
కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్‌ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లూమ్‌ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?
లూమ్‌ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్‌పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.
ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్‌ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.
The co-founder of Loom sold his biz for ~$1B, made $50-70M personally, then walked away from an extra $60M
He has “no income right now” and is “looking for internships”...@vhmth has a wild post-exit story. we talked about it on Moneywise:
-Turned down $60M in retention… pic.twitter.com/uTdS5blabz— Sam Parr (@thesamparr) March 25, 2025