
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోషల్ స్టడీస్ పరీక్ష మంగళవారం నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
విధి నిర్వహణలో భాగమైన అధికారులు, ఉపాధ్యాయులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం ఐచ్చిక సెలవుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పదో తరగతి పరీక్షలకు సెలవు వర్తించదని అధికారులు ప్రకటించారు.