న్యూఢిల్లీ: లండన్‌లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు, ప్రసూతి నిపుణులు వీసా కోసం ఇకపై టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కేవలం ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్ (ఓఈటీ) రాయడం ద్వారా యూకేలో సులువుగా ప్రవేశించవచ్చు. యూకేలోని నర్సింగ్ అండ్ మిడ్‌వైఫెరీ కౌన్సిల్, జనరల్ మెడికల్ కౌన్సిల్ నిర్వహించే ఓఈటీని అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది.
టైర్–2 వీసా కోసం సంబంధిత ఆరోగ్య సంస్థ నిర్వహించే ఇంగ్లిష్ పరీక్ష పాసయితే చాలని యూకే హోం శాఖ తెలిపినట్లు కేంబ్రిడ్జ్ బోక్స్‌హిల్ లాంగ్వేజ్ అసెస్‌మెంట్ సీఈఓ సుజాత స్టెడ్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. వైద్య రంగ నిపుణుల ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓఈటీ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment