TOEFL
-
ఇకపై ఏపీ స్కూల్స్ లో ''టోఫెల్' శిక్షణ ఉండదు
-
టోఫెల్ శిక్షణతో సత్ఫలితాలు..ఎల్లో మీడియా వక్రరాతలు
-
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యార్థులకు టోఫెల్ శిక్షణ
-
విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ
-
టోఫెల్ తర్ఫీదుకు కీలక అడుగు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులను ‘టోఫెల్ సర్టిఫికేషన్’కు సన్నద్ధం చేయడంలో భాగంగా ‘లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి టోఫెల్ శిక్షణకు అవసరమైన సాఫ్ట్వేర్, ఈ–కంటెంట్‌ను ఉచితంగా అందించడంతో పాటు, ఉపాధ్యాయులు, అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే మూడో తరగతి నుంచి తొమ్మిది వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రోజుకు గంట పాటు టోఫెల్ శిక్షణ ప్రారంభించినట్టు తెలిపారు. విద్యార్థుల్లో లిజనింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పెంపు, వివిధ దేశాల్లో ఇంగ్లిషు మాట్లాడే తీరును అర్థం చేసుకుని.. తిరిగి జవాబు ఇచ్చేలా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే ఎస్సీఈఆర్టీ ద్వారా మెటీరియల్ తయారు చేశామన్నారు. అయితే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ ఏజెన్సీ మెటీరియల్ అవసరాన్ని గుర్తించి లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో వారిని దృష్టిలో పెట్టుకుని లిక్విడ్ సంస్థ ఉచితంగా మెటీరియల్ ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సమగ్ర శిక్ష పీడీ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. వాస్తవానికి టోఫెల్ సర్టిఫికేషన్ కోసం ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్విసెస్(ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా.. విద్యార్థులను టోఫెల్ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నామన్నారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్థల నుంచి టెండర్లు పిలిచినా.. శిక్షణ ప్రక్రియ ప్రారంభించేందుకు సమయం లేదన్నారు. అందుకే ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే లిక్విడ్ ఇచ్చే కంటెంట్ వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది టెండర్లు పిలిచి కంటెంట్ ఖరారు చేస్తామని వివరించారు. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రవీణ్‌ప్రకాశ్ చెప్పారు. ఇందులో భాగంగానే 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది ఆంగ్ల మాధ్యమం అభ్యసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో తొలిసారిగా సైన్స్, సోషల్ సైన్స్, గణితం సబ్జెక్టుల్లో ద్విభాషా పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చినట్టు తెలిపారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యం పెంపొందించడంలో భాగంగా బైజూస్ ద్వారా ఉత్తమ కంటెంట్ అందిస్తోందన్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌ను ఇన్స్టాల్ చేసి 5.18 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసిందని వెల్లడించారు. నాడు–నేడులో భాగంగా పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్‌పీ), ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో తరగతి గదులను డిజిటలైజ్ చేసిందని చెప్పారు. డిసెంబర్ నాటికి మొత్తం తరగతి గదుల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో డిజిటల్ బోధనలు ప్రవేశపెడతామని వివరించారు. అంతర్జాతీయంగా గుర్తింపు నోయిడాకు చెందిన లిక్విడ్ ఇంగ్లిష్ ఎడ్జ్.. కామన్ యూరోపియన్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ రిఫరెన్స్(సీఇఎఫ్ఆర్)తో పాటు బ్రిటీష్ కౌన్సిల్, పియర్సన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, మాక్మిలన్, ఆదిత్య బిర్లా ఫౌండేషన్, పబ్లిషింగ్ కంపెనీలకు విశ్వసనీయ సేవలందిస్తోంది. విద్యార్థుల తరగతి, వయస్సును బట్టి ఈ కంటెంట్‌ను తయారు చేసి అందిస్తోంది. కెయిర్న్ ఇండియా, అలహాబాద్ యూనివర్సిటీ, ఫెయిర్ అండ్ లవ్లీ ఫౌండేషన్, ఫ్రాంక్ఫిన్, గ్లోబల్ లాజిక్, ఇండియన్ మిలిటరీ అకాడమీ, జెట్‌కింగ్, ఒడిశా మోడల్ ట్రైబల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటి అనేక మందికి సేవలందిస్తోంది. -
AP: సర్కారు బడిలో ‘టోఫెల్’ ట్రైనింగ్
మనం ఏ కార్యక్రమం తలపెట్టినా పేద వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. వారి పట్ల సహృదయంతో పని చేయాలి. వారి జీవితాల్లో మార్పు తేవడం దేవుడి దృష్టిలో గొప్ప సేవ చేసినట్లే. ఇదొక సవాల్‌తో కూడుకున్న కార్యక్రమం. టోఫెల్ శిక్షణను కేవలం జూనియర్ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్ వన్, ప్లస్ టూ (ఇంటర్) వరకూ విస్తరించాలి. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులను చేపట్టిన నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్’ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఊమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఈటీఎస్ అసెస్మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రుయి ఫెరీరా, డేనియల్, యూఫిఎస్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ కపూర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కపిల్, వైస్ ప్రెసిడెంట్ డిజిటల్ సేల్స్ ఇండియా కే–12 రాజీవ్ రజ్దాన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పరిశీలించాలని ఈటీఎస్ బృందాన్ని ఆహ్వానించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌లు రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్ చేస్తున్నాం. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తాం. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతాం. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. 1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తాం. టెన్త్ విద్యార్థులు 2025లో సీబీఎస్ఈ పరీక్షలకు ఇంగ్లిష్ మీడియంలో హాజరవుతారు. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయి. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతాం. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం. వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం. కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఒప్పందంలో ముఖ్యాంశాలు.. ♦ టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. ♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. ♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. ♦ 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్ ప్రైమరీని నిర్వహిస్తారు. ♦ 6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష ఉంటుంది. ♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్ జూనియర్ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. ♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు. ♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. ♦ అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు మూడు రోజులపాటు పంపిస్తారు. ♦ ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్ –1, ప్లస్ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం విద్యలో నాణ్యత పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంతోనైనా విద్యార్థులు సులభంగా అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. నా తల్లిదండ్రులు ఫ్రాన్స్‌కు చెందినవారు కావడంతో ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు. నేను ఆంగ్ల భాష నేర్చుకుని అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందా. ఈటీఎస్ 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మాది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సంస్థ. 180 దేశాల్లో 9 వేల ప్రాంతాల్లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 52 మంది టీచర్లను అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపనుంది. వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం. – అలైన్ డౌమాస్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ -
విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు
సాక్షి, అమరావతి: విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచస్థాయి పోటీలకు విద్యార్థులను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని కేవలం జూనియర్ లెవెల్కే పరిమితం చేయకుండా.. ప్లస్ వన్, ప్లస్ టూ సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. మీరు కచ్చితంగా మా ప్రభుత్వ బడులను చూడాలి. అప్పుడే మీకు మేం విద్యారంగంలో చేస్తున్న మార్పులు నేరుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ జూలై ఆఖరు నాటికి రాష్ట్రంలో 30,230 క్లాస్‌రూమ్‌లను డిజిటలైజ్ చేయబోతున్నాం. మొత్తంగా దాదాపు 63వేల క్లాస్ రూమ్‌లను డిసెంబరు నాటికి డిజిటలైజ్ చేయబోతున్నాం.’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: పేదల పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే: సీఎం జగన్ ‘‘మరో వైపు 8వతరగతిలోకి అడుగుపెడుతున్న ప్రతి విద్యార్ధికి ట్యాబులు పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా 8వతరగతి విద్యార్ధులకు డిసెంబరు 21న ట్యాబులు పంపిణీ చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 45 వేల స్కూళ్లలో నాడు నేడు పేరుతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మా పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్ధికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని కూడా ఉచితంగా అందిస్తున్నాం. వీటకి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ చెప్పారు. -
టోఫెల్ అర్హతతో కెనడాలోనూ చదవొచ్చు
న్యూఢిల్లీ: టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్) స్కోరు ఆధారంగా విదేశీ విద్యార్థులు కెనడాలోనూ ఉన్నత విద్యనభ్యసించవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) తెలిపింది. కెనడా ప్రభుత్వ ‘స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)’పథకంలో భాగంగా ఉన్నత విద్యనభ్యసించే విదేశీ విద్యార్థులకు ఇకపై టోఫెల్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొంది. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా(ఐఆర్సీసీ) ఇందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఇప్పటి వరకు ఎస్డీఎస్లో ఇంగ్లిష్ అర్హత పరీక్షగా ఐఈఎల్‌టీఎస్‌కు మాత్రమే ఆప్షన్ ఉండేది. ఈ ఏడాది ఆగస్ట్ 10వ తేదీ నుంచి ఎస్డీఎస్కు దరఖాస్తు చేసుకునేవారు టోఫెల్ స్కోరును కూడా జత చేసుకోవచ్చని వివరించింది. ఎస్డీఎస్ దరఖాస్తుల పరిశీలన దాదాపు 20 రోజుల్లోనే పూర్తవుతుందని ఈటీఎస్ పేర్కొంది. కాగా, టోఫెల్‌ను అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర 160కి పైగా దేశాలకు చెందిన 12 వేల సంస్థలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. -
విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్..ఇకపై రెండు గంటల్లోనే ‘టోఫెల్’
న్యూఢిల్లీ: విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఉపకరించే ‘టోఫెల్’ పరీక్ష ఇకపై రెండు గంటలలోపే ముగియనుంది. ప్రస్తుతం ఈ పరీక్షను మూడు గంటలపాటు నిర్వహిస్తున్నారు. అధికారిక స్కోర్‌ను విడుదల చేసే తేదీని టోఫెల్ పూర్తికాగానే అభ్యర్థులు తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఈటీఎస్) వెల్లడించింది. టోఫెల్ ఒక గంట 56 నిమిషాల పాటు ఉంటుందని పేర్కొంది. టోఫెల్లో చేస్తున్న మార్పులు ఈ ఏడాది జూలై 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టోఫెల్ స్కోర్‌ను 160కిపైగా దేశాల్లో 11,500కిపైగా యూనివర్సిటీలు అంగీకరిస్తున్నాయి. ఇందులో అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని వర్సిటీలు ఉన్నాయి. టోఫెల్ రిజి్రస్టేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తున్నట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ తెలిపారు. టెస్టు ఫీజును భారతీయ రూపాయల్లో చెల్లించవచ్చని సూచించారు. టోఫెల్ ప్రక్రియలో తీసుకొస్తున్న మార్పులతో లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అసోసియేషన ఆఫ్ ఆ్రస్టేలియన్ ఎడ్యుకేషన్ రిప్రజంటేటివ్స్ ఇన్ ఇండియా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి బొర్రా వివరించారు. చదవండి: పోతపోసిన పోస్టాఫీస్...! -
ఇకపై వారికి నో టోఫెల్
న్యూఢిల్లీ: లండన్‌లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు, ప్రసూతి నిపుణులు వీసా కోసం ఇకపై టోఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్ (ఓఈటీ) రాయడం ద్వారా యూకేలో సులువుగా ప్రవేశించవచ్చు. యూకేలోని నర్సింగ్ అండ్ మిడ్‌వైఫెరీ కౌన్సిల్, జనరల్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే ఓఈటీని అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. టైర్–2 వీసా కోసం సంబంధిత ఆరోగ్య సంస్థ నిర్వహించే ఇంగ్లిష్ పరీక్ష పాసయితే చాలని యూకే హోం శాఖ తెలిపినట్లు కేంబ్రిడ్జ్ బోక్స్‌హిల్ లాంగ్వేజ్ అసెస్మెంట్ సీఈఓ సుజాత స్టెడ్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వైద్య రంగ నిపుణుల ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓఈటీ నిర్వహిస్తున్నారు. -
పరీక్షల ‘కీ’.. అక్రమార్కుల చేతికి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఆన్లైన్ పరీక్షలైన టోఫెల్, పీటీఈ, ఐఈఎల్టీఎస్ల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి. వీటికి సంబంధించిన ‘కీ’లు ముందే బయటకు వచ్చేస్తున్నాయి. లాడ్జిల్లో ‘కోచింగ్ సెంటర్లు’ఏర్పాటు చేసి అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ దందాలో దాదాపు 40 మంది మంచి స్కోర్స్ సాధించి విదేశీ విద్యకు వెళ్లారు. మరో 40 మంది సఫలీకృతులు కాలేకపోయారు. తమ సిరీస్‌కు చెందిన ‘కీ’లు ఇస్తామంటూ మోసం చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వేట మొదలుపెట్టిన మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక ఏజెంట్ కె.కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి ఆయా పరీక్షలకు సంబంధించిన ‘కీ’లు తీసుకువచ్చి అందిస్తున్న సూత్రధారి యువరాజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు. వీరి ద్వారా లబ్ధిపొంది, ఆన్లైన్ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించి విదేశాలకు వెళ్లిన విద్యార్థులకూ నోటీసులు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పరీక్ష కోసం అయిన పరిచయంతో... నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్‌కు చెందిన కుర్రా కిరణ్‌కుమార్ 2013లో అక్కడి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. 2016 మేలో హైదరాబాద్‌కు వచ్చి కేపీహెచ్బీలో ఉన్న మలేషియా టౌన్షిప్లో స్థిరపడ్డాడు. ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేద్దామనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాలని సిద్ధమయ్యాడు. విదేశాల్లో విద్యనభ్యసించాలని భావించే వారు ఐఈఎల్టీఎస్, పీయర్సన్ టెస్ట్స్ ఆఫ్ ఇంగ్లిష్ (పీటీఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాస్ ఎ ఫారెన్ లాంగ్వేజ్ (టోఫెల్) వంటి పరీక్షలు ఆన్లైన్లో రాసి మంచి స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కిరణ్‌కు పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన యువరాజ్ సింగ్‌తో పరిచయమైంది. పరీక్ష అడ్డదారిలో పాస్ కావడానికి సహకరిస్తానని చెప్పడంతో కిరణ్ అంగీకరించడమే గాక, పరీక్ష రాసే అభ్యర్థుల్ని వెతికే పనిలోపడ్డాడు. 12 గంటల ముందే ‘కీ’ బయటకు... పరీక్షల్లో అడ్డదారిలో స్కోర్ సాధించాలనుకునే వారి నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసేవాడు. కిరణ్, యువరాజ్ సగం సగం తీసుకునేవారు. పరీక్షకు ముందు రోజు.. దాదాపు 12 గంటల ముందు యువరాజ్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ని తెచ్చి ఇచ్చేవాడు. వీరిద్దరూ కలసి స్థానికంగా ఉన్న లాడ్జిల్లో గదులు బుక్ చేసి, నగదు చెల్లించిన అభ్యర్థుల్ని తీసుకువచ్చి రాత్రంతా ప్రిపేర్ చేయించేవారు. అయితే మూడు నాలుగు సిరీస్లుండే పేపర్లో ఒక్క సిరీస్ మాత్రమే తెచ్చేవారు. మరుసటి రోజు ఆ సిరీస్ వచ్చిన వారు ఉత్తీర్ణులవుతుండగా... మిగిలిన వారికి సరైన స్కోర్ రావట్లేదు. ఇలా మంచి స్కోర్ పొందిన వారిలో 40 మంది విదేశాలకు వెళ్లిపోయారు. మోసపోయామని ఫిర్యాదు చేయడంతో... కిరణ్‌కు రూ.50 లక్షలు చెల్లించిన మరో 40మందికి సరైన స్కోర్ రాలేదు. దీంతో వీరిలో కొందరు కిరణ్‌పై సైఫాబాద్, మీర్‌చౌక్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం గత వారం కిరణ్‌ను పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది. ఇతడి విచారణలోనే యువరాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడికి క్వశ్చన్ పేపర్ ‘కీ’ బ్రిటిష్ కౌన్సిల్ నుంచే అందుతున్నట్లు బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా ఈ దందా చేస్తున్న యువరాజ్ కోసం గాలిస్తున్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో పంజాబ్, హరియాణాల్లో ఇతను పోలీసులకు పట్టుబడ్డాడు. వీరి ద్వారా అక్రమంగా లబ్ధిపొంది విదేశాలకు వెళ్లిన 40 మందికి నోటీసు లు జారీచేయాలని భావిస్తున్నారు. మోసపోయినట్లు చెప్తున్న వారూ అక్రమ మార్గంలో స్కోర్ సాధించాల ని ప్రయత్నించిన వారే కాబట్టి వీరిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉం దా? అనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు. -
బ్రిటన్ విద్యార్థి వీసాల ఆశలు ఆవిరి!
టోఫెల్, టోయిక్ పరీక్షలు ఇకపై ఈటీఎస్ నిర్వహించదు న్యూఢిల్లీ: విద్యార్థుల వీసా ఆశలపై నీళ్లు చల్లేలా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. యూకేలో వీసాల జారీకి సంబంధించి టోఫెల్, టోయిక్ పరీక్షలను ఇకపై ఈటీఎస్(ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) నిర్వహించడం లేదని ప్రకటించింది. టోయిక్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫర్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్) అక్రిడేషన్ కోసం విద్యార్థులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నట్లు ఇటీవల బీబీసీలో కథనం వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈటీఎస్‌తో తమ కాంట్రాక్టు పొడిగించబోమని బ్రిటన్ హోంశాఖ తెలిపింది. ఈటీఎస్ పరీక్షలకు హాజరయ్యే వారు హోం శాఖ ఆమోదించిన ఇతర ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని యూకే అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి సూచించింది. సహాయం కోసం సంబంధిత విద్యాసంస్థల సలహాదారులను సంప్రదించాలని పేర్కొంది.