Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Negligence Over Aqua Farmers Problems1
పబ్లిసిటీ కాదు బాబూ.. మేలు ముఖ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్

సాక్షి, తాడేపల్లి: ఆక్వా రైతుల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నిర్లక్ష్యంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు, మీరు చేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు నిజంగా మేలు చేసేలా ఉండాలి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ఆక్వా రైతుల పెట్టుబడిలో రొయ్యలకు వేసే మేత ప్రధానమైనది. గతంలో ఈ ఫీడ్‌పై 15 శాతం సుంకం విధించినప్పుడు కంపెనీలన్నీ కిలోకు రూ.6.50లు చొప్పున పెంచారు. ఫీడ్‌ తయారు చేసే ముడిసరుకులపై ఇప్పుడు సుంకం 15 శాతం నుంచి 5 శాతంకి తగ్గింది. అలాగే సోయాబీన్‌ రేటు కిలోకు గతంలో రూ.105లు ఉంటే ఇప్పుడు రూ.25లకు పడిపోయింది. మరి ముడిసరుకుల రేట్లు ఇలా పడిపోయినప్పుడు ఫీడ్‌ రేట్లు కూడా తగ్గాలి కదా? ఎందుకు తగ్గడంలేదు? ఈ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలన్నీకూడా 50 కౌంట్‌ లోపువే. అమెరికాకూడా మన దేశంపై విధించిన టారిఫ్‌లను 90 రోజులపాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మేరకు ధరలు పెరగాలి కదా? ఎందుకు పెరగడంలేదు? టారిఫ్‌ సమస్యతో సంబంధం లేని యూరప్‌ దేశాలకు 100 కౌంట్ రొయ్యలు ఎగుమతి అవుతాయి. వీటి రేటుకూడా పెరగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన రూ.220ల రేటు కూడా రైతులకు రావడంలేదు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270ల రేటు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..మా ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్ అథారిటీ కింద ఎంపెవరింగ్‌ కమిటీ ఉండేది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచేది. ఇలాంటి వ్యవస్థలను ఇప్పుడు అచేతనంగా మార్చేశారు. వెంటనే దీన్ని పునరుద్ధరిస్తూ రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. 1. @ncbn గారూ.. ఆక్వా రైతుల కష్టాలపై మా పార్టీ నాయకుల ఆందోళన, నా ట్వీట్‌ తర్వాత ఎట్టకేలకు మీరు ఒక సమావేశం పెట్టినందుకు ధన్యవాదాలు. కాని, మీరు పెట్టిన సమావేశం ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా కనిపించడం లేదని ఆయా జిల్లాలకు చెందిన నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చారు. మీ సమావేశాలు,…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 10, 2025

Hyderabad And Telangana Rains Update2
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్‌, మియాపూర్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌ ఎస్‌ఆర్‌ నగర్, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.హైదరాబాద్‌లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.

Portugals 64-year-old Joanna Child becomes second oldest T20I debutant3
సంచ‌ల‌నం.. 64 ఏళ్ల వ‌య‌స్సులో అంత‌ర్జాతీయ అరంగేట్రం

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. 64 ఏళ్ల వ‌య‌స్సులో జోవన్నా చైల్డ్ అనే మ‌హిళా క్రికెట‌ర్ పోర్చుగ‌ల్ త‌ర‌పున టీ20 అరంగేట్రం చేసింది. ఈ లేటు వ‌య‌స్సులో జోవన్నా చైల్డ్ ఏప్రిల్ 7న నార్వేతో జ‌రిగిన మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.త‌ద్వారా ఇంటర్న‌నేష‌న‌ల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రెండవ పెద్ద వయసు క్రికెటర్‌గా ఆమె రికార్డుల‌కెక్కింది. ఇంత‌కుముందు ఈ రికార్డు ఫాక్లాండ్ ఐస్‌ల్యాండ్స్‌కు చెందిన ఆండ్రూ బ్రౌన్లీ (62 సంవత్సరాల, 145 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ఆండ్రూ బ్రౌన్లీ ఆల్‌టైమ్ రికార్డును చైల్డ్ బ్రేక్ చేసింది. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో జిబ్రాల్టర్ మాజీ ప్లేయ‌ర్ సాలీ బార్టన్ అగ్ర‌స్ధానంలో ఉంది. బార్టన్ 66 ఏళ్ల 334 రోజుల వయసులో గ‌తేడాది ఎస్టోనియాపై అరంగేట్రం చేసింది.జోవన్నా చైల్డ్ విష‌యానికి వ‌స్తే.. నార్వేతో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల‌లోనూ ఆమె ఆడింది. అయితే మూడు మ్యాచ్‌ల్లో కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చైల్డ్ చేసింది. ఆదేవిధంగా బౌలింగ్ కూడా ఆమె చేసింది. 16.50 ఎకానమీతో వికెట్ తీసుకోకుండా 11 పరుగులు ఇచ్చింది. ఈ సిరీస్‌కు ముందు ఆమెకు అస్స‌లు పూర్తిగా క్రికెట్ అనుభ‌వం లేదు. అయిన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన చైల్డ్‌పై స‌ర్వాత్ర ప్ర‌శంస‌ల వర్షం కురుస్తోంది.టీ20ల్లో అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్సు గల ఆటగాళ్లు వీరేసాలీ బార్టన్ - 66 సంవత్సరాల 334 రోజులుజోన్నా చైల్డ్ - 64 సంవత్సరాలుఆండ్రూ బ్రౌన్లీ - 62 సంవత్సరాల 145 రోజులుకేమాన్ మాల్లీ మూర్ - 62 సంవత్సరాల‌ 25 రోజులు Congrats to Joanna Child, who made her T20I debut recently. At 64, she becomes the 2nd oldest cricketer to make her T20I debut after Gibraltar's Sally Barton. Portugal team also featured cricketers who were just 15, 16. The team's captain Sarah called Joanna an inspiration. pic.twitter.com/ASSaxJ1OKv— Krithika (@krithika0808) April 10, 2025

Tahawwur Rana Extradition Live Updates4
తహవూర్‌ రాణా అరెస్ట్‌.. తీహార్‌ జైలుకు తరలించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్‌లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్‌ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్‌ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 🚨 BIG BREAKING NEWS26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025తహవూర్‌ రాణాను విచారణ ఇలా ఉండనుంది26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు. తహవూర్‌ రాణాకు శిక్ష పడేది అప్పుడే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది. ఎవరి తహవూర్‌ రాణాపాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి.

Ajith Kumar Good Bad Ugly Movie Review In Telugu5
అజిత్ కుమార్‌ యాక్షన్‌ థ్రిల్లర్.. 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' ఎలా ఉందంటే?

టైటిల్: గుడ్ బ్యాడ్‌ అగ్లీనటీనటులు: అజిత్‌ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్‌ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్‌ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్‌ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్‌ ‍‍‍అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్‌ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్‌ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ ఏకే(అజిత్‌ కుమార్) అలియాస్‌ రెడ్ డ్రాగన్‌. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్‌. అలా వరల్డ్‌ ఫేమస్ గ్యాంగ్‌స్టర్‌ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్‌ దేవ్‌) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వ‍చ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్‌.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న ‍అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్‌ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్‌ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ ‍అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్‌, వయోలెన్స్‌ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్‌ చేశాడు డైరెక్టర్‌. యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్‌ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్‌ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్‌ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్‌ స్టైల్లో చూపించారు. టాలీవుడ్‌ నటుడు సునీల్‌ స్టైల్‌ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే ‍అజిత్‌ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్‌ ఫైట్‌ సీన్‌తో బ్యాంగ్‌ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్‌ దాస్‌(జానీ)కి సంబంధించిన ట్విస్ట్‌ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్‌ ఆడియన్స్‌ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్‌ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్‌ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్‌ డ్రాగన్‌ టీమ్‌ చేసే ఫైట్స్‌ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్‌(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్‌ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. ‍క్లైమాక్స్ సీన్‌ వచ్చేసరికి.. అర్జున్‌ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్‌ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్‌ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్‌ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్‌ బ్యాడ్‌ ‍అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్‌. యాక్షన్‌ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్‌ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్‌ హీరోయిన్‌గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్‌స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్‌ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్‌ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్‌ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్‌ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్‌ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

She Invited Trouble Allahabad High Court Again In Discussion6
ఇది బాధితురాలి స్వయంకృతాపరాధమే!

వక్షోజాలను తాకడం.. యువతి పైజామాను లాగడం లాంటి చేష్టలు అత్యాచార యత్నం కిందకు రావంటూ వివాదాస్పద తీర్పు ఇచ్చిన అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌).. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ అత్యాచార కేసులో బాధితురాలిది కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి ఏకంగా బెయిల్‌ మంజూరు చేసింది.లక్నో: ఢిల్లీలో ఉంటూ పీజీ చదువుతున్న ఓ విద్యార్థిని తన క్లాస్‌మేట్‌ అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. .. మద్యం మత్తులో ఉన్న తనను అతని బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే సాక్ష్యాలు పరిశీలనలో అది అబద్ధమని, పరస్పర అంగీకారంతో ఇద్దరూ కలిశారని నిందితుడి తరఫు లాయర్‌ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న తర్వాత.. ధర్మాసనం కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.ఈ కేసులో బాధితురాలుగా ఉన్న యువతి ఎంఏ చదువుతోంది. ఏది తప్పో..ఏది ఒప్పో.. నైతికత గురించి ఆమెకు తెలియంది కాదు. ఒకవేళ బాధితురాలి ఆరోపణే నిజం అనుకున్నా.. ఇక్కడ సమస్యను స్వయంగా ఆమెనే ఆహ్వానించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, జరిగిన దానికి ఆమె కూడా ఓ బాధ్యురాలే. ఇది ముమ్మాటికీ బాధితురాలి స్వయంకృతాపరాధమే!.పైగా వైద్య పరీక్షలో కన్నెపొర(Hymen) చిరిగిపోయినట్లు తేలింది. కానీ లైంగిక వేధింపులు జరిగినట్లుగా వైద్యులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. ఇక ఈ కేసులో నిందితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్‌ షరతులను ఉల్లంఘించడని హామీతో పాటు, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకం కుదిరిన తర్వాతే నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటన కిందటి ఏడాది సెప్టెంబర్‌లో జరిగింది. పీజీ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్‌ ఖాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు ఆహ్వానించారు. అయితే అర్ధరాత్రి 3గం.దాకా ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె చిత్తుగా తాగింది. ఈ క్రమంలో మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఓ స్నేహితుడిని అతని ఇంటికి తీసుకెళ్లాలని ఆమె కోరింది. అయితే.. బాగా మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధవులు ప్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నది ఆమె ఆరోపణ. ఈ కేసులో కిందటి ఏడాది డిసెంబర్‌ నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు. ఇక.. ఈ కేసులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరీ నిందితుడికి అలహాబాద్‌ హైకోర్టు బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది మార్చి 11వ తేదీనే. కానీ, పలు ఆంగ్ల మీడియా వరుస కథనాలతో ఇప్పుడు హైలైట్‌ అవుతోంది. అంటే..ఇదే కోర్టుకు చెందిన జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా ఇచ్చిన వివాదాస్పద తీర్పు కంటే ముందు ఈ కేసు విచారణ జరిగిందన్నమాట!. మార్చి 17వ తేదీన ఓ మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార యత్నం కేసు విచారణలో జస్టిస్‌ రామ్‌ మనోహర్‌ నారాయణ్‌ మిశ్రా సంచలన తీర్పు వెల్లడించారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన. అయితే ఈ తీర్పును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. తీర్పును, న్యాయమూర్తి తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్టే విధించింది కూడా.

TDP MLA Ganta Srinivasa Rao Verbal Abuse On Sanitary Inspector7
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్‌– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

TCS Q4 results Net profit falls 1 7pc to Rs 12224 crore dividend declared8
TCS Q4 results: టీసీఎస్‌ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..

దేశ ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (Q4FY25) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభంలో స్వల్ప క్షీణతను నివేదించింది. అయినప్పటికీ బలమైన ఒప్పంద విజయాలు, స్థిరమైన ఆదాయ వృద్ధి పథాన్ని ప్రదర్శించింది.టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,434 కోట్ల నుంచి 1.69 శాతం తగ్గి రూ.12,224 కోట్లుగా నమోదైంది. ఈ స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.3% పెరిగి రూ .64,479 కోట్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దాని స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోంది. ఇక వాటాదారుల ఆమోదానికి లోబడి, టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ .30 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.పూర్తి సంవత్సరానికి పనితీరును పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.45,908 కోట్లతో పోలిస్తే 5.76 శాతం పెరిగి రూ.48,553 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.2,59,286 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,315 కోట్లతో పోలిస్తే 5.69 శాతం పెరిగింది.ఈ నివేదికలోని ముఖ్యమైన గణాంకాల్లో ఒకటి టీసీఎస్ డీల్ పైప్ లైన్. క్యూ3లో 10.2 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెరిగి 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ పొందింది. ఇది దాని డిజిటల్ పరివర్తన సేవలు, క్లౌడ్ పరిష్కారాలకు బలమైన డిమాండ్‌ను సూచిస్తోంది.లాభాల తగ్గుదల కొన్ని ఆందోళనలను లేవనెత్తినప్పటికీ, టీసీఎస్ స్థిరమైన డీల్ వేగం, బలమైన ఆర్డర్ బుక్‌ 2026 ఆర్థిక సంవత్సరంలో ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టడం వృద్ధిని కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Shocking Datails in Bihar Samastipur Sakshi Case9
ప్రియుడితో వెళ్లిపోయి రీల్స్‌.. తండ్రి కోపాగ్నికి బలి

నా కూతురు ఎవడితోనో వెళ్లిపోయింది. ఎవడో చెబితే తిరిగొచ్చింది. మళ్లీ ఎవడి కోసమో ఇంట్లోంచి వెళ్లిపోయింది. మా గురించి ఆలోచించని కూతురి గురించి మేమెందుకు ఆలోచించాలి.. అంటూ పోలీసుల ఎదుట భావోద్వేగంతో ఓ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ప్రాణంగా పెంచుకున్న కూతురిని పరువు పేరిట పొట్టన పెట్టుకుంటాడని కన్నతల్లి సహా ఎవరూ ఊహించలేకపోయారు.బీహార్‌ సమస్తిపూర్‌(Samastipur)లో పరువు హత్య ఘటన చోటు చేసుకుంది. తక్కువ కులం వాడితో తన కూతురు వెళ్లిపోయి.. తిరిగొచ్చిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆమెను కడతేర్చి ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కన్నీరు పెట్టసాగాడు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో ఇంట్లోని బాత్రూం నుంచి ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాక్షి(20) అనే యువతి కాలేజీ చదివే ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు ఉండేది కూడా ఆమె ఉండే కాలనీలోనే. ఆమె తండ్రి ముకేష్‌ కుమార్‌ సింగ్‌(Mukesh Singh Kumar) రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌. అతనిది పరాయి కులమంటూ ఆ ప్రేమను ఆ తండ్రి అంగీకరించలేదు. దీంతో.. మార్చి 4వ తేదీన ఆమె ఆ యువకుడితో ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడ రీల్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయసాగింది. ఈలోపు యువకుడి బంధువు ఒకరు వాళ్లను ఒప్పించి వెనక్కి పంపించారు. వారం కిందట ఆమె తిరిగి ఇంటికి చేరుకుంది. సాక్షి తిరిగి రావడంతో ఈ కథ సుఖాంతమైందని బంధువులంతా అనుకున్నారు. కానీ, ఇంట్లోంచి వెళ్లిపోవడమే కాకుండా.. నలుగురికి తెలిసేలా కూతురు చేసిన రీల్స్‌పై ఆ తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.అయితే ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి సాక్షి(Sakshi) మళ్లీ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తల్లి కంగారుపడిపోయింది. కూతురు మళ్లీ ఇంట్లోంచి వెళ్లిపోయిందటూ తండ్రి ముకేష్‌ సింగ్‌ భార్య సహా అందరినీ నమ్మించే ప్రయత్నిం చేశాడు. ఈ క్రమంలో సాక్షి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముకేష్‌ను పోలీసులు విచారించగా.. ఎమోషనల్‌ డ్రామాలు ఆడాడు. ఈలోపు.. ముకేష్‌ బాత్రూం నుంచి దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులతో నిజం ఒప్పుకున్న నిందితుడు.. తానే కూతురిని కడతేర్చినట్లు అంగీకరించాడు. కూతురిని చంపాక.. ఆ యువకుడిని కూడా చంపేందుకు ముకేష్‌ ప్రయత్నించాడని, కానీ సమయానికి ఆ యువకుడు ఊరిలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇదీ చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే అదనపు కట్నం కోసం..

American Woman Experiences Periods For Over 1000 Days10
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్‌..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!

సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్‌ రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్‌ పీరియడ్‌ సైకిల్‌) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్‌​ యూజర్‌ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్‌ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్‌రెగ్యులర్‌గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్‌) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్‌ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్‌ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్‌ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement