న్యూఢిల్లీ: ఏదైనా కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వచ్చేముందు స్టాక్ ఎక్స్చేంజీల వద్ద తప్పనిసరిగా డిపాజిట్ చేయవలసిన నిబంధనలను తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. ఐపీవో చేపట్టే ప్రణాళికలుగల అన్‌లిస్డెడ్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్‌పై వెసులుబాటు కల్పిస్తూ సెబీ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.
దీంతో ఇకపై ఇష్యూ పరిమాణంలో 1 శాతాన్ని స్టాక్ ఎక్స్చేంజీల వద్ద డిపాజిట్ చేయవలసిన అవసరం ఉండదు. సులభతర బిజినెస్ నిర్వహణకు వీలు కల్పించే బాటలో సెబీ వెనువెంటనే అమల్లోకి వచ్చేవిధంగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇప్పటివరకూ పబ్లిక్ ఇష్యూ ముగిశాక సెక్యూరిటీ డిపాజిట్‌ను స్టాక్ ఎక్స్చేంజీలు తిరిగి చెల్లిస్తున్నాయి.
ఐపీవో లేదా రైట్స్‌కు ముందు 1 శాతం మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేసే నిబంధన రద్దుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సెబీ చర్చాపత్రానికి తెరతీసింది. ప్రస్తుతం ఐపీవో ప్రక్రియలో ఇన్వెస్టర్ల ఖాతా లకు అస్బా అమలుకావడం, యూపీఐ చెల్లింపులు, డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల అలాట్‌మెంట్ అమలు జరుగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ డిపాజిట్ అవసరానికి కాలం చెల్లినట్లు సెబీ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment