Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

America Donald Trump Govt backs down on tariffs1
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా

సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్‌ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. ట్రంప్‌ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది.

China imposes additional 84% tariff on US goods2
అమెరికాకు షాకిచ్చిన చైనా

బీజింగ్‌: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్‌ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్‌ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్‌ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్‌ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లెవిట్‌ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్‌ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్‌ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్‌ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

IPL 2025: Gujarat Titans Beat Rajasthan Royals3
IPL 2025: సాయి సుదర్శన్‌ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్‌ ఘన విజయం

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 9) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. సాయి సుదర్శన్‌ (53 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌ (25 బంతుల్లో 36; 5 ఫోర్లు), షారుక్‌ ఖాన్‌ (20 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రాహుల్‌ తెవాతియా (12 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. రషీద్‌ ఖాన్‌ 4 బంతుల్లో ఫోర్‌, సిక్స్‌ సాయంతో 12 పరుగులు, రూథర్‌ఫోర్డ్‌ 3 బంతుల్లో సిక్స్‌ సాయంతో 7 పరుగులు, శుభ్‌మన్‌ గిల్‌ 3 బంతుల్లో 2 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, తీక్షణ తలో రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్‌, సందీప్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్‌ గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా రాణించడంతో 19.2 ఓవర్లలో 159 ఆలౌటైంది. ప్రసిద్ద్‌ కృష్ణ 3, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌ చెరో 2, సిరాజ్‌, అర్షద్‌ ఖాన్‌, కేజ్రోలియా తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (32 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సంజూ శాంసన్‌ (28 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (14 బంతుల్లో 26; ఫోర్‌, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.యశస్వి జైస్వాల్‌ (7 బంతుల్లో 6; ఫోర్‌), నితీశ్‌ రాణా (3 బంతుల్లో 1), ధృవ్‌ జురెల్‌ (4 బంతుల్లో 5; ఫోర్‌), శుభమ్‌ దూబే (3 బంతుల్లో 1), తుషార్‌ దేశ్‌పాండే (3 బంతుల్లో 3), జోఫ్రా ఆర్చర్‌ (4 బంతుల్లో 4), తీక్షణ (13 బంతుల్లో 5) విఫలమయ్యారు.

Anitha Could Not Answer Reporters Questions On Jagan Security Failure4
జగన్‌ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీ­సులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవు­తోంది. మంగళవారం వైఎస్‌ జగన్‌ పర్యటనలో అడుగ­డుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదా­రుల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులను అడ్డుకు­నేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్‌ భద్రత విషయంలో చూపకపో­వడం గమనార్హం. హెలిప్యాడ్‌ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది­మంది హెలిప్యాడ్‌ వద్దకు పోటెత్తారు. జగన్‌ ప్రయాణిస్తున్న హెలి­కా­ప్టర్‌ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్‌ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్‌ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభి­మా­నుల తాకిడితో హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్‌ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్‌ తిరిగి వెళ్లిపోయింది. జగన్‌ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్‌ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

Top Court Raps Centre On Emergency Aid In Road Accident Cases Details5
ఇది తీవ్రమైన ఉల్లంఘనే.. కేంద్రానికి ‘సుప్రీం’ చీవాట్లు

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. ఈ విషయాన్ని తీవ్ర ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ బుధవారం సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ ఉద్దేశం. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. దీని అమలుకుగానూ కేంద్రానికి సుప్రీం కోర్టు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా కేంద్రం ఇంతదాకా దీనిని అమలు చేయలేదు.‘‘ప్రభుత్వానికి ఇచ్చిన గడువు ముగిసిపోయింది. దీనిని తీవ్రమైన కోర్టు ఆదేశాల ఉల్లంఘనగా పరిగణిస్తున్నాం’’ అని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. ఈ అలసత్వానికి సంబంధించి రోడ్డు రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్‌ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ‘‘అధికారులు కోర్టులకు హాజరైతేనే మా ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మా సుదీర్ఘ అనుభవం ద్వారా మేం తెలుసుకున్నాం. ఏప్రిల్‌ 28వ తేదీన సమన్లు అందుకున్నవాళ్లు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలి. సకాలంలో చికిత్స అందకపోవడంతో రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ.. ఒక్క విషయాన్ని మేం స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. ఎటువంటి పురోగతి సాధించలేదని మేం గనుక గుర్తిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం అని జస్టిస్‌ ఓకా సంబంధిత అధికారులను హెచ్చరించారు.రోడ్డుప్రమాదాల సమయంలో ఆ దారిన వెళ్లేవాళ్లు, పోలీసులు,కొన్నిసార్లు ఆస్పత్రులు కూడా ఎవరైనా ముందుకు వస్తారేమో అని ఎదురు చూస్తున్నాయి. ఇది ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.ఇదిలా ఉంటే.. 2023 డిసెంబర్‌లో నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందించే విషయంలో కేంద్రం తొలి అడుగు వేసింది. ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఎంవీఏ యాక్టు 2019లో భాగం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తున్నాయి. అయితే.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహకారంతో రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంది.రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాణాంతకంగా ఉన్న సమయంలో.. ప్రత్యేకించి గోల్డెన్‌ అవర్‌ టైంలో రోడ్డు ప్రమాద బాధితుడి ప్రాణాలు రక్షించే చికిత్స కోసం నగదు చెల్లింపులు చేయడానికి ఎవరూ లేనప్పుడు ఈ పథకం వర్తిస్తుంది. క్యాష్‌లెస్‌ ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌ స్కీమ్‌ కింద.. రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ల చికిత్స కోసం ఏడు రోజులకుగానూ లక్షా 5 వేల రూపాయల ఖర్చు భరిస్తుంది. అయితే ఇది ప్రమాదం జరిగిన 24 గంటలలోపు పోలీసులకు తెలియజేస్తేనే!. ఇక..ఆస్పత్రులు మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్ ఫండ్‌ నుంచి ట్రీట్‌మెంట్‌ సొమ్మును‌ రీయింబర్స్‌మెంట్‌ ద్వారా పొందుతాయి. ఇదికాక.. అదనంగా హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మరణించిన వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా అందిస్తుంది. అయితే.. ఏడాదిన్నరగా ఈ పథకాన్ని ఆచరణలో పెట్టాలనే ప్రయత్నాలు మాత్రం ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన సరైన విధివిధానాలతో ఓ పథకం రూపొందించాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా.. మోటార్‌ వెహికిల్స్‌ యాక్ట్‌(సవరణ చట్టం)లోని సెక్షన్‌ 162(2) ప్రకారం.. ఇన్సూరెన్స్‌ కంపెనీలు కూడా బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. కానీ, ఇది కూడా అమలు కావడం లేదని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.

Union Minister Jitan Manjhi Granddaughter Dead6
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు దారుణ హత్య

పాట్నా: కేంద్రమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ (Jitan Ram Manjhi) మనవరాలు సుష్మాదేవి (Sushma Devi) దారుణ హత్య కలకలం రేపుతోంది. సుష్మాదేవిని ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు.గయా ఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. బీహార్ రాష్ట్రం,గయా జిల్లా అటారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తేటువా గ్రామానికి చెందిన జితన్‌ రామ్‌ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32),రమేష్ సింగ్ దంపతులు. 13ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. సుష్మాదేవీ వికాస్‌ మిత్రగా పనిచేస్తుండగా.. ఆమె భర్త రమేష్‌ సింగ్‌ ఓ వాహన యజమానిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఉన్న సుష్మాను భర్త రమేష్‌ గన్నుతో కాల్చి చంపాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన సమయంలో వేరే గదిలో ఉన్న పూనమ్‌, సుష్మా పిల్లలు పరిగెత్తుకొని రాగా రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. కాల్పులమోతతో ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.మృతురాలి సోదరి పూనమ్ కుమారి మాట్లాడుతూ..తన అక్కను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి రమేష్‌ తన వద్ద ఉన్న గన్నుతో కాల్చి చంపినట్లు చెప్పారు. తన అక్క మరణానికి కారణమైన రమేష్‌కు కఠిన శిక్ష విధించాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూఈ ఘటనపై గయా జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడారు. సుష్మాను ఆమె భర్త రమేష్‌ సింగ్‌ నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) బృందం ఆధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమత్తం మగధ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించాం. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’అని తెలిపారు. జితన్ రామ్ మాంఝీ ఎవరు?మనవరాలి హత్యపై గయ లోక్‌సభ ఎంపీ, సూక్ష్మ,చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పందించలేదు. జితన్‌ రామ్‌ మాంఝీ బీహార్‌ సీఎంగా పనిచేశారు. హిందుస్థానీ అవామ్ మోర్చా సెక్యులర్ వ్యవస్థాపకుడు.

These Indian companies are likely to be affected if Trump imposes tariffs on pharmaceutical drugs7
మందులపైనా టారిఫ్‌లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు

ఫార్మాస్యూటికల్స్‌పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.బ్లూమ్‌బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్‌పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్‌ సంకేతాలిచ్చారు.పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావంరాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి.

Air India Passenger Urinates On Fellow Traveller8
Air India ‘Pee-gate’: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం!

ఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాలో (air india) అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన (Air India ‘Pee-gate’) చేసిన ఘటన కలకలం రేపుతోంది.ఢిల్లీ నుంచి బ్యాంకాక్‌కు ప్రయాణించిన ఎయిరిండియా విమానంలో (AI 2336) ఓ ప్రయాణికుడు మధ్యం సేవించాడు. అయితే మద్యం మత్తులో ఓ కంపెనీ మేనేజింగ్ డైరెక్టగా పనిచేస్తున్న ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటన చేసింది.ఈ ఘటనపై అధికారులకు సమాచారం అందించామని,బ్యాంకాక్‌లో బాధితుడికి అవసరమైన సహాయం అందించేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని తెలిపింది. అయితే బాధితుడు ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించినట్టు సంస్థ వెల్లడించింది.ప్రయాణికుడిపై మూత్ర విసర్జన ఘటనపై విచారణ కోసం స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ కమిటీ ఘటనపై సమగ్రంగా సమీక్షించి, అవసరమైతే సంబంధిత ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటుందని సంస్థ స్పష్టం చేసింది. డీజీసీఏ రూపొందించిన ప్రామాణిక కార్యకలాపాల ప్రకారమే వ్యవహరిస్తామని పేర్కొంది. An Air India spokesperson says, “Air India confirms that an incident of unruly passenger behaviour was reported to the cabin crew operating flight AI2336, from Delhi to Bangkok, on 9 April 2025. The crew followed all laid down procedures, and the matter has been reported to the… pic.twitter.com/QwMB1pWr2E— ANI (@ANI) April 9, 2025 గత రెండేళ్లుగా మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన చేసిన ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. 2023 మార్చిలో అమెరికాలోని ఓ యూనివర్సిటీకి చెందిన భారతీయ విద్యార్థి ఆర్య వోహ్రా, అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో సహయాత్రికుడిపై మూత్రవిసర్జన చేశాడని ఆరోపణల నేపథ్యంలో విమాన సంస్థ అతనిపై నిషేధం విధించింది. గతేడాది నవంబర్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు ఎయిరిండియా బిజినెస్ క్లాస్‌లో ఓ వృద్ధ మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

10 Days Before Daughter Wedding: Up Woman Elopes With Would Be Son In Law9
యూపీ మహిళ నిర్వాకం.. 10 రోజుల్లో కూతురు పెళ్లి.. కాబోయే అల్లుడితో అత్త జంప్‌!

పది రోజుల్లో కూతురి వివాహం జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రాలు పంచి.. బంధువులను కూడా ఆహ్వానించారు. అంతలోనే షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి తన కాబోయే భర్తతో పారిపోవడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.నాలుగు నెలల క్రితం ఓ మహిళ తన కూతురు వివాహం చేసేందుకు ఓ సంబంధం చూసింది. ఓ యువకుడితో తన కుమార్తెకు పెళ్లి చేయడానికి నిశ్చయించింది. ఈ నెల 16న పెళ్లి జరగాల్సి ఉండగా.. ఆమె తల్లి తనకు కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పారిపోయేటప్పుడు తన కుమార్తె వివాహం కోసం దాచిన రూ. 5 లక్షలు విలువ చేసే బంగారంతో పాటు 5.5 లక్షలకు పైగా నగదు కూడా తనతో తీసుకెళ్లింది.అయితే పెళ్లి కుదిరిన కొద్ది రోజుల తర్వాత అల్లుడు తన అత్తకు మొబైల్ ఫోన్‌ బహుమతిగా అందించాడు. తరుచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడే వాడు. పలుమార్లు అత్త ఇంటికి రావడంతో పాటు, గంటల తరబడి ఒకే గదిలో అత్తతో మాట్లాడేవాడు. ఈ క్రమంలో అల్లుడితో ప్రేమలో పడిన అత్త, పెళ్లికి మరో పది రోజులు ఉందనగా ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని, అతడితో పారిపోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీస్ అధికారి మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని వెల్లడించారు.

Rajinikanth Reveals Why He Opposed Jayalalithaa10
నా స్పీచ్‌తో అతని పదవి పోయింది.. రజనీకాంత్‌ కీలక వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మధ్య కొన్నాళ్ల పాటు రాజకీయ వైర్యం కొనసాగిన సంగతి తెలిసిందే. 1996లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో రజనీకాంత్, జయలలిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే, దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు" అని ఆయన చేసిన ప్రకటన రాజకీయ రంగంలో సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యలు ఆ ఎన్నికల్లో జయలలిత అధికారం కోల్పోవడానికి ఒక కారణంగా నిలిచాయి. తాజాగా ఈ ‘రాజకీయ వివాదం’పై రజనీకాంత్‌ స్పందించారు. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి గల కారణం ఏంటో ఆయన వివరిస్తూ.. మాజీ మంత్రి వీరప్పన్‌ పట్ల జయలలిత వ్యవహరించిన తీరే.. తనను వ్యతిరేకంగా మాట్లాడేలా చేసిందని చెప్పారు.వీరప్పన్‌ పదవి పోయిందిసినీ నిర్మాత, రాజకీయ నాయకుడు ఆర్.ఎం. వీరప్పన్, రజనీకాంత్‌ మధ్య మంచి స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. వీరప్పన్‌ సత్య మూవీస్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘బాషా’ చిత్రం అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా వీరప్పన్‌ మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందట. ఈ వేడుకల్లో రజనీకాంత్‌ మాట్లాడుతూ.. తమిళనాడులో వారసత్య రాజకీయాల కారణంగా బాంబు సంస్కృతి పెరిగిపోయిందని.. రాష్ట్రం ఓ స్మశానంలా మారిందని అన్నారు. రజనీ వాఖ్యలు జయలలిత కోపానికి కారణం అయ్యాయట. దీంతో మంత్రిగా ఉన్న వీరప్పన్‌ని పదవి నుంచి తొలగించారట. జయలలితపై వ్యతిరేకంగా మాట్లాడడానికి ఇదే ప్రధాన కారణం అని రజనీ అన్నారు.వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు ‘నేను జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం, ఆ రోజుల్లో పరిస్థితులను బట్టి అలా మాట్లాడాను. అయితే నా స్పీచ్‌ కారణంగా వీరప్పన్‌ పదవి పోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. మరుసటి రోజు ఫోన్‌ చేసి మాట్లాడాను. జయలలితతోనూ మాట్లాడతానని చెప్పాను. అయితే వీరప్పన్‌ మాత్రం దానికి అంగీకరించలేదు. ‘నీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దను. నాకు ఏ పదవి అవసరం లేదు’ అని చెప్పారు. ఆయన ఈ విషయాన్ని లైట్‌ తీసుకున్నా.. నేను చాలా బాధపడ్డాను. జయలలితను తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటి’ అని రజనీకాంత్‌ అన్నారు. వీరప్పన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ‘ఆర్‌వీఎం: ది కింగ్‌మేకర్‌’ డాక్యుమెంటరీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీకాంత్‌ ఈ వివాదం గురించి స్పందించాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement