
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్.. అక్రమ కేసులు పెడుతూ అరెస్ట్‌లు చేస్తోంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ఏపీలో కూటమి ప్రభుత్వం మరో అరెస్ట్‌కు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అరెస్ట్ చేసింది. అహ్మద్ బాషా ముంబై ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, అహ్మద్ బాషా గతంలో రాజీ పడిన ఓ కేసును కూటమి ప్రభుత్వం తిరగదోడింది. ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక, సదరు కేసులో ఇరు వర్గాలు ఇప్పటికే రాజీపడటం గమనార్హం. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా అహ్మద్‌ను ఇప్పుడు అరెస్ట్ చేసింది.