
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్‌ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఆర్‌ఏఏఎస్‌బీ) లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌వైజరీ బాడీ (ఐఏఏఎస్‌బీ) అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది.
ఆర్‌ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’ అని సెబీ పేర్కొంది.
పెనాల్టీలు వేయాల్సింది టెల్కోలపై కాదు: సీఓఏఐ
స్పామ్ కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేయడానికి టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలతో టెల్కోలకు పెనాల్టీలు గణనీయంగా పెరిగాయని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్‌కు ఎటువంటి నియంత్రణ లేకపోవడం వల్ల స్పామ్ సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. ‘టెలికం ఆపరేటర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టడానికి పుష్కలంగా చర్యలు తీసుకున్నాయి.
ఇదీ చదవండి: రూ.250కే జన్‌నివేష్ సిప్
అయాచిత కమ్యూనికేషన్ల పరిమాణంలో గణనీయ పెరుగుదల, అలాగే న్యాయబద్ధ వాణిజ్య కమ్యూనికేషన్ అంతా ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లకు మారింది. ఇది దేశంలో ఆర్థిక నేరాల పెరుగుదలకు దారితీసింది. టెలికం సర్వీస్ ప్రొవైడర్లపై పెనాల్టీలు ఏ ప్రయోజనాన్ని అందించవు. అవసరమైతే టెలిమార్కెటర్ డెలివరీ కంపెనీలు లేదా వాణిజ్య సమాచార ప్రసారాల వాస్తవ రూపకర్తలు, లబ్ధాదారులైన ప్రధాన సంస్థలపై ఈ పెనాల్టీలు వేయాలి’ అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్.పి.కొచ్చర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment