వేణుగోపాల్‌ ధూత్‌కు రూ.కోటి డిమాండ్‌ నోటీస్‌ | Sebi Demand Notice For Venugopal Dhoot, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వేణుగోపాల్‌ ధూత్‌కు రూ.కోటి డిమాండ్‌ నోటీస్‌

Published Thu, Oct 3 2024 7:57 AM | Last Updated on Thu, Oct 3 2024 9:30 AM

Sebi Demand Notice for Venugopal Dhoot

ముంబై: వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను దాదాపు రూ.1.03 కోట్లు చెల్లించాలని పారిశ్రామికవేత్త వేణుగోపాల్‌ ధూత్, మరో రెండు సంస్థలకు క్యాపిటల్‌ మార్కెట్స్‌ రెగ్యులేటర్‌ సెబీ డిమాండ్‌ నోటీసులు పంపింది.  15 రోజుల్లోగా చెల్లింపుల్లో విఫలమైతే అరెస్ట్‌కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆయన ఆస్తులతో పాటు ఇతర సంస్థలను ఆస్తులనూ జప్తు చేస్తానని రెగ్యులేటర్‌ హెచ్చ రించింది.

ధూత్‌తో పాటు, ఎలక్ట్రోపార్ట్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్, వీడియోకాన్‌ రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ నోటీసులు అందుకున్న సంస్థల్లో ఉన్నాయి. 2017లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను 2021 సెపె్టంబర్‌లో సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) తమపై విధించిన రూ. 75 లక్షల జరిమా నాను చెల్లించడంలో ధూత్‌తో సహా ఈ సంస్థలు విఫలమైన నేపథ్యంలో తాజా డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ధూత్, మరో రెండు సంస్థలు ప్రచురితంకాని ప్రైస్‌ సెన్సి టివ్‌ ఇన్ఫర్మేషన్‌ (యూపీఎస్‌ఐ) వద్ద మార్కె ట్‌ లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించిన నేపథ్యంలో సెబీ ఈ  చర్యలు తీసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement