సెబీ నిర్దేశించిన అన్ని నియమాలు, మార్గదర్శకాలకు తాను కట్టుబడి ఉన్నానని సంస్థ చీఫ్ మాధబి పురి బచ్ తెలిపారు. ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, అవమానకరమైనవిగా చెబుతూ వాటిని తీవ్రంగా ఖండించారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) చీఫ్ మాధబి పురి బచ్ ఒక వ్యక్తిగత ప్రకటనలో ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవస్తవాలని కొట్టిపారేశారు. అవి తనను అవమానించేలా ఉన్నాయన్నారు. సెబీలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పరస్పర ప్రయోజనాల కోసం అగోరా అడ్వైజరీ, అగోరా పార్టనర్స్, మహీంద్రా గ్రూప్, పిడిలైట్, డాక్టర్ రెడ్డీస్, సెంబ్‌కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్..వంటి సంస్థల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని తెలిపారు. ఈ సంస్థలకు చెందిన ఏ వ్యవహారంతోనూ తనకు సంబంధం లేదన్నారు. సెబీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
అదానీ కంపెనీలో పెట్టుబడులు
సింగపూర్, మారిషస్‌లకు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధబి అదానీ గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టారని ఇటీవల హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె 2017 నుంచి 2024 మధ్య ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.12 కోట్లకు పైగా వేతనం తీసుకున్నారని ఇటీవల కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. ప్రముఖ సంస్థకు చీఫ్‌గా వ్యవహరిస్తూ వేరే సంస్థ నుంచి వేతనం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్‌పై ఇలా ఆరోపణలు రావడంపై ట్రేడర్లు, పెట్టుబడిదారుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి.
ఇదీ చదవండి: పదేళ్లలో గణనీయ వృద్ధి.. ‘ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం
ఉద్యోగుల ఫిర్యాదు
సెబీ అధికారులు ఇటీవల సంస్థ చీఫ్ పనితీరుపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. ఫిర్యాదులోని వివరాల ప్రకారం మాధబి కిందిస్థాయి ఉద్యోగులతో సమావేశాల్లో అరవడం, తిట్టడం, బహిరంగంగా అవమానిస్తున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్ ఆపై స్థాయి సిబ్బంది మొత్తం సెబీలో 1000 మంది ఉన్నారు. అందులో 500 మంది వరకు ఈ ఫిర్యాదు లేఖపై సంతకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment