తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన | YSRCP Bhumana Karunakar Reddy Serious Comments ON CBN Govt | Sakshi
Sakshi News home page

తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు: భూమన

Published Wed, Apr 2 2025 1:16 PM | Last Updated on Wed, Apr 2 2025 3:47 PM

YSRCP Bhumana Karunakar Reddy Serious Comments ON CBN Govt

సాక్షి, తిరుపతి: తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి. తిరుమల కొండపై నాలుగు సార్లు ఎర్ర చందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్‌ పీఏ పది నుంచి 12 లెటర్లు పంపిస్తున్నారు అంటే అసలేం జరుగుతోంది?. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది అని చెప్పుకొచ్చారు.

తాజాగా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి లోకేష్‌ పీఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దందా చేస్తున్నారు. గతంలో నాలుగు వేల లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు ఎనిమిది వేలకు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డుపై వాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే.. చంద్రబాబు?. ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారు చెప్పండి చంద్రబాబు

అటవీ శాఖ పరిధిలో పాపవినాశనం చుట్టూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఎందుకు మాట్లాడరు?. టీటీడీ అధికారిగా కాకుండా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీ అనుంగు శిష్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుమలలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది మీ పాలనలోనే. కూటమి పాలన పాపాన్నిపెంచడానికే ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు గుర్తించండి. ధర్మ వ్యతిరేకంగా మీ పాలక మండలి, సభ్యులు వ్యవహరిస్తున్నారు.

పీ-4 కార్యక్రమంపై భూమన స్పందిస్తూ.. రెండు లక్షల 80వేల కోట్లు పేదలకు పంచిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కింది. మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా 5 శాతం కూడా సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. మార్గదర్శి బంగారు కుటుంబం అంటూ నటనలు చేస్తున్నారు, ఆర్థిక ద్రోహమే కానీ, మరొకటి లేదు. ఈ మాయ ధనవంతులు.. పేదలకు సహాయం చేయడం అన్నది సాధ్యం కాని విషయం. పేద వాళ్ళు అందరూ చంద్రబాబు చేస్తున్న మోసాన్ని గమనించాలి. పేదలకు బాసటగా నిలిచిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. పీ-4 ఫిలాసఫీ మానవాళికి విఘాతమే తప్ప, ఎలాంటి మేలు జరగదు అని తెలిపారు. 

లోకేష్ పీఏ తిరుమలలో సిఫార్సు లేఖల దందా చేస్తున్నారు: భూమన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement