AP Govt Signs Agreement With ETS To Conduct TOEFL Exams for Students - Sakshi
Sakshi News home page

విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు

Published Fri, Jun 23 2023 7:53 PM | Last Updated on Fri, Jun 23 2023 8:24 PM

Ap Govt Signs Agreement With Ets To Conduct Toefl Exams For Students - Sakshi

సాక్షి, అమరావతి: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

‘‘ఈ కార్యక్రమాన్ని కేవలం జూనియర్‌ లెవెల్‌కే పరిమితం చేయకుండా.. ప్లస్‌ వన్, ప్లస్‌ టూ సీనియర్‌ లెవెల్‌ వరకూ విస్తరించాలి. మీరు కచ్చితంగా మా ప్రభుత్వ బడులను చూడాలి. అప్పుడే మీకు మేం విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 30,230 క్లాస్‌రూమ్‌లను డిజిటలైజ్‌ చేయబోతున్నాం. మొత్తంగా దాదాపు 63వేల క్లాస్‌ రూమ్‌లను డిసెంబరు నాటికి డిజిటలైజ్‌ చేయబోతున్నాం.’’ అని సీఎం పేర్కొన్నారు.
చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్‌

‘‘మరో వైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్ధికి ట్యాబులు పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా 8వతరగతి విద్యార్ధులకు డిసెంబరు 21న ట్యాబులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు నేడు పేరుతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్ధికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని కూడా ఉచితంగా అందిస్తున్నాం. వీటకి అదనంగా ఇప్పుడు టోఫెల్‌ ప్రైమరీ, టోఫెల్‌ జూనియర్‌, టోఫెల్‌ సీనియర్‌ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement