు.. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు విక్రన్ ఇంజినీరింగ్, అజాక్స్ ఇంజినీరింగ్, పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్, ఆల్ టైమ్ ప్లాస్టిక్స్, స్కోడా ట్యూబ్స్ చేరాయి. ఈ ఆరు కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ కోసం 2024 సెప్టెంబర్-డిసెంబర్ మధ్య ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తద్వారా ఉమ్మడిగా రూ.10,000 కోట్లు సమీకరించనున్నాయి. వివరాలు చూద్దాం..కార్లయిల్ మద్దతుతో..డిజిటల్, ఐటీ సొల్యూషన్ల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో(IPO)లో భాగంగా రూ. 9,950 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ సంస్థ సీఏ మ్యాగ్నమ్ హోల్డింగ్స్ వీటిని ఆఫర్ చేయనుంది. హెక్సావేర్‌లో పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ సంస్థ సీఏకు ప్రస్తుతం 95.03 శాతం వాటా ఉంది. కంపెనీ ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, తయారీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు ఐటీ సర్వీసులు సమకూర్చుతోంది. గత ప్రమోటర్ బేరింగ్ పీఈ ఏషియా 2020లో హెక్సావేర్‌ను స్టాక్ ఎక్స్చేంజీల నుంచి డీలిస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఏడాది కాలంలో బేరింగ్ వాటాను కార్లయిల్ గ్రూప్ కొనుగోలు చేసింది. గతేడాది(2023–24) హెక్సావేర్ రూ.10,380 కోట్ల ఆదాయం, రూ.997 కోట్ల నికర లాభం ఆర్జించింది. స్టెయిన్లెస్ స్టీల్ గుజరాత్ కంపెనీ స్కోడా ట్యూబ్స్ ఐపీవోలో భాగంగా రూ.275 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. సంస్థ ప్రధానంగా ఆయిల్, గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో కార్యకలాపాలు నిర్వహించే ఈపీసీ, ఇండ్రస్టియల్ కంపెనీలకు స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపులను తయారు చేసి అందిస్తోంది. ఈపీసీ కంపెనీమౌలిక రంగ ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ ఐపీవోలో భాగంగా రూ.900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీలో సుప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కొచాలియాకు సైతం పెట్టుబడులున్నాయి. టర్న్‌కీ పద్ధతిలో డిజైన్, సప్లై, ఇన్స్టలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ తదితర ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసులదిస్తోంది. సోలార్ టెక్ఐపీవోలో భాగంగా పీఎంఈఏ సోలార్ టెక్ సొల్యూషన్స్ రూ.600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.12 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 2006లో ఏర్పాటైన కంపెనీ ప్రధానంగా సోలార్ ట్రాకింగ్ మౌంటింగ్ సిస్టమ్స్, ఎక్విప్మెంట్ తయారీలో ఉంది. మాడ్యూల్ మౌంటింగ్ అసెంబ్లీలో 16 గిగావాట్ల వార్షిక స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. కన్జూమర్ ప్రొడక్ట్స్కస్టమర్ల కోసం కన్జూమర్‌వేర్ ప్రొడక్టులు తయారు చేసే ఆల్ టైమ్ ప్లాస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 52.5 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వైట్‌లేబుల్ కన్జూమర్‌వేర్ ప్రొడక్టుల తయారీ కంపెనీ క్లయింట్ల సొంత బ్రాండ్లను రూపొందించి అందిస్తోంది. కస్టమర్ల జాబితాలో గ్లోబల్ దిగ్గజాలు ఐకియా, ఏఎస్‌డీఏ స్టోర్స్, టెస్కో పీఎల్సీ, మైఖేల్స్ స్టోర్స్‌తోపాటు దేశీయంగా స్పెన్సర్స్ రిటైల్ తదితరాలున్నాయి.ఇదీ చదవండి: అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లుకాంక్రీట్ ఎక్విప్మెంట్పీఈ దిగ్గజం కేదారా క్యాపిటల్‌కు పెట్టుబడులున్న అజాక్స్ ఇంజినీరింగ్ కాంక్రీట్ ఎక్విప్మెంట్ తయారీలో కార్యకలాపాలు విస్తరించింది. ఐపీవోలో భాగంగా 2.28 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కేదారా క్యాపిటల్ 74.37 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. -
కార్పొరేట్ వ్యవహారాలపై సెబీ నిర్ణయం
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ వినిర్ ఇంజినీరింగ్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(SEBI)కి ముసాయిదా ప్రాస్పెక్టస్ సమర్పించింది. దీని ప్రకారం ఐపీవోలో భాగంగా 5,33,00,000 షేర్లను కంపెనీ ఆఫర్ చేయనుంది. ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ నితేష్ గుప్తా వీటిని ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. షేర్ల ముఖవిలువ రూ.2గా ఉంటుంది.ఇదీ చదవండి: మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలుఆనంద్ రాఠీకి సెబీ చెక్ఐపీవో ప్రాస్పెక్టస్ వెనక్కిన్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా బ్రోకింగ్ కంపెనీ ఆనంద్ రాఠీ(Anand Rati) గ్రూప్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలకు చెక్ పెట్టింది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ 2024 డిసెంబర్లో దాఖలు చేసిన ఐపీవో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను తిప్పి పంపింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ ద్వారా ఆనంద్ రాఠీ షేర్ రూ. 745 కోట్లు సమీకరించాలని భావించింది. ఇందుకు ఈక్విటీని తాజాగా జారీ చేయాలని ప్రతిపాదించింది. అయితే కారణాలు వెల్లడించకుండా సెబీ ప్రాస్పెక్టస్‌ను రిటర్న్ చేసింది. -
స్టాక్ మార్కెట్లోకి రావాలా?.. పోవాలా?
స్టాక్ మార్కెట్లను నియంత్రించే సెబీ (సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమధ్య కొన్ని చర్యలు తీసుకుంది. అవి నవంబర్ 20 నుంచి అమల్లోకి వచ్చాయి కూడా. కొన్ని ఇండెక్స్‌లలో వారాంతపు ట్రేడింగ్‌లు నిలిపివేయడం, లాట్ సైజులను పెంచడం వీటిలో ప్రధానమైనది. ఇలా చేయడం ద్వారా రిటైల్ ట్రేడర్లు భారీ స్థాయిలో నష్టపోకుండా చూడవచ్చన్నది సెబీ ఉద్దేశం. నిజంగా సెబీ లక్ష్యం నెరవేరిందా / నెరవేరుతుందా.. అంటే ఎన్నో ప్రశ్నలు. ఆ చర్యలను ఒకసారి విశ్లేషిస్తే...గత నవంబర్ దాకా మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు ఉండేవి. ప్రతి వారం.. సోమవారం మిడ్ నిఫ్టీ, మంగళ వారం ఫిన్ నిఫ్టీ, బుధవారం బ్యాంకు నిఫ్టీ, గురువారం నిఫ్టీ, శుక్రవారం సెన్సెక్స్ ఎక్సపైరీలు జరిగేవి. తదనుగుణంగా ట్రేడర్లు పొజిషన్స్ తీసుకుని ట్రేడ్ చేసుకునేవారు. ఇప్పుడు కేవలం నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే వారాంతపు కాంట్రాక్టులు అమలు చేస్తున్నారు.మిడ్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీలలో ట్రేడ్ చేయాలి అనుకునేవారు.. తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే తీసుకోవాల్సి వస్తోంది. పైన పేర్కొన్న అయిదు సూచీల్లో మీకు నచ్చిన ఏదో ఒక సూచీని వారాంతపు ఎక్సపైరీ సూచీలుగా కొనసాగించుకోవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ సూచించింది. ఈ రెండు ఎక్స్చేంజీలు సహజంగానే వాటి ప్రామాణిక సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌లలో వారాంతపు కాంట్రాక్టులు నిర్వహిస్తామని సెబీకి చెప్పాయి. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్‌లలో మాత్రమే ఇప్పుడు వారాంతపు కాంట్రాక్టులు నడుస్తూండగా.. మిగిలిన మూడూ నెలవారీ కాంట్రాక్టులుగా కొనసాగుతున్నాయి. అలాగే మిడ్ నిఫ్టీ లాట్ సైజు ఇప్పటిదాకా 50 ఉంటే.. ఫిబ్రవరి నుంచి 120కి పెరిగింది. ఫిన్ నిఫ్టీ లాట్ సైజు 25 నుంచి 65కి, బ్యాంకు నిఫ్టీ 15 నుంచి 30కి, నిఫ్టీ 25 నుంచి 75కి, సెన్సెక్స్ 10 నుంచి 20కి పెరిగాయి.వారాంతపు కాంట్రాక్టులు ఇప్పటికే నెలవారీ కాంట్రాక్టులుగా మారిపోగా.. లాట్ సైజుల్లో మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది. అన్ని అలవాట్లకు లోనైన వ్యక్తి తొందరగా వాటిని ఎలా మానుకోలేడో.. ట్రేడింగ్ కూడా అలాంటిదే. పైగా ఇది ఆర్ధిక పరమైన అంశం. స్టాక్ మార్కెట్లో ఉండే బలహీనత ఏమిటంటే.. పోగొట్టుకున్న వ్యక్తి అంతటితో ఊరుకోడు. ఎలాగైనా ఆ పోగొట్టుకున్నది రాబట్టుకోవాలన్న తాపత్రయంతో ఇంకా ఇంకా డబ్బులు తెచ్చి ట్రేడింగ్‌లో పెడుతూనే ఉంటాడు. వీక్లీ కాంట్రాక్టులు తీసేయడం వల్ల వారం వారం డబ్బులు పోగొట్టుకునే ట్రేడర్లు తగ్గిపోతారని.. తద్వారా సగటు ట్రేడర్లను కాపాడినట్లు అవుతుందన్నది సెబీ సదుద్దేశం. కానీ అలా జరిగిందా..??సగటు ట్రేడర్.. ట్రేడింగ్ ఆపేయలేదు. నెలవారీ కాంట్రాక్టులు కొనడం మొదలుపెట్టాడు. ఇవి రేటు ఎక్కువ ఉంటాయి. పైగా లాట్ సైజు పెరిగింది కూడా.. దీనికి ఒక ఉదాహరణ పరిశీలిద్దాం..బ్యాంకు నిఫ్టీ లాట్ ప్రస్తుతం15 షేర్స్. ఈ సూచీ 51000 దగ్గర ఉంది అనుకుందాం. దాని కాల్ ప్రీమియం రూ. 200 ఉంది అనుకుంటే రూ. 3,000 చేతిలో ఉంటే చాలు. 1 లాట్ వస్తుంది. ఇప్పుడు మంత్లీ కాంట్రాక్టు మాత్రమే కొనాలి. మంత్లీ కాంట్రాక్ట్స్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇదే 51000 కాల్ మంత్లీలో రూ. 1000 దరిదాపుల్లో ఉంది. కనీసం ఒక లాట్ కొనాలంటే రూ. 15,000 కావాలి. అదే ఫిబ్రవరి నుంచి అయితే లాట్ సైజు 30కి పెరుగుతుంది. అప్పుడు 30,000 అవసరమవుతాయి. దీంతో అంత పెట్టుబడి పెట్టలేక చాలామంది రిటైల్ ట్రేడర్లు మార్కెట్‌కి దూరమవుతారని, తద్వారా ఇలాంటి చిన్న ట్రేడర్లను నష్టాల నుంచి కాపాడవచ్చు అన్నది సెబీ ఉద్దేశం.ఇది జరగొచ్చు.. జరక్కపోవచ్చు కూడా.. అదెలాగంటే... 1. అంత డబ్బులు పెట్టలేని వ్యక్తి ట్రేడింగ్‌కు దూరమవుతాడు. సెబీ కోరుకున్నది ఇదే.2. ట్రేడింగ్‌కు అలవాటు పడ్డ వ్యక్తి, డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంత తొందరగా ట్రేడింగ్ మానేయడు. అప్పు చేసో, పొదుపు మొత్తాలు ఖాళీ చేసో.. మరిన్ని డబ్బులు తెచ్చి పెడతాడు. ఇది సెబీ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా రిటైల్ ట్రేడర్లను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తుంది.కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీల్లో వారాంతపు కాంట్రాక్టుల్లో ట్రేడ్ చేసే వ్యక్తులు ఇప్పుడు మంత్లీ వైపు మళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత డిసెంబర్లో (అంతక్రితం 11 నెలలతో పోలిస్తే) బ్యాంకు నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల్లో రోజువారీ ప్రీమియం టర్నోవర్ 377 శాతం పెరిగి రూ.12,200 కోట్లుగా నమోదైంది. అదే మిడ్ నిఫ్టీలో 819 శాతం పెరిగి 512 కోట్లకు చేరగా, ఫిన్ నిఫ్టీ లో 575 శాతం పెరిగి రూ. 398 కోట్లకు చేరింది.దీన్నిబట్టి చూస్తే ట్రేడర్లు ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది. వ్యాపార పరిమాణం మందగించవచ్చేమో కానీ వ్యాపారం మాత్రం తగ్గట్లేదు. దీనివల్ల పోగొట్టుకునే వ్యక్తులు మరింత పోగొట్టుకోవడానికి, లబ్ది పొందేవాళ్ళు మరింత ప్రయోజనం పొందడానికి తలుపులు తెరిచినట్లే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పోగొట్టుకునేది చిన్న ట్రేడర్లే కానీ.. ప్రయోజనం పొందేది మాత్రం భారీ స్థాయిలో లావాదేవీలు నిర్వహించే విదేశీ మదుపర్లు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్సే.సెబీ నిర్ణయాలు అమల్లోకి వచ్చి ఇంచుమించు రెండు నెలలే కావస్తోంది. కాబట్టి మరికొన్ని నెలల పరిశీలన తర్వాత సెబీ తన నిర్ణయాలను ఏవైనా మార్చుకుంటుందా.. కొత్త పద్ధతినే కొనసాగిస్తుందా.. ఏవైనా మార్పులు చేస్తుందా.. ఇవన్నీ వేచి చూడాల్సిన ప్రశ్నలే.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నిధుల సమీకరణలో 2025 జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్ఎస్ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు. ఇకపై ఇన్విట్స్ అదుర్స్ నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్స్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్ఎస్ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎంఈలకు దన్ను చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు. ఐపీవోల వరద ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లు, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు వివరించారు. -
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్(King Fisher), హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్ బ్రాండ్ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ! -
‘తొందర’ తెచ్చిన తంటా.. ఓలాకు సెబీ హెచ్చరిక
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) హెచ్చరిక లేఖ జారీ చేసింది. సెబీకి ముందస్తు సమాచారం లేకుండా భవిష్ అగర్వాల్ తన ఎక్స్ వేదికలోనే కంపెనీకి చెందిన కీలక సమాచారాన్ని పంచుకున్నారని లేఖలో తెలిపింది.భవిష్ అగర్వాల్ డిసెంబర్ 2, 2024న కంపెనీ స్టోర్ల సంఖ్యను నెలలో 800 నుంచి 4,000కు విస్తరించాలనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. ఉదయం 9:58 సమయంలో ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. అయితే, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు మాత్రం మధ్యాహ్నం 1:36 గంటలకు, 1:41 గంటలకు సమాచారాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.ముందు ఎక్స్‌లో.. తర్వాత ఎక్స్చేంజీలకు..సెబీ (లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ ఆవశ్యకతలు) రెగ్యులేషన్స్, 2015 నిబంధనలను ఓలా ఉల్లంఘించినట్లు హెచ్చరిక లేఖలో సెబీ తెలియజేసింది. సోషల్ మీడియా ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారులందరికీ ఏకకాలంలో, నియమాల ప్రకారం సకాలంలో సమాచారాన్ని అందించడంలో ఓలా ఎలక్ట్రిక్ విఫలమైందని నొక్కి చెప్పింది. మార్కెట్లో ఎలాంటి సమాచారాన్నైనా ముందుగా ఎక్స్చేంజీలకు తెలియజేయాలి. కానీ అందుకు విరుద్ధంగా భవిష్ అగర్వాల్ ముందుగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన తర్వాత రెగ్యులేటర్లకు సమాచారం అందించారు.Taking the Electric revolution to the next level this month.Going from 800 stores right now to 4000 stores this month itself. Goal to be as close to our customers as possible.All stores opening together on 20th Dec across India. Probably the biggest single day store opening…— Bhavish Aggarwal (@bhash) December 2, 2024అనైతికంగా లాభాలు..సామాజిక మాధ్యమాల్లో సీఈఓ స్థాయి వ్యక్తి ఏదైనా సమాచారాన్ని తెలియజేశాడంటే అది చూసిన పెట్టుబడిదారులు నమ్మి వెంటనే అందులో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంకొందరు ఇన్వెస్టర్లు అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూంటారు. అలా ముందుగా సమాచారం పొందిన వారు అనైతికంగా లాభాలు సంపాదించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రతి సమాచారాన్ని ఎక్స్చేంజీలకు తెలియజేయాలి.ఇదీ చదవండి: ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేసిన మెటా‘మళ్లీ పునరావృతం అవ్వదు’సెబీ హెచ్చరిక లేఖపై ఓలా ఎలక్ట్రిక్ స్పందిస్తూ.. సెబీ ప్రమాణాలను మెరుగుపరచడానికి కంపెనీ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలకు ప్రతి కంపెనీ కట్టుబడి ఉండాలని ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. కార్పొరేట్ సమాచారాన్ని పారదర్శకతతో నిర్వహించాల్సి ఉంటుంది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొనసాగించేందుకు కంపెనీ కృషి చేయాలి. -
‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (ZEEL) వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ గోయెంకాలతో పాటు కంపెనీపై విచారణ కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. వారికి కొత్తగా షోకాజ్ నోటీసు (ఎస్సీఎన్) జారీ చేయనున్నట్లు పేర్కొంది. గత నోటీసులో పొందుపర్చిన అంశాలన్నీ తాజా ఎస్‌సీఎన్‌లో కూడా ఉంటాయని తెలిపింది. కీలక వివరాల వెల్లడి నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల కింద జీల్‌తో పాటు సంస్థ టాప్ మేనేజ్మెంట్పై సెబీ(SEBI) విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో 2022 జులైలో తొలుత షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీంతో జీల్, పునీత్ గోయెంకా వివాద సెటిల్మెంట్ కోసం సెబీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సెబీ హోల్–టైమ్ సభ్యుల కమిటీ దాన్ని తిరస్కరించి, తదుపరి విచారణకు సిఫార్సు చేశారు. ఇదీ చదవండి: 10 నిమిషాల్లో అంబులెన్స్రిలయన్స్ నేవల్ పేరు మార్పున్యూఢిల్లీ: రిలయన్స్(Reliance) నేవల్ అండ్ ఇంజినీరింగ్ సంస్థ పేరు స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్‌గా మారింది. జనవరి 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్చేంజీలకు సంస్థ సమాచారమిచ్చింది. దివాలా పరిష్కార ప్రక్రియ కింద రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్‌ను స్వాన్ ఎనర్జీ దక్కించుకుంది. -
ఐపీవోకు 8 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఎనిమిది కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో లీలా ప్యాలస్ మాతృ సంస్థ ష్లాస్ బెంగళూరు, ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ, మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ తదితరాలున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్ 10–23 మధ్య కాలంలో ఇవి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఈ నెలాఖరుకల్లా అనుమతులు పొందాయి. ఐపీవోకు అనుమతి లభించిన ఇతర కంపెనీలలో ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్, క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ సైతం చేరాయి. వివరాలు చూద్దాం..ఏథర్ ఎనర్జీ ద్విచక్ర ఈవీ తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మహారాష్ట్రలో ఈవీ ప్లాంటు ఏర్పాటుకు, ఆర్‌అండ్‌డీకి, రుణ చెల్లింపులకు, మార్కెటింగ్ వ్యయాలకు వెచ్చించనుంది. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ఈవీ కంపెనీగా లిస్ట్‌కానుంది.హోటల్ లీలాలీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వాహక కంపెనీ ష్లాస్ బెంగళూరు ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద ఆతిథ్య రంగ ఐపీవోగా నిలవనుంది. బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్కు పెట్టుబడులున్న కంపెనీ ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. 10 ప్రాంతాలలోని 12 హోటళ్ల ద్వారా 3,382 గదులను నిర్వహిస్తోంది. ఓస్వాల్ పంప్స్ తక్కువ, అధిక వేగంగల(లోస్పీడ్, హైస్పీడ్) మోనోబ్లాక్ పంపుల తయారీ కంపెనీ ఓస్వాల్ పంప్స్ ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.13 కోట్ల షేర్లను ప్రమోటర్ వివేక్ గుప్తా ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలకు, సొంత అనుబంధ సంస్థ ఓస్వాల్ సోలార్‌లో పెట్టుబడులకు వినియోగించనుంది. ఈ బాటలో హర్యానాలోని కర్ణాల్లో కొత్త యూనిట్లను నెలకొల్పేందుకు, రుణ చెల్లింపులకు సైతం వెచ్చించనుంది.ఫ్యాబ్ టెక్నాలజీస్ ఫార్మా, బయోటెక్, హెల్త్‌కేర్ పరిశ్రమలలో టర్న్‌కీ ఇంజినీరింగ్ సొల్యూషన్లు అందించే ఫ్యాబ్ టెక్నాలజీస్ ఐపీవోలో భాగంగా 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆయా విభాగాలలో కంపెనీ సమీకృత సొల్యూషన్లు సమకూర్చుతోంది. వీటిలో డిజైనింగ్, ప్రొక్యూర్మెంట్, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ తదితర సేవలున్నాయి. ఐవేల్యూ ఇన్ఫో పీఈ సంస్థ క్రియేడర్కు పెట్టుబడులున్న ఐవేల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా 1.87 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. క్రియేడర్ 1.11 కోట్ల షేర్లను విక్రయించనుంది. కంపెనీ ప్రధానంగా డిజిటల్ అప్లికేషన్ల మేనేజింగ్, డేటా నిర్వహణలో సమీకృత ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తోంది. జనవరి 6న స్టాండర్డ్ గ్లాస్ ఆఫర్ఫార్మా రంగానికి ప్రత్యేక పరికరాల తయారీలో ఉన్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీవో జనవరి 6న ప్రారంభం కానుంది. జనవరి 8న ఆఫర్ ముగియనుంది. ప్రైస్ బ్యాండ్ రూ. 133–140గా నిర్ణయించారు. కనీసం 107 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ.250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. అలాగే రూ.350 కోట్ల వరకు వి లువైన 1.84 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు విక్రయిస్తారు. షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ చేస్తారు. ఈ ఆఫర్‌తో తమ హోల్డింగ్స్ లో కొంత భాగాన్ని కంపెనీ ప్రమోటర్లు ఎస్2 ఇంజనీరింగ్, కందుల రామకృష్ణ, కందుల కృష్ణ వేణి, నాగేశ్వర్ రావు కందుల విక్రయించనున్నారు.క్వాలిటీ పవర్ ఎనర్జీ ట్రాన్స్మిషన్, పవర్ టెక్నాలజీల కంపెనీ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 225 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్ చిత్రా పాండ్యన్ ఆఫర్ చేయనున్నారు. ప్రస్తుతం కంపెనీలో పాండ్యన్ కుటుంబానికి 100 శాతం వాటా ఉంది. -
లోక్‌పాల్ ఎదుట విచారణకు సెబీ చీఫ్
అవినీతి ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలని సెక్యూరిటీ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్పర్సన్ మాధబి పుర్ బచ్ను అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ లోక్‌పాల్ ఆదేశించింది. ఈ విచారణకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా ఫిర్యాదుదారులు కూడా హాజరుకావాలని తెలిపింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్(Hindenburg Research) మాధబిపై చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి 2025 జనవరిలో విచారణకు హాజరుకావాలని అధికారిక ఆదేశాలు జారీ చేసింది.మహువా మొయిత్రా, మరో ఇద్దరు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దాంతో నవంబరు 8న సెబీ చీఫ్‌ను లోక్‌పాల్ వివరణ అడిగింది. అందుకు ఆమె నాలుగు వారాల సమయం కోరారు. డిసెంబరు 7న ఫిర్యాదులో పేర్కొన్న విధంగా అఫిడవిట్ రూపంలో లోక్‌పాల్(Lokpal)కు వివరణ ఇచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ జరిపేందుకు వచ్చే నెల 28న ఫిజికల్‌గా హాజరుకావాల్సిందిగా బచ్తోపాలు ఫిర్యాదుదారులను లోక్‌పాల్ ఆదేశించింది.అసలేం జరిగిందంటే..బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది.ఐసీఐసీఐ బ్యాంకు నుంచి వేతనంఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానాసెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. -
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడా
సామాజిక మాధ్యమాల సాయంతో స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడే వారిపై సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది. సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ సాగిస్తున్న రవీంద్ర బాలు భారతి అనే వ్యక్తిపై చర్య తీసుకుంది. ఏప్రిల్ 4, 2025 వరకు సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా తాను సంపాదించిన మొత్తం రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.19 లక్షల మందికి సలహాలు..నిబంధనల ప్రకారం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. అందులోనూ చాలా నియామాలున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా కొన్ని రోజులుగా రవీంద్ర బాలు భారతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టుబడి సలహాలు, స్టాక్ సిఫార్సులు చేస్తున్నట్లు సెబీ గుర్తించింది. దాంతో స్టాక్ మార్కెట్‌పై అనుభవం లేనివారే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించినట్లు తెలిపింది. తనకు చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్‌ల్లో దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లతో పెద్దమొత్తంలో నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టుబడి సలహాలు ఇస్తూ భారీగా నగదు పోగు చేసినట్లు సెబీ పేర్కొంది.రూ.10 లక్షలు జరిమానారవీంద్ర సంపాదించిన డబ్బును రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై ఇన్వెస్ట్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఏప్రిల్ 2025 వరకు ఎలాంటి సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారతి, అతని సంస్థ, తన సహచరులపై సెబీ నిషేధం విధించింది. రవీంద్ర, తన సహచరులకు రూ.10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ మోసాలతో సంపాదించిన రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణస్వతహాగా నేర్చుకోవడం ఉండదు..సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా, బంధువులు, స్నేహితులు చెబుతున్నారని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా డబ్బులు వచ్చినట్లు కనిపించినా దీర్ఘకాలంలో చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో ఎదుటి వ్యక్తులు, వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడే స్వభావం అలవడుతుందని అంటున్నారు. దాంతో మార్కెట్ గురించి స్వతహాగా నేర్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వీడియోలు చూసి ట్రేడింగ్ చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
ఐపీవో బాటలో 3 కంపెనీలు
ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్‌కేర్ అక్టోబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..ఆనంద్ రాఠీ ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్ఎన్ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.జీకే ఎనర్జీసౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్‌కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్‌జీవన్ మిషన్కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్‌కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.లక్ష్మీ డెంటల్ రెడీసెప్టెంబర్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్డెంట్ డివైసెస్‌లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది. -
ఐపీవో వేవ్
న్యూఢిల్లీ: ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత వారం 4 ఇష్యూలు మార్కెట్లను పలకరించగా.. గురువారం(19న) మరో 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. 23న ముగియనున్న ఇవి 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యే వీలుంది. బుధవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనున్నాయి. వివరాలు చూద్దాం..ట్రాన్స్‌రైల్ లైటింగ్ ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధ ఈపీసీ సేవలందించే ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 410–432 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్ 1.01 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 839 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.డీఏఎమ్ క్యాపిటల్ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఏఎమ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 269–283 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 2.97 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. తద్వారా రూ. 840 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, విలీనాలు– కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్రోకింగ్, రీసెర్చ్లతోకూడిన సంస్థాగత ఈక్విటీల ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కంపెనీ నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.కంకార్డ్ ఎన్విరో పర్యావరణ సంబంధ ఇంజనీరింగ్ సొల్యూషన్ల సంస్థ కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 665–701 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 46.41 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 500 కోట్లుపైగా సమ కూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధులను వాటర్ ట్రీట్మెంట్ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త అసెంబ్లీ యూనిట్(సీఈఎఫ్)లో ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రోకెమ్ సెపరేషన్ సిస్టమ్స్‌పై మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.సనాతన్ టెక్స్టైల్స్ విభిన్న యార్న్‌ల తయారీ కంపెనీ సనాతన్ టెక్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 305–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, గ్రూప్ సంస్థలు రూ. 150 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 550 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ టెక్స్టైల్స్, ఇండ్రస్టియల్ పాలియస్టర్, కాటన్ తదితర యార్న్లను కంపెనీ రూపొందిస్తోంది. -
ఐపీవో బాటలో రెండు కంపెనీలు
వినియోగించిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌లను పునరుద్ధరించే జీఎన్జీ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 825 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 97 లక్షల ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 320 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 260 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. కంపెనీ ఎలక్ట్రానిక్స్ బజార్ బ్రాండుతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, సర్వర్లు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ తదితరాల పునర్వినియోగానికి వీలైన వేల్యూ చైన్‌ను నిర్వహిస్తోంది. విక్రయాలు, అమ్మకాల తదుపరి సర్వీసులు, వారంటీ సేవలు అందిస్తోంది. కొత్త ప్రొడక్టులతో పోలిస్తే 35–50 శాతం తక్కువ ధరలకే అందిస్తోంది. భారత్‌సహా యూఎస్, యూరప్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది.ఎలిగంజ్ ఇంటీరియర్స్ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ఎన్ఎస్ఈ ఎమర్జ్ వద్ద ఎలిగంజ్ ఇంటీరియర్స్ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 60.05 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఐపీఓ అనంతరం షేర్లను ఎన్ఎస్ఈ ఎమర్జ్ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో నమోదు చేస్తామని పేర్కొంది.సమీకరించిన నిధుల్లో రూ.25 కోట్లు రుణాలను చెల్లించేందుకు, రూ.30 కోట్లు మూలధన వ్యయానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని వివరించింది. ఈ ఇష్యూకు వివ్రో ఫైనాన్సియల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ మేనేజర్‌గా, బిగ్‌షేర్ సర్వీసెస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి. ఎలిగంజ్ ఇంటీరియర్స్ దేశవ్యాప్తంగా కార్పొరేట్, వాణిజ్య సంస్థలకు ఇంటీరియర్ ఫిట్ అవుట్ సేవలు అందిస్తోంది. -
500 షేర్లకు T+0 సెటిల్మెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా టీప్లస్‌జీరో (T+0) సెటిల్మెంట్ను మరింత విస్తరించింది. లావాదేవీ చేపట్టిన రోజే సెటిల్మెంట్కు వీలు కల్పించే విధానంలోకి 500 కంపెనీల షేర్లను చేర్చింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా 500 కంపెనీల స్టాక్స్‌కు ఆప్షనల్‌గా టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను వర్తింపచేయనుంది.నిబంధనలకు లోబడి టీప్లస్‌జీరో, టీప్లస్వన్ సెటిల్మెంట్ సైకిళ్లకు విభిన్న బ్రోకరేజీ చార్జీలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సెబీ తొలుత 2024 మార్చిలో 25 కంపెనీల స్టాక్స్ ద్వారా టీప్లస్‌జీరో సెటిల్మెంట్కు తెరతీసింది. నాన్కస్టోడియన్ క్లయింట్లకు మాత్రమే ఇది వర్తింపచేసింది. తదుపరి అభిప్రాయ సేకరణ చేపట్టి సెటిల్మెంట్ను విస్తరించింది. 2024 డిసెంబర్31కల్లా టాప్–500 కంపెనీల షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేర్చుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.2025 జనవరి నుంచి అట్టడుగున ఉన్న 100 కంపెనీలు సెటిల్‌మెంట్‌లోకి రానున్నాయి. ఆపై ప్రతీ నెలా ఇదే రీతిలో 100 కంపెనీలు చొప్పున జత కానున్నాయి. వెరసి ప్రస్తుత 25 కంపెనీలతో కలిపి 525 షేర్లు టీప్లస్‌జీరో సెటిల్మెంట్ పరిధిలోకి చేరనున్నాయి. వీటికి ఉదయం 8.45–9 సమయంలో ప్రత్యేక బ్లాక్ డీల్ విండోను ఏర్పాటు చేయనుంది. ఐసీఈఎక్స్కు చెల్లు సెబీ తాజాగా ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఐసీఈఎక్స్) మూసివేతకు అనుమతించింది. రెండేళ్ల క్రితమే స్టాక్ ఎక్స్ఛేంజీ గుర్తింపును రద్దు చేయగా.. ప్రస్తుతం నిబంధనలకు అనుగుణంగా ఐసీఈఎక్స్ కార్యకలాపాల నిలిపివేతకు ఓకే చెప్పింది. వెరసి ఎక్స్ఛేంజీ విభాగం నుంచి ఐసీఈఎక్స్ వైదొలగనుంది. అయితే ఆదాయపన్ను నిబంధనలను అమలు చేయవలసి ఉంటుందని సెబీ స్పష్టం చేసింది. పేరు మార్పుసహా గతకాలపు లావాదేవీలను డేటాబేస్ నుంచి తొలగించవలసిందిగా ఐసీఈఎక్స్ను సెబీ ఆదేశించింది. -
‘ఈ ప్లాట్‌ఫామ్‌లపై ట్రేడింగ్ వద్దు’.. సెబీ హెచ్చరిక!
అనధికారిక ప్లాట్‌ఫామ్‌లపై అన్‌లిస్టెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల సెక్యూరిటీలలో ట్రేడింగ్ నిర్వహించే విషయమై సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ తరహా లావాదేవీలు సెక్యూరిటీస్ కాంట్రాక్టుల చట్టం 1956, సెబీ యాక్ట్ 1992కు వ్యతిరేకమని స్పష్టం చేసింది.అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేసేందుకు వీలుగా కొన్ని గుర్తింపు లేని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అవకాశం కల్పిస్తున్నట్లు సెబీ తెలిపింది. అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించొద్దని హెచ్చరించింది. ఆయా ప్లాట్ఫామ్ల్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంది. ఈ తరహా ప్లాట్‌ఫామ్‌లకు సెబీ గుర్తింపు లేదని స్పష్టం చేసింది. అనధికార ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సెక్యూరిటీలను ట్రేడింగ్ చేయడం వల్ల పారదర్శకత లేకపోవడం, పరిమిత లిక్విడిటీ, చట్టపరమైన సమస్యలు వంటివి తలెత్తుతాయని తెలిపింది.ఇప్పటికే హెచ్చరికలుఅనధికారిక వర్చువల్ ట్రేడింగ్, పేపర్ ట్రేడింగ్, ఫ్యాంటసీ గేమ్స్ తదతర వాటిపై లావాదేవీలకు దూరంగా ఉండాలంటూ సెబీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. లిస్టెడ్ సెక్యూరిటీలలో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సెబీ సూచించింది. అధీకృత ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్స్, గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌లను కలిగి ఉంటాయని పేర్కొంది. ఈ విధానాలు అనధికార ప్లాట్ఫామ్ల్లో ఉండవని వివరించింది. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల సమాచారాన్ని సెబీ పోర్టల్ నుంచి తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: ద్రవ్యలోటు కట్టడికి కృషి చేయండి: సీఐఐకొన్ని లిస్టెడ్ ఆన్లైన్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్లుగ్రోజెరోధాఏంజిల్ వన్అప్స్టాక్స్ఐసీఐసీఐ డైరెక్ట్కోటక్ సెక్యూరిటీస్హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ఎస్బీఐ సెక్యూరిటీస్మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ -
వారమంతా.. ఐపీవోల సందడి..
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇష్యూల వివరాలు..→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి. → విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్‌కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు. → సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతర షేర్హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది. → ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు. → ఇక ఎస్ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి. -
వాటి జోలికి వెళ్లొద్దు.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
గత 30 రోజుల్లో క్లయింట్ ఎలాంటి లావాదేవీలను చేపట్టని సందర్భంలో తదుపరి సెటిల్మెంట్లో మూడు రోజుల్లోగా ఖాతాలోని నిధులను వెనక్కి ఇవ్వవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. ఖాతాల నెలవారీ రన్నింగ్ సెటిల్మెంట్ సైకిల్‌కు సంబంధించి స్టాక్ బ్రోకర్లకు సెబీ తాజా మార్గదర్శకాలను ప్రతిపాదించింది.రానున్న సెటిల్మెంట్ రోజులకు ఇది వర్తించనున్నట్లు కన్సల్టేషన్ పేపర్లో పేర్కొంది. దీనికి క్వార్టర్లీ సెటిల్మెంట్గా సైతం పిలిచే సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు.. సరళతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ తాజా మార్గదర్శకాలకు ప్రతిపాదించింది. వెరసి క్లయింట్ల నిధుల సెటిల్మెంట్ను తప్పనిసరి చేయనుంది. ఈ అంశాలపై ఈ నెల 26వరకూ సెబీ ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది.ఇదిలా ఉండగా అనామక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లభించే అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లొద్దని ఇన్వెస్టర్లను సెబీ హెచ్చరించింది. ఈ అన్‌రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ సెక్యూరిటీస్‌ను అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని సెబీ గుర్తించింది. ఈ క్రమంలోనే మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆథరైజ్డ్ స్టాక్‌బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ల్లోకి మాత్రమే వెళ్లాలని సెబీ సూచించింది. -
పబ్లిక్ ఆఫర్ల వెల్లువ!
న్యూఢిల్లీ: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఏడు కంపెనీల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవో) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఇష్యూల ద్వారా కంపెనీలు దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించనున్నాయి. సెబీ ఆమోదం పొందిన వాటిల్లో ఈకామ్ ఎక్స్‌ప్రెస్, స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్ బయోఎనర్జీ, ఇంట్రర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ), కెరారో ఇండియా, కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఆగస్టు–సెపె్టంబర్ మధ్య తమ ముసాయిదా పత్రాలను సమరి్పంచగా, నవంబర్ 26–29 మధ్య సెబీ.. అబ్జర్వేషన్లను జారీ చేసింది. సెబీ పరిభాషలో అబ్జర్వేషన్ల ను ఐపీవో ప్రతిపాదనకు ఆమోదంగా పరిగణిస్తారు. ఐజీఐ.. 4,000 కోట్లుఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌లో భాగమైన ప్రమోటరు, బీసీపీ ఆసియా టూ టాప్కో రూ. 2,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. సహజసిద్ధమైన వజ్రాలు, ల్యాబ్‌లో రూపొందించిన వజ్రాలు మొదలైన వాటికి సరి్టఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. ఇతర కంపెనీల వివరాలు.. ⇒ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈకామ్ ఎక్స్‌ప్రెస్ రూ. 1,284.50 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు..ఇతర షేర్హోల్డర్లు రూ. 1,315.50 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ బ్లాక్‌స్టోన్ గ్రూప్, పంచశీల్ రియల్టీ సంస్థల జాయింట్ వెంచర్ అయిన వెంటివ్ హాస్పిటాలిటీ ప్రతిపాదిత ఐపీవో పూర్తిగా కొత్త షేర్ల జారీ రూపంలో ఉండనుంది. సంస్థకు భారత్, మాల్దీవుల్లో బిజినెస్, లీజర్ విభాగాల్లో ఆతిథ్య రంగ లగ్జరీ అసెట్స్ ఉన్నాయి. వెంటివ్లో పంచశీల్కు 60 శాతం, బ్లాక్‌స్టోన్‌కు మిగతా 40 శాతం వాటాలు ఉన్నాయి. ⇒ స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు 67.59 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ కింద విక్రయించనున్నారు. ⇒ కెరారో ఇండియా రూ. 1,812 కోట్లు సమీకరించేందుకు ఐపీవో తలపెట్టింది. ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం సెల్లింగ్ షేర్‌హోల్డరయిన కెరారో ఇంటర్నేషనల్ సంస్థ.. తమ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనుంది. కెరారో ఇండియా 1997లో ఏర్పాటైంది. ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, యాక్సిల్స్ తయారీతో కార్యకలాపాలు ప్రారంభించింది. ⇒ బయోఫ్యుయెల్ తయారీ దిగ్గజం ట్రూఆల్ట్ బయోఎనర్జీ ప్రతిపాదిత ఐపీవో ఇటు కొత్త షేర్ల జారీ, అటు ఓఎఫ్ఎస్ రూపంలో ఉండనుంది. రూ. 750 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు 36 లక్షల షేర్లను విక్రయించనున్నారు. బెంగళూరుకు చెందిన ట్రూఆల్ట్ బయోఎనర్జీ ఇథనాల్ ఉత్పత్తి చేస్తోంది.రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 1,400 కిలోలీటర్లుగా ఉంది⇒ ఎని్వరాన్మెంటల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ సంస్థ కాంకర్డ్ ఎన్విరో సిస్టమ్స్ తలపెట్టిన ఇష్యూలో భాగంగా రూ. 192.3 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనున్నారు. ప్రమోటర్లు, ఇన్వెస్టరు.. ఓఎఫ్ఎస్ కింద 51.94 లక్షల షేర్లను విక్రయించనున్నారు. 2025లో జెప్టో ఐపీవో...క్విక్‌కామర్స్ దిగ్గజం జెప్టో వచ్చే ఏడాది (2025) పబ్లిక్ ఇష్యూకి వచ్చే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో ఆదిత్ పాలిచా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల 35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,950 కోట్లు) సమీకరణతో జెప్టో పూర్తిస్థాయిలో దేశీ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు సమకూర్చడం దీనికి కారణమని తెలియజేశారు. కంపెనీ నికర లాభాలు ఆర్జించే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు. క్విక్‌కామర్స్ విధానాలు సంప్రదాయ కిరాణా స్టోర్ల వృద్ధిని దెబ్బతీస్తున్నట్లు వెలువడుతున్న ఆరోపణలను కొట్టిపారేశారు. -
రిలయన్స్ సెక్యూరిటీస్‌కు సెబీ గట్టి దెబ్బ
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిలయన్స్ సెక్యూరిటీస్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చెక్ పెట్టింది. స్టాక్ బ్రోకర్ సంస్థకు రూ. 9 లక్షలు జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది. ఖాతాలు, రికార్డులు, అధికారిక వ్యక్తుల ఇతర డాక్యుమెంట్లను సెబీసహా స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ థిమాటిక్ ఆన్సైట్ పరిశీలన చేపట్టాయి.2022 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్‌వరకూ పరిశీలనకు పరిగణించాయి. తదుపరి 2024 ఆగస్ట్ 23న సంస్థకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సెబీ వద్ద రిజిస్టరైన రిలయన్స్ సెక్యూరిటీస్ స్టాక్ బ్రోకర్ నిబంధనలకు అనుగుణంగా ఖాతాలను నిర్వహించవలసి ఉంటుంది.అంతేకాకుండా ఎన్ఎస్ఈఐఎల్ క్యాపిటల్ మార్కెట్ మార్గదర్శకాలు, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ లావాదేవీ నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే క్లయింట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్స్, తగినవిధంగా వ్యవస్థలను నిర్వహించకపోవడం తదితర నిబంధనల ఉల్లంఘనను గు ర్తించినట్లు 47 పేజీల ఆదేశాలలో సెబీ పేర్కొంది. -
రెండు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
రియల్టీ సంస్థ కల్పతరు లిమిటెడ్‌తోపాటు, హైప్రెసిషన్ ఇంజినీరింగ్ కంపెనీ యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో కల్పతరు పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. యూనిమెక్ ఏరోస్పేస్ తాజాగా ఈక్విటీ జారీసహా ప్రమోటర్లు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రెండు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి.రూ.1,590 కోట్లపై దృష్టికల్పతరు కంపెనీ ప్రాస్పెక్టస్ ప్రకారం సంస్థ ఐపీవోలో భాగంగా రూ.1,590 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఐపీవో నిధుల్లో దాదాపు రూ.1,193 కోట్లు కల్పతరు గ్రూప్ కంపెనీ రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. కల్పతరు గ్రూప్‌లో కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, ప్రాపర్టీ సొల్యూషన్స్(ఇండియా), శ్రీ శుభం లాజిస్టిక్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..రూ.500 కోట్ల సమీకరణఐపీవోలో భాగంగా యూనిమెక్ ఏరోస్పేస్ రూ.250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ.250 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర మెషీనరీ, పరికరాల కొనుగోలు ద్వారా విస్తరణకు వినియోగించనుంది. ఈ బాటలో వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు తదితరాలకు సైతం నిధులను వెచ్చించనుంది. -
ఐపీవోలో సెక్యూరిటీ డిపాజిట్ రద్దు
న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేముందు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్‌లిస్డెడ్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్‌పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.ఐపీవో లేదా రైట్స్‌కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల అలాట్మెంట్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది. -
రూ.5 లక్షల కోట్ల ఐటీ కంపెనీ.. వారసురాలికి గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఓపెన్ ఆఫర్ అంశంపై వెసులుబాటును కల్పించింది. గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు ప్రతిపాదనల నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే.. గ్రూప్ కంపెనీలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో రోష్నీ నాడార్ వాటాను పెంచుకునేందుకు ప్రతిపాదించారు. దీంతో టేకోవర్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించవలసి ఉంటుంది. అయితే ఇందుకు మినహాయింపును కోరుతూ సెప్టెంబర్ 30న విడిగా సెబీకి దరఖాస్తు చేశారు. కుటుంబ వాటాల మార్పిడిలో భాగంగా వాటాల కొనుగోలు ప్రతిపాదనలు చేయడంతో సెబీ మినహాయింపునకు సానుకూలంగా స్పందించింది.రెండు కంపెనీలలోనూ నిలకడైన యాజమాన్యాన్ని కొనసాగించే యోచనతో అదనపు వాటా కొనుగోలుకి తెరతీయనున్నట్లు దరఖాస్తులలో నాడార్ పేర్కొన్నారు. తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు. దీంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫొసిస్టమ్స్ ప్రమోటర్లు హెచ్‌సీఎల్ కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్(ఢిల్లీ) పీవీటీ లిమిటెడ్ నుంచి వాటాలు లభించనున్నాయి.ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్ 10.33 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నారు. వెరసి హెచ్సీఎల్కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రోష్నీ నాడార్ వాటా 57.33 శాతానికి చేరనుంది. అయితే ఈ లావాదేవీల తదుపరి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లలో ప్రమోటర్ల వాటాలు యథాతథంగా అంటే 60.82 శాతం, 62.89 శాతం చొప్పున కొనసాగనున్నాయి. -
రెండు కంపెనీలు ఐపీవో బాటలో
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. జాబితాలో ఎల్పీజీ, కెమికల్స్ స్టోరేజీ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్తోపాటు.. సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ చేరాయి. వివరాలు చూద్దాం.. రూ. 3,500 కోట్లపై దృష్టి ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకంటే ముందుగా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఐపీవో పరిమాణం ఆమేర తగ్గవచ్చు. ఇష్యూ నిధుల్లో రూ. 2,027 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. వీటితో మంగళూరువద్ద క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనుంది. మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం వొపాక్ ఇండియా బీవీకి 50.1 శాతం, ఏజిస్ లాజిస్టిక్స్‌కు 47.31 శాతం చొప్పున వాటా ఉంది. 2024 జూన్‌కల్లా దేశవ్యాప్తంగా 18 స్టోరేజీ ట్యాంకులను నిర్వహిస్తోంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్, లూబ్రికెంట్స్, ఎల్పీజీ, ప్రొపేన్, బ్యుటేన్ తదితరాల నిల్వకు వీటిని వినియోగించవచ్చు. రూ. 1,150 కోట్లకు రెడీ సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 850 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ. 300 కోట్లు ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 90 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 553 కోట్లు ఒడిషాలో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుపై వెచి్చంచనుంది. మరో రూ. 96 కోట్లు అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. 2024 జూన్‌కల్లా 1.8 గిగావాట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టు ఎండ్ ఈపీసీ సరీ్వసులను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 246 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఏంజెల్ ఫండ్ పెట్టుబడి పరిమితి పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకి మరింతగా పెట్టుబడులు లభించేలా, ఇన్వెస్టర్లకు కూడా వెసులుబాట్లు కల్పించేలా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా స్టార్టప్‌లలో ఏంజెల్ ఫండ్స్ చేసే పెట్టుబడులపై గరిష్ట పరిమితిని ప్రస్తుతమున్న రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచాలని యోచిస్తోంది.అలాగే కనిష్ట పరిమితిని రూ. 25 లక్షల నుంచి రూ. 10 లక్షలకు తగ్గించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించిన చర్చా పత్రంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. నిర్దిష్ట అర్హతలు, రిస్కు సామరŠాధ్యలు ఉండే ’అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ల’ను మాత్రమే ఏంజెల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది.ఏంజెల్ ఫండ్స్ తమ దగ్గరున్న మొత్తం నిధుల నుంచి, ఏదైనా ఒక స్టార్టప్‌లో 25 శాతానికి మించి ఇన్వెస్ట్ చేయరాదనే నిబంధనను తొలగించనుంది. తద్వారా పెట్టుబడులపరంగా మరింత వెసులుబాటు కల్పించనుంది. -
ఇన్వెస్టర్లకు యూపీఐ.. సెబీ ఆదేశం
న్యూఢిల్లీ: సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ కోసం క్లయింట్లకు యూపీఐ ఆధారిత బ్లాక్ విధానాన్ని లేదా త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటు సదుపాయాన్ని అందించాలని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్క్కు (క్యూఎస్బీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది.ప్రస్తుత ట్రేడింగ్ విధానంతో పాటు ఫిబ్రవరి 1 నుంచి ఈ రెండింటిలో ఒక సదుపాయాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. త్రీ–ఇన్–వన్ ట్రేడింగ్ అకౌంటులో సేవింగ్స్ అకౌంటు, డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ మూడూ కలిసి ఉంటాయి.ఇదీ చదవండి: సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరటయూపీఐ బ్లాక్ మెకానిజంలో క్లయింట్లు ట్రేడింగ్ సభ్యునికి ముందస్తుగా నిధులను బదిలీ చేయడానికి బదులుగా తమ బ్యాంకు ఖాతాలలో బ్లాక్ చేసిన నిధుల ఆధారంగా సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఐచ్ఛికంగానే ఉంది. -
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
4 ఐపీవోలకు సెబీ ఓకే.. లిస్ట్‌లో హైదరాబాదీ కంపెనీ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3,000 కోట్ల సమీకరణకు సంబంధించి నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి లైఫ్ సైన్సెస్, రూబికాన్ రీసెర్చ్, సనాతన్ టెక్స్టైల్స్, మెటల్‌మ్యాన్ ఆటో వీటిలో ఉన్నాయి. ఇవి జూలై–ఆగస్టు మధ్యకాలంలో తమ ముసాయిదా ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాయి. అక్టోబర్ 31న సెబీ ఆమోదం లభించింది.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రమోటరు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతరత్రా షేర్హోల్డర్లు 6.15 కోట్ల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 600 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపునకు, మిగతా నిధులను కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు .. ఔషధాల ఫార్ములేషన్ కంపెనీ రూబీకాన్ రీసెర్చ్ రూ. 1,085 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, రూ. 585 కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్‌కు రూబీకాన్ రీసెర్చ్‌లో 57 శాతం పైగా వాటాలు ఉన్నాయి. ఐపీవో నిధుల్లో రూ. 310 కోట్ల మొత్తాన్ని, రుణాల చెల్లింపు కోసం, మిగతాది ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం రూబీకాన్ వినియోగించుకోనుంది.మరోవైపు, సనాతన్ టెక్స్టైల్స్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు రూ. 300 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నాయి. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 210 కోట్ల మొత్తాన్ని .. అనుబంధ సంస్థ సనాతన్ పాలీకాట్కి సంబంధించి దీర్ఘకాలిక మూలధన అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే రూ. 175 కోట్లను రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.అటు మెటల్‌మ్యాన్ ఆటో సంస్థ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ విధానంలో ప్రమోటర్లు 1.26 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 25 కోట్ల మొత్తాన్ని మధ్యప్రదేశ్‌లోని పిథంపూర్‌లో 2వ యూనిట్లో యంత్రపరికరాల కొనుగోలు తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. -
వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: అనధికార వర్చువల్ ట్రేడింగ్ లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉండాలని సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. కేవలం రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీల (మధ్యవర్తిత్వ సంస్థలు) ద్వారానే లావాదేవీలు నిర్వహించాలని సూచించింది. యాప్‌లు/వెబ్ అప్లికేషన్లు/ప్లాట్‌ఫామ్‌లపై లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరల ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ లేదా ఫాంటసీ గేమ్‌లు ఆఫర్ చేస్తున్నట్టు సెబీ దృష్టికి వచ్చింది.ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీస్ చాంట్రాక్ట్ (రెగ్యులేషన్స్) చట్టం, 1956, సెబీ చట్టం 1992కు విరుద్ధమని, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాలను తీసుకొచ్చినట్టు సెబీ తెలిపింది. రిజిస్టర్డ్ సంస్థల ద్వారానే పెట్టుబడులు, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించింది. ‘‘అనధికారిక పథకాల్లో పాల్గొనడం, వ్యక్తిగత కీలక సమాచారాన్ని పంచుకోవడం ఇన్వెస్టర్ల సొంత రిస్క్, పైనే ఆధారపడి ఉంటుంది. దీని వల్ల ఎదురయ్యే పరిణామాలకు ఇన్వెస్టర్లే బాధ్యులు. ఎందుకంటే ఆయా సంస్థలు సెబీ వద్ద నమోదైనవి కావు. కనుక ఆయా సంస్థలతో నిర్వహించే లావాదేవీలకు సంబంధించి ఇన్వెస్టర్లకు పెట్టుబడిదారుల పరిరక్షణ, ఫిర్యాదుల పరిష్కార విభాగం తదితర సెబీ యంత్రాంగాలు అందుబాటులో ఉండవు’’ అని స్పష్టం చేసింది.విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విషయంలో సెబీ కొంత ఉపశమనాన్ని కల్పించనుంది. భారత సెక్యూరిటీల్లో విదేశీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన మేరకు.. ఆయా విదేశీ పథకాల్లో భారత మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సెబీ తాజాగా ప్రకటించింది. అయితే ఆయా విదేశీ ఫండ్స్ భారత పెట్టుబడులు వాటి నిర్వహణ ఆస్తుల్లో 25 శాతానికి మించకూడదని పేర్కొంది.మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పెట్టుబడులను మరింత వైవిధ్యం చేసుకునేందుకు సెబీ తాజా నిర్ణయం వీలు కల్పించనుంది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని సెబీ తెలిపింది. ఫండ్స్ పెట్టుబడుల విలువ సెబీ పరిమితులను మించితే నిబంధనలకు అనుగుణంగా తగ్గించుకునేందుకు ఆరు నెలల వ్యవధి ఉంటుంది. -
రీట్స్, ఇన్విట్స్తో రిస్క్ హెడ్జింగ్
రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(రీట్స్), చిన్న, మధ్యతరహా(ఎస్ఎం) రీట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు(ఇన్విట్స్)లను ఇంటరెస్ట్ రేట్ డెరివేటివ్స్‌గా వినియోగించుకునేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ప్రతిపాదించింది. రిస్క్ హెడ్జింగ్‌కు వీలుగా వీటి వినియోగానికి అనుమతించాలని భావిస్తోంది. వీటికితోడు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లకు వర్తించే నిబంధనల బాటలో స్పాన్సర్లతోపాటు.. తమ గ్రూప్‌లకు లాక్డ్ఇన్ రీట్స్, ఇన్విట్స్ యూనిట్ల బదిలీకి సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా ఆయా సంస్థలు తమ ఆర్థిక లక్ష్యాలను వీడకుండా సొంత హోల్డింగ్స్ నిర్వహణకు వీలు చిక్కనుంది.ఇదీ చదవండి: త్వరలో 7,000 మందికి జాబ్ కట్! ఎక్కడంటే..రీట్స్, ఇన్విట్స్ లెవరేజ్ మదింపులో ఫిక్స్డ్ డిపాజిట్లను నగదుకు సమానంగా పరిగణించేందుకు వీలు కల్పించనుంది. ఈ బాటలో రీట్, ఇన్విట్ సమీకరణకు క్రెడిట్ రేటింగ్ అవసరాలు, ఆయా సంస్థల బోర్డులలో ఖాళీలకు సభ్యుల ఎంపిక గడువు, ఆస్తుల మూలాల విస్తరణ తదితర అంశాలపై మార్గదర్శకాలకు తెరతీయాలని ప్రతిపాదించింది. ఇక మరోవైపు రీట్స్‌ను లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతించేలా ప్రతిపాదించింది. ఇన్వెస్టర్ల పరిరక్షణతోపాటు రీట్స్, ఇని్వట్స్ సులభతర వ్యాపార నిర్వహణకు వీలైన చర్యలకు తెరతీయాలని సెబీ తాజా ప్రతిపాదనలలో అభిప్రాయపడింది. -
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
సెబీ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచే..
న్యూఢిల్లీ: వచ్చే నెల (నవంబర్) 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) ఒక పాన్ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది.సంబంధిత అధికారులు, ట్రస్టీలు లేదా సంబంధిత వ్యక్తులు ఆయా లావాదేవీల వివరాలను రెండు పనిదినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్ లేదా అనేక లావాదేవీల ద్వారా రూ. 15 లక్షల విలువ ట్రాన్సాక్షన్ జరిగితే.. మినహాయింపులో ఉన్నవికాకుండా అన్ని పథకాలకూ తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.వచ్చే నెల నుంచి ఏఎంసీలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. అక్టోబర్ 31కల్లా కలిగి ఉన్న హోల్డింగ్స్‌ను నవంబర్ 15కల్లా వెల్లడించవలసి ఉంటుంది. ఆపై ప్రతీ త్రైమాసికం తదుపరి 10 రోజుల్లోగా వీటి వివరాలు దాఖలు పరచాలని సెబీ తెలియజేసింది. -
ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో ఆరోగ్య బీమా సేవలందించే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆరోగ్య పరిరక్షణ సర్వీసుల సంస్థ పారస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఉన్నాయి. నివా బూపా జులైలోనూ, పారస్ హెల్త్ ఆగస్ట్‌లోనూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.ఆసుపత్రుల సంస్థ పారస్ హెల్త్ బ్రాండుతో ఆసుపత్రుల చైన్‌ను నిర్వహిస్తున్న పారస్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.5 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత వాటాదారు సంస్థ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలు పారస్ హెల్త్‌కేర్(రాంచీ) ప్రయివేట్, ప్లస్ మెడికేర్ హాస్పిటల్స్ ప్రయివేట్‌లో పెట్టుబడులకు( రుణ చెల్లింపులు) వెచి్చంచనుంది. హర్యానా, బీహార్, యూపీ, రాజస్తాన్, జేఅండ్కేలలో సంస్థ పారస్ హెల్త్ పేరుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. మొత్తం 2,135 పడకలతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రూ. 3,000 కోట్లపై కన్నుగతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా సేవలందించిన నివా బూపా ఐపీవోలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో యూకే దిగ్గజం బూపా(సింగపూర్ హోల్డింగ్స్) 62.27 శాతం వాటాను కలిగి ఉంది. ఫెటిల్ టోన్ ఎల్ఎల్పీకు 27.86 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 625 కోట్లు మూలధన పటిష్టతకు వినియోగించనుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ తదుపరి రెండో స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరర్‌గా బూపా నివా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుంది. ఐపీవో బాటలో జారోవిద్యా రంగ సంస్థ జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్(జారో ఎడ్యుకేషన్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 85 శాతానికిపైగా వాటా ఉంది. ఐపీవో నిధుల్లో రూ. 81 కోట్లు బ్రాండ్ విస్తరణకు, రూ. 48 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
కట్టండి జరిమానా.. రాధికా గుప్తాకు షాకిచ్చిన సెబీ
ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సీఈఓ రాధికా గుప్తాకు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ షాకిచ్చింది. మ్యూచువల్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీతోపాటు దాని సీఈఓ రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ త్రిదీప్ భట్టాచార్యపై మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించింది.సెబీ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. మొత్తం రూ.16 లక్షల జరిమానాలో విడిగా ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్పై రూ. 8 లక్షలు, సీఈవో రాధికా గుప్తా, ఫండ్ మేనేజర్ భట్టాచార్యలకు చెరో రూ. 4 లక్షలు చొప్పున జరిమానా విధించింది. ఈ పెనాల్టీలను 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్బీఐ హెచ్చరికఫోకస్డ్ ఫండ్స్ స్పష్టంగా (ట్రూ-టు-లేబుల్) ఉంటున్నాయా.. లేదా అనేదానిపై సెబీ పరిశ్రమవ్యాప్త సమీక్ష చేపట్టింది. ఇందులో ఎడెల్వీస్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ (EFEF) 88 రోజులలో 'గరిష్టంగా 30 స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం' నిబంధనను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. -
ఎఫ్&వో ట్రేడింగ్ అంటే టైమ్‌పాస్ కాదు..
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్ అనేదేమీ టైమ్‌పాస్‌గా చేసే ఆషామాషీ వ్యవహారం కాదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అశ్వని భాటియా వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాలని మార్నింగ్‌స్టార్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు.సెబీ అధ్యయనం ప్రకారం సంస్థాగత ఇన్వెస్టర్లే ఎఫ్‌అండ్‌వోలో లాభపడుతుండగా, 93 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని వెల్లడైన విషయాన్ని భాటియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే చిన్న మదుపరుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలను ఇన్వెస్టర్లు వ్యతిరేకిస్తుండటం సరికాదని ఆయన తెలిపారు.2020లో కరోనా వైరస్ మహమ్మారి తర్వాత నుంచి ఎఫ్ అండ్ ఓలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. అయితే, ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం మంచిదేమీ కాదని, ఆందోళనకరమని భాటియా అభిప్రాయపడ్డారు. ‘‘అంతర్జాతీయంగా నమోదయ్యే డెరివేటివ్స్ వాల్యూమ్స్‌లో సగభాగం పైగా వాటా భారత్‌దే ఉండటం గొప్పగా అనిపించినా, ఇది మనం ధరించడానికి ఇష్టపడని కిరీటంలాంటిది’’ అని వ్యాఖ్యానించారాయన.మరోవైపు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో అసంబద్ధమైన హంగామాను నివారించేందుకు, ధరల్లో అవకతవకలు జరగకుండా చూసేందుకు నియంత్రణ సంస్థ, స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని భాటియా తెలిపారు. త్వరలోనే సెబీ దీనిపై ఒక చర్చాపత్రాన్ని కూడా ప్రవేశపెట్టనుందని వెల్లడించారు. -
ప్రజాపద్దుల కమిటీ భేటీకి మాధవీ పురి డుమ్మా
న్యూఢిల్లీ: సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ హోదాలో ఉంటూ గౌతమ్ అదానీ గ్రూప్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవీ పురీ బచ్ గురువారం పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సమావేశానికి గైర్హాజరయ్యారు. సెబీ పనితీరును మాధవీ పురి మసకబార్చారంటూ అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గతంలో ఆరోపణలు చేయడంతో సెబీ పనితీరును ఆమె సమక్షంలోనే సమీక్షించేందుకు పీఏసీ సిద్ధమైన విషయంతెల్సిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన సమావేశం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైంది. అయితే చివరి నిమిషంలో అత్యవసర పనుల కారణంగా తాను ఢిల్లీలో సమావే శానికి రాలేకపోతున్నానని రెండు గంటలముందు మాధవీ సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె లేకుండా సమీక్ష అనవసరమని భావించి వేణుగోపాల్ సమావేశాన్ని మధ్యాహా్ననికి వాయిదావేశారు. -
ఐపీఓతో రూ.4,000 కోట్లు సమీకరణ
కమ్యునిషన్ పరికరాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటి వ్యక్తిగత రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న ఎస్పీపీ లిమిటెడ్ సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వనుంది. సంస్థ వ్యాపారంపై ఆసక్తి ఉన్న పెట్టుబడిదారుల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈమేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కు డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో 15 జీబీ స్టోరేజ్ నిండిందా? ఇలా చేయండి..ఈ ఆఫర్లో భాగంగా రూ.580 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, సెల్లింగ్ షేర్హోల్డర్లు రూ.3,420 కోట్ల వరకు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. డీఆర్‌హెచ్‌పీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎస్ఎంపీపీ లిమిటెడ్ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఈ)లో లిస్ట్ అవుతాయి. అయితే ఐపీఓ కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి.. చివరి తేదీ ఎప్పుడు.. లిస్టింగ్ ప్రైస్, లాట్ సైజ్.. వంటి పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. -
డేటా షేరింగ్‌పై సెబీ చర్చాపత్రం
డేటా గోప్యత, జవాబుదారీతనం మొదలైన పరిశోధనల కోసం డేటాను షేర్ చేసుకోవడానికి ప్రత్యేక విధానాలు రూపొందించుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఈమేరకు స్టాక్ ఎక్ఛ్సేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐ) సొంత విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సెబీ తెలిపింది.వాణిజ్య అవసరాల కోసం షేర్ చేసుకునే డేటా గోప్యత, జవాబుదారీతనం..వంటి అంశాలపై సెబీ చర్చాపత్రాన్ని రూపొందించింది. సెబీలో భాగమైన మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ(ఎండీఏసీ) సూచనల ప్రకారం మార్కెట్ డేటాకు బాధ్యత వహించాల్సిన సంస్థలు డేటా సేకరణ, ప్రాసెసింగ్, స్టోరేజ్, షేరింగ్, గోప్యత పాటించడం, యాక్సెస్ ఇవ్వడం మధ్య సమతూకంతో వ్యవహరించేలా తగు విధానాలను రూపొందించుకోవాలి. ఎంఐఐలు డేటాను రెండు కేటగిరీల కింద వర్గీకరించాలి. ఒకటి బహిరంగంగా షేర్ చేసుకునే డేటా. రెండు..గోప్యంగా ఉంచాల్సిన డేటా. కేవైసీ వివరాలు, వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు పరోక్షంగా ఉపయోగపడే డేటా రెండో కేటగిరీ పరిధిలోకి వస్తుంది. మార్కెట్లో స్థిరమైన విధానాలను పాటించేలా చూడటం ఈ పాలసీ లక్ష్యంగా సెబీ తెలిపింది. ఈ ప్రతిపాదనలపై అక్టోబర్ 29లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర! -
ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలం
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణమంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం. -
ఎన్ఎస్డీఎల్, స్టాండర్డ్ గ్లాస్, జింకా లాజిస్టిక్స్.. ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవల దిగ్గజం నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) పబ్లిక్ ఇష్యూకి లైన్ క్లియర్ అయ్యింది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ, జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ సైతం సెబీ నుంచి లిస్టింగ్‌కు అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం..ఎన్ఎస్డీఎల్ ఐపీవో చేపట్టేందుకు వీలుగా ఎన్ఎస్డీఎల్ 2023 జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే 14 నెలల తదుపరి అనుమతులు సాధించడం గమనార్హం! ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో 5.72 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌సహా కంపెనీలో వాటాదారు సంస్థలు షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ప్రధానంగా ఐడీబీఐ బ్యాంక్ 2.22 కోట్ల షేర్లు, ఎన్ఎస్ఈ 1.8 కోట్ల షేర్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 56.25 లక్షల షేర్లు, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 40 లక్షల షేర్లు చొప్పున విక్రయానికి ఉంచనున్నాయి. వెరసి ఐపీవో ద్వారా ఎన్ఎస్డీఎల్కు ఎలాంటి నిధులు అందబోవు! ఇదీ బ్యాక్‌గ్రౌండ్ సెబీ వద్ద రిజిస్టరైన్ ఎన్ఎస్డీఎల్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులందించే కంపెనీ. దేశీయంగా ఫైనాన్షియల్, సెక్యూరిటీస్ మార్కెట్లో వివిధ సర్వీసులు, ప్రొడక్టులను ఆఫర్ చేస్తోంది. 1996లో ప్రవేశపెట్టిన డిపాజిటరీల చట్టం ప్రకారం అదే ఏడాది నవంబర్‌లో సెక్యూరిటీల డీమ్యాట్ సేవలకు తెరతీసింది. కాగా.. డిపాజిటరీ సేవలందించే మరో కంపెనీ సెంట్రల్ డిపాజిటరీ సరీ్వసెస్(సీడీఎస్ఎల్) 2017లో ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. దీంతో పబ్లిక్‌గా ట్రేడయ్యే రెండో డిపాజిటరీగా ఎన్ఎస్డీఎల్ నిలవనుంది. జింకా లాజిస్టిక్స్ వస్తు రవాణా రంగ కంపెనీ జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.16 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అమ్మకాలు, మార్కెటింగ్ వ్యయాలకు, భవిష్యత్ అవసరాలరీత్యా బ్లాక్‌బక్ ఫిన్సర్వ్ మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డౌన్.. కారణం ఏంటో తెలుసా? స్టాండర్డ్ గ్లాస్ హైదరాబాద్ కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఈ ఏడాది(2024) జులైలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 350 కోట్ల విలువైన 1.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ ప్రధానంగా ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాలలో వినియోగించే స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ పరికరాల తయారు చేస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు కొత్త సాధనం
న్యూఢిల్లీ: పెట్టుబడులపై అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్ల కోసం సెబీ ‘న్యూ అస్సెట్ క్లాస్’ (కొత్త సాధనం)ను ప్రవేశపెట్టింది. అలాగే, ప్యాసివ్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా ‘ఎంఎఫ్ లైట్–టచ్’ కార్యాచరణను అనుమతించింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు సంబంధించి నిబంధనల సవరణలకూ ఆమోదం తెలిపింది. ఇలా 17 ప్రతిపాదనలకు సెబీ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.అందరూ అనుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో)లో రిటైల్ ట్రేడర్ల స్పెక్యులేషన్ కట్టడిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ, కాంగ్రెస్ పార్టీ ఆరోపణల తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశం ఇది కావడంతో అందరిలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. న్యూ అస్సెట్ క్లాస్ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సేవలు (పీఎంఎస్) పొందాలంటే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలి. రాబడుల కోసం రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, రూ.50 లక్షల పెట్టుబడి అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఉత్పత్తిని సెబీ ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు సైతం స్వీకరించింది. ఈ సాధనంలో డెరివేటివ్స్‌లో పెట్టుబడులకు అనుమతి ఉంటుంది. రుణాలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. అన్‌లిస్టెడ్, అన్‌రేటెడ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అనుమతి లేదు. టీప్లస్0 ప్రస్తుతం టీప్లస్1 సెటిల్మెంట్ విధానం అమల్లో ఉంది. అంటే స్టాక్స్ కొనుగోలు చేసిన మరుసటి పనిదినంలో దాన్ని సెటిల్ చేస్తారు. తదుపరి దశలో టీప్లస్0కు మళ్లాలన్నది సెబీ ప్రణాళిక. ఇందులో భాగంగా 25 స్క్రిప్‌లకు ఆప్షనల్ (ఐచి్ఛకం) టీప్లస్0 విధానం (ట్రేడింగ్ రోజే సెటిల్మెంట్) అమల్లో ఉంది. ఇప్పుడు టాప్–500 (మార్కెట్ విలువ పరంగా) స్టాక్స్‌కు టీప్లస్0 విధానాన్ని ఐచి్ఛకంగా చేస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్లు అందరూ తమ ఇన్వెస్టర్లకు టీప్లస్0 సెటిల్మెంట్ను ఆఫర్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన బ్రోకరేజీ చార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను సెబీ కల్పించింది. మ్యూచువల్ ఫండ్స్ సైతం టీప్లస్0 విధానాన్ని పొందొచ్చు. ఎంఎఫ్ లైట్ ప్యాసివ్ పండ్స్‌కు సంబంధించి సరళించిన కార్యాచరణను సెబీ ప్రకటించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలకు నిబంధనల భారాన్ని తగ్గించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్ రూపంలో ప్రవేశించే కొత్త సంస్థలకు మార్గం తేలిక చేసింది. నికర విలువ, ట్రాక్ రికార్డు, లాభదాయకత పరిమితులను తగ్గించింది. రైట్స్ ఇష్యూ వేగవంతం రైట్స్ ఇష్యూలు వేగంగా పూర్తి చేసేందుకు సెబీ కొత్త నిబంధనలు రూపొందించింది. దీని కింద బోర్డు ఆమోదించిన నాటి నుంచి 23 పనిదినాల్లో రైట్స్ ఇష్యూ ముగుస్తుంది. ప్రస్తుతం 317 రోజుల సమయం తీసుకుంటోంది. ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కు పట్టే 40 రోజుల కంటే కూడా తక్కువ కానుంది. ఇతర నిర్ణయాలు.. » సెకండరీ మార్కెట్లో (నగదు విభాగం) యూపీఐ బ్లాక్ విధానం (ఏఎస్బీఏ) లేదా 3ఇన్1 ట్రేడింగ్ సదుపాయం ద్వారా ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసుకోవచ్చు. 2025 ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం మాదిరే తమ బ్యాంక్ ఖాతా నుంచి నిధులను ట్రేడింగ్ అకౌంట్‌కు బదిలీ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐపీవో దరఖాస్తుకు ఏఎస్బీఏ విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. » ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్లను (ఎడీఐలు) జారీ చేసే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) సంబంధించి పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు కానుంది. ఎఫ్‌పీఐలు తమ నుంచి ఓడీఐలను పొందిన వారి వివరాలను సరిగ్గా అందిస్తున్నాయా? అన్నది ఈ యంత్రాంగం పర్యవేక్షించనుంది. -
వేణుగోపాల్ ధూత్‌కు రూ.కోటి డిమాండ్ నోటీస్
ముంబై: వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను దాదాపు రూ.1.03 కోట్లు చెల్లించాలని పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్, మరో రెండు సంస్థలకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ డిమాండ్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపుల్లో విఫలమైతే అరెస్ట్‌కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆయన ఆస్తులతో పాటు ఇతర సంస్థలను ఆస్తులనూ జప్తు చేస్తానని రెగ్యులేటర్ హెచ్చ రించింది.ధూత్‌తో పాటు, ఎలక్ట్రోపార్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నోటీసులు అందుకున్న సంస్థల్లో ఉన్నాయి. 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను 2021 సెపె్టంబర్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తమపై విధించిన రూ. 75 లక్షల జరిమా నాను చెల్లించడంలో ధూత్‌తో సహా ఈ సంస్థలు విఫలమైన నేపథ్యంలో తాజా డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ధూత్, మరో రెండు సంస్థలు ప్రచురితంకాని ప్రైస్ సెన్సి టివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ) వద్ద మార్కె ట్ లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించిన నేపథ్యంలో సెబీ ఈ చర్యలు తీసుకుంది. -
ఐపీవోల సందడే సందడి
సెకండరీ మార్కెట్లను మించుతూ ప్రైమరీ మార్కెట్ సైతం సరికొత్త రికార్డులవైపు పరుగు తీస్తోంది. జనవరి నుంచి ఇప్పటికే 62 కంపెనీలు ఐపీవోలకురాగా.. తాజాగా ఒకే రోజు 13 కంపెనీలు సెబీని ఆశ్రయించాయి. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్డెస్క్రిటైల్ ఇన్వెస్టర్ల దన్ను, సెకండరీ మార్కెట్ల జోష్ పలు అన్‌లిస్టెడ్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. దీంతో నిధుల సమీకరణతోపాటు.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. వెరసి తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఒకే రోజు 13 కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఈ జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్ తదితరాలు చేరాయి. ఇవన్నీ కలసి ఉమ్మడిగా రూ. 8,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ ఏడాది(2024) ఇప్పటివరకూ 62 కంపెనీలు రూ. 64,000 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది(2023) మొత్తంగా 57 కంపెనీలు ఉమ్మడిగా సమీకరించిన రూ. 49,436 కోట్లతో పోలిస్తే ఇది 29% అధికం! జాబితా ఇలా తాజాగా సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసిన కంపెనీల జాబితాలో విక్రమ్ సోలార్, ఆదిత్య ఇన్ఫోటెక్, వరిండెరా కన్స్ట్రక్షన్స్, అజాక్స్ ఇంజినీరింగ్, రహీ ఇన్ఫ్రాటెక్, విక్రన్ ఇంజినీరింగ్, మిడ్వెస్ట్, వినే కార్పొరేషన్, సంభవ్ స్టీల్ ట్యూబ్స్, జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, అల్ టైమ్ ప్లాస్టిక్స్ లిమిటెడ్, స్కోడా ట్యూబ్స్, దేవ్ యాక్సిలరేటర్ చోటు చేసుకున్నాయి. ఈ సంస్థలన్నీ కలసి రూ. 8,000 కోట్లవరకూ సమీకరించనున్నట్లు అంచనా. విస్తరణ ప్రణాళికలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత వాటాదారుల వాటా విక్రయం తదితర లక్ష్యాలతో కంపెనీలు ఐపీవో బాట పడుతున్నట్లు నిపుణులు వివరించారు. సమీకరణ తీరిదీ ఐపీవోలో భాగంగా సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ విక్రమ్ సోలార్ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.74 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఆదిత్య ఇన్ఫోటెక్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. ఇక వరిండెరా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. ప్రమోటర్లు రూ. 300 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈ బాటలో ఈపీసీ సంస్థ విక్రన్ ఇంజినీరింగ్ రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా.. రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. కారణాలున్నాయ్ ప్రైమరీ మార్కెట్ల జోరుకు పలు సానుకూల అంశాలు దోహదం చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్థూల ఆర్థిక పరిస్థితులు, రంగాలవారీగా అనుకూలతలు, నిధుల లభ్యత, రిటైల్‌సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఆసక్తి తదితరాలను ప్రస్తావించారు. దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీగా పెట్టుబడులు ప్రవహిస్తుండటం, యూఎస్‌లో వడ్డీ రేట్ల కోత సైతం ఇందుకు తోడ్పాటునిస్తున్నట్లు ఈక్విరస్ ఎండీ మునీష్ అగర్వాల్ తెలియజేశారు. కోవిడ్–19, సబ్‌ప్రైమ్ సంక్షోభం, 2011 సెపె్టంబర్ ఉగ్రదాడి తదితర అనూహ్య విపరిణామాలు సంభవిస్తే తప్ప మార్కెట్లు పతనంకాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో 2025లో మార్కెట్ సరికొత్త రికార్డులను నెలకొల్పడంతోపాటు.. మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలున్నట్లు తెలియజేశారు. -
స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్
న్యూఢిల్లీ: స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) నిబంధనలను కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని పెంచడంతోపాటు.. ఆప్షన్స్ ప్రీమియంల ముందస్తు వసూళ్లను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల పరిరక్షణార్ధం పొజిషన్ లిమిట్స్‌పై ఇంట్రాడే పర్యవేక్షణ, ఎక్స్పైరీ రోజున కేలండర్ స్ప్రెడ్ లబ్ధి రద్దు, వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను క్రమబద్ధీకరించడం, టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు తదితర పలు ఇతర చర్యలను సైతం తీసుకుంది.ఈ చర్యలన్నీ వచ్చే నెల (నవంబర్) 20 నుంచి దశలవారీగా అమల్లోకిరానున్నట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇటీవల పరిశీలన ప్రకారం ఎఫ్‌అండ్‌వో విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు 2022–24 మధ్య కాలంలో సగటున రూ. 2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. కోటిమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93% మందికి నష్టాలు వాటిల్లినట్లు ఇప్పటికే రిటైలర్లను హెచ్చరించింది. ఈ కాలంలో వ్యక్తిగత ట్రేడర్లకు ఉమ్మడిగా రూ. 1.8 లక్షల కోట్లమేర నష్టాలు నమోదైనట్లు పేర్కొనడం తెలిసిందే. నిబంధనల తీరిదీ... తాజా సర్క్యులర్‌లో సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనల సవరణలను వెల్లడించింది. వీటి ప్రకారం ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని 2015లో నిర్ణయించిన రూ. 5–10 లక్షల నుంచి రూ. 15–20 లక్షలకు పెంచింది. ఇందుకు అనుగుణంగానే లాట్ సైజ్‌ను కూడా నిర్ధారిస్తారు. వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను ఒకేఒక ప్రామాణిక ఇండెక్స్‌కు పరిమితం చేస్తారు. షార్ట్ ఆప్షన్స్ కాంట్రాక్టులపై ఎక్స్పైరీ రోజున 2 శాతం అదనపు మార్జిన్ (ఈఎల్ఎం)ను విధిస్తారు. ఆప్షన్ కొనుగోలుదారులు ముందస్తుగా పూర్తి ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. దీంతో అధిక లెవరేజ్‌ను నివారిస్తారు. మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు మౌలిక రంగ అభివృద్ధికి వినియోగించగల నిధుల సమీకరణకు వీలుగా మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు ప్రకటించాలని సెబీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. వీటి సబ్‌్రస్కయిబర్లకు పన్ను మినహాయింపులను అందించాలని అభ్యర్థించింది. -
స్విగ్గీ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. నిధుల వినియోగమిలా ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్‌పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్‌కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. -
నిర్ధారిత ధరతో ఇక డీలిస్టింగ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా స్వచ్చంద డీలిస్టింగ్ నిబంధనలను సవరించింది. దీనిలో భాగంగా నిర్ధారిత(ఫిక్స్డ్) ధర విధానం ద్వారా షేర్ల డీలిస్టింగ్‌కు వీలు కలి్పంచనుంది. వెరసి రివర్స్ బుక్బిల్డింగ్(ఆర్బీబీ) పద్ధతిలో ప్రత్యామ్నాయానికి తెరతీసింది. దీంతో లిస్టెడ్ కంపెనీలకు సులభతర బిజినెస్ నిర్వహణలో మరింత తోడ్పాటు లభించనుంది. ఆర్బీబీ విధానంలో ఏదైనా సంస్థ షేర్లను డీలిస్ట్ చేయదలచుకుంటే తలుత పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇందుకు తప్పనిసరిగా కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించవలసి ఉంటుంది. తదుపరి వాటాదారులు షేర్లను ఆఫర్ చేసేందుకు వీలుంటుంది. తాజా నోటిఫికేషన్లో సెబీ ఫిక్స్డ్ ధర విధానం ద్వారా ఆర్బీబీ విధానంలో ప్రత్యామ్నాయానికి వీలు కలి్పంచింది. తరచుగా ట్రేడయ్యే షేర్లను స్టాక్ ఎక్సే్ఛంజీల నుంచి డీలిస్టింగ్ చేసేందుకు కంపెనీలు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంను ఆఫర్ చేయవలసి ఉంటుంది. మరోపక్క ఆర్బీబీ పద్ధతిలో చేపట్టే డీలిస్టింగ్‌కు సంబంధించి కౌంటర్ ఆఫర్ విధానంలోనూ సెబీ సవరణలు చేసింది. పబ్లిక్ వాటాలో కనీసం 50 శాతం టెండర్ అయితే ప్రస్తుత 90 శాతానికికాకుండా 75 శాతానికి కౌంటర్ ఆఫర్ ప్రకటించవచ్చు. అయితే కౌంటర్ ఆఫర్ ధర టెండర్ అయిన షేర్ల సగటు పరిమాణ అధిక ధర కంటే తక్కువగా ఉండటాన్ని అంగీకరించరు. వెరసి కొనుగోలుదారుడు ఆఫర్ చేసిన సంకేత ధరను మించి ప్రకటించవలసి ఉంటుంది. ఆఫర్ తదుపరి కొనుగోలుదారుడి వాటా 90 శాతానికి చేరుకుంటేనే డీలిస్టింగ్‌కు అనుమతిస్తారు. ఎక్సే్చంజీల్లో 1 నుంచి లావాదేవీ చార్జీల్లో మార్పులు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సభ్యులందరికీ ఒకే రకమైన రుసుముల విధానాన్ని అమలు చేయాలంటూ సెబీ ఆదేశించిన నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తాజాగా క్యాష్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల ట్రేడింగ్‌పై లావాదేవీ ఫీజులను సవరించాయి. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లపై ట్రాన్సాక్షన్ ఫీజును రూ. 1 కోటి ప్రీమియం టర్నోవరుపై రూ. 3,250గా బీఎస్ఈ నిర్ణయించింది. అయితే, ఈక్విటీ డెరివేటివ్స్‌లోని మిగతా కాంట్రాక్టులకు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు. మరోవైపు ఎన్ఎస్ఈలో క్యాష్ మార్కెట్‌కి సంబంధించి రూ. 1 లక్ష విలువ చేసే ట్రేడ్‌కి చార్జీలు రూ. 2.97గా ఉంటాయి. ఈక్విటీ ఫ్యూచర్స్కి ఈ రుసుము రూ. 1 లక్షకి రూ. 1.73గాను, ఈక్విటీ ఆప్షన్ల విషయంలో రూ. 1 లక్ష ప్రీమియం విలువపై రూ. 35.03గాను ఉంటుంది. కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఫ్యూచర్స్కి సంబంధించి లక్ష ట్రేడ్ వేల్యూకి రూ. 0.35 ఫీజు ఉంటుంది. రంగు చూసి ఫండ్స్‌లో రిస్క్ తెలుసుకోవచ్చుఈ దిశగా కొత్త ప్రతిపాదనలు తెచి్చన సెబీవివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక ముందు ఇన్వెస్టర్లు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సెబీ కొన్ని కీలక ప్రతిపాదనలు రూపొందించింది. ఒక మ్యూచువల్ ఫండ్ పథకానికి సంబంధించి రిస్‌్కను సూచించే ‘రిస్్క–ఓ–మీటర్’ రంగుల థీమ్‌తోనూ ఉండాలన్నది సెబీ ప్రతిపాదన. మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి రిస్్క–ఓ–మీటర్‌ను ఆరు స్థాయిల్లో తెలియజేయడం తప్పనిసరి. ప్రస్తుతం లో(తక్కువ), లో టు మోడరేట్ (తక్కువ నుంచి మోస్తరు), మోడరేట్ (మోస్తరు), మోడరేట్లీ హై (కొంచెం ఎక్కువ), హై (ఎక్కువ), వెరీ హై (మరీ ఎక్కువ)గా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీలు/ఫండ్స్ నిర్వహణ సంస్థలు) తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తక్కువ రిస్క్‌కు ఆకుపచ్చ, తక్కువ నుంచి మోస్తరు రిస్‌్కకు ముదురు చిలకపచ్చ, మోస్తరు రిస్‌్కకు లేత చిలకపచ్చ (నియాన్ ఎల్లో), కొంచెం ఎక్కువ రిస్‌్కకు కాఫీ రంగు (క్యారామెల్), అధిక రిస్క్‌కు చిక్కటి నారింజ రంగు, అధిక రిస్‌్కకు ఎర్రటి రంగును సూచించాలన్నది సెబీ ప్రతిపాదన. ఎక్స్పెన్స్ రేషియో, రాబడులు అన్నవి ఒకే పథకానికి సంబంధించి డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో వేర్వేరుగా ఉండడంతో.. ఈ రెండు రకాల ప్లాన్లకు సంబంధించి అన్ని వివరాలు ప్రదర్శించాలంటూ సెబీ మరో ప్రతిపాదన చేసింది. వీటిపై అక్టోబర్ 18 వరకు ప్రజల నుంచి సలహా, సూచనలను సెబీ ఆహా్వనించింది. -
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్‌తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్‌లో కోరింది. -
బాహు‘బుల్’ ఐపీఓలొస్తున్నాయ్!
ఇప్పటిదాకా వచ్చినవి ఒక రేంజ్.. ఇకపై వచ్చేవి వేరే లెవెల్! అడుగుపెడితే మార్కెట్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే!! ఇప్పటికే సెపె్టంబర్లో ఇన్వెస్టర్లు ఐపీఓల వర్షంలో ముద్దవుతుండగా.. రాబోయే రెండు నెలల్లో బాహుబలి ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి. దేశంలో రెండో బడా కార్ల కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా అతిపెద్ద ఇష్యూగా రికార్డు బ్రేక్ చేయనుంది. ఇక ఫుడ్–గ్రాసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ రెండో మెగా స్టార్టప్ ఆఫర్‌గా నిలవనుంది. ఈ రెండింటికీ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక మెగా ఐపీఓల జాతరకు రంగం సిద్ధమైంది. దక్షిణకొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్ ఐపీఓకు సెబీ తాజాగా ఆమోదం తెలపడంతో పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ కనీసం 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించనుంది. హ్యుందాయ్ ఇండియా మాతృ సంస్థ (ప్రమోటర్) హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కొంత వాటాను, అంటే 14.22 కోట్ల షేర్లను విక్రయిచనుంది. తాజా ఈక్విటీ షేర్లు ఏవీ జారీ చేయడం లేదు. ఈ ఇష్యూ పూర్తయితే ఎల్ఐసీ రికార్డును బద్దలవుతుంది. 2022లో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.21,000 కోట్లను సమీకరించింది. ఇప్పటిదాకా ఇదే దలాల్ స్ట్రీట్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫర్.రెండు దశాబ్దాల తర్వాత... దేశీ వాహన పరిశ్రమలో ఇదో సరికొత్త మైలురాయిగా నిలవనుంది. 2003లో జపాన్ వాహన దిగ్గజం మారుతీ సుజుకీ లిస్టింగ్ అయిన రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ దేశీయంగా ఒక కార్ల కంపెనీ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. అమ్మకాల పరంగా దేశంలో రెండో అతిపెద్ద కార్ల కంపెనీగా నిలుస్తున్న హ్యుందాయ్ ఇండియా మార్కెట్ క్యాప్ (విలువ) 18–20 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రస్తుతం మారుతీ మార్కెట్ విలువ దాదాపు 48 బిలియన్ డాలర్లు. కాగా, అక్టోబర్‌లో హ్యుందాయ్ ఐపీఓ వస్తుందని సమాచారం. 1996లో భారత్‌లోకి అడుగుపెట్టిన హ్యుందాయ్.. వివిధ కార్ల విభాగాల్లో 13 మోడల్స్ విక్రయిస్తోంది. గత నెలలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఐపీఓ ద్వారా రూ.6,145 కోట్ల సమీకరించడంతో పాటు బంపర్ లిస్టింగ్ నేపథ్యంలో హ్యుందాయ్ మెగా ఇష్యూపై ఇన్వెస్టర్లు గురిపెడుతున్నారు. స్విగ్గీ డెలివరీ రెడీ...ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి కూడా సెబీ నుంచి ప్రాథమిక ఆమోదం లభించింది. సెబీ కొన్ని మార్పుచేర్పులు సూచించడంతో తుది డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ త్వరలో దాఖలు చేయనుంది. ఏప్రిల్‌లో వాటాదారుల ఆమోదం ప్రకారం ఈ మెగా ఇష్యూ ద్వారా రూ.10,414 కోట్లను స్విగ్గీ సమీకరించనుంది. ఇందులో రూ.3,750 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా కంపెనీ సమీకరించనుంది. మిగతా మొత్తాన్ని ప్రస్తుత ఇన్వెస్టర్లు కొంత వాటాను విక్రయించి సొమ్ము చేసుకోనున్నారు. తుది ఆమోదం మేరకు ఇష్యూ సైజు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11,700 కోట్లు) ఉండొచ్చని అంచనా. 2014లో ఆరంభమైన స్విగ్గీ ప్రస్తు తం ఫుడ్ డెలివరీతో పాటు క్విక్ కామర్స్ (ఇన్‌స్టామార్ట్), హైపర్ లోకల్ లాజిస్టిక్స్ విభాగాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ 13 బిలియన్ డాలర్లుగా అంచనా. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1.09 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించింది. 4,700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, జొమాటో 2021లో బంపర్ లిస్టింగ్‌తో బోణీ చేసింది. రూ.9,375 కోట్లు సమీకరించింది. రూ.76 ఇష్యూ ధర కాగా, 60% ప్రీమియంతో రూ.115 వద్ద లిస్టయింది. రెండేళ్లలో జొమాటో షేరు రూ.46 కనిష్ట స్థాయి నుంచి 520 శాతం (ప్రస్తుత ధర 286) ఎగబాకడం విశేషం. కాగా, స్విగ్గీ ఐపీఓ నవంబర్‌లో ఉండొచ్చనేది మార్కెట్ వర్గాల సమాచారం.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్‌కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి. -
సెబీ కొత్త రూల్స్.. డెట్ సెక్యూరిటీల నిబంధనలు మార్పు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రుణ(డెట్) సెక్యూరిటీల జారీ విధానాలను క్రమబద్ధీకరించేందుకు నడుం కట్టింది. ఇందుకు వీలుగా నిబంధనలను సవరించింది. దీంతో ఇక డెట్ సెక్యూరిటీల జారీ వేగవంతంకానుంది.తద్వారా పబ్లిక్కు సెక్యూరిటీలను జారీ చేసే సంస్థలకు నిధులు త్వరగా అందనున్నాయి. తాజా నిబంధనల ప్రకారం సెబీ పబ్లిక్ నుంచి స్పందన కోరే ముసాయిదా డాక్యుమెంట్ల గడువును ప్రస్తుత 7 రోజుల నుంచి 1 పనిదినానికి సవరించింది. ఇది ఇప్పటికే లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు వర్తించనుంది. ఇతరత్రా సెక్యూరిటీల జారీని చేపట్టే సంస్థలకు 5 రోజులుగా వర్తించనుంది.జాతీయస్థాయిలో టెర్మినళ్లు కలిగి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్టయిన నిర్దిష్ట సెక్యూరిటీలకు ఫైలింగ్ తదుపరి ఒక రోజులోనే ముసాయిదా పత్రాలను దాఖలు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో కనీస సబ్స్క్రిప్షన్ గడువును సెబీ 3 నుంచి 2 రోజులకు తగ్గించింది. -
బోనస్ షేర్ల ట్రేడింగ్‌లో సెబీ మార్పులు
బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.ప్రస్తుత ఐసీడీఆర్ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్లు అదే ఐఎస్ఐఎన్ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే బోనస్ షేర్లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. -
సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్ ఆరోపణలు
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పనితీరుపై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. 2017-23 మధ్యకాలంలో రూ.36.9 కోట్ల విలువైన లిస్టెడ్ సెక్యూరిటీల్లో ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ఆమె సంస్థ పూర్తికాల డైరెక్టర్‌గా నియమితులైన తర్వాత ఈ వ్యవహారం జరిగిందని చెప్పారు. ఇది సెబీ నిబంధనలను బేఖాతరు చేయడమేనన్నారు. మాధబి సెబీ నియమాలను ఉల్లంఘించడంతోపాటు చైనీస్ ఫండ్ల్లో పెట్టుబడులు, విదేశాల్లో ఆస్తులను కలిగి ఉన్నారని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‘2017-21 సంవత్సరాల మధ్య మాధబి పురీ బచ్‌కి విదేశీ ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మొదటిసారిగా ఆమె ఏ ప్రభుత్వ సంస్థకు ఎప్పుడు తెలియజేసిందో ప్రకటించాలి. సింగపూర్‌లోని అగోరా పార్ట్‌నర్స్‌తో మాధబి బ్యాంక్ అకౌంట్‌పై సంతకం చేసింది నిజమో కాదో చెప్పాలి. వాన్గార్డ్ టోటల్ స్టాక్ మార్కెట్ ఈటీఎఫ్, ఏఆర్కే ఇన్నోవేషన్ ఈటీఎఫ్, గ్లోబల్ ఎక్స్ ఎంఎస్సీఐ చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌ల్లో ఈమె పెట్టుబడులు పెట్టారు. సెబీ ఛైర్పర్సన్ స్థాయిలో ఉన్న వ్యక్తి చైనాలో పెట్టుబడులు పెట్టడం నిజంగా ఆందోళనకరం’ అని చెప్పారు. భారత్, చైనా సంబంధాలపై స్పందిస్తూ చైనా ఉత్పత్తులను వాడకూడదని ఉపన్యాసాలు ఇచ్చే ప్రధాని చైనా నుంచి పీఎం కేర్స్ విభాగం ఎందుకు నిధులు పొందుతోందో చెప్పాలన్నారు.అదానీ కంపెనీలో పెట్టుబడులుసింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని గతంలో కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.ఇదీ చదవండి: ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు ఇచ్చే రంగంఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు. -
రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్
ఆన్లైన్ ట్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ స్కామ్ గుట్టును అస్సాం పోలీసులు ఛేదించారు. రాష్ట్రాన్ని కుదిపేసిన కోట్లాది రూపాయల ఆర్థిక కుంభకోణంలో అస్సామీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రసిద్ధ కొరియోగ్రాఫర్,నటి 'సుమీ బోరా' ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు. రెండురోజులుగా పరారీలో ఉన్న ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ కావడంతో తాజాగా పోలీసులకు లొంగిపోయింది.స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ రాబడి వస్తుందని నమ్మించి ప్రజలను మోసం చేసిన నిందితుడు బిషల్ ఫుకాన్ (22)ను అస్సాం పోలీసులు మొదట అరెస్టు చేశారు. ఫుకాన్ అరెస్టు తర్వాత తన బంధువు అయిన సుమీ బోరా, ఆమె భర్త తార్కిక్ బోరా పేర్లు తెరపైకి వచ్చాయి. అసలైన ప్రధాన సూత్రధారులు వారిద్దరేనని పోలీసులు గుర్తించారు. అస్సామీ చిత్ర పరిశ్రమలో తన పరిచయాల ద్వారా నటులు, గాయకులు, రాజకీయ నాయకులు, సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులతో సహా అనేక మందిని టార్గెట్ చేస్తూ.. భారీ మొత్తంలో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టించింది. ఇదీ చదవండి: సందీప్, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్ఆమెకు మంచి గుర్తింపు ఉండటంతో చాలామంది మధ్యతరగతి వారు కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. అలా సుమారు రూ. 2,200 కోట్ల భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. కొంతకాలం క్రితం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సుమీ బోరా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. అందుకు రూ. 3 కోట్లు ఖర్చు చేసింది. బోరా తరచుగా విహారయాత్రలు చేస్తూ తన భర్తతో విలాసవంతమైన జీవితం గడిపేది. ఆమె భర్త తార్కిక్ బోరా కూడా ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ కావడం విశేషం. ఇలా ఈ జంట రూ. 2,200 కోట్ల బిగ్ స్కామ్‌కు పాల్పడింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో వారిద్దరూ ఉన్నారు. -
‘అన్నీ అవాస్తవాలే’
సెబీ నిర్దేశించిన అన్ని నియమాలు, మార్గదర్శకాలకు తాను కట్టుబడి ఉన్నానని సంస్థ చీఫ్ మాధబి పురి బచ్ తెలిపారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, అవమానకరమైనవిగా చెబుతూ వాటిని తీవ్రంగా ఖండించారు.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చీఫ్ మాధబి పురి బచ్ ఒక వ్యక్తిగత ప్రకటనలో ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవస్తవాలని కొట్టిపారేశారు. అవి తనను అవమానించేలా ఉన్నాయన్నారు. సెబీలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరస్పర ప్రయోజనాల కోసం అగోరా అడ్వైజరీ, అగోరా పార్టనర్స్, మహీంద్రా గ్రూప్, పిడిలైట్, డాక్టర్ రెడ్డీస్, సెంబ్‌కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్..వంటి సంస్థల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ఈ సంస్థలకు చెందిన ఏ వ్యవహారంతోనూ తనకు సంబంధం లేదన్నారు. సెబీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.అదానీ కంపెనీలో పెట్టుబడులుసింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.ఇదీ చదవండి: పదేళ్లలో గణనీయ వృద్ధి.. ‘ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదంఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు. -
బీవోపై ఎఫ్‌పీఐల వెనకడుగు
న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, లోటస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి. అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం! ఏం జరిగిందంటే? సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు.. పీఏసీ విచారణ?
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్‌పై వచ్చిన ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) విచారణకు ఆమోదించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పీఏసీ ఈ నెలాఖరులో సెబీ పనితీరును సమీక్షించనుందని చెప్పారు.ఆగస్టు 29న జరిగిన పీఏసీ ప్యానెల్ సమావేశంలో సెబీ చీఫ్‌పై వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా సంస్థ పనితీరుపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. దాంతో కమిటీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో జరగబోయే పీఏసీకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ నాయకత్వం వహించనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌తోపాటు అధికార ఎన్డీఏ పార్టీకి చెందిన నాయకులు కూడా ఈ కమిటీలో భాగంగా ఉంటారు.పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థల పనితీరుపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏ క్షణమైనా విచారణ జరిపే అధికారం కలిగి ఉంది. అందుకోసం ఆయా సంస్థలకు ముందుగా సమాచారం అందించాల్సిన అవసరం ఉండదు. సెబీ కూడా పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన నియంత్రణ సంస్థ. పీఏసీ తన తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 10న నిర్వహించనుంది. ఆ తేదీన సెబీ విచారణ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.సెబీ చీఫ్ పనితీరుపై ఉద్యోగుల ఫిర్యాదుసెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’అదానీ కంపెనీలో పెట్టుబడులుఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. -
రూ. 1,000 కోట్లు జమ చేయండి
న్యూఢిల్లీ: గ్రూప్ సంస్థల రూ.25,000 కోట్ల అక్రమ డిపాజిట్ సమీకరణకు సంబంధించి సెబీ కేసులో 15 రోజుల్లోగా రూ. 1,000 కోట్లను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సహారా గ్రూప్ కంపెనీలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. దీనితోపాటు రూ.10,000 కోట్ల సమీకరణకుగాను ముంబైలోని వెర్సోవాలో తన భూమిని అభివృద్ధి చేయడానికి, ఈ విషయంలో జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి ప్రవేశించడానికి సైతం సుప్రీం అనుమతించింది. అత్యున్నత న్యాయస్థానం 2012 ఆదేశాలకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి ఇవ్వడానికి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. భూమి విక్రయానికి స్వయంగా చర్యలు జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజుల్లోగా కోర్టులో దాఖలు చేయాల్సి చేయాలి. అనంతరం ఈ ఒప్పందానికి అత్యున్నత న్యాయస్థానం ఆమోదముద్ర తప్పనిసరి. లేని పక్షంలో వెర్సోవాలోని 12.15 మిలియన్ చదరపు అడుగుల భూమిని విక్రయించడానికి సుప్రీం తగిన చర్యలు తీసుకుంటుందని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరే‹Ù, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘సహార సంస్థలు– ఎస్‌ఐఆర్‌ఈసీఎల్, ఎస్‌హెచ్‌ఐసీఎల్ (రెండూ సహారా గ్రూప్ కంపెనీలు)కు మేము 15 రోజుల సమయం మంజూరు చేస్తున్నాము. జాయింట్ వెంచర్/డెవలప్మెంట్ ఒప్పందాన్ని 15 రోజులలోపు దాఖలు చేయకపోతే, వెర్సోవా భూమిని విక్రయానికి కోర్టు చర్యలు చేపడుతుంది’’ అని బెంచ్ పేర్కొంది. ‘‘ఈ పక్రియ కోసం థర్డ్‌పారీ రూ. 1,000 కోట్లు జమచేస్తే, దీనిని సెబీ ఎస్క్రో ఖాతాలో ఉంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ కోర్టు ఆమోదం/అనుమతి (జాయింట్ వెంచర్ అగ్రిమెంట్‌కు) మంజూరు చేయకపోతే, ఆ మొత్తాన్ని (జమ చేసిన మొత్తాన్ని) తిరిగి థర్డ్‌పారీ్టకి చెల్లించడం జరుగుతుంది’’అని కూడా ధర్మాసనం వివరించింది.చెల్లింపులకు 10 యేళ్ల సుదీర్ఘ వెసులుబాటు రూ.25,000 కోట్ల తిరిగి డిపాజిట్ చేయడానికి సహారాకు సుప్రీం దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ సమయం ఇచ్చి ఎంతో వెసులుబాటు కలి్పస్తున్న విషయాన్ని కూడా ధర్మాసనం ఈ సందర్భంగా సంస్థ తరఫున వాదనలు వినిపిస్తున్న కపిల్ సిబల్‌కు గుర్తు చేసింది. ఇదే కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతోరాయ్ సుదీర్ఘకాలం తీహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం గమనార్హం. తల్లి మరణం అనంతరం అంతిమ సంస్కారాల కోసం జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచి్చన ఆయన, కొద్ది నెలల క్రితం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. -
సెబీ చీఫ్ రాజీనామా చేయాల్సిందే.. ఉద్యోగుల నిరసన
భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్పర్సన్ మాధవి పూరి బచ్‌పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఆమె రాజీనామాను డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది ఉద్యోగులు సెబీ ముంబై ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.సెబీలో విధి నిర్వహణ పరిస్థితులపై ఉద్యోగులు ఆర్థిక శాఖకు చేసిన ఫిర్యాదుపై సెబీ ఖండిస్తూ ప్రకటన విడుదల చేసిన మరుసటి రోజే ఉద్యోగులు నిరసనకు దిగారు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. నిరసన దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. నిరసన తర్వాత ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.తమ ఫిర్యాదుపై ఉన్నతస్థాయి అధికారులు చేస్తున్న వక్రీకరణకు వ్యతిరేకంగా, తమ ఐక్యతను ప్రదర్శించడమే ఈ నిరసన ఉద్దేశం అని ఉద్యోగుల మధ్య అంతర్గత సందేశాన్ని ఉటంకిస్తూ మనీకంట్రోల్ పేర్కొంది. సెబీ ఉద్యోగులపై అసత్యాలు ప్రచారం చేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకోవడం, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయడం తక్షణ డిమాండ్ అని ఆ సందేశంలో ఉన్నట్లు తెలిపింది.నిరసన ఎందుకంటే..సెబీలో పని చేయడం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదని, ఇక్కడ విషపూరితమైన పని వాతావరణం ఉందంటూ కొంతమంది సెబీ ఉద్యోగులు గత నెలలో ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. దీన్ని సెబీ తప్పుబట్టింది. పనితీరు, జవాబుదారీతనంలో ప్రమాణాలను పాటించే విషయంలో ఉద్యోగులను బయటి శక్తులు తప్పుదోవ పట్టించాయంటూ సెబీ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. -
పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురీ బుచ్ పనితీరుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. పని సమయాల్లో కిందిస్థాయి సిబ్బందితో పరుష పదజాలాన్ని వాడుతున్నారని, అవాస్తవ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని సెబీ అధికారులు ఆర్థిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు.అందులో 500 మంది ‘గ్రీవెన్స్ ఆఫ్ సెబీ ఆఫీసర్స్-ఎ కాల్ ఫర్ రెస్పెక్ట్’ అనే శీర్షికతో రాసిన ఫిర్యాదు లేఖపై సంతకం చేసినట్లు తెలిసింది. స్నేహపూర్వక విధానాలు, పని సమయంలో వేధింపుల వంటి అంశాలపై సెబీ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి. ఇది తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిందని లేఖలో తెలిపారు. సెబీ ఉన్నతాధికారులకు గతంలో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. పని సామర్థ్యాన్ని పెంచే పేరుతో మేనేజ్మెంట్ వ్యవస్థలను సమూలంగా మార్చేసి తిరోగమన విధానాలను అమల్లోకి తెచ్చిందని చెప్పారు. దాంతో సంస్థకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఈ ఏడాదికి సంబంధించి ‘కీ రిజల్ట్ ఏరియా(కేఆర్ఏ)’ లక్ష్యాలను మేనేజ్మెంట్ 20-50% పెంచిందని లేఖలో తెలిపారు. డిసెంబర్ నాటికి ఉద్యోగులు ఆ లక్ష్యాలను సాధించాలని అధికారులు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది వాస్తవానికి దరిదాపుల్లో కూడా లేదని, దాంతో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై సెబీ మెయిల్ ద్వారా స్పందించింది. ఉద్యోగులతో ఉన్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. చాలా సంప్రదింపుల తర్వాత కేఆర్‌ఏలను రూపొందించామని కొందరు అధికారులు తెలిపారు. ఉద్యోగులు సమస్యను లేవనెత్తిన తర్వాత అన్ని విభాగాలతో సమీక్షించామన్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌ల్లో చిన్న సర్దుబాట్లు జరిగాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదంఇటీవల సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
‘ఐసీఐసీఐ నుంచి వేతనం తీసుకున్న సెబీ చీఫ్’
సెబీ ఛైర్పర్సన్ మాధబిపురి బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మాధబి ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు 2017-24 మధ్య కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నుంచి రూ.22.41 కోట్ల ఆదాయాన్ని పొందారని ఖేరా తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.రెండు కోట్లకు పైగా విలువైన ఇఎస్‌ఓపీని అందుకున్నారని చెప్పారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ చీఫ్ సరైన విచారణ నిర్వహించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మెరుగైన మౌలిక సదుపాయాలతో దేశం వృద్ధిఅసలేం జరిగిందంటే..బెర్ముడా, మారిషస్‌ల్లోని అదానీ గ్రూప్ డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలున్నట్టు ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్‌బర్గ్ వెల్లడించింది. ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్టు నివేదిక తెలిపింది. భారత్‌లో పెట్టుబడులకు ఎన్నో మ్యూచువల్ ఫండ్లు తదితరాలుండగా ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గధామంగా పేరొందిన దేశాల్లో, అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లోనే పెట్టడం ఆశ్చర్యకరమని పేర్కొంది. అదానీల ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫే భాగస్వామి కావడంతో లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసిందని ఆరోపించింది. -
ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రిజిస్టర్‌కాని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు(ఫిన్ఫ్లుయెన్సర్ల)ను నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉపక్రమించింది. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇటీవల అన్‌రిజిస్టర్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లతో పెరుగుతు న్న రిసు్కలపై ఆందోళనల కారణంగా సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. విడిగా జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల ద్వారా రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్‌కాని వ్యక్తుల మధ్య సహకారంపై పరిమితులు విధించింది. ఈ అంశాలపై ప్రతిపాదనలను గత నెలలోనే సెబీ బోర్డు అనుమతించింది. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సెబీ నియంత్రణలోని ఏజెంట్లు, సంబంధిత వ్యక్తులపై ఆంక్షలు వర్తించనున్నాయి. సొమ్ము సంబంధ ఎలాంటి లావాదేవీలు, క్లయింట్‌కు రిఫర్ చేయడం, ఏ ఇతర వ్యక్తులతోనూ ఐటీ సిస్టమ్స్‌తో జత కలవడం తదితరాలు నిషిద్ధం. అంతేకాకుండా వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సలహాలు, రికమండేషన్లు, స్పష్టమైన రిటర్నుల క్లెయిములు తదితరాలను చేపట్టకూడదు. సెబీ వద్ద రిజిస్టరైన లేదా బోర్డు అనుమతిస్తే తప్ప నియంత్రణలోలేని సంస్థలు, సంబంధిత ఏజెంట్లు సైతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవేమీ చేపట్టేందుకు అనుమతి ఉండదు. ఫిన్ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఇందుకు నైపుణ్యాలు, జవాబుదారీతనం వంటి అంశాలలో సెబీ ప్రమాణాలకు తెరతీసినట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఫిన్‌ఫ్లుయెన్సర్లతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రీసెర్చ్ నిపుణులు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, స్టాక్ బ్రోకర్లు జత కట్టేందుకు వీలుండదు. -
రిలయన్స్ హోమ్‌పై సెబీ
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్(ఆర్హెచ్ఎఫ్ఎల్) నిధుల అక్రమ మళ్లింపులో అనిల్ అంబానీ ప్రధాన పాత్ర పోషించినట్లు సెబీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆడిటింగ్ తదితరాల వివరాలను బయటపెట్టింది. వీటి ప్రకారం అప్పటి కంపెనీ బోర్డు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సంబంధిత యాజమాన్యం వీటిని పట్టించుకోలేదు. కంపెనీ విధానాలను వ్యతిరేకంగా రుణాలను విడుదల చేసింది. అసంపూర్తి డాక్యుమెంటేషన్, క్రెడిట్ పాలసీ నిబంధనల ఉల్లంఘన ద్వారా రుణ మంజూరీ జరిగింది. రుణ విడుదల అంశాలను సమీక్షిస్తూ బోర్డు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పెడచెవిన పెట్టారు. వెరసి సాధారణ కార్పొరేట్ రుణ విధానాలకు పాతరవేశారు. వీటన్నిటి వెనుక మాస్టర్‌మైండ్ అనిల్ అంబానీదేనని సెబీ అభిప్రాయపడింది. ఇతర వివరాలు ఇలా.. ఆర్హెచ్ఎఫ్ఎల్ నిధుల అక్రమ మళ్లింపు జరిగినట్లు కంపెనీకి చట్టబద్ధ ఆడిటర్‌గా వ్యవహరించిన పీడబ్ల్యూసీ, ఫోరెన్సిక్ ఆడిటర్ గ్రాంట్ థార్న్టన్ వెల్లడించాయి. గ్రాంట్ థార్న్‌టన్‌ను రుణదాతల కన్సార్షియంకు అధ్యక్షత వహించిన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నియమించింది. పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం సాధారణ కార్పొరేట్ లోన్ ప్రొడక్ట్‌లో భాగంగా విడుదల చేసిన రుణాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. 2018 మార్చి31కల్లా రూ. 900 కోట్ల రుణాలు విడుదలకాగా.. 2019 మార్చి31కల్లా రూ. 7,900 కోట్లకు జంప్‌చేశాయి. రుణగ్రహీత సంస్థలలో నెగిటివ్ నెట్‌వర్త్, అతితక్కువ ఆదాయం, బిజినెస్ కార్యకలాపాలు, లాభార్జన లేకపోవడం తదితర పలు ప్రతికూలతలున్నాయి. ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి మాత్రమే రుణాలను పొందడం, రుణాలతో పోలిస్తే తక్కువ ఈక్విటీ మూలధనం, రుణాలు అందుకునే ముందుగానే ఏర్పాటుకావడం, రుణ దరఖాస్తు రోజునే రుణ మంజూరీ తదితర అక్రమాలు నెలకొన్నాయి. ఇక 2016 ఏప్రిల్ నుంచి 2019 జూన్‌వరకూ బీవోబీ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ తొలి నివేదిక 2020 జనవరిలో వెలువడింది. ఈ కాలంలో కార్పొరేట్ రుణ విధానాలకింద ఆర్హెచ్ఎఫ్ఎల్ నుంచి రూ. 14,577 కోట్లకుపైగా రుణాలు విడుదలయ్యాయి. వీటిలో రూ. 12,487 కోట్లకుపైగా నిధులు సంబంధిత 47 సంస్థలకే చేరాయి. 2019 అక్టోబర్ 31కల్లా రూ. 7,984 కోట్ల రుణాలు వసూలుకావలసి ఉంటే.. దాదాపు రూ. 2,728 కోట్లు మొండిబకాయిలుగా నమోదయ్యాయి. తదుపరి నివేదికలలో గ్రూప్‌లోని పలు ఇతర కంపెనీలకు సైతం రుణాలు విడుదలైనట్లు నివేదిక పేర్కొంది. -
సెబీ చీఫ్‌పై కేంద్రం దర్యాప్తు..?
సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్ర ఆర్థికశాఖ దర్యాప్తు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఈ సంఘంలో సెబీ ప్రతినిధులు సైతం ఉండబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో సెబీ చీఫ్ మాధబి, ఆమె భర్త పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!ఇదిలాఉండగా, సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో సెబీ తాజాగా దర్యాప్తునకు ఆమోదిస్తున్నట్లు సమాచారం. -
22న దేశవ్యాప్త నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెక్యూరిటీస్, ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చైర్పర్సన్ మాధవి పురీ బుచ్, ఆమె భర్త ధవళ్‌కు వాటాలు ఉన్నాయని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన సంచలన ఆరోపణలపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వివాదంలో కేంద్ర బిందువుగా మారిన మాధవి వెంటనే రాజీనామా చేయాలని, అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనెల 22వ తేదీన దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచి్చంది.ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లు, పీపీసీ చీఫ్‌లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ తర్వాత పార్టీ ఈ ప్రకటన చేసింది. ఈ ప్రత్యేక సమావేశంలో రాబోయే ఎన్నికల కోసం పార్టీ సన్నద్ధత, సంస్థాగత అంశాలు, ఎన్నికలపరంగా జాతీయ ప్రాముఖ్యత గల వివిధ అంశాలు, సమస్యలపై ముఖ్యనేతలు విస్తృతంగా చర్చించారు. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశీ్మర్‌లలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ‘‘అదానీ– మాధవి బుచ్ ఉదంతంలో ప్రధాని మోదీ పాత్ర కూడా ఉంది. ఒక సంస్థ ప్రయోజనాల కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ ఎంతగా ప్రలోభాలకు గురైందో ఈ ఉదంతం చాటుతోంది’’ అని నేతలు భేటీలో తీర్మానం చేశారు. భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. హిండెన్‌బర్గ్ ఉదంతం సహా దేశంలోని పలు సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని, అందుకుతగ్గ ప్రచారానికి రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కేరళ వయనాడ్ కొండల్లో ప్రకృతి విలయతాండవం ధాటికి వందల మంది ప్రాణాలు కోల్పోవడంపై సమావేశం తీవ్ర ఆవేదనను, సంతాపాన్ని వ్యక్తం చేసింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రాహుల్ డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న బాధిత మైనారిటీలు గౌరవంగా బతికేలా తగు సహాయక, పునరావాస చర్యలు తీసుకునేలా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్ సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ డిమాండ్చేసింది. పేదలు, మధ్యతరగతిని వంచించారు: ఖర్గే ‘‘స్టాక్మార్కెట్లో చిన్న మదుపరుల పెట్టుబడుల భవితవ్యం అగమ్యగోచరం కాకూడదు. హిండెన్‌బర్గ్ బట్టబయలుచేసిన సెబీ, అదానీల ఉదంతం యావత్భారతావనికి షాక్‌కు గురిచేసింది. సెబీ, అదానీ సంబంధాలను బయటపెట్టేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ నేతృత్వంలో దర్యాప్తు జరపాల్సిందే. రాజ్యాంగంపై దాడి నిరాటంకంగా కొనసాగుతోంది.కుల గణన అనేది ప్రజల డిమాండ్. ఈ అంశాలపై త్వరలో దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్రలను చేపడదాం. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాల్సిందే. అగి్నపథ్ పథకాన్ని రద్దు చేయాలి. దేశంలో హద్దులేని నిరుద్యోగం, పగ్గాల్లేని ద్రవ్యోల్బణంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు, మధ్యతరగతిని ప్రభుత్వం వంచించింది. రైళ్లు పట్టాలు తప్పడం, రైలు ప్రమాదాలు ఆనవాయితీగా మారాయి’’ అని ఖర్గే అన్నారు. -
సెబీ చీఫ్‌పై ఆరోపణలు: దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
ఢిల్లీ:అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో ఆమెను సెబీ ఛైర్ పర్సన్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఆమెను ఛైర్మన్ పదవి నుంచి తొలిగించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 22 దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 22న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈడీ ఆఫీసుల ముందు భైఠాయించి నిరసనలు తెలుపుతాం. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జ్లు, పీసీసీ ప్రెసిడెంట్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదానీ గ్రూప్, సెబీకి సంబంధించిన అతిపెద్ద కుంభకోణంపై చర్చించాం. అదానీ మెగా స్కామ్‌పై జేపీసీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని అన్నారు.చదవండి: ముగిసిన ఏఐసీసీ మీటింగ్.. సెబీ, అదానీలే టార్గెట్ -
వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. దేశమంతటికీ విస్తరించిన ఆందోళనలు..
-
రాహుల్ గాంధీ.. యమా డేంజర్ : కంగనా రనౌత్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని అన్నారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ భారత్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మధబి బుచ్‌పై పలు ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలకు మద్దతిస్తూ..ప్రధాని మోదీ, సెబీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కంగనా స్పందించారు.ఎక్స్ వేదికగా.. రాహుల్ గాంధీ దేశ భద్రత,ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి. అతను ప్రధానమంత్రి కాలేకపోతే తను ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలనుకోవడమే అతని ఎజెండా’ అని కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can't be the Prime Minister then he might as well destroy this nation.Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out…— Kangana Ranaut (@KanganaTeam) August 12, 2024 -
‘బహిరంగ విచారణ జరగాలి’
సెబీ చీఫ్ మాధబి పురి బచ్, తన భర్త ధవల్ బచ్‌ల పెట్టుబడులపై పారదర్శకంగా, బహిరంగ విచారణ జరగాలని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కోరింది. బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దానిపై సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది.సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. ఇలా బచ్ ఇన్వెస్ట్మెంట్లపై తమ ఒరిజినల్ నివేదికలోనూ తెలిపామని హిండెన్‌బర్గ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024Buch’s response now publicly confirms her investment in an obscure Bermuda/Mauritius fund structure, alongside money allegedly siphoned by Vinod Adani. She also confirmed the fund was run by a childhood friend of her husband, who at the time was an Adani director.SEBI was…— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024ఇదీ చదవండి: మెరుగైన సమాచార లభ్యతపై దృష్టిమాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.Buch’s statement also claims that the two consulting companies she set up, including the Indian entity and the opaque Singaporean entity “became immediately dormant on her appointment with SEBI” in 2017, with her husband taking over starting in 2019.Per its latest shareholding… pic.twitter.com/gh7jS3zJKZ— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024 -
మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి
సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్ వేలిడేషన్ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్‌మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్ క్లాస్‌లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్ ఐఏలు, ఆర్‌ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకంఅన్రిజిస్టర్డ్ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్వీట్స్) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది. -
హిండెన్ బర్గ్ ఆరోపణలు.. మోదీపై రాహుల్ గాంధీ సెటైర్లు
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన తాజా ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. హిండెన్ బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ తాజాగా నివేదిక స్పష్టంగా తెలుపుతుందని అన్నారు.చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ సెబీ.. సమగ్రత, దాని చైర్‌పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో రాజీ పడింది అని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. అంతేకాదు,సెబీ చైర్పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలుసుకోవాలనుకుంటున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.The integrity of SEBI, the securities regulator entrusted with safeguarding the wealth of small retail investors, has been gravely compromised by the allegations against its Chairperson.Honest investors across the country have pressing questions for the government:- Why… pic.twitter.com/vZlEl8Qb4b— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2024 -
హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. మోదీ సర్కార్‌కు ట్విస్ట్ ఇచ్చిన ఖర్గే!
ఢిల్లీ: సెబీ ఛైర్పర్సన్ మాధబి పూరీ, ఆమె భర్తపై హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ షేర్ల విలువలను కృత్రిమంగా పెంచేందుకు వీరిద్దరూ దోహదపడ్డారని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ హయాంలో సెబీ బండారం బట్టబయలైందని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక, ఖర్గే తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ భారీ కుంభకోణంపై జేపీసీ విచారణ జరపాలి. దీనిపై విచారణ జరగనంతవరకు ప్రధాని మోదీ తన స్నేహితుడు(అదానీ)కి సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే సమయంలో హిండెన్‌బర్గ్ విషయంలో జనవరి 2023లో సుప్రీంకోర్టు.. సెబీ, అదానీకి క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేశాడు. నేడు ఆర్ధిక సంబందాలకు అధినేతగా చెప్పుకునే అదే సెబీ అసలు బండారం బయటకు వచ్చింది. దేశంలో మధ్యతరగతికి చెందిన చిన్న, మధ్యతరగతి పెట్టుబడిదారులు.. వారు కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. వారు సెబీని విశ్వసిస్తున్నందున వారికి రక్షణ అవసరం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, అంతకముందు కాంగ్రెస్ నేతలు హిండన్‌బర్గ్ రీసెర్చ్ విషయంలో కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. అదానీ గ్రూప్ చేస్తున్న కుంభకోణాలపై దర్యాప్తు విషయంలో సెబీ ఆసక్తి కనబరచకపోవడానికి గల కారణం ఇప్పుడు అర్థమైంది. దీనిని సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ కూడా గుర్తించలేకపోయింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. SEBI had previously cleared Adani, a close associate of PM Modi, before the Supreme Court following the January 2023 Hindenburg Report revelations.However, new allegations have surfaced regarding a quid-pro-quo involving the SEBI Chief.The small & medium investors belonging…— Mallikarjun Kharge (@kharge) August 11, 2024 -
ముందస్తుగా స్ట్రెస్ టెస్ట్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు సంబంధించి స్ట్రెస్ టెస్ట్‌ను ముందస్తుగా నిర్వహించాలని పరిశ్రమను కోరినట్టు సెబీ హోల్‌టైమ్ సభ్యుడు అనంత్ నారాయణ్ గోపాలకృష్ణన్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. స్ట్రెస్ టెస్ట్ కేవలం పథకాల కోసమో లేదా ఫండ్స్ సంస్థల కోసమే కాదని.. మొత్తం మ్యూచువల్ ఫండ్ వ్యవస్థకు సంబంధించినదిగా పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక అనిశి్చతులు, ఆటుపోట్ల పరిస్థితుల్లో ఇన్వెస్టర్ల నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉపసంహరణ ఒత్తిళ్లు (లిక్విడిటీ రిస్క్) ఎదురైతే.. వాటిని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, పరిశ్రమ ఎలా అధిగమించగలవో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు తెలియజేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థల (ఏఎంసీల) సన్నద్ధతను ఇది పెంచుతుంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో లిక్విడిటీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం తెలిసిందే. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల పరిధిలో ఉండే రిస్క్‌పై ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించేందుకు మెరుగైన మార్గాలను గుర్తించేందుకు ఇది సాయపడుతుందని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న రిస్క్ నిర్వహణ విధానం.. వివిధ పథకాల్లో ఉండే వేర్వేరు రిస్క్ స్థాయిలను ప్రతిబింబించడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వేర్వేరు రిస్క్ స్థాయిలు ఉన్నప్పటికీ.. చాలా పథకాలకు కేవలం అధిక రిస్క్ ట్యాగ్ వేస్తున్నట్టు చెప్పారు. కనుక ఈ వ్యత్యాసాలను మరింత పారదర్శకంగా తెలియజేయడమే కొత్త వ్యవస్థ లక్ష్యమన్నారు. సులభంగా ఉండాలి.. ‘‘పోర్ట్‌ఫోలియోలో అంతర్లీనంగా ఉండే ఆటుపోట్లను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇందుకు గాను రిస్‌్కలను సులభంగా అర్థం చేసుకునే విధంగా సమాచారం ఉండాలి. పోర్ట్‌ఫోలియో స్ట్రెస్ టెస్ట్ ఫలితాలు ఈ దిశగా మరింత స్పష్టతనిస్తాయి’’అని గోపాలకృష్ణన్ తెలిపారు. కార్యకలాపాలు క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు మరింత కచ్చితత్వంతో సేవలు అందించడంపై దృష్టి పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమకు సూచించారు. అప్పటికప్పుడే నిధుల బదిలీకి మన వ్యవస్థలు వీలు కలి్పస్తున్న తరుణంలో.. సెటిల్మెంట్ రోజే ఇన్వెస్టర్లకు నిధుల బదిలీ చేయాలా చూడాలన్నారు. విక్రయించిన మరుసటి రోజు లేదా రెండు రోజుల తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లకు ఫండ్స్ సంస్థలు నిధులు బదిలీ చేస్తుండడంతో గోపాలకృష్ణన్ సూచనకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
15 రోజుల్లో రూ.24.57 కోట్లు చెల్లించాలి: సెబీ
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, కంపెనీ సీఎండీ సి.పార్థసారథికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నోటీసు జారీ చేసింది. పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేయడం ద్వారా ఖాతాదారుల నిధులను పక్కదారి పట్టించిన కేసులో రూ.24.57 కోట్లను చెల్లించాలని ఆదేశించింది.గతంలో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో కార్వీ సంస్థ విఫలమైంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నుంచి ఈ నోటీసు వచ్చింది. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించని పక్షంలో బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసి, కంపెనీల స్థిర, చర ఆస్తులను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని రికవరీ చేస్తామని సెబీ హెచ్చరించింది. అంతేకాకుండా మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం పార్థసారథిని అరెస్ట్ చేసి జైలులో నిర్బంధిస్తామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదుబ్రోకింగ్ సంస్థకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీను దుర్వినియోగం చేసినట్లు సెబీ గతంలోనే తెలిపింది. క్లయింట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారని పేర్కొంది. దాంతో ఏప్రిల్ 2023లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్, సీఎండీ పార్థసారథిలను సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు సెబీ నిషేధించింది. అలాగే రూ.21 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. అయితే ఈ పెనాల్టీను చెల్లించడంలో కార్వీ జాప్యం చేస్తోంది. దాంతో జరిమానాతో కలిపి మొత్తం రూ.24.57 కోట్లు చెల్లించాలని సెబీ ఆదేశించింది. -
నిరసనకు సిద్ధమైన సెబీ ఉద్యోగులు!
భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిరసన సెగ ఎదుర్కోబోతోంది. సంస్థలో ఏ, బీ, సీ గ్రేడ్లలో పనిచేసే సుమారు 700 మంది ఉద్యోగులు సోమవారం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం, సెబీ భవన్ వన్ వద్ద నిరసనకు సిద్ధమైనట్లు ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదించింది.సంస్థ నాయకత్వంపై గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. ఇక నిరసనకు ఆజ్యం పోసిన ప్రధాన అంశాలు మరికొన్ని ఉన్నాయి. సెబీ అందిస్తున్న అలవెన్సులు, ఆర్బీఐ అధికారులకు అందించే వాటి స్థాయిలో లేవనే అసంతృప్తి సెబీ అధికారుల్లో ఉంది.దీంతోపాటు కీ రిజల్ట్ ఏరియాస్ (KRA) అప్లోడ్ చేయడానికి ప్రవేశపెట్టిన కొత్త సిస్టమ్‌తో కొంత మందికి అలవెన్స్‌లు ఆగిపోయే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తులను చల్లార్చేందుకు క్షమాపణలు కోరుతూ సెబీ నాయకత్వం ఈమెయిల్ పంపినప్పటికీ ఉద్యోగులు నిరసనను విరమించుకోలేదని తెలిసింది. -
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
పేటీఎమ్‌కు సెబీ ఝలక్
న్యూఢిల్లీ: పాలనా సంబంధ నిబంధనలు ఉల్లంఘించినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా హెచ్చరికల లేఖను అందుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే సహచర సంస్థ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్స్(పీపీబీఎల్)తో సంబంధిత పార్టీ లావాదేవీ(ఆర్పీటీ)లను నిర్వహించినట్లు లేఖలో సెబీ పేర్కొంది. అయితే సెబీ నిబంధనలను స్థిరంగా అమలు చేస్తున్నట్లు బీఎస్ఈకి దాఖలు వివరాలలో పేటీఎమ్ తెలియజేసింది. నిబంధనల అమలులో కంపెనీ అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా సెబీకి వివరణను సైతం సమర్పించనున్నట్లు పేటీఎమ్ బ్రాండ్ డిజిటల్ చెల్లింపుల కంపెనీ వెల్లడించింది. కాగా, సెబీ లేఖ ప్రకారం పీపీబీఎల్, వన్97 కమ్యూనికేషన్స్ సంబంధ ఫైనాన్షియల్ తదితర సమాచారంపై సెబీ పరిశీలన చేపట్టింది. దీనిలో నిబంధనలు పాటించని అంశం గుర్తించింది. ఆడిట్ కమిటీ లేదా వాటాదారుల అనుమతి లేకుండానే ఆర్‌పీటీలలో పేటీఎమ్ లేదా అనుబంధ సంస్థలు పీపీబీఎల్‌తో అధిక లావాదేవీలు చేపట్టినట్లు సెబీ పేర్కొన్నట్లు వన్97 బీఎస్ఈకి తెలియజేసింది. -
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్!
న్యూఢిల్లీ: అకౌంటింగ్లో అవకతవకల ఆరోపణలతో అదానీ గ్రూప్‌ను కుదిపేసిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ షాకాజ్ నోటీసులు జారీ చేసింది. అదానీ సంస్థల స్టాక్స్ విషయంలో అనుచిత వ్యాపార విధానాలను అమలు చేశారనే ఆరోపణల మీద జూన్ 27న తమకు 46 పేజీల నోటీసు వచ్చినట్లు హిండెన్‌బర్గ్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఇది అర్ధరహితమైన చర్యగా కొట్టిపారేసింది. కార్పొరేట్ అవినీతిని, మోసాలను బహిర్గతం చేసేవారిని భయపెట్టేందుకు భారత్‌లో అత్యంత శక్తిమంతులైన వారు చేస్తున్న ప్రయత్నమని వ్యాఖ్యానించింది.అదానీ గ్రూప్ స్టాక్స్‌లో తమకు షార్ట్ పొజిషన్లు ఉన్నాయనే విషయాన్ని అధ్యయన నివేదికను ప్రకటించినప్పుడే తాము వెల్లడించామని హిండెన్‌బర్గ్ పేర్కొంది. ఒక ఇన్వెస్టర్ తరఫున తీసుకున్న పొజిషన్లకు సంబంధించి 4.1 మిలియన్ డాలర్లు లభించాయని, సొంతంగా అదానీ అమెరికా బాండ్లను షార్ట్ చేయడం ద్వారా 31,000 డాలర్లు వచ్చాయని తెలిపింది. లీగల్ ఖర్చులు, అధ్యయనంపై చేసిన వ్యయాలకు అవి బొటాబొటీగా సరిపోయాయని వివరించింది. ఆర్థికంగా గానీ వ్యక్తిగత భద్రతపరంగా గానీ అదానీ గ్రూప్‌పై అధ్యయనం తమకు ఏమాత్రం ప్రయోజనకరమైనది కాకపోయినా ఇప్పటివరకు తాము చేసిన వాటిల్లో అత్యంత గర్వకారణమైనదిగా ఇది నిలిచిపోతుందని హిండెన్‌బర్గ్ తెలిపింది. కోటక్ గ్రూప్ పాత్ర .. అదానీ స్టాక్స్‌ను షార్ట్ చేసేందుకు తమ భాగస్వామ్య ఇన్వెస్టరు ఒకరు .. కోటక్ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన ఆఫ్‌షోర్ ఫండ్‌ను ఉపయోగించినట్లు హిండెన్‌బర్గ్ తెలిపింది. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ పేరు బైటికి రాకుండా చూసేందుకే సెబీ తన నోటీసులో కోటక్‌ను ప్రస్తావించకుండా కే–ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ (కేఐవోఎఫ్) అని మాత్రమే పేర్కొందని ఆరోపించింది. సెబీ నోటీసుల ప్రకారం హిండెన్‌బర్గ్ క్లయింట్ అయిన కింగ్డన్ క్యాపిటల్.. అధ్యయన నివేదిక విడుదలకు ముందు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్కి (కేఎంఐఎల్) చెందిన కేఐవోఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది.అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను షార్ట్ చేసిన కేఐవోఎఫ్ .. నివేదిక విడుదల తర్వాత పరిణామాలతో మొత్తం రూ. 183.24 కోట్ల లాభాలు ఆర్జించింది. మరోవైపు, కేఐవోఎఫ్, కేఎంఐఎల్‌కు హిండెన్‌బర్గ్ ఎన్నడూ క్లయింటుగా లేదని కోటక్ మహీంద్రా గ్రూప్ స్పష్టం చేసింది. తమ ఇతర ఇన్వెస్టర్లకు, హిండెన్‌బర్గ్‌కు మధ్య ఉన్న సంబంధాల గురించి తమకు తెలియదని పేర్కొంది. అదానీ గ్రూప్‌లో షేర్లు, అకౌంట్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 2023 జనవరిలో విడుదల చేసిన నివేదికతో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. -
ప్యాసివ్ ఫండ్స్‌కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రోత్సాహకంగా సరళతర నిబంధనలను సెబీ ప్రతిపాదించింది. ప్యాసివ్‌గా నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో అంతర్గతంగా రిస్క్ చాలా తక్కువగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ.. నిబంధనల అమలు భారాన్ని తగ్గించడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడం, పోటీకి మద్దతునివ్వడం, కేవలం ప్యాసివ్ పథకాలనే ఆవిష్కరించే మ్యూచువల్ ఫండ్స్ సంస్థలను (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) ప్రోత్సహించడం కోసం ‘ఎంఎఫ్ (మ్యూచువల్ ఫండ్) లైట్’ పేరుతో సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేస్తూ భాగస్వాముల నుంచి అభిప్రాయాలు కోరింది. ప్యాసివ్ పథకాలు అంటే?మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్, ప్యాసివ్ అని రెండు రకాల పథకాలు ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ల పాత్ర కీలకం. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించేది వీరే. అదే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పనితీరు వీటికి భిన్నం. ఈటీఎఫ్‌లు, ఇండెక్స్ ఫండ్స్ ప్యాసివ్ ఫండ్స్ కిందకే వస్తుంటాయి. ఇవి ఒక సూచీని అనుసరిస్తూ ఆ సూచీలోని కంపెనీల్లో, వాటి వెయిటేజీకి అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక వీటి రాబడులు ఆయా సూచీల పనితీరును పోలి ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్‌లో సరైన కంపెనీలను, సరైన వ్యాల్యూషన్ల వద్ద ఎంపిక చేసుకోవాలి. సరైన సమయంలో ఆయా కంపెనీల్లోని పెట్టుబడులను ఉపసంహరించుకోవడం కూడా చేయాల్సి వస్తుంది. అందుకే వీటికి ఫండ్ మేనేజర్లు, పరిశోధక బృందం నైపుణ్యాలు కీలకం అవుతాయి. కానీ, ప్యాసివ్ ఫండ్స్‌లో అంత నైపుణ్యాలు అవసరం ఉండవు. సూచీల ఆధారంగా పెట్టుబడులను కేటాయిస్తే సరిపోతుంది. అందుకే వీటిల్లో రిస్క్ చాలా తక్కువ. కానీ, ప్రస్తుతం ప్యాసివ్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఒకే విధమైన కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. నికర విలువ, పనితీరు, లాభదాయకత తదితర అంశాల విషయంలో నిబంధనలు కేవలం ప్యాసివ్ ఫండ్స్‌నే ప్రారంభించాలనుకునే సంస్థలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఇది గుర్తించిన సెబీ, ఎంఎఫ్ లైట్ పేరుతో ప్యాసివ్ ఫండ్స్‌కు సులభతర నిబంధనలు ప్రతిపాదించింది. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలే ఎంఎఫ్ లైట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తూ, యాక్టివ్తోపాటు, ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించే సంస్థలు ప్రస్తుత రిజి్రస్టేషన్ కిందే కొనసాగొచ్చు. కేవలం ప్యాసివ్ ఫండ్స్‌ను నిర్వహించాలనుకునే సంస్థలకు రిజిస్ట్రేషన్, సమాచార వెల్లడి, నింధనల అమలులో వెసులుబాటును సెబీ ప్రతిపాదించింది. సభ్యులందరికీ ఒకే చార్జీలుస్టాక్ ఎక్సే్ఛంజ్‌లు తమ సభ్యులందరికీ ఒకే విధమైన చార్జీలు వసూలు చేయాలని సెబీ తాజాగా ఆదేశించింది. సభ్యుల లావాదేవీల పరిమాణంతో సంబంధం లేకుండా అందరికీ చార్జీలు ఒకే రకంగా ఉండాలని సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్లతోపాటు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐలు) అయిన క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. ‘‘ఎంఐఐలు నూతన చార్జీల విధానం రూపొందించే ముందు, ప్రస్తుతం ఒక యూనిట్ వారీ అవుతున్న చార్జీలను పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల చార్జీల తగ్గింపుతో తుది క్లయింట్ (ఇన్వెస్టర్) లబ్ధి పొందుతారు’’అని సెబీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
తప్పుడు సలహాలు ఇక కుదరవు!! సెబీ కొత్త రూల్స్
ముంబై: సెక్యూరిటీస్ లావాదేవీలపై అనియంత్రిత ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు (ఫిన్ఫ్లుయెన్సర్లు) ఇచ్చే తప్పుడు సలహాలతో తలెత్తే రిస్కులపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై దృష్టి సారించింది. ఫిన్ఫ్లుయెన్సర్లను నియంత్రణ పరిధిలోకి తెస్తూ నిబంధనలను ఆమోదించింది.వీటి ప్రకారం ప్రతిఫలం తీసుకుని కచ్చితమైన రాబడులు వస్తాయంటూ సలహాలిచ్చే వ్యక్తులతో సెబీ నియంత్రణలోని వ్యక్తులు (బ్రోకర్లు మొదలైనవారు) కలిసి పని చేయకూడదు. సాధారణంగా కమీషన్ ప్రాతిపదికన పని చేసే ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కొన్నాళ్లుగా తమ ఫాలోయర్ల ఆర్థిక నిర్ణయాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నారు. తామిచ్చే సలహాల విషయంలో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు తాజా సెబీ నిబంధనలు ఉపయోగపడనున్నాయి.మరోవైపు, తరచుగా ట్రేడయ్యే షేర్లను డీలిస్ట్ చేయడానికి సంబంధించి ఫిక్సిడ్ ధర ప్రక్రియను ప్రవేశపెట్టాలని సెబీ నిర్ణయించింది. అలాగే, ఇన్వెస్ట్మెంట్, హోల్డింగ్ కంపెనీల (ఐహెచ్సీ) డీలిస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ఆవిష్కరించింది. ఫిక్స్డ్ ధర విధానంలో డీలిస్టింగ్‌కు ఫ్లోర్ ధర కంటే కనీసం 15 శాతం ప్రీమియంతో ఆఫర్‌ను చేపట్టవలసి ఉంటుంది. డెరివేటివ్స్ నిబంధనలు కఠినతరం.. ఇండివిడ్యువల్ స్టాక్స్‌ను డెరివేటివ్స్ సెగ్మెంట్లో చేర్చడం, తీసివేయడానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. క్యాష్ మార్కెట్లో పనితీరును బట్టి వాటిని చేర్చడం లేదా తీసివేయడమనేది ఉంటుందని పేర్కొంది. తక్కువ టర్నోవరు ఉన్న స్టాక్స్‌ను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ నుంచి తప్పించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. మరోవైపు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కేటగిరీని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది సెకండరీ మార్కెట్ అడ్వైజరీ కమిటీకి తన నివేదికను సమర్పిస్తుందని సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. -
క్వాంట్ ఫండ్ కార్యాలయాల్లో సెబీ సోదాలు
ముంబై: ఫ్రంట్ రన్నింగ్ కేసులను తీవ్రంగా పరిగణిస్తున్న మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా క్వాంట్ మ్యుచువల్ ఫండ్‌పై దృష్టి సారించింది. కంపెనీకి చెందిన హైదరాబాద్, ముంబై కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధమున్న డీలర్లు, వ్యక్తులను కూడా సెబీ ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సందీప్ టాండన్ నెలకొల్పిన క్వాంట్ మ్యుచువల్ ఫండ్ అసెట్లు 2019లో సుమారు రూ. 100 కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం రూ. 90,000 కోట్ల పైచిలుకు చేరాయి. 26 స్కీములు, 54 లక్షల ఫోలియోలతో ఈ ఫండ్ ఈ ఏడాది జనవరిలోనే రూ. 50,000 కోట్ల మార్కును దాటింది. సంస్థకి చెందిన స్మాల్ క్యాప్ ఫండ్ గత అయిదేళ్లలో ఏకంగా 45 శాతం రాబడిని అందించింది. మే నెలలో స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వచి్చన మొత్తం నిధులలో 43 శాతం నిధులు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్‌లోకే రావడం గమనార్హం. పెద్ద ఆర్డర్లు రాబోతున్న సమాచారం తెలుసుకుని ఫండ్ మేనేజర్లు, డీలర్లు, బ్రోకర్లు ముందుగానే తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లలో ట్రేడింగ్ చేసి లాభపడటాన్ని ఫ్రంట్ రన్నింగ్‌గా వ్యవహరిస్తారు. ఇలాంటి లావాదేవీలన్నీ వేరే వారి పేరిట ఉండే ఖాతాల ద్వారా జరుగుతాయి కాబట్టి అంతిమంగా లబ్ధి పొందే వ్యక్తులను గుర్తించడం కఠినతరంగా ఉంటోంది. దీంతో సెబీ కొన్నాళ్లుగా ఈ తరహా కేసులపై మరింత లోతుగా విచారణ జరుపుతోంది. ఇలాంటి ఆరోపణలపైనే యాక్సిస్ మ్యుచువల్ ఫండ్‌కి చెందిన ఫండ్ మేనేజర్ వీరేశ్ జోషితో పాటు అతనికి సంబంధించిన 20 సంస్థలు, వ్యక్తులపై సెబీ గతంలో చర్యలు తీసుకుంది. -
దిగ్గజ ఐపీవోలకు ఓకే.. సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ, హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఎమ్క్యూర్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు కంపెనీలూ 2023 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. రూ. 5,500 కోట్లకు రెడీ ఐపీవో ద్వారా ఓలా ఎలక్ట్రిక్ రూ. 5,500 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూ నిధులలో అత్యధిక శాతాన్ని సామర్థ్య విస్తరణ, సెల్ తయారీ ప్లాంట్, ఆర్అండ్డీపై పెట్టుబడులకు వినియోగించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 9.52 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. రూ. 1,226 కోట్లు సెల్ తయారీ యూనిట్‌కు, రూ. 1,600 కోట్లు ఆర్‌అండ్‌డీకి, మరో రూ. 800 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. ఇక బెయిన్ క్యాపిటల్‌కు పెట్టుబడులున్న ఎమ్క్యూర్ ఫార్మా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.ఆఫీసర్స్ చాయిస్ @ రూ. 267–281 ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 267–281 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 27న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 24న షేర్లను కేటాయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,000 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయాలి. -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్‌లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్‌వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
సెబీ.. ఇన్వెస్టర్ సర్టిఫికేషన్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు సర్టిఫికేషన్ పరీక్షను నిర్వహించనుంది. దీంతో ఉచితంగా స్వచ్చంద పద్ధతిలో ఇన్వెస్టర్లు ఆన్లైన్లో పరీక్షను రాయడం ద్వారా సరి్టఫికేషన్‌ను అందుకునేందుకు వీలుంటుంది. తద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సమగ్ర విజ్ఞానాన్ని పొందవచ్చని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం) సహకారంతో అభివృద్ధి చేసిన సర్టిఫికేషన్‌ను సెబీ జారీ చేయనుంది. వెరసి ఇన్వెస్టర్లు స్వచ్చందంగా మార్కెట్లు, పెట్టుబడుల విషయంలో తమ విజ్ఞానాన్ని పరీక్షించుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ సెక్యూరిటీల మార్కెట్లో ప్రావీణ్యాన్ని పెంచుకునేందుకు పరీక్ష ఉపయోగపడుతుందని తెలియజేసింది. -
నామినీ నిబంధనలు సడలించిన సెబీ
డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును జతచేయాలనే నిబంధనను సడలిస్తూ సెబీ నిర్ణయం తీసుకుంది.గతంలో సెబీ జారీ చేసిన నియమాల ప్రకారం..డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ఫండ్ పోర్ట్‌ఫోలియోలో నామినీ పేరును తప్పకుండా జతచేయాలి. నామినీ అవసరం లేనివారు (ఆప్ట్ ఔట్ ఆఫ్ నామినేషన్) అని ఎంచుకోవాలి. ఇందులో ఏదో ఒకటి జూన్ 30లోపు తెలియజేయాల్సి ఉంది. ఆయా వివరాలు సమర్పించని వారి డీమ్యాట్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు జూన్30 తర్వాత పనిచేయవని సెబీ గతంలో చెప్పింది.ఈ నిబంధనలను మరోసారి పరిశీలించాలని సెబీకి మార్కెట్ వర్గాల నుంచి భారీగా అభ్యర్థనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సెబీ తన పాత ఆదేశాలన్ని సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మదుపు చేస్తున్న డీమ్యాట్ ఖాతాదారులు, ఫండ్ మదుపరులు నామినేషన్ వివరాలు తెలియజేయకపోయినా వారి ఖాతాల విషయంలో ఎలాంటి చర్యలుండవని సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు భౌతిక రూపంలో షేర్ల సర్టిఫికెట్లు ఉన్న వారికీ డివిడెండ్, వడ్డీ, ఇతర చెల్లింపులతోపాటు, అవసరమైన సేవల విషయాలన్నీ నామినేషన్‌తో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.నామినీ జత చేయడంపై సెబీ సడలింపు ఇచ్చినా తప్పకుండా డీమ్యాట్, ఫండ్ పెట్టుబడిదారులు ఆయా వివరాలు నమోదు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు కాబట్టి ఏక్షణం ఏదైనా జరగొగ్గచ్చు. మనం ఉన్నా..లేకపోయినా మనం కష్టపడి సంపాదించికున్న పెట్టుబడులు, లాభాలను నామినీకు చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. -
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్‌బీఎఫ్‌సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్‌కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
సెబీ నుంచి అప్డేటెడ్ మొబైల్ యాప్ సారథి2.0
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పర్సనల్ ఫైనాన్స్‌పై విస్తృత సమాచారంతో సారథి2.0(Saarthi2.0) మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన ఈ యాప్‌లో సమీకృత టూల్స్‌కు చోటు కలి్పంచింది. సంక్లిష్టమైన ఫైనాన్షియల్ కాన్సెప్్ట్సను సరళతరం చేయడమే లక్ష్యంగా అప్డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లు సెబీ పేర్కొంది. వినియోగదారులకు సులభరీతిలో అర్ధమయ్యే విధంగా సమాచారాన్ని క్రోడీకరించినట్లు తెలియజేసింది. యాప్‌లో ఫైనాన్షియల్ కాల్క్యులేటర్లు, కేవైసీ విధానాలు వివరించే మాడ్యూల్స్, ఎంఎఫ్‌లు, ఈటీఎఫ్లతోపాటు స్టాక్ ఎక్సే్ఛంజీలలో షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు, ఇన్వెస్టర్ల సమస్యల పరిష్కార విధానాలు తదితర పలు అంశాలను చేర్చినట్లు వివరించింది. -
జూన్ 1 నుంచి సెబీ కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: మార్కెట్ వదంతుల ప్రభావంతో షేర్ల ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటాన్ని కట్టడి చేసే దిశగా సెబీ కొత్త నిబంధనలు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఇవి టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు వర్తిస్తాయి. డిసెంబర్ 1 నుంచి తదుపరి 150 కంపెనీలకు వర్తిస్తాయి. వీటి ప్రకారం తమ షేర్ల ధరలను ప్రభావితం చేసే వదంతులేవైనా వస్తే లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోగా ధృవీకరించడమో లేదా ఖండించడమో లేదా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్‌ఈ) డీల్స్ విషయంలో ’అప్రభావిత ధర’ కాన్సెప్టును కూడా సెబీ ప్రతిపాదించింది. దీని ప్రకారం వదంతుల ప్రభావమేమీ లేనప్పుడు షేరు సగటు ధర ఎంత ఉందో దాన్ని ఎంఅండ్‌ఈ డీల్స్ కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. దీన్ని లెక్కించేందుకు సెబీ నిర్దిష్ట విధానాన్ని సూచించింది. -
బీఎస్ఈ కంపెనీల సరికొత్త రికార్డ్ 5 లక్షల కోట్ల డాలర్లు
దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ తాజాగా 5 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఈ ఏడాది ప్రారంభం నుంచి 633 బిలియన్ డాలర్లకుపైగా జమ చేసుకుంది. నిజానికి మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టానికి 1.7 శాతం దూరంలో ఉన్నప్పటికీ బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించడం విశేషం!ముంబై: బీఎస్ఈ తొలిసారి 5 లక్షల కోట్ల డాలర్ల విలువను అందుకుంది. ఓవైపు బ్లూచిప్స్ పరుగుతీస్తుంటే.. మరోపక్క మధ్య, చిన్నతరహా కంపెనీల ఇండెక్సులు సైతం సరికొత్త గరిష్టాలకు చేరాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రికార్డ్ నెలకొల్పింది. వెరసి బీఎస్ఈ విలువ తొలిసారి రూ. 415 లక్షల కోట్లకు చేరింది. 2023 నవంబర్‌లో తొలిసారి బీఎస్ఈ విలువ 4 ట్రిలియన్ డాలర్లను తాకింది.ఆపై ఆరు నెలల్లోనే 5 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకూ ప్రపంచంలో 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్లో యూఎస్ఏ, చైనా, జపాన్, హాంకాంగ్ మాత్రమే ఉన్నాయి. మిడ్, స్మాల్ క్యాప్స్ భారీగా సహకరించడం ఈ సందర్భంగా గమనార్హం. ఇటీవల మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ.. 2024 జనవరి మొదలు సెన్సెక్స్ 2.3 శాతం బలపడగా.. మిడ్ క్యాప్ 16.3 శాతం, స్మాల్ క్యాప్ 11.5 శాతం ఎగశాయి. జర్నీ తీరిలా 2007 మే నెలలో ట్రిలియన్ డాలర్ల విలువను సాధించిన బీఎస్ఈ ఆపై దశాబ్దం తదుపరి అంటే 2017 జులైలో 2 ట్రిలియన్ డాలర్లను చేరింది. ఈ బాటలో 2021 మే నెలకల్లా 3 లక్షల కోట్ల డాలర్లను తాకింది. 5 లక్షల కోట్ల డాలర్ల జాబితాలో 55.65 ట్రిలియన్ డాలర్లతో యూఎస్ఏ టాప్ ర్యాంకులో ఉంది. 9.4 ట్రిలియన్లతో చైనా, 6.4 ట్రిలియన్లతో జపాన్, 5.47 ట్రిలియన్లతో హాంకాంగ్ తదుపరి నిలుస్తున్నాయి.మార్కెట్ విలువ మదింపులో మార్పులు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను మదింపు చేయడంలో సెబీ తాజాగా నిబంధనలను పునర్వ్యవస్థీకరించింది. దీంతో ఇకపై రోజువారీ మార్కెట్ విలువ మదింపునకు బదులుగా ఆరు నెలల సగటును ప్రాతిపదికగా తీసుకోనున్నారు. దీని వలన సరైన విలువ మదింపునకు వీలుంటుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్వల్ప నష్టాలతో సరి.. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల వేళ అప్రమత్తత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 53 పాయింట్లు నష్టపోయి 73,953 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,529 వద్ద నిలిచింది. మెటల్, ఇంధన షేర్లు రాణించగా, బ్యాంకులు, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోన య్యాయి.ఉదయం నష్టాలతో మొదలైన సూచీలు.., మిడ్ సెషన్లో కాసేపు లాభాల్లో ట్రేడయ్యా యి. తదుపరి అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు వెల్లడికి ముందు(బుధవారం రాత్రి) అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో (జూన్ 4న) ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ సూచీ 7% పెరిగి 23 నెలల గరిష్టస్థాయి 22.3 స్థాయిని తాకింది. -
SEBI: కేవైసీ నిబంధనలు సరళతరం
న్యూఢిల్లీ: కేఆర్‌ఏల (కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీలు) ద్వారా కేవైసీ రికార్డుల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించి రిస్కుల నిర్వహణ విధానాన్ని సరళతరం చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం కేఆర్ఏలు అధికారిక డేటాబేస్‌ల ఆధారంగా పాన్, పేరు, చిరునామా, ఈమెయిల్, మొబైల్ నంబరును ధృవీకరించవచ్చు. ఇవన్నీ సక్రమంగా ఉంటే రికార్డులను ధృవీకరించినట్లుగా పరిగణిస్తారని సైన్జీ సహ వ్యవస్థాపకుడు అంకిత్ రతన్ తెలిపారు. పెట్టుబడుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో డిజిటల్ గుర్తింపును ధృవీకరించడం చాలా కీలకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామం ఇన్వెస్టర్లకు లావాదేవీలను సులభతరం చేసేందుకు తోడ్పడగలదని వివరించారు. కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడానికి వీలుగా ఎక్స్చేంజీలు, డిపాజిటరీలు, సంబంధిత మధ్యవర్తిత్వ సంస్థలు మే నెలాఖరు నాటికి తగిన సాంకేతిక మార్పులు, చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. క్యామ్స్, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మొదలైనవి కేఆర్‌ఏలుగా వ్యవహరిస్తున్నాయి. ఇవి సాధారణంగా బ్రోకింగ్ సంస్థలు, ఎక్సే్చంజీలు, ఇంటర్మీడియరీల నుంచి సేకరించిన ఇన్వెస్టర్ల కేవైసీ వివరాలను నిర్వహిస్తున్నాయి. -
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్ఎస్ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్ఎస్ఈ ట్రేడింగ్ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు. తదుపరి స్టాక్ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
బిజినెస్: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో.. గవర్నర్ చర్చ!
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నార్త్‌బ్లాక్‌లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశమయ్యారు. ఎకానమీపై చర్చించారు. కాగా సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై మార్కెట్ పరిణామాలను వివరించారు. స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ కపూర్ సీతారామన్‌తో సమావేశమయినట్లు మరో పోస్ట్‌లో ఆర్థికశాఖ పేర్కొంది. ఇవి చదవండి: బిజినెస్ - నష్టాల్లోంచి లాభాల్లోకి.. -
పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు. 2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి. -
చిన్న షేర్లలో అవకతవకలు
ముంబై: చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవీ పురి పేర్కొన్నారు. కొంతమంది అసహజ లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించామని తెలియజేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) విభాగంలో కృత్రిమంగా ధరల పెంపును చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్ఎంఈ విభాగం ఐపీవోలతోపాటు.. సెకండరీ మార్కెట్లోనూ అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి రిసు్కలు అధికంగాగల విభాగంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచించారు. ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా మహిళా పాత్రికేయులతో ముచ్చటించిన పురి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన విభాగంతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగం ప్రత్యేకమైనదని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవలసి ఉన్నట్లు పురి పేర్కొన్నారు. ప్రధాన విభాగంలోని కంపెనీలు తప్పనిసరిగా సమాచారాన్ని వెల్లడించవలసి ఉంటుందని, అయితే ఎస్ఎంఈ విభాగం రిసు్కలు విభిన్నంగా ఉంటాయని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో టీ+0 సెటిల్మెంట్ సెక్యూరిటీల టీ+0 సెటిల్మెంట్ను మార్చి 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నట్లు పురి తెలియజేశారు. గత కొద్ది నెలల్లో భారీగా దూసుకెళుతున్న స్మాల్, మిడ్ క్యాప్ విభాగం షేర్ల విలువలపై స్పందిస్తూ కొన్ని కౌంటర్లలో అసహజ లావాదేవీలు నమోదవుతున్న సంకేతాలున్నట్లు వెల్లడించారు. ధరలను మ్యానిప్యులేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి బుడగలవంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి బుడగలు తలెత్తేందుకు అనుమతించకూడదని, ఇవి పగలిపోతే ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఇది మార్కెట్లకు మంచిదికాదని అభిప్రాయపడ్డారు. స్టాక్ బ్రోకర్లకు కఠిన నిబంధనలు కాగా, అర్హతగల స్టాక్ బ్రోకర్(క్యూఎస్బీ)గా గుర్తించే మార్గదర్శకాలను సెబీ తాజాగా విస్తృతం చేసింది. తద్వారా మరింతమంది బ్రోకర్లను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాజా చర్యలకు తెరతీసింది. యాజమాన్య సంబంధ లావాదేవీల పరిమాణం, నిబంధనలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను స్టాక్ బ్రోకర్లను క్యూఎస్బీలుగా గుర్తించడంలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఒక సర్క్యులర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పేర్కొంది. -
తప్పుడు ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
తప్పుదారి పట్టించే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మార్గంలో దేశీ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొనే ప్లాట్‌ఫామ్స్‌పట్ల అప్రమత్తతను ప్రదర్శించవలసిందిగా సూచించింది. మోసగాళ్లు స్టాక్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటార్íÙప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు వివరించింది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ తదితర లైవ్ బ్రాడ్క్యాస్ట్లను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టరైన ఎఫ్‌పీఐలు లేదా ఉద్యోగులులా మభ్యపెడుతూ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేలా వ్యక్తిగత ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఖాతాల లబ్దిని అందుకోమని ప్రోత్సహిస్తూ షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు తదితరాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఎలాంటి ట్రేడింగ్ లేదా డీమ్యాట్ ఖాతా అవసరంలేదంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు వివరించింది. ఈ పథకాలకు తప్పుడు పేర్లతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
స్మాల్, మిడ్‌క్యాప్‌పై సెబీ అలర్ట్
న్యూఢిల్లీ: స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ విలువలు గణనీయంగా పెరిగిన సమయంలో మదుపరుల ప్రయోజనాల పరిరక్షణ కోసం సెబీ కీలక సూచనలు చేసింది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారి రక్షణ దృష్ట్యా తగిన కార్యాచరణను/విధానాలను అమల్లో పెట్టాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలను (ఏఎంసీలు) ఆదేశించింది. ఈ విభాగాల్లోకి వచ్చే తాజా పెట్టుబడులపై ఆంక్షలు, పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్ తదితర చర్యలను పరిశీలించాలని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తన సభ్యులను కోరింది. సెబీ తరఫున యాంఫి ఈ సూచనలు చేసింది. నిజానికి గడిచిన ఏడాది కాలానికి పైగా స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో పెద్దగా దిద్దుబాటు రాలేదు. 2023లో మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.22,913 కోట్లు రాగా, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.41,305 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీగా పెట్టుబడులు వస్తుండడం, స్టాక్స్ విలువలను మరింత పైకి తీసుకెళుతోంది. ఈ తరుణంలో సెబీ ఫండ్స్ సంస్థలను అప్రమత్తం చేయడం గమనార్హం. 21 రోజుల్లోగా నూతన విధానాన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ వెబ్సైట్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్త.. ప్రతి నెలా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.వేలాది కోట్లు వస్తుంటే, వాటిని ఫండ్ మేనేజర్లు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల స్టాక్స్ విలువలు మరింత పెరిగిపోతాయి. ఈ ర్యాలీని చూసి ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. కానీ, దిద్దుబాటు మొదలైందంటే, దీనికి విరుద్ధంగా అమ్మకాల ఒత్తిడికి స్టాక్స్ విలువలు దారుణంగా పడిపోయే రిస్క్ ఉంటుంది. దీన్ని నివారించేందుకు, పెట్టుబడుల రాకను క్రమబద్దీకరించేందుకు సెబీ ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా, ఎస్బీఐ, టాటా మ్యూచువల్ ఫండ్ సంస్థలు స్మాల్‌క్యాప్ పథకాలకు సంబంధించి లంప్సమ్ (ఏక మొత్తం/ఒకే విడత) పెట్టుబడులను అనుమతించడం లేదు. సిప్ పెట్టుబడిపైనా కొన్ని సంస్థలు పరిమితులు అమలు చేస్తున్నాయి. -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్‌లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్‌చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
సోనీతో విలీనానికి మళ్లీ రెడీ.. అంతలోనే ‘జీ’కి భారీ షాక్..
మీడియా దిగ్గజం జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్)కు భారీ షాక్ తగిలింది. జీ సంస్థ భారీ మొత్తంలో నిధుల మళ్లించినట్లు మార్కెట్ రెగ్యులేటరీ బోర్డ్ సెబీ గుర్తించింది. ఫలితంగా ఆ సంస్థ షేర్లు పతనమవుతున్నాయి. జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిడెట్ (జీల్) తాజాగా సోనీ గ్రూప్ తో వీలిన అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. గత నెలలో రండు సంస్థల మధ్య 10 బిలియన్ డాలర్ల విలువైన విలీన ప్రతిపాదన రద్దయిన నేపరథ్యంలో తాజా అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ తరుణంలో జీ వ్యవస్థాపకులపై సెబీ జరిపిన విచారణలో కంపెనీ నుండి సుమారు 20 బిలియన్ల ($241 మిలియన్లు) మొత్తాన్ని మళ్లించినట్లు తేలింది. నిధుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. జీలో నిధులు మళ్లించడం సెబీ ఊహించిన దానికంటే దాదాపు పది రెట్లు ఎక్కువ ఉందని సమాచారం. సెబీ రివ్యూ భారీ మొత్తంలో నిధులు మాయమవ్వడంపై జీ ఇచ్చే సమాధానాలపై సెబీ రివ్వ్యూ జరపనుంది. రివ్యూ జరిపేందుకు రెగ్యులేటరీ జీ ఫౌండర్ సుభాష్ చంద్ర, అతని కుమారుడు పునిత్ గోయాంక్తో పాటు ఇతర బోర్డ్ సభ్యులు హాజరు కావాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే రివ్యూ అనంతరం పైన పేర్కొన్నట్లుగా జీలో నిధులు మళ్లీంపు, లేదంటే దుర్వినియోగం జరిగిందా అనే అంశంపై స్పష్టత రానుంది. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్‌ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్‌ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
కార్వీ కేసులో ప్రముఖ సంస్థలకు ఊరట
కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో సెబీ, ఎన్ఎస్డీఎల్కు పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబరు 20న సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్) జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ తన ఖాతాదారుల షేర్లను బ్యాంకుల వద్ద తనఖాపెట్టి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ కుంభకోణం బయటపడడంతో సెబీ, ఎన్ఎస్డీఎల్ రంగంలోకి దిగి ఆ షేర్లను మళ్లీ ఖాతాదారులకు బదిలీ చేయించాయి. యాక్సిస్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఈ విషయాన్ని శాట్‌లో సవాల్ చేశాయి. ఇదీ చదవండి: పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..! ఫలితంగా కార్వీ తనఖాపెట్టిన షేర్ల విలువకు సమాన మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని శాట్ గత ఏడాది డిసెంబరులో సెబీ, ఎన్ఎస్డీఎల్ను ఆదేశించింది. ఈ సంస్థలు సంబంధిత అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా శాట్ తీర్పుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. -
వదంతులపై స్పందించే గడువు పెంపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్–100 లిస్టెడ్ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది. సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్ ర్యాంక్‌లోని 100 లిస్టెడ్ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్‌లైన్‌ను జూన్ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ బాటలో మార్కెట్ విలువలో టాప్–250 ర్యాంకు లిస్టెడ్ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే. -
దొంగ ఓట్లు.. ‘పచ్చ’ నోట్లు
సాక్షి, అమరావతి: ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లతో మోసాలకు పాల్పడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని మరోసారి రుజువైంది! నల్లధనాన్ని వెదజల్లి ఎన్నికల్లో అక్రమ మార్గాల్లో నెగ్గేందుకు టీడీపీ ఏకంగా ప్రత్యేక కార్యాలయాలనే ఏర్పాటు చేసుకున్నట్లు ఆధారాలతో సహా బట్టబయలైంది. 2019 ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాల్పడిన అక్రమాలు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్ డీఆర్ఐ) తనిఖీల్లో తాజాగా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్‌గా ఉన్న నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయం కేంద్రంగా ఎన్నికల అక్రమాలకు తెగబడినట్లు డీఆర్ఐ కీలక ఆధారాలను గుర్తించింది. ఆ వెంటనే ఆ కంపెనీకి చెందిన కీలక వ్యక్తులు పరారు కావడం గమనార్హం. ఆదాయపన్ను (ఐటీ) చట్టం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డట్టు తేలింది. డీఆర్ఐ నివేదిక మేరకు న్యాయస్థానం అనుమతితో టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు, నోవా అగ్రిటెక్ కంపెనీలపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం ఇదిగో ఇలా సాగింది.. నోవా అగ్రిటెక్ కేంద్రంగా... పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు చెందిన నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో డీఆర్ఐ అధికారులు తాజాగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు శ్రీలక్ష్మీ నగర్‌లోని ఆ కంపెనీ కార్యాలయంలో ఈ నెల 24న చేపట్టిన సోదాల్లో ప్రధానంగా డీఆర్ఐ అధికారులు స్వా«దీనం చేసుకున్న ఓ డైరీ టీడీపీ ఎన్నికల అక్రమాల గుట్టును విప్పింది. స్వతంత్ర సాక్షులు, నోవా అగ్రిటెక్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో ఆ డైరీని డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. కీలక అధికారి పరార్ నోవా అగ్రిటెక్‌కు చెందిన ఉద్యోగి పుల్లెల అజయ్‌బాబు ఆ డైరీని ఉపయోగించారని కంపెనీ ఉద్యోగులు వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన పుల్లెల అజయ్ బాబును కార్యాలయానికి రావాలని డీఆర్ఐ అధికారులు సూచించిన వెంటనే ఆయన పరారు కావడం గమనార్హం. తన సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్ఛాఫ్ చేసేసి అందుబాటులో లేకుండా పోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతోనే ఆయన పరారైనట్లు స్పష్టమవుతోంది. 13 పేజీల్లో నమోదు.. ఆ డైరీని పరిశీలించగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ ఎలా ఎన్నికల అక్రమాలకు పాల్పడిందో వెలుగు చూసింది. పోలింగ్‌కు ముందు రోజు అంటే 2019 ఏప్రిల్ 11న అక్రమ నిధులను ఎలా తెచ్చారు? ఓటర్లకు ఎలా పంపిణీ చేశారనే వివరాలన్నీ అందులో ఉన్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలను ఏకంగా 13 పేజీల్లో నమోదు చేయడం గమనార్హం. అంతా నల్లధనమే... ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీగా నల్లధనాన్ని తరలించినట్లు డీఆర్ఐ సోదాల్లో వెల్లడైంది. అందుకోసం షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధులను చేరవేశారు. ఆ డబ్బుల వివరాలేవీ నోవా అగ్రిటెక్ కంపెనీ రికార్డులతో సరిపోలకపోవడంతో అదంతా నల్లధనమేనని రుజువవుతోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లో ఆ నిధుల జమ, విత్‌డ్రాలకు సంబంధించిన వివరాలేవీ లేవు. అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో అక్రమాలుకు పాల్పడేందుకు వెచ్చిం చినదంతా నల్లధనమేనని నిర్థారణ అయింది. ఎన్నికల కమిషన్‌కూ బురిడీ... డైరీలో పేర్కొన్న నిధుల వ్యయానికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఎన్నికల వ్యయంలో చూపలేదు. కమిషన్‌కు ఎప్పటికప్పుడు సమర్పించాల్సిన వ్యయంలో డైరీలో పేర్కొన్న నిధుల వివరాలు లేవు. అంటే టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల కమిషన్‌కు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. ఐటీ, ఈడీ, సెబీలకు నివేదిక.. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్రమంగా నిధులు తరలించినట్లు ఆధారాలతో వెల్లడి కావడంతో డీఆర్ఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. తమ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలను ఆదాయపన్ను శాఖ, ఈడీ, సెబీ దృష్టికి తెచ్చారు. నోవా అగ్రిటెక్ కంపెనీ తమ రికార్డుల్లో చూపని నిధులను వెచ్చించడంతోపాటు పన్ను చెల్లించకుండా ఎగవేసింది. అక్రమ నిధుల తరలింపు ద్వారా కేంద్ర మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించింది. అక్రమ నిధులను తరలించేందుకు కంపెనీని కేంద్ర బిందువుగా చేసుకోవడం సెబీ నిబంధనలకు విరుద్ధం. నోవా అగ్రిటెక్ అక్రమాలపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదాయపన్ను, ఈడీ, సెబీలకు డీఆర్ఐ అధికారులు నివేదిక సమర్పించారు. త్వరలోనే ఆ మూడు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదుకు సన్నద్ధం అక్రమ నిధుల ద్వారా ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ నోవా అగ్రిటెక్ కంపెనీ, కంపెనీ చైర్మన్‌గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై పోలీసు శాఖ కేసు నమోదు చేయనుంది. ఈ అక్రమ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు బాపట్ల జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు స్పష్టమవుతోంది. డైరీలో నల్లధనం ♦ పవులూరు అనే గ్రామంలో పోలింగ్ కేంద్రాలు 223 నుంచి 226 పరిధిలో 239 మంది ఓటర్లకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. మొత్తం రూ.2.39 లక్షలు పంపిణీ చేసినట్టు ఆ డైరీలో ఉంది. ♦ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు ద్వారా రూ.3.60 లక్షలు ఓటర్లకు పంపిణీ చేసినట్లు డైరీలో ఉంది. ♦ నోవా అగ్రిటెక్ కంపెనీకి చెందిన ఉద్యోగి ద్వారా ఓటర్లకు ఆ డబ్బులను పంపిణీ చేశారు. ♦ ఆ కంపెనీకి చెందిన అప్పారావు, బుజ్జిబాబు, సాయి గణేశ్ అనే ఉద్యోగుల ద్వారా దుద్దుకూరు గ్రామంలో ఓటర్లకు రూ.15 లక్షలు పంపిణీ చేశారు. ♦ పర్చూరు నియోజకవర్గంలోని దుద్దుకూరు, ఇంకొల్లు, తాటిపర్తివారిపాలెం, గంగవరం తదితర గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేశారో డైరీలో వివరంగా ఉంది. ♦ ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తరలించేందుకు రవాణా వ్యయం, పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల పేర్లు, వారికి పంపిణీ చేసిన మొత్తం తదితర వివరాలను ఆ డైరీలో సవివరంగా పేర్కొనడం గమనార్హం. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్, జేఎన్‌కే ఇండియా, ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) చేరాయి. 2023 జూన్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. కాగా.. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం.. ఎంటెరో హెల్త్‌కేర్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్ సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్‌ను 2018లో ప్రభాత్ అగర్వాల్, ప్రేమ్ సేథీ ఏర్పాటు చేశారు. జేఎన్‌కే ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్‌కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అక్మే ఫిన్‌ట్రేడ్ ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్‌ట్రేడ్(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎక్సికామ్టెలీ టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ నెక్ట్స్‌వేవ్ కమ్యూనికేషన్స్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్‌వేవ్‌కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్లో ప్రొడక్షన్ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
డే ట్రేడింగ్ చేయకూడదు.. సెబీ కీలక నిర్ణయం!
ఈక్విటీ మార్కెట్లో స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్న కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లకు సంబంధించి నిత్యం నిబంధనలు తీసుకొస్తూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డే ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ పేర్కొంది. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చేసే ట్రాన్సాక్షన్లు కస్టోడియన్ లెవెల్లో జరుగుతాయని, వీరు స్టాక్ ఎక్స్చేంజీలతో నెట్ బేసిస్‌లో తమ డెలివరీలను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించింది. మరోవైపు అన్ని కేటగిరీల్లోని ఇన్వెస్టర్లు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చని సెబీ పేర్కొంది. కానీ, నేకెడ్ (ప్రొటెక్షన్ లేకుండా) సెల్లింగ్ చేయడానికి కుదరదని తెలిపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కింద అన్ని షేర్లు షార్ట్ సెల్లింగ్‌కు అర్హులని వివరించింది. ఇదీ చదవండి: బీఐఎస్ గుర్తింపు తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే.. అధిక నష్టభయం ఉండే డెరివేటివ్స్, ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ విషయంలో, మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించాలని గతంలో ఎన్ఎస్ఈ సూచించింది. స్టాక్ మార్కెట్లో తరచు (ఫ్రీక్వెంట్) ట్రేడింగ్ చేయడం మంచిదికాదని సలహా ఇచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లలో 90 శాతం మంది మదుపర్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిల్లోనే ట్రేడింగ్ చేసేందుకు అత్యధికులు ఆసక్తి చూపిస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని గతంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. -
ఐపీవో బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్‌వీ పార్ట్‌నర్స్‌తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు పెట్టుబడులున్నాయి. -
కొత్త బిజినెస్‌లోకి అంబానీ.. రూ.1200 కోట్ల పెట్టుబడి!
భారతదేశంలోని సంపన్నుల జాబితాలో అగ్రగణ్యుడుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మ్యూచువల్ ఫండ్ రంగంలోకి ప్రవేశిస్తారంటూ కొన్ని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్లాక్‌రాక్ భాగస్వామ్యంతో మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అప్లికేషన్ 'సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా' (SEBI) వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ.. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ వెంచర్ మార్కెట్ కలిగి ఉంది. తాజాగా ఈ రెండు సంస్థలు కలిసి మ్యూచువల్ ఫండ్ విభాగంలో ప్రవేశించడానికి 50:50 ప్రాతిపదికన ఒక్కొక్కరు 150 మిలియన్ డాలర్లు (రూ. 12,48,63,52,500) పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుపై కొత్త సబ్సిడీ.. మహిళలకు అదనపు రాయితీ! జియో, బ్లాక్‌రాక్ రెండూ కలిసి భారతదేశంలో పెట్టుబడిదారులకు సరసమైన, వినూత్న పెట్టుబడి పరిష్కారాలను అందించే దిశగా అడుగేస్తున్నట్లు రిలయన్స్ గ్రూప్ వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ విభాగం జోరుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో జియో ఫైనాన్షియల్ దీనిపై ద్రుష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
చనిపోయినా సంపద సేఫ్..! కానీ..
చావు పుట్టుకలు చెప్పిరావు.. చావే వస్తే మనం కూడబెట్టిన కొద్ది మొత్తం డబ్బు ఏమౌతుంది.. ఆ డబ్బు మన తర్వాత ఉన్నవాళ్లు ఎలా క్లెయిమ్ చేసుకోవాలి.. స్టాక్మార్కెట్లో మదుపు చేయాలని చాలా మంది అంటుంటారు. దీర్ఘకాలంగా అందులో మదుపుచేసిన వారు చనిపోతే ఆ డబ్బు ఎవరికి చెందుతుంది.. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి.. ప్రభుత్వం అందుకు విధిస్తున్న గడువులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి సంపద సృష్టించాలని చాలా మందికి ఉంటుంది. దాంతో అందులో మదుపు చేస్తూంటారు. కానీ చివరకు ఏదైనా జరిగి వారు మరణిస్తే ఆ డబ్బు ఎవరికీ కాకుండా అలా ఉండిపోతుంది. కానీ ఆ సంపద ఎవరికి చెందాలో నామినీగా వారి వివరాలను డీమ్యాట్ అకౌంట్‌కు జతచేయాలి. ఫలితంగా ఖాతాదారుడు చనిపోయినా నామినీ వెళ్లి ఆ డబ్బును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి గడువు 2024 జూన్ 30 వరకు పొడిగిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 వరకు మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినీల పేర్లు నమోదు చేసేందుకు డెడ్ లైన్ విధించింది. కానీ ఆ తేదీని పొడగిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: మానవ అక్రమ రవాణా.. ఎయిర్ ఇండియా సిబ్బంది ‘మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యర్థనలు, ఇన్వెస్టర్ల సౌకర్యార్థం డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేందుకు గడువు పొడిగించాం’ అని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేలా ప్రోత్సహించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లను (ఆర్టీఏ) సెబీ కోరింది. -
IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..
ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒక్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి. 2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే.. ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది. ఆకాష్: బైజూస్ అనుబంధ సంస్థ అయిన ఎడ్టెక్ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా. ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్ చేసింది. ఫార్మ్ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు. మొబీక్విక్: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది. -
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది.