
తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది.
రెండేళ్ల టెన్యూర్
ఈ సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై ఎస్‌బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్‌డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.90 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది.
ఏడాది టెన్యూర్
ఎస్‌బీఐ సర్వోత్తం ఎఫ్‌డీ పథకంపై 1 సంవత్సరం కాలపరిమితితో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్‌లు 7.60 శాతం వడ్డీని పొందవచ్చు.
పెట్టుబడి పరిమితి
ఎస్‌బీఐ సర్వోత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్టర్ కనీసం రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌దారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
పదవీ విరమణ చేసిన వారికి ఎస్‌బీఐ సర్వోత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు. పీపీఎఫ్ నుండి డబ్బు పొందినప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ 0.05 శాతం తగ్గుతుంది.
(Disclaimer: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఏదైనా ఎఫ్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం)