జీఎస్‌డీపీపై ఇన్ని బోగస్‌ మాటలా బాబూ? | YS Jagan Questions To CM Chandrababu Naidu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

జీఎస్‌డీపీపై ఇన్ని బోగస్‌ మాటలా బాబూ?

Published Tue, Apr 8 2025 4:47 AM | Last Updated on Tue, Apr 8 2025 10:58 AM

YS Jagan Questions To CM Chandrababu Naidu: Andhra pradesh

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌  

2024–25 మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతమే.. జీఎస్‌డీపీ ఏకంగా 8.21 శాతం

ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా? 

రాష్ట్ర విశాల ప్రయోజనాలు, విశ్వసనీయతను 

కాపాడేందుకు ‘అతి’ అంచనాలను సరిదిద్దుకోండి  

సాక్షి, అమరావతి: ‘‘గత ఆర్థిక సంవత్సరం (2024–­25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీ­యమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్‌డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవు­తుం­దని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయ­తను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపా­డేం­దుకు.. జీఎస్‌డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలి­కారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. అందులో ఏమన్నారంటే..
è చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. 

నాడు కోవిడ్‌ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్‌ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది. 

జీఎస్‌డీపీ గ్రోత్ పై వైఎస్ జగన్ ట్వీట్

⇒  కోవిడ్‌ ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ 2019–24 మధ్య ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో దేశ వృద్ధి రేటును రాష్ట్ర వృద్ధి రేటు అధిగమించింది. 2025 మార్చిలో విడుదలైన రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదిక, ఎంవోఎస్‌పీఐ నివేదికలే అందుకు నిదర్శనం. అయినప్పటికీ 2019–24లో రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం ఉందని మీరు చెబుతున్నారు.

⇒ మరోవైపు మీ పాలనలో మొదటి సంవత్సరంలో చాలా ఆందోళనకరమైన ధోరణి ఆవిష్కృతమైంది. కోవిడ్‌ లాంటి ప్రతికూల పరిస్థితులు లేనప్పటికీ.. 2024–25లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాలు, పన్నే­తర ఆదాయాల పెరుగుదల చాలా తక్కువగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటా పెరగకపోతే, అప్పులు చేయక­పోతే.. మీ ప్రభుత్వం ప్రాథమిక ఖర్చులను కూడా తీర్చలేకపోయేది. మీ అసమర్థ పాలన.. అసంబద్ధ విధానాల వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఇంకా ప్రధానమైన విషయం ఏమిటంటే .. మీ ప్రభుత్వం మొదటి సంవత్సరంలో మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది.

⇒ రాష్ట్ర ఆర్థిక పనితీరును బలోపేతం చేయడానికి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సిన అవసరాన్ని పూర్తిగా విస్మరించి.. రాష్ట్ర ఆర్థిక పనితీరుపై తప్పుడు ప్రచారం చేయడానికి మీ ప్రభుత్వం అన్ని ప్రయత్నా­లను చేస్తుండటం ఆందోళనకరం. రాష్ట్ర ఆర్థిక పనితీ­రును ఒక్కసారి పరిశీలిస్తే.. ఎంత ఇబ్బంది, దోపిడీ జరుగుతుందో తెలుస్తుంది. అయినప్పటికీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని మీరు అబద్ధం చెబుతున్నారు.

⇒ ఎంవోఎస్‌పీఐ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రం ఈమేరకు పనితీరు కనబరుస్తున్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం వెల్లడిస్తోంది. నిజానికి ఎంవోఎస్‌పీఐ విడుదల చేసే డేటాకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక, గణాంకాల డైరెక్టరేట్‌ డేటానే మూలం. దీన్ని బట్టి చూస్తే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన డేటా మినహా  మరొకటి కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన ముందస్తు అంచనాలు మాత్రమే. వాటిని ఎంవోఎస్‌పీఐ వంటి ఏ స్వతంత్ర సంస్థ ధృవీకరించలేదు. 

⇒ 2024–25లో కేంద్ర పన్నుల ఆదాయాలు ఫిబ్రవరి 25 వరకూ 10.87 శాతం వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2024–25లో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 6.48 శాతంగా అంచనా వేసింది. ఇది సమర్థనీయమే. 

⇒ తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి 2025 వరకు 13.01 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.69 శాతంగా అంచనా వేసింది. ఇది కూడా సమర్థనీయమే.

⇒ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 2024–25లో ఫిబ్రవరి వరకు 2.16 శాతం మాత్రమే పెరిగితే.. జీఎస్‌డీపీ వృద్ధి రేటు 8.21 శాతంగా ఉంటుందని మీ ప్రభుత్వం అంచనా వేసింది. మరి ఇది సమర్థనీ­యమైన­దేనా? పన్ను ఆదాయాల వృద్ధి రేటు.. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయం 33.35 శాతం తగ్గింది. మూలధన వ్యయం 42.78 శాతం తగ్గింది. 

⇒ గత సంవత్సరం మీ ప్రభుత్వ ఆర్థిక పనితీరు పేలవంగా ఉండటం ఆదాయాల తీరును బట్టి స్పష్టంగా కనిపిస్తున్నందున.. ఈ సంవత్సరం ఇంత బలమైన ఆర్థిక పనితీరు గురించి మీ ప్రభుత్వ అంచనాను మీరు ఎలా సమర్థిస్తారు? ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్ను ఆదాయంలో పెరుగుదల ముందస్తు జీడీపీ వృద్ధి అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఇది సముచితం. ఎందుకంటే, ప్రస్తుత ధరల వద్ద వినియోగం, పెట్టుబడి వ్యయంపై పన్నులు విధిస్తారు కాబట్టి.. ఇది వాస్తవ జీడీపీ వృద్ధి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement