మార్కెట్‌ మురిపెం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ మురిపెం

Published Fri, Apr 4 2025 1:23 AM | Last Updated on Fri, Apr 4 2025 1:23 AM

మార్క

మార్కెట్‌ మురిపెం

కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్న మిరియాలు ఈ ఏడాది గిరిజన రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. దిగుబడులు భారీగా పెరగడంతో పాటు మార్కెట్‌లో ధరలు కూడా అనుకూలంగా ఉండడంతో వ్యాపారం పోటాపోటీగా జరుగుతోంది. తొలిసారిగా స్పైసెస్‌ బోర్డు కూడా రంగంలోకి దిగడంతో రైతులకు మరింత మేలు జరగనుంది.
లాభాల మిరియం..

పాడేరు మండలం మోదాపల్లిప్రాంతంలో విరగ్గాసిన మిరియాలు

సాక్షి, పాడేరు: మిరియాలు పండిస్తున్న గిరి రైతులకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏజెన్సీవ్యాప్తంగా లక్షా 52 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలు ఉండగా, వాటిలో సుమారు 90 వేల ఎకరాల్లో గిరిజనులు అంతరపంటగా మిరియాలు సాగుచేస్తున్నారు. ఎకరానికి 300 కిలోల వరకు పచ్చిమిరియాలు కాస్తాయి. బాగా ఎండితే సగం బరువు తగ్గిపోతాయి. గత ఏడాది ఎకరానికి 120 కిలోల వరకు దిగుబడి రాగా, ఈసారి 150 కిలోలకు పైగానే దిగుబడి పెరిగింది. ప్రతి గిరిజన రైతు ఎకరానికి 150 కిలోల మిరియాలను మార్కెటింగ్‌ చేస్తుండడంతో మంచి లాభాలు పొందుతున్నారు.

మన్యం మిరియాలకు మంచి డిమాండ్‌

జాతీయ స్థాయిలో ఏజెన్సీ మిరియాలకు పూర్వం నుంచి మంచి డిమాండ్‌ ఉండడంతోపాటు నాణ్యతలోను నంబర్‌–1గా నిలుస్తున్నాయి. రైతులంతా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 100 కోట్లకు పైగానే మిరియాల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది దిగుబడులు, ధరలు పెరగడంతో సుమారు రూ.150 కోట్ల వరకు మిరియాల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

కిలో ధర రూ.600

ఏజెన్సీవ్యాప్తంగా మిరియాల వ్యాపారం భారీగా జరుగుతోంది. గత నెల సీజన్‌ కిలో రూ.550తో వ్యాపారం ప్రారంభమవ్వగా, ప్రస్తుతం కిలో రూ.600తో వ్యాపారులు పోటాపోటీగా మిరియాలను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కన్నా కిలోకు రూ.70 పెరిగింది. ఎకరం పంట ఉన్న రైతు మిరియాల అమ్మకాల ద్వారా రు.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాడు.

స్పైసెస్‌ బోర్డు మార్కెట్‌లోకి...

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్పైసెస్‌ బోర్డు తొలిసారిగా మిరియాల మార్కెట్‌ను ప్రారంభించింది. కలెక్టర్‌ ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ జాతీయ స్థాయిలో మిరియాల వ్యాపారస్థులు, స్పైసెస్‌ బోర్డు అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇటీవల చింతపల్లి ప్రాంతంలో మిరియాల గింజలను కిలో రూ.610తో స్పైసెస్‌ బోర్డు కొనుగోళ్లను ప్రారంభించింది.

హుకుంపేట మండలం బాకూరు రోడ్డులో పాదుల నుంచి మిరియాలు సేకరిస్తున్న గిరిజనులు

దిగుబడులు పెరిగాయి

గత ఏడాది కన్నా మిరియాల దిగుబడులు పెరగడంతోపాటు సంతల్లో వ్యాపారులు కిలో రూ.600తో కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కిలో రూ.520తోనే అమ్ముకున్నాను. నాకు 3 ఎకరాల కాఫీ తోటల్లో మిరియాల పంట ద్వారా ఇప్పటికి రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. – వంతాల వరహాలమ్మ,

ఎస్‌.గొందూరు గ్రామం,

హుకుంపేట మండలం

స్పైసెస్‌ బోర్డు ద్వారా మిరియాల మార్కెటింగ్‌

ఎకరం

పంటకు

150 కిలోల

దిగుబడి..

రూ.90 వేల ఆదాయం

స్పైసెస్‌ బోర్డు ద్వారా మిరియాల పంట సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఏజెన్సీలో గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్న మిరియాలకు గిట్టుబాటు ధరల కల్పన లక్ష్యంగా స్పైసెస్‌ బోర్డును మార్కెట్‌లోకి దింపాం. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో మిరియాల కొనుగోళ్లను విస్తరిస్తాం.

– ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌,

కలెక్టర్‌

మార్కెట్‌ మురిపెం1
1/4

మార్కెట్‌ మురిపెం

మార్కెట్‌ మురిపెం2
2/4

మార్కెట్‌ మురిపెం

మార్కెట్‌ మురిపెం3
3/4

మార్కెట్‌ మురిపెం

మార్కెట్‌ మురిపెం4
4/4

మార్కెట్‌ మురిపెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement