Air Condition Machine
-
సమ్మర్లో ఎయిర్ కూలర్స్, ఏసీలు వాడేస్తున్నారా..?
ఎండలు బాగా ముదిరాయి. స్థోమత ఉన్నవారు ఎయిర్ కండిషనర్స్నూ, అంతగా స్థోమత లేనివారు ఎయిర్ కూలర్స్నూ వాడుతుంటారు. ఏసీల కారణంగా గదిలో ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణంలో మెయింటెయిన్ అవుతుండటంతో టు అందులోని కొన్ని ఫిల్టర్లు చాలా చాలా చిన్నగా, అత్యంత సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) బారి నుంచీ కాపాడతాయి. శబ్దకాలుష్యాన్నీ నివారించి... చెవి, ఇతరత్రా సమస్యలు రాకుండా చూస్తాయి. కానీ వాటివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలూ ఉత్పన్నమవుతాయి. అలాగే ఎయిర్ కూలర్స్లో, లీజియొన్నెల్లా అనే బ్యాక్టీరియా పెరిగి ‘లీజియొన్నేరిస్ డిసీజ్’కు గురయ్యే ముప్పు ఉంటుంది. ఏసీలూ, కూలర్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలూ, అవి రాకుండా నివారించే జాగ్రత్తలను తెలుసుకుందాం. ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి... తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ చాలాసేపు ఏసీలో గడపడం వల్ల ఆ చల్లదనం మూలాన కొందరిలో ఒళ్లునొప్పులు, తలనొప్పితోపాటు తీవ్రమైన నీరసం, నిస్సత్తువగా అనిపించవచ్చు. శ్వాస సమస్యలు : గదిలోని ఏసీగానీ లేదా కారులోని ఏసీగానీ చాలాసేపు ఆన్‌లో ఉండటం, దాంతో గది లేదా కార్ డోర్స్ / గ్లాసెస్ ఎప్పుడూ మూసేసే ఉండటంతో అక్కడి సూక్ష్మజీవులతో పక్కనే ఉన్న ఇతరులకు ఆ సమస్యలు వ్యాపించవచ్చు. కొందరిలో ఆస్తమానూ, పిల్లికూతలనూ ప్రేరేపించవచ్చు. అందువల్ల... ఏసీ గదిలోగానీ లేదా ఏసీ ఆన్ చేసి ఉన్న కారులోగానీ అదేపనిగా చాలాసేపు ఉండటం అంత మంచిది కాదు. తేలిగ్గా వడదెబ్బకు గురికావడం : ఎప్పుడూ ఏసీలో ఉండేవారు దానికి అలవాటైపోయి తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. చర్మం పొడిబారడం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గి, చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురదలు వచ్చే అవకాశాలెక్కువ. వీళ్లు చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్లు : ఎక్కువ సేపు ఏసీలో ఉండేవారికి అంతగా దాహంగా అనిపించకపోవడంతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దాంతో ఇలాంటివాళ్లలో కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలెక్కువ. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బ్లడ్ ప్రెషర్), ఆర్థరైటిస్, న్యురైటిస్ (నరాల చివరలు మొద్దుబారినట్లుగా అయిపోయి స్పర్శ అంతగా తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవాళ్లలో ఆ సమస్యలు కాస్త తీవ్రమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండటం ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడిగినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే బిగించడం ఎప్పుడూ ఏసీలో ఉండేవారు సాయంత్రాలూ లేదా రాత్రిపూట స్వాభావికమైన చల్లగాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉండటం. ఏసీ సరిపడక ఏవైనా ఆరోగ్యసమస్యలు వస్తే ఏసీని వాడకపోవడం లేదా గది చల్లబడే వరకు ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేసుకుని ఫ్యాన్ వేసుకోవడం. వాటర్ కూలర్‌తో వచ్చే నిమోనియా నివారణ ఇలా... కిందటేడాది వాటర్ కూలర్ వాడాక దాన్ని మూల పెట్టేసి ఉంచి, ఇప్పుడు ఎండలు ముదరగానే వాడటానికి తీసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గతంలో మిగిలి ఉన్న నీళ్లలో లీజియోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు.దాంతో ‘లీజియోన్నేరిస్ డిసీజ్’ అనే ఒక రకం నిమోనియా వచ్చే అవకాశముంది. దీన్నే ‘వాటర్‌కూలర్ నిమోనియా’ అని కూడా అంటారు. చాలాకాలం వాడని కూలర్స్ తాలూకు పాత తడికల్లోనూ డస్ట్‌మైట్స్ ఉండి, నేరుగా ఆన్ చేస్తే అది ఆస్తమా బాధితుల్లో సమస్యను ట్రిగర్ చేయవచ్చు. మామూలు వ్యక్తులకు సైతం దగ్గు, ఆయాసం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే బయటకు తీయగానే వాటర్‌కూలర్ అడుగున ఏమాత్రం చెమ్మలేకుండా చేసేందుకు ఆరుబయట ఆన్ చేసి పెట్టి దాదాపు గంటసేపు అలాగే ఉంచాలి. అడుగున ఒక్క చుక్క నీళ్లు లేకుండా డ్రైగా అయిపోయాకే వాటర్ కూలర్ వాడటం మొదలుపెట్టాలి.(చదవండి: ఎండకు చర్మం కమిలిపోకూడదంటే..) -
ఏసీలు కూడా పేలే అవకాశం : ఎలా గుర్తించాలి? ముఖ్యమైన జాగ్రత్తలు
ఎండలు ముదురుతున్నాయి. సూర్యుడి భగభగలను తట్టుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఏసీలను వాడుతున్న పరిస్థితి. అయితే ఏసీల పని తీరుపై ప్రాథమిక అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలమంతా వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కాబట్టి ఇపుడు వాడేటపుడు మెయింటెనైన్స్పై దృష్టి పెట్టాలి. ఏసీలోని భాగాలను శుభ్రం చేసుకోవాలి. అసలు ఎండాకాలంలో ఏసీల వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించాలో తెలుసు కుందాం ఈ కథనంలో...కొన్ని చోట్ల ఏసీ పేలడం కారణంగా అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.మెయింటెనెన్స్వేసవికాలంలో ఏసీలను వాడే ముందు శుభ్రంచేయడం, ప్రొఫెషనల్ టెక్నీషియల్ సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి. ఏసీ సరిగ్గా పనిచేస్తుందో? లేదో నిపుణులై టెక్నీషియన్ ద్వారా తనిఖీ చేయించాలి. లేదా సంబంధిత బ్రాండ్ సర్వీస్ సెంటర్ వారిని సంప్రదించాలి. దీని వల్ల ఏసీలో ఉన్న లోపాలను ముందుగనాఏ గుర్తించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చూసుకోవచ్చు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ లాంటి ప్రధానం చెక్ చేసుకోవాలి.వైరింగ్ తనిఖీఏసీకి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు కనిపిస్తే బాగు చేయించుకోవాలి, లేదా వెంటనే మార్చుకోవాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే షాక్ వచ్చే అవకాశాలుంటాయి. రిమోట్లో కూల్ మోడ్, డ్రై మోడ్, ఫ్యాన్ మోడ్ లేదా ఎనర్జీ-సేవింగ్ మోడ్ వంటి మోడ్లు పనిచేయక పోవడం, AC లోని సెన్సార్ పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. మోడ్లు ఏవీ సరిగ్గా పనిచేయకపోతే, వెంటనే టెక్నీషియన్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.వెంటిలేషన్ ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. ఖాళీగా ఉన్న ప్రదేశంలో, మంచి వెంటిలేషన్ ఉంచితే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. లేదంటే గాలి సరిగ్గా రాదు. గాలి ప్రవాహం సరిగ్గా ఉటే ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ వేడెక్కి అగ్ని ప్రమాద అవకాశాలను పెంచుతుంది.ఒక వేళ ఏసీ ఎలక్ట్రికల్ భాగాలు పాడైతే, వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన, కంపెనీకి చెందిన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు నాణ్యతను ఒకటిరెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఏసీ టెంపరేచర్ని రూమ్ టెంపరేచర్ కంటే తక్కువగా సెట్ చేసుకోవడం కూడా ముఖ్యంఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసన వస్తున్నా, లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు గమనిస్తే పొరపాటున కూడా నీటిని చల్లకూడదు. నిపుణులు వచ్చి తనిఖీ చేసేదాకా ఏసీని ఆఫ్ చేయడం ఉత్తమం.ఏసీ నిరంతరం వాడుతున్నవారు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే.. రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాలి. దీని చాలాప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు లాంటి పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.ఎలాంటి ఏసీలను తీసుకోవాలి? నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను వినియోగించే, నాణ్యమైన బ్రాండుకు సంబంధించిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలి. నోట్ : ఏసీలు వాడుతున్నవారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా మెంటెయిన్ చేయాలి. దీని వల్ల చల్లదనాన్ని ఆస్వాదించడంలోపాటు, కరెంట్ ఖర్చును కూడా ఆదా చేసుకోవచ్చు. ఇదీ చదవండి : సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది! -
ప్రముఖ దేవాలయంలో ఏసీ నుంచి కారుతున్న నీళ్లు.. తాగేందుకు ఎగబడుతున్న భక్తులు
ప్రజల్లో దైవ భక్తి రోజురోజుకి శృతి మించుతోంది. ప్రముఖ దేవాలయంలో ఏర్పాటు చేసిన ఏసీల నుంచి కారే నీటిని తాగుతున్నారు. ఒంటిపై చల్లుకుని పునీతులం అయ్యామని తెగ సంబరపడిపోతున్నారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వ్రిందావన్ నగరంలో ప్రముఖ ప్రసిద్ధ ‘బాంకే బిహారీ’ అనే శ్రీకృష్ణుని దేవాలయం ఉంది. అయితే ఆ దేవాలయంలో దైవ దర్శనానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. వస్తూ.. వస్తూ తమ వెంట టీ తాగే కప్పులను తెచ్చుకుంటున్నారు. శ్రీకృష్ణుడి దర్శనం అనంతరం గుడికి వెనుక భాగంలో ఏనుగు శిల్పం నుంచి కారుతున్న నీటిని దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు.Serious education is needed 100%People are drinking AC water, thinking it is 'Charanamrit' from the feet of God !! pic.twitter.com/bYJTwbvnNK— ZORO (@BroominsKaBaap) November 3, 2024ఆ నీటిని టీ కప్పుల్లో నింపుకున్న భక్తులు తాగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొంతమంది భక్తులు నీటిని సేకరించడానికి కప్పులను ఉపయోగిస్తుండగా.. మరికొందరు చేతిలో తీర్ధం తీసుకున్నట్లుగా ఏసీ నుంచి కారే నీటిని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వెలుగులోకి వచ్చిన పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆలయ నిర్మాణ సమయంలో ఏసీలను ఏర్పాటు చేశారు. ఆ ఏసీల నుంచి కారే నీటిని బయట విడుదలయ్యేలా ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాలను అమర్చారు. ఇప్పుడు ఏనుగు ఆకారంలో ఉండే గొట్టాల ద్వారా విడుదలవుతున్న నీటినే భక్తులు తాగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో.. వీడియోలు తీసిన వారు.. ఏనుగు శిల్పం నుంచి ఏసీ విడుదల చేసే నీరు కారుతుందని చెబుతున్న మాటలు వినబడుతున్నాయి. అయినప్పటికీ అనేక మంది ఆలయానికి వెళ్లేవారు నీటిని తాగడం లేదంటే తమపై చల్లుకోవడం చేస్తున్నారు. మరికొందరు ఏనుగు శిల్పం నోటి నుండి కారుతున్న 'చరణ్ అమృతం’ (దేవుడు తమని ఆశీర్వదిస్తున్నారనే సూచికగా) భావిస్తున్నారు. శ్రీకృష్ణుడి పాదాల నుండి వస్తున్న పవిత్ర జలం అంటూ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.PLEASE DO NOT DRINK AIR CONDITIONING WATER!Cooling and air conditioning systems are breeding grounds for many types of infections including fungus, some really hellish. Exposure to air conditioning condensed water can lead to a terrifying disease known as Legionnaires'… https://t.co/FhOly0P7Dj— TheLiverDoc (@theliverdr) November 3, 2024వైరల్ అవుతున్న వీడియోలపై డాక్టర్లు సైతం స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల్లో.. దేవాలయంలో అమర్చిన ఏసీల నుంచి వచ్చే నీరని తాగొద్దని కోరుతున్నారు. ఏసీ నుంచి వచ్చే నీటిని తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. -
నల్లగొండ: ఏసీ మెషిన్ పేలి తెగిపడ్డ శరీర భాగాలు
సాక్షి, నల్లగొండ: జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీ మెషిన్ పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ప్రమాదం నుంచి మరో నలుగురు ప్రాణాలతో బయటపడగా.. మృతుల శరీరాలు చెల్లాచెదురై పడడంతో అక్కడంతా భయానకవాతావరణం నెలకొంది. మిర్యాలగూడ రోడ్డు బర్కత్‌పుర కాలనీ న్యూస్టార్ ప్రూట్స్ గోడాన్‌లో ఏసీ మెషిన్ రిపేర్ చేస్తుండగా.. కంప్రెషర్ ఒక్కసారిగా పేలింది. పేలుడును గుర్తించి ముందుగానే నలుగురు బయటకు పరుగులు తీశారు. మెషిన్‌కు అతి సమీపంలో ఉన్న షేక్ కలీమ్, సాజిద్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఎస్పీ సహా నల్లగొండ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పెళ్లైనా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని.. -
కూల్.. సీలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఫాల్స్ సీలింగ్‌తో ఇంటి అందం రెట్టింపవుతుంది. టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో ఇంటి పైకప్పును కలపతో తయారు చేసేవారు. కాలక్రమేణా ఇంటి పైకప్పులు మారిపోయాయి. ఇప్పుడు అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లతో చేసే ఫాల్స్ సీలింగ్‌కు ఆదరణ బాగా పెరుగుతోంది. ఫాల్స్ సీలింగ్‌తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మారుతుంది. ► ఫాల్స్ సీలింగ్‌తో సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుకోవచ్చు. ► సీలింగ్‌కు రెండు నుంచి మూడు అంగుళాల దిగువన ఫాల్స్ సీలింగ్ వేయిస్తే సరిపోతుంది. అయితే ప్రైమరీ సీలింగ్, ఫాల్స్ సీలింగ్ దగ్గరగా ఉండేలా చూసుకోవాలి. ► ఫాల్స్ సీలింగ్‌తో వివిధ డిజైన్లు, కలర్స్‌తో సీలింగ్‌ను రూపొందించుకునే సౌలభ్యం ఉంటుంది. ధర చ.అ.కి రూ.25 నుంచి మొదలవుతుంది. పెయింటింగ్‌కు మరో రూ.2 వేలు అవుతుంది. డిజైన్ టైల్స్‌తో ఉన్న సీలింగ్‌ను ఎంచుకుంటే పెయింటింగ్ ఖర్చు తగ్గుతుంది. ► అర్హత, అనుభవం కలిగిన ఇంటీరియల్ డిజైనర్స్ ఉంటే ప్లెయిన్లో కూడా ఫాల్స్ సీలింగ్‌ను వేసుకోవచ్చు. కొత్తగా కడుతున్న ఇళ్లకే కాకుండా పాత ఇంటికి సైతం ఈ ఫాల్స్ సీలింగ్‌ను వేయించుకోవచ్చు. జాగ్రత్తలివే.. ► ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. ► ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్‌తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. ► ఉడెన్ ఫాల్స్ సీలింగ్‌లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ► దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి.