Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Prime Minister Narendra Modi Sensational Comments On Kancha Gachibowli Lands1
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

హర్యానా: కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ సర్కార్‌ బిజీగా ఉంది. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే.. వాళ్లు అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుంది. బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుంది. ప్రకృతి నష్టం,జంతువులకు ప్రమాదం జరుగుతుంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతుంది.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు నమ్మక ద్రోహం జరుగుతుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజల ఆందోళనతో అభివృద్ధి కుంటు పడింది. కర్ణాటకలో విద్యుత్ నుంచి పాల వరకు, బస్సు కిరాయి వరకు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం రేట్లు, పన్నులు పెంచింది. కాంగ్రెస్ కర్ణాటక ప్రభుత్వాన్ని అవినీతిలో నెంబర్ వన్ చేసింది. సత్యం ఆధారంగా, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ బీజేపీ ముందుకు వెళ్తోంది. వికసిత్‌ భారత్ కోసం బీజేపీ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదంప్రకృతి నడుమ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అలజడి రేగింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై వివాదం రేగింది. విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర సాధికార కమిటీ హెచ్‌సీయూలో వివాదాస్పద భూముల పరిశీలనకు వచ్చింది.ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ స్పందించారు.

IPL 2025, DC VS MI: KARUN NAIR IS RULING CRICKET2
Karun Nair: ఎ‍క్కడ ఆడినా పరుగుల వరదే.. బ్యాట్‌ పట్టుకుంటే విధ్వంసమే..!

భారత క్రికెట్‌లో కరుణ్‌ నాయర్‌ పరిచయం అక్కరలేని పేరు. సెహ్వాగ్‌ తర్వాత టెస్ట్‌ల్లో ట్రిపుల్‌ సెంచరీ (టీమిండియా తరఫున) చేసి, ఆతర్వాత కొద్ది రోజుల్లోనే కనుమరుగైన ఆటగాడు. సుదీర్ఘకాలం అవకాశాల కోసం వేచి చూసి ఇప్పుడిప్పుడే తన ప్రతిభకు తగ్గ అవకాశాలను పొందుతున్న కరుణ్‌.. తాజాగా ఐపీఎల్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో పేట్రేగిపోయి వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 13) రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణ్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. అయినా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపాలైంది.ముంబై ఇండియన్స్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌ తర్వాత కరుణ్‌ క్రికెట్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. కరుణ్‌ గురించి తెలుసుకునేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్‌ ఇటీవలికాల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.2017 భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడి కనుమరుగైన కరుణ్‌​, మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఓ దశలో అతను ఎంత బాగా ఆడినా దేశవాలీ క్రికెట్‌లోనూ అవకాశాలు రాలేదు. దీంతో అతను జట్టును మార్చుకుని (కర్ణాటక) విదర్భ జట్టుకు వలస వచ్చాడు. విదర్భకు రాగానే కరుణ్‌ దశ మారింది. దేశవాలీ క్రికెట్‌లో అంతకుముందు కంటే ఎక్కువ పరుగులు సాధించి తగినంత గుర్తింపు దక్కించుకున్నాడు. టీమిండియాలో చోటే లక్ష్యంగా కరుణ్‌ గతేడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఈ క్రమంలో కరుణ్‌ గతేడాదంతా పరుగుల వరద పారించాడు. ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. ఈ ఏడాది విజయ్‌ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్‌ అదే జోష్‌ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కరుణ్‌ అరివీర భయంకరమైన ఫామ్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 177.08 స్ట్రయిక్‌రేట్‌తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇవే కాక కరుణ్‌ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్‌ 10 మ్యాచ్‌ల్లో 188.4 స్ట్రయిక్‌రేట్‌తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.కరుణ్‌ గతేడాది కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ దేశవాలీ సీజన్‌లో కరుణ్‌ 11 ఇన్నింగ్స్‌ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్‌ సెంచరీ సహా మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.ఏడాదికి పైగా ఘనమైన ట్రాక్‌ రికార్డు మెయిన్‌టైన్‌ చేస్తూ వచ్చిన కరుణ్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 50 లక్షల బేస్‌ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లోనూ కరుణ్‌ తన తొలి మ్యాచ్‌ ఆడేందుకు నాలుగు మ్యాచ్‌లు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన అవకాశం రాగానే కరుణ్‌ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి ఇరగదీశాడు. బుమ్రా, బౌల్ట్‌ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాను కరుణ్‌ బాదినట్లు ఏ బ్యాటర్‌ బాది ఉండడు. ఐపీఎల్‌లో రెండేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కరుణ్‌ సద్వినియోగపరచుకున్నాడు. రీఎంట్రీలో తన ఐపీఎల్‌ అత్యధిక స్కోర్‌ను నమోదు చేశాడు. తాజా ప్రదర్శనల నేపథ్యంలో కరుణ్‌ టీమిండియా బెర్త్‌ సాధించడం కన్ఫర్మ్‌ అని క్రికెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి భారత సెలెక్టర్లు కరుణ్‌ లాంటి హార్డ్‌ వర్కింగ్‌ టాలెంట్‌కు అవకాశం​ ఇస్తారో లేదో చూడాలి.

KSR Comments Over YS Jagan Vision And CBN3
జగన్‌ విజన్‌ బాబు తలకెక్కిందా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు అసలు విజనరీ ఎవరో అర్థమై ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒకే ఒక్క మంచి పనితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దూరదృష్టి, దార్శనికత ఏమిటో తెలిసి వచ్చి ఉంటుంది. బాబు ఇటీవల వెళ్లిన ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అభివృద్ధి.. పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడేయడం, చూసిన తరువాత కూడా బాబుకు చేయాల్సిందేమిటి? చేస్తున్నదేమిటన్న ఆత్మవిమర్శ చేసుకోకపోతే దానికి ఆయనే బాధ్యుడు అవుతాడు. వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రంలో జరిగిన సంస్కరణలపై ఇప్పటివరకూ చంద్రబాబు ఎల్లో మీడియా ముఖ్యంగా ఈనాడు పత్రిక లేదా టీవీ ఛానల్‌లో రాసిన పచ్చి అబద్దాల వార్తలు మాత్రమే చూసి ఉంటారు. ఇప్పుడు వాస్తవం తెలుసుకుని ఉంటారు. ఇంతకాలం తాను చేసిందేమిటన్న స్పృహ ఆయనకు వచ్చి ఉంటే మంచిదే. జగన్ ముఖ్యమంత్రిగా విద్య, వైద్య రంగాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు, ఆస్పత్రులు బాగు చేశారు. స్కూ​ల్స్‌లో బల్లల మొదలు, టాయిలెట్ల వరకు, పిల్లల డ్రెస్ మొదలు, వారు తినే ఆహార పదార్ధాల వరకు జగన్ పర్యవేక్షించేవారు. పిల్లలకు పోషకాహారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.అంతకుముందు చంద్రబాబు 2014 హయాం వరకు పాడైపోయి ఉన్న స్కూళ్లను ఒక విప్లవం మాదిరి జగన్ దశల వారీగా బాగు చేయించారు. ప్రభుత్వ స్కూళ్లు అంటే నరకప్రాయం అన్న అభిప్రాయాన్ని తొలగించి, వాటిని ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా తీర్చి దిద్దారంటే అతిశయోక్తి కాదు. తాగునీటి సదుపాయంతోపాటు, స్కూల్ ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టారు. టాయిలెట్స్‌ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పాఠ్య పుస్తకాలు రెండు భాషల్లో (ఇంగ్లీషు, తెలుగు)నూ చదువుకునే వెసులుబాటు కల్పించారు. అంతర్జాతీయ స్థాయి ఐబీ కోర్సు, టోఫెల్ వంటి పరీక్షలకు మూడో తరగతి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్దులంతా జగన్ మామ అని పిలుచుకునేవారు.అన్నింటినీ మించి పిల్లలు స్కూళ్లు మానివేయకుండా అమ్మ ఒడి అనే స్కీమ్ ను తెచ్చి విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చేశారు. ఇంత చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తుండేది. కానీ, ఎన్నికల నాటికి వాస్తవం తెలుసుకుని విద్యార్ధి ప్రతీ ఒక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు వంటివారు ఎక్కాలు చదివినట్లు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక హామీని మరిచారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గింది. జగన్ సంస్కరణలు తీసుకు వస్తే వాటికి వ్యతిరేకంగా టీచర్లను టీడీసీ నేతలు రెచ్చగొట్టారు. మెగా డీఎస్సీ నిర్వహించి స్కూళ్లలో టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని ప్రచారం చేశారు.ఇన్ని హామీలు ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా ఉన్న ఐబీ సిలబస్ ఎత్తివేసింది. పాఠశాలల్లో ఆంగ్ల మీడియం ఉందో, లేదో తెలియదు. టోఫెల్ కోచింగ్‌ రద్దు చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేశే మంత్రి అయినా విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా మారే పరిస్థితులు సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ జిల్లాలోని ముప్పాళ్లలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అక్కడి సదుపాయాలను పరిశీలించి పిల్లలతో మాట్లాడారు. వారు ఆంగ్లంలో మాట్లాడుతుంటే బహుశా ఆయన ఆశ్చర్యపోయి ఉండాలి. గతంలో ఆంగ్ల మీడియంను ఆయనతో సహా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వ్యతిరేకించే వారు. చంద్రబాబుకు ఆ పిల్లలలో ఉన్న బలమైన ఆకాంక్ష ఏమిటో అర్థమై ఉండాలి.విద్యార్ధులు వారు చేస్తున్న ప్రయోగాల గురించి ఇంగ్లీష్‌లో వివరిస్తుంటే, బాబు గారు మధ్య, మధ్యలో ఎక్కువ భాగం తెలుగులోనే మాట్లాడారు. ఒక బాలిక ‘‘కలర్‌పుల్ గుడ్ మార్నింగ్’’ అని అన్నప్పుడు అలా ఎందుకు అన్నావు అని ప్రశ్నించి, ఇన్నోవేటివ్‌గా మాట్లాడావు కాబట్టి ఆకర్షించావు అని సీఎం వ్యాఖ్యానించారు. నిజానికి ఆయన కేవలం ఆ బాలిక మాటలకే కాదు. మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులకు కూడా ఆకర్షితులై మరో బాలుడిని భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు అన్నప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అవ్వాలని ఉందని జవాబు ఇచ్చాడు. దానికి ఏమి చదవాలని అడిగితే ఇంగ్లీష్ అని చెప్పేసరికి చంద్రబాబు అవాక్కై ఉండాలి. కొంతకాలం క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో ఒక స్కూల్‌ ను సందర్శించి ప్రైవేటు స్కూళ్ల మాదిరి సదుపాయాలు ఉన్నాయని ప్రశంసించారు. మంత్రి లోకేష్ కూడా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న వాస్తవ పరిస్థితి గమనించి ఒకింత ఆశ్చర్యపడిన వీడియోలు గతంలో వచ్చాయి.ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చూశారు. అయినా వారిలో అహం దెబ్బతింటుంది కనుక, జగన్ పాలనలో జరిగిన ఈ మార్పులను అంగీకరించడానికి మనసు అంగీకరించదు. అంతేకాక చంద్రబాబుకు ప్రభుత్వ స్కూళ్లపై అంత నమ్మకం ఉన్న మనిషి కాదని అంటారు. కొందరు కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యజమానులకు ఆయన ఆప్త మిత్రుడు. అలాంటి వారిలో ఒకరైన నారాయణ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి. అయినా ఫర్వాలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా ఈ స్కూళ్లను పాడు చేయకుండా వాటిని జగన్ టైమ్ నాటి ప్రమాణాలతో కొనసాగిస్తే మంచిదే. కాని పలు స్కూళ్లలో పారిశుద్ధ్యం కొరవడిందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం గతంలో ఉన్న విధంగా ఇప్పుడు ప్రత్యేక సిబ్బంది లేకపోవడమే. విద్యా రంగానికి సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యథావిధిగా కొనసాగించితే ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలకు న్యాయం చేసినట్లవుతుంది. జగన్ ఫోబియాతో బాధపడుతున్న వారికి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది. చంద్రబాబు స్కూల్‌కు రావడం సంతోషంగా ఉందని ఒక బాలిక అంది. ఎందుకు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆ బాలిక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందట.అంటే ఏదో మర్యాద కోసం అలా మాట్లాడిందే తప్ప ఇంకొకటి కాదేమో అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అదే జగన్ సీఎం హోదాలో వచ్చి ఉంటే తాము సంతోషానికి ఆ బాలికలు వంద కారణాలు ఉండేవి. మరి ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు స్కూల్‌కు వచ్చినా, రాకపోయినా పెద్దగా తేడా లేదన్న భావన ఉండవచ్చు. ఎందుకంటే వారేమీ తమ హయాంలో స్కూళ్లను ఇలా మెరుగు పరచలేదు కనుక. జగన్ మంచి చదువే పేద పిల్లలకు ఇచ్చే సంపద అని పలుమార్లు చెప్పేవారు. అదే చంద్రబాబు మాత్రం విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలోనే చెప్పుకున్నారు. తన మనుమడు దేవాన్శ్‌ను మంచి ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తుండవచ్చు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద పిల్లలను కూడా అదే తరహాలో భావించి మంచి విద్య ఇవ్వడానికి యత్నిస్తే పేరు వస్తుంది. ఏది ఏమైనా విద్యకు సంబంధించి జగన్ విజన్ ను చంద్రబాబు అంగీకరించక తప్పదు కదా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Chandrababu Naidu hesitates in the meeting4
2014-19 మధ్య కాలంలో మీరు సంతోషంగా ఉన్నారా.. సంతోషంగా ఉన్నారా?

గుంటూరు,సాక్షి: అంబేద్కర్ జయంతి సభలో సీఎం చంద్రబాబు తడబడ్డారు. 2014-2019లో ప్రజలు ఆనందంగా కూర్చొని నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయా? , ఉన్నాయా? అని నొక్కి నొక్కి సభ సాక్షిగా అడిగారు చంద్రబాబు. అది తన హయాం అనే విషయం మర్చిపోయిన చంద్రబాబు.. ఆ సమయంలో ఎవ్వరూ సంతోషంగా లేరనే విషయాన్ని ఆయన తన నోటి వెంటే పలికారు.రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. నా చరిత్రలో ఎప్పుడు చూడని రాజకీయం 2014-2019లో చూశానని అన్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు వద్దకు వచ్చి ఆయన చెవిలో ఏదో గుసగుసలాడారు. అసలు విషయాన్ని ఆయన చెవిలో ఊదారు. వెంటనే తేరుకున్న చంద్రబాబు సారీ సారీ అంటూ తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ ఘటనతో బాబు.. తన పరిపాలనలో జనం సంతోషంగా లేరన్న విషయం తనే ఒప్పేసుకున్నట్లయింది. కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని ఎంత దాచుదామనుకున్నా అది ఏదొక సమయంలో నోరూ జారుతూనే ఉంటుంది. ఇ‍ప్పుడు చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అని జనం ఆ నోట ఈ నోట అనేసుకుంటున్నారనుకోండి.

Scientists Grow Human Teeth In Lab For First Time5
పళ్ల సెట్‌కి గుడ్‌బై చెప్పేయండి..! హాయిగా యథావిధిగా వచ్చేస్తాయట..!

మానవులకు చిన్నతనంలో పాలపళ్లు వచ్చి ఊడిపోతాయి. ఆ తర్వాత వచ్చేవి శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లేదంటే అంతే సంగతులు. అయితే తినే ఆహార పదార్ధాల వల్ల లేదా ఇతర అనారోగ్యాల కారణంగా దంతాలు ఊడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత కాస్త డబ్బులుంటే కొత్త దంతాలు కట్టించుకోవడం వంటివి చేస్తారు. అయితే ఒరిజనల్‌ దంతాల మాదిరి అనుభూతిని మాత్రం అందివ్వవు. ఆ సమస్యకు తాజాగా శాస్త్రవేత్తలు చెక్‌పెట్టి ఓ అసాధారణ ఘనతకు శ్రీకారం చుట్టారు. ల్యాబ్‌లో కృత్రిమంగా దంతాలను పెంచి దంత వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఇక ఇన్నాళ్లు చేయించుకున్న ఇంప్లాంట్‌ ట్రీట్‌మెంట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చని చెబుతున్నారు.లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ పరిశోధకుల బృందం ఈ ఆవిష్కరణ చేసింది. దంతాల అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని సమర్థవంతంగా క్రియేట్‌ చేసి ఒక కణం, మరొక కణం కలిసి దంత కణంగా రూపాంతరం చెందిలే అభివృద్ధి చేశారు. అనేక జాతులు తమ దంతాలను పునరుత్పత్తి చేయగలిగినప్పటికీ..మానవులకు మాత్రం ఆ అవకాశం లేదు. ఇన్నాళ్లు దంతాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా దంతాలను కోల్పోయినా.. దంతాలను ఇంప్లాంటు చేయించుకునేవారు. అయితే ఇవి ఒరిజనల్‌ దంతాల మాదిరి సౌలభ్యాన్ని అందించలేకపోయేవి. ఇప్పుడు ఈ ఆవిష్కరణతో ఆ సమస్యకు చెక్‌పెట్టినట్లయింది. దంతాల సమస్యతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను అందించింది. ఈ బయోమెటీరియల్స్ కణాలు సహజ దంతాల మాదిరిగా విధులను నిర్వర్తించేలా దంతాల ఆకృతిని ఇంజనీర్‌ చేస్తుంది. పునరుత్పత్తి అయిన ఈ దంత మొత్తం దంతాన్ని అభివృద్ధిచేస్తుందట. దంతాల నష్టంతో బాధపడే లక్షలాదిమందికి ఆ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ మేరకు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ..జీవసంబంధమైన రీతీలోనే దంతం భర్తీ చేయాలన్న లక్ష్యం నెరవేరింది. తాము అభివృద్ధి చేసిన ఈ దంతాలు దవడలో కలిసిపోతాయి, దీర్ఘకాలం మన్నికగా ఉండేలా బలంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇక్కడ ల్యాబ్‌లో పెంచిన దంతాలను నోటిలో కూడా పెంచడం అనేదానిపై మన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే వైద్యలు మాత్రం పోయిన పంటి స్థానంలో దంత కణాలు మార్పిడి చేసి పెంచుతామని చెబుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవ్వడానికి సమయం పట్టినా..దంత సంరక్షణలో అత్యాధునిక విధానంగా చెప్పొచ్చని అన్నారు పరిశోధకులు. (చదవండి: సినీ దర్శకుడు రాజమౌళి కారణంగా ఫేమస్‌ అయిన పర్యాటక ప్రాంతం ఇదే..! స్పెషాలిటీ ఏంటంటే..)

MLA Prem Sagar Rao Takes On Congress High Command6
అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ!

మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి రాకపోతే సహించేదే లేదని తేల్చిచెప్పారు. పదేళ్ల పాటు పార్టీని కాపాడుకుంటే ఇదేనా తమకిచ్చే గౌరవం అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి, పార్టీలో ఉండి పార్టీని కాపాడుకున్న తమలాంటి వాళ్లకు పదవులు ఇవ్వకపోతే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. ఇంద్రవెల్లి సభతో పార్టీకి ఊపిరిపోశానని ఆయన చెప్పుకొచ్చారు.వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లంటే..!వేరే పార్టీలు తిరిగొచ్చిన వాళ్లకి మంత్రి పదవులు ఇస్తారా అని ప్రేమ్‌ సాగర్‌ రావు ప్రశ్నించడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలు రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించే చేసినవే అంటూ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఒకానిక సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లి అక్కడ చుక్కెదురు కావడంతో తిరికి సొంత గూటికే చేరిన రాజగోపాల్‌ రెడ్డిని ఉద్దేశించి ప్రేమ్‌ సాగర్‌ వ్యాఖ్యానించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇది కాంగ్రెస్‌ లో మరింత అలజడి రేపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేతలు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడం ప్రతిపక్షాల పార్టీలు కౌంటర్లు వేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయ్యింది. మంత్రి పదవుల పంచాయితీ మొదటికొచ్చిందా?తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే కసరత్తు పూర్తయినప్పటికీ తమకు పదవి కావాలంటే తమకు కావాలంటూ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు సమాచారం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాస్త సస్సెన్స్ నెలకింది. కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు.తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఎందుకని జానారెడ్డి అన్నట్లు వార్తలు రావడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎందుకు పదవులు ఉండకూడదని ప్రశ్నించారు. తమ శక్తి సామర్థ్యాలను బట్టే మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం మొగ్గిచూపుతోందని, ఇక్కడ కొంతమంది తమ పలుకుబడితో ఆ పదవిని రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా పదవి ఇవ్వకపోతే అమీతుమీ తేల్చుకుంటాననే సంకేతాలు పంపడంతో అధిష్టానానికి మళ్లీ పదవుల పంచాయితీ తలనొప్పి షురూ అయ్యింది. తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ పంచాయితీ మళ్లీ మొదటికి రావడంతో అధిష్టానం మరోసారి చర్చలు జరిపే అవకాశాలు కూడా లేకపోలేదు.

Man Lost Job He Car 25 Minutes Early To An Interview7
ఇంటర్వ్యూకు ఇంత ముందొస్తావా? నీకు జాబ్‌ ఇవ్వనుపో!

ఎక్కడైనా ఉద్యోగానికి లేదా ఇంటర్వ్యూలకు కొంత ముందు వస్తే, వాళ్ళ టైమ్ సెన్స్ చూసి.. జాబ్ ఇచ్చే సంస్థల గురించి విన్నాం. కానీ ఇంటర్వ్యూకు 25 నిముషాలు ముందుగా వచ్చాడని.. ఉద్యోగం ఇవ్వని ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ది బ్రదర్స్ దట్ జస్ట్ డు గట్టర్స్ ఓనర్ 'మాథ్యూ ప్రీవెట్'.. తాను షెడ్యూల్ చేసిన సమయానికంటే ముందుగా ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థిని రిజెక్ట్ చేశారు. దీనికి కారణాన్ని వెల్లడిస్తూ.. అతనికి సమయపాలన లేదని, ఇంటర్వ్యూకు ఐదు నుంచి 15 నిముషాలు ముందుగా వచ్చి ఉంటే.. ఆ అభ్యర్థి మీద మంచి అభిప్రాయం వచ్చి ఉండేదని అన్నారు. అంతే కాకుండా అతడు ముందుగా వచ్చి.. నా కాల్స్ వినడం కూడా కొంత ఇబ్బందిగా అనిపించిందని స్పష్టం చేసారు. సమయానికంటే ముందుగా రావడం మంచి అలవాటే.. కానీ మారీ ముందుగా రావడం అనేది ఒక లోపం అని మాథ్యూ ప్రీవెట్ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆ సంస్థ తీరుపై మండిపడుతున్నారు. రిజెక్ట్ చేయడానికి ఇలాంటి కారణాన్ని మేము ఎక్కడా వినలేదని కొందరు చెబుతుంటే.. అతని అడ్రస్ మాకు పంపించండి.. మేము ఉద్యోగం ఇస్తామని మరికొందరు చెబుతున్నారు.

Randeep Hooda: I was Sidelined By This Hero for Highway Promotions8
ఆ హీరోకు నా సినిమాతో ఏం పని? నన్ను పక్కనపడేసి..: 'జాట్‌' విలన్‌

రణ్‌దీప్‌ హుడా (Randeep Hooda).. సినిమా అంటే ఎంత పిచ్చో మాటల్లో చెప్పలేదు. చేతల్లో చూపించాడు. సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు. తన శరీరాన్ని నచ్చినట్లుగా మార్చేస్తాడు. సర్‌బిజత్‌ సినిమా కోసం నెల రోజుల్లోనే 18 కిలోలు తగ్గిపోయాడు. గతేడాది వచ్చిన స్వతంత్ర వీర్‌ సావర్కర్‌ కోసం ఏకంగా 30 కిలోలకు పైనే తగ్గిపోయాడు. ఇందుకోసం తిండిమానేసి కడుపు కాల్చుకున్నాడు. జాట్‌ మూవీతో ఫుల్‌ క్రేజ్‌ఈ సినిమా కోసం పైసాపైసా కూడబెట్టి కొన్న రెండు,మూడు ప్లాట్లను అమ్మేశాడు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా నష్టాల్ని మిగిల్చింది. తాజాగా ఇతడు జాట్‌ సినిమాతో పలకరించాడు. తెలుగు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని రూపొందించిన ఈ సినిమాలో సన్నీడియోల్‌ హీరోగా, రణ్‌దీప్‌ విలన్‌గా నటించారు. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. కలెక్షన్స్‌ మాట పక్కనపెడితే విలన్‌గా రణ్‌దీప్‌కు మాత్రం మరింత గుర్తింపు తీసుకొచ్చింది.ఆ సినిమాకు నేను హీరో..తాజాగా అతడు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని తల్చుకుని బాధపడ్డాడు. రణ్‌దీప్‌ హుడా మాట్లాడుతూ.. ఆలియా భట్‌ (Alia Bhatt)తో కలిసి నేను హైవే సినిమా చేశాను. కానీ ప్రమోషన్స్‌లో నా స్థానంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఉన్నాడు. రణ్‌బీర్‌- ఆలియా ప్రమోషన్స్‌ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే ఆయనకు నా సినిమాతో ఏం పని? హైవేలో నేను హీరో. మరి ప్రమోషన్స్‌లో తనెందుకు ఉన్నాడో అర్థం కాలేదు. సరే, పోనీ.. కనీసం ప్రమోషన్స్‌కు నన్నైనా పిలవాలి కదా.. పిలవలేదు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడి ప్రమోషన్స్‌కు పిలిచుంటే అది నా కెరీర్‌కు సాయపడేదేమో!లవ్‌ జర్నీ..బహుశా.. హైవే ప్రమోషన్స్‌ అప్పుడే రణ్‌బీర్‌, ఆలియా ప్రేమలో పడ్డారేమో! నా సినిమా వల్ల వారిద్దరి మనసులు దగ్గరయ్యాయంటే అది నాకు సంతోషమే! కానీ నన్ను పట్టించుకుంటే బాగుండేదనిపించింది. అయితే వారి ప్రమోషన్స్‌తో సినిమాకు పెద్దగా హైప్‌ రాకపోవడంతో రిలీజ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు నన్ను ప్రమోషన్స్‌కు పిలిచారు అని చెప్పుకొచ్చాడు.చదవండి: అలాంటి తప్పులు భవిష్యత్తులో జరగనివ్వను: సమంత

PM Modi Targets Congress Over Waqf Act9
మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్‌: ‍ప్రధాని మోదీ

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ(Prime Minister Modi) కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు.ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ మతవాదులను సంతృప్తి పరచిందనడానికి వక్ఫ్ చట్టమే రుజువు అని అన్నారు. లక్షల హెక్టార్ల భూమిని వక్ఫ్ పేరుతో దక్కించుకున్నారని, వీటితో పేద ముస్లింలు ఏనాడూ ప్రయోజనం పొందలేదని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ లాభపడింది భూ మాఫియానే అని అన్నారు. ఈ దోపిడీ ఇకపై కొత్త చట్టంతో ఆగిపోతుందని, సవరించిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు(Waqf Board) ఏ ఆదివాసీ భూమినీ క్లెయిమ్ చేయలేదని అన్నారు. ఇదే నిజమైన సామాజిక న్యాయమని, దీంతో పేద ముస్లింలు తమ హక్కులను కాపాడుకోగలుగుతారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలను రెండవ తరగతి పౌరులుగా చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. డాక్టర్ అంబేద్కర్ పేదలు, వెనుకబడిన వర్గాలకు గౌరవం ఇవ్వాలని కలలు కన్నారని, కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల వైరస్‌ను వ్యాప్తి చేసి, అంబేదర్కర్‌ దార్శనికతకు అడ్డుకట్ట వేసిందని ప్రధాని పేర్కొన్నారు. వారు అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు కూడా అతనిని అవమానించారని, ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారని, ఆయన వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించారని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నదని, ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఇప్పుడు లౌకిక పౌర కోడ్ అమలులో ఉందని, కాంగ్రెస్ ఇప్పటికీ దానిని వ్యతిరేకిస్తున్నదని ప్రధాని ఆరోపించారు.ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలపై తమ పార్టీ ట్రాక్ రికార్డ్‌ను సమర్థించుకుంటూ, బీజేపీ చారిత్రక వంచనకు పాల్పడిందని ఆరోపించారు. ఇలాంటివారు అప్పట్లో బాబా సాహెబ్‌కు శత్రువులని, నేటికీ అలాగే ఉన్నారన్నారు. బాబాసాహెబ్ బౌద్ధమతాన్ని స్వీకరించినప్పుడు ఆయన అంటరానివాడిగా మారారని వారు ఆరోపించారని ఖర్గే పేర్కొన్నారు. నాడు ఆయనను హిందూ మహాసభ వ్యతిరేకించిందని అన్నారు. మహిళా చట్టంలో రిజర్వేషన్ కల్పించి, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలను ఖర్గే గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు

Chandrababu coalition govt Land Grabbing For Amaravati Capital Expansion10
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్‌’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ లేదా నెగోíÙయేటెడ్‌ సెటిల్‌మెంట్స్‌ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్‌ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement