భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిరసన సెగ ఎదుర్కోబోతోంది. సంస్థలో ఏ, బీ, సీ గ్రేడ్‌లలో పనిచేసే సుమారు 700 మంది ఉద్యోగులు సోమవారం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం, సెబీ భవన్ వన్ వద్ద నిరసనకు సిద్ధమైనట్లు ఎన్‌డీటీవీ ప్రాఫిట్ నివేదించింది.
సంస్థ నాయకత్వంపై గత రెండున్నర సంవత్సరాలుగా ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తే ఈ నిరసనకు కారణంగా తెలుస్తోంది. ఇక నిరసనకు ఆజ్యం పోసిన ప్రధాన అంశాలు మరికొన్ని ఉన్నాయి. సెబీ అందిస్తున్న అలవెన్సులు, ఆర్‌బీఐ అధికారులకు అందించే వాటి స్థాయిలో లేవనే అసంతృప్తి సెబీ అధికారుల్లో ఉంది.
దీంతోపాటు కీ రిజల్ట్ ఏరియాస్ (KRA) అప్‌లోడ్ చేయడానికి ప్రవేశపెట్టిన కొత్త సిస్టమ్‌తో కొంత మందికి అలవెన్స్‌లు ఆగిపోయే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల అసంతృప్తులను చల్లార్చేందుకు క్షమాపణలు కోరుతూ సెబీ నాయకత్వం ఈమెయిల్ పంపినప్పటికీ ఉద్యోగులు నిరసనను విరమించుకోలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment