research analyst
-
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
ఇన్వెస్ట్మెంట్ సలహాదారులకు సెబీ చెక్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు(ఐఏలు), రీసెర్చ్ ఎనలిస్టు(ఆర్ఏ)లకు ప్రకటనల కోడ్ ను జారీ చేసింది. దీంతో ఇకపై తమ ప్రకటనల్లో.. నంబర్ వన్, టాప్ సలహాదారులు, టాప్ రీసెర్చ్ విశ్లేషకులు, లీడింగ్ సంస్థ వంటి అత్యుక్తులను వినియోగించేందుకు వీలుండదు. తమ ప్రకటనల్లో ఇకపై ఇలాంటి పదాలను నిషేధిస్తూ సెబీ అడ్వర్టయిజ్మెంట్ కోడ్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా క్లిష్టమైన భాషను సైతం వాడేందుకు అనుమతించరు. అయితే ఏదైనా అవార్డులవంటివి పొంది తే వీటి వివరాలు పొందుపరచేందుకు అవకాశముంటుంది. ఇందుకు సర్క్యులర్‌ను జారీ చేసింది. మే 1నుంచి అమలుకానున్న తాజా నిబంధనల ద్వారా ఐఏ, ఆర్ఏల నిబంధనలు మరింత పటిష్టంకానున్నాయి. అనుభవం, అవగాహనలేని ఇన్వెస్టర్ల ను తప్పుదారి పట్టించే అంచనాలు, స్టేట్మెంట్లు వంటివి ప్రకటనల్లో వినియోగించకూడదు. ఇదేవిధంగా రాబడి(రిటర్న్) హామీలను ఇవ్వడానికి వీ లుండదు. ఐఏలు, ఆర్ఏల గత పనితీరును సైతం ప్రస్తావించేందుకు అనుమతించరు. సెబీ లోగోను వినియోగించరాదు. ఐఏ లేదా ఆర్ఏ జారీ చేసే ప్రకటనల్లో వాళ్ల పేర్లు, లోగో, కార్యాలయ చిరునామా, రిజిస్ట్రేషన్ సంఖ్యలు వెల్లడించవలసి ఉంటుంది. సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. పెట్టుబడులు చేపట్టే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి అంటూ ప్రా మాణిక హెచ్చరికను జారీ చేయవలసి ఉంటుంది. -
భారత సంతతి రీసెర్చర్ హత్య
వాషింగ్టన్: భారత సంతతి పరిశోధకురాలిని దుండగులు హత్య చేసిన టెక్సాస్ రాష్టంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న 43 ఏళ్ల సర్మిస్త సేన్ ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తుండగా.. హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్, మార్చమన్ వే సమీపంలోని క్రీక్ ప్రాంతంలో లభ్యమయినట్లు పోలీసులు వెల్లడించారు. సర్మిస్త సేన్ ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. మాలిక్యూలర్ బయాలజీ విభాగంలో, క్యాన్సర్ రోగుల కోసం పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసుతో సబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 29 ఏళ్ల బకారి అభియోనా మోన్‌క్రీప్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కొల్లీన్ కౌంటీ జైలులో నిర్బంధంలో ఉన్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్‌టాక్’ షో!) సర్మిస్త హత్య జరిగిన సమయంలోనే.. మైఖేల్ డ్రైవ్‌లోని 3400 బ్లాక్‌లోని ఓ ఇంటిలోకి ఎవరో చొరబడ్డారని పోలీసులు తెలిపారు. బకారిని కూడా దోపిడి నేరం కింద అరెస్ట్ చేశారు. దాంతో సర్మిస్త హత్యతో అతడికి సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బకారిని విచారిస్తున్నారు. సర్మిస్త అథ్లెట్ కావడంతో ప్రతిరోజు తన కుమారులు లేవడానికి ముందే జాగింగ్ చేయడానికి వచ్చేదని పోలీసులు తెలిపారు. సర్మిస్త మరణం ఆమె కుటుంబ సభ్యులను ఎంతో కలిచి వేసింది. ఆమె చాలా మంచిదని.. పరిచయం అయిన ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో కట్టిపడేసేదని సర్మిస్త కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప వారికే ఎందుకు ఇలా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఓయూలో పరిశోధక విద్యార్థి మృతి
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీలో పరిశోధక విద్యార్థి కొంపల్లి నర్సింహ (45) మృతి చెందారు. ఓయూ పీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన కొంపల్లి నర్సింహ క్యాంపస్‌లోని సైన్స్ కాలేజీ జాగ్రఫీ విభాగంలో ఇటీవల పీహెచ్డీ పూర్తి చేశారు. న్యూ పీజీ హాస్టల్లోని రూం నంబర్ 3లో ఉంటున్న అతడు ఆదివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. గది లోపల గడియ వేసుకొని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. నర్సింహ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. మృతుడి అంత్యక్రియల కోసం తక్షణ సహాయంగా రూ.25 వేలను అందచేసినట్లు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగం రాలేదనే మానసిక క్షోభతో.. ఓయూలో పీహెచ్డీ పూర్తి చేసి పీడీఎఫ్ కోసం చదువుతున్న నర్సింహ ఉద్యోగం రాలేదని, 45 ఏళ్లు వచ్చినా జీవితంలో స్థిరపడలేదని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నర్సింహ కుటుంబానికి న్యాయం చేయాలని సోమవారం న్యూ పీజీ హాస్టల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ ఛైర్మన్ చనగాని దయాకర్‌గౌడ్, విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఓయూ పరిశోధన విద్యార్థి నర్సింహమృతిపట్ల ఎమ్మార్పీఎస్ టీఎస్‌రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
అలాంటి జాబ్స్ వద్దే వద్దు...
సాక్షి,న్యూఢిల్లీ: పొద్దున్నే డ్యూటీ ఎక్కి ఎంచక్కా సాయంత్రానికి ఇంటి కెళ్తే బిందాస్...ఇది పాతమాట. మరి కొత్త బాట ఏంటంటారా..? కొలువుల తీరు మారుతుండటమే నయా ట్విస్ట్. ఓ రీసెర్చిలో వెల్లడైన అంశాలు ఉద్యోగుల్లో నూతన పోకడలకు అద్దం పడుతున్నాయి. నైన్ టూ ఫైవ్ ఉద్యోగాలకు కాలం చెల్లిందని, నూతన తరం ఉద్యోగాలనే యువత కోరుతున్నదని ఓ అథ్యయనంలో వెల్లడైంది. మ్యాన్‌పవర్ గ్రూప్ నిర్వహించిన అథ్యయనంలో రాబోయే ఉద్యోగాల్లో పార్ట్‌టైమ్, ఫ్రీల్యాన్స్, కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయని తేలింది. ఇప్పటి ఉద్యోగులెవరూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుర్చీలకు అతుక్కుపోవాలని అనుకోవడం లేదని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. నూతన ఉద్యోగ పోకడలకు భారత్, మెక్సికో వంటి ఎదుగుతున్న మార్కెట్లలో మంచి ఆదరణ లభించిందని ఈ అథ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలకు చెందిన 9500 మందిని ఈ సర్వే పలుకరించింది. భారత్‌లో 785 మంది ఉద్యోగుల నుంచి వారి అభిరుచులను రాబట్టారు. సంప్రదాయ ఉద్యోగాల కంటే ఫ్రీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఉద్యోగాలకే తమ ఓటని భారత ఉద్యోగుల్లో 85 శాతం మందికి పైగా వెల్లడించారు. ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునేందకు అనుకూలమైన ఉద్యోగాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు.గత పదేళ్లలోనూ ఈ తరహా ఉద్యోగ నియామకాలే ఎక్కువగా చోటుచేసుకున్నాయని మాన్పవర్ గ్రూప్ వెల్లడించింది. -
విశ్లేషకులకూ రూల్స్: సెబీ
ముంబై: లిస్టెడ్ కంపెనీలు, షేర్ల గురించి స్వతంత్ర నివేదికలు ఇస్తూ, గందరగోళం సృష్టిస్తున్న రీసెర్చ్ అనలిస్టులను నియంత్రించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నడుం కట్టింది. ఇందులో భాగంగా విశ్లేషకుల సర్వీసులకు సంబంధించి మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించింది. వీటిప్రకారం భారతీయ కంపెనీలపై రీసెర్చ్ సేవలు అందించాలనుకునే విదేశీ సంస్థలు కచ్చితంగా భారత్‌లో అనుబంధ సంస్థను కలిగి ఉండాలి. దాని ద్వారా తప్పనిసరిగా రిజిస్టరు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేనిదే ఏ వ్యక్తి కూడా రీసెర్చ్ అనలిస్టుగా వ్యవహరించడానికి వీల్లేదు. విశ్లేషకులను కూడా నియంత్రణ పరిధిలోకి తేవాలంటూ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ కమిషన్స్ (ఐవోఎస్‌సీవో) చేసిన సూచనల మేరకు సెబీ ఈ ముసాయిదా రూపొందించింది. వీటిపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను డిసెంబర్ 21లోగా తెలియజేయాల్సి ఉంటుంది