
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేటి నుంచి 1–9 తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్–2) ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 1–8వ తరగతి వరకు ఉదయం 9–12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9–12.15 గంటల వరకు పరీక్షలుంటాయి.
షెడ్యూల్ ఇదీ..
⇒ ఉన్నత తరగతులకు (6–9) ఏప్రిల్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, 8న సెకండ్ లాంగ్వేజ్, 9న థర్డ్ లాంగ్వేజ్, 10న గణితం, 11న జనరల్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, 12న బయాలజీ, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 16న కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం/ హిందీ, అరబిక్, పర్షియా లేదా ఓఎస్‌ఎస్‌సీ పేపర్–1, 17న ఓఎస్‌ఎస్‌సీ లేదా కాంపోజిట్ కోర్సు పేపర్–2 పరీక్ష ఉంటుంది.
⇒ ప్రాథమిక తరగతులకు (1–5) ఏప్రిల్ 9న ఫస్ట్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి‹Ù, 11న గణితం, 12న ఈవీఎస్ (3, 4, 5 తరగతులు), 15న ఓఎస్‌ఎస్‌సీ (3, 4, 5 తరగతులు) పరీక్షలు జరుగుతాయి.
పది రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు..!
మరో 10 రోజుల్లో ఇంటర్, పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు ఈనెల ఒకటో తేదీ నుంచే ప్రారంభం కాగా, మొదటి సంవత్సరం ప్రవేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి హాల్‌టికెట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించి, ఫలితాలు వచ్చాక అడ్మిషన్ ఖరారు చేయనున్నారు.