సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురి బచ్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల ఆధారంగా కేంద్ర ఆర్థికశాఖ దర్యాప్తు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఈ సంఘంలో సెబీ ప్రతినిధులు సైతం ఉండబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో సెబీ చీఫ్ మాధబి, ఆమె భర్త పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. మాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్‌నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!
ఇదిలాఉండగా, సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగడంతో సెబీ తాజాగా దర్యాప్తునకు ఆమోదిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment