
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తాజాగా శ్రీలంకలోని కొలంబో పశ్చిమ అంతర్జాతీయ టెర్మినల్ (సీడబ్ల్యూఐటీ)ను ప్రారంభించినట్లు వెల్లడించింది. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన సీడబ్ల్యూఐటీని కన్సార్షియం నిర్వహించనున్నట్లు తెలియజేసింది.
కంపెనీ అధ్యక్షతన శ్రీలంక దిగ్గజం జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్‌సీ, శ్రీలంక పోర్ట్స్ అథారిటీ కన్సార్షియంలో భాగమైనట్లు పేర్కొంది. 35ఏళ్ల కాలానికి నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి(బీఓటీ) పద్ధతిలో ఒప్పందం అమలుకానున్నట్లు వివరించింది.
80 కోట్ల డాలర్ల పెట్టుబడులతో 1,400 మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతుతో అభివృద్ధి చేసిన కొలంబో టెరి్మనల్ వార్షికంగా 3.2 మిలియన్ టీఈయూను హ్యాండిల్ చేయగలదని తెలియజేసింది. కొలంబోలో ఇది తొలి డీప్‌వాటర్ టెరి్మనల్‌కాగా.. పూర్తి ఆటోమేటెడ్‌గా ఏర్పాటైన్నట్లు పేర్కొంది. తద్వారా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలు మెరుగుపడటం, వెస్సల్ టర్న్‌అరౌండ్ సమయం తగ్గడం వంటి సౌకర్యాలకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది.