
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.
11 నుంచి 12.55 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడ బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.